చిత్తూరు కాంగ్రెస్ నాయకులతో పెద్దిరెడ్డి మంతనాలు | Chittoor Congress leaders   Pursuing negotiations | Sakshi
Sakshi News home page

చిత్తూరు కాంగ్రెస్ నాయకులతో పెద్దిరెడ్డి మంతనాలు

Mar 5 2014 2:22 AM | Updated on Sep 2 2017 4:21 AM

మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం చిత్తూరు నగరంలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి మంతనాలు సాగించారు.

 మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం చిత్తూరు నగరంలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి మంతనాలు సాగించారు. నగరంలోని పీసీసీ మాజీ సభ్యుడు ఎస్.సుధాకరరెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.

ఆయనతోపాటు కాంగ్రెస్ నా యకులు, చిత్తూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఐరాల మాజీ ఎంపీపీ పొలకల ప్రభాస్‌కుమార్‌రెడ్డి(చిట్టిరెడ్డి)తో పెద్దిరెడ్డి దాదాపు గంటసేపు మంతనాలు జరిపారు. చిత్తూరులో వైఎస్‌ఆర్ సీపీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన చర్చించారు.

చర్చల అనంతరం పలువురు నాయకులు పెద్దిరెడ్డి సమక్షంలో తమ అనుచరులతో కలిసి పార్టీలోకి చేరేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. వీరంతా రెండు, మూడురోజుల్లో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ .జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో వైఎస్‌ఆర్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ అమర్‌నాథ్, నగర కన్వీనర్ పూల రఘునాథరెడ్డి, నాయకులు క ట్టమంచి ప్రతాప్‌రెడ్డి, బాలసుబ్రమణ్యంరెడ్డి, కట్టమంచి మనోహర్‌రెడ్డి, ఆర్ చంద్ర, త్రిమూర్తి, శ్రీధర్‌రెడ్డి, సయ్యద్, మాజీ కౌన్సిలర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement