purushotam reddy
-
వై.ఎస్.ఆర్ దూరదృష్టి వల్లే కీలకమైన ప్రాజెక్టులు వచ్చాయి
-
అత్యవసర పరిస్థితిని ప్రకటించండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ’ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో తీర్మానించారు. వాతావరణ మార్పులకు దారితీస్తున్న భూతాపం వల్ల మానవాళికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ప్రపంచంలోని 18 దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయన్నారు. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు ‘వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సంస్థ’మార్గదర్శకాల ప్రకారం కేంద్రం ప్రత్యేక విధానాలతో ముందుకు రావాలని తీర్మానించారు. హరితవిప్లవ మండలి, క్యాపిటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో ఎన్జీటీ మాజీ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్, గ్రేస్ చైర్మన్, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, పర్యావరణ వేత్తలు బూరె లాల్, విక్రంసోనీ, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, ప్రొఫెసర్ పుష్ప కుమార్ లక్ష్మణ్, లక్ష్మారెడ్డి, సేవ్ రివర్ కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. జీవించే హక్కులో భాగం: జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును రాజ్యాంగం కల్పించింది. అందులో మంచి వాతావరణాన్ని కలిగి ఉండడం ఒక భాగమే. మన సంప్రదాయంలో ప్రకృతిని పూజించే మనం పూజ తర్వాత చెట్లను నరికేస్తున్నాం. పర్యావరణ రక్షణకు ఎన్నో చట్టాలున్నా.. సమర్థంగా అమలు చేయడంలో లోపాలున్నాయి. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో బాధ్యత నిర్వర్తించాలి. ప్రజల్లో పూర్తి అవగాహనతో పర్యావరణ పరిరక్షణ: దిలీప్ రెడ్డి పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో వెల్లువెత్తే ఆందోళన ప్రభుత్వాలను దిగివచ్చేలా చేస్తుంది. దీనికి ఉదాహరణే నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వాలు వెనక్కు తగ్గడం. ఏపీలో గత ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలపై ఇష్టానుసారంగా అనుమతులిచ్చింది. ఆ తప్పిదాలను సరిదిద్దుతూ ఇప్పటి ప్రభుత్వం మేనిఫెస్టో హామీ మేరకు ఆ తవ్వకాల అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వాతావరణ మార్పులతో భావితరాలు నష్టపోతాయన్న అభిప్రాయాలు కల్పించారు. కానీ నేటి తరాలూ నష్టపోతున్నాయని గ్రహించి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. దేశంలో విపరీత పరిణామాలు.. వాతావరణ మార్పుల కారణంగా దేశంలో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, నీటికోసం చెన్నై ఎన్ని అవస్థలు పడుతోందో చూస్తున్నామని, వర్షాలతో ముంబై ఎలా అతలాకుతలమవుతోంది యావత్తు సమాజం చూసిందని ప్రొ.పురుషోత్తం రెడ్డి అన్నారు. -
పురుషోత్తంరెడ్డి కేసులో నిశాంత్‌రెడ్డికి ఊరట
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో నిందితునిగా ఉన్న గడ్డం నిశాంత్‌రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు ఏసీబీ అధికారుల ముందు ప్రతీ సోమ, బుధ వారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోపు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురుషోత్తంరెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు అతని సమీప బంధువైన నిశాంత్‌రెడ్డి (పురుషోత్తంరెడ్డి అల్లుడు నిపుణ్‌రెడ్డి సోదరుడు)ని నిందితునిగా చేర్చారు. పురుషోత్తంరెడ్డితో ఓ ఆస్తి అభివృద్ధికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారని, పురుషోత్తంరెడ్డి డబ్బును దాచేందుకే ఇలా చేశారంటూ గత నెల 9న నిశాంత్‌రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. పురుషోత్తంరెడ్డి ఆస్తులకు సంబంధించి నిశాంత్‌రెడ్డిని పలు రకాలుగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నిశాంత్‌రెడ్డి హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనను ఏసీబీ అధికారులు ప్రశ్నించడం పూర్తయిన దరమిలా బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరగా షరతులతో బెయిల్ మంజూరు చేసింది. -
చిత్తూరు కాంగ్రెస్ నాయకులతో పెద్దిరెడ్డి మంతనాలు
మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం చిత్తూరు నగరంలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి మంతనాలు సాగించారు. నగరంలోని పీసీసీ మాజీ సభ్యుడు ఎస్.సుధాకరరెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నా యకులు, చిత్తూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఐరాల మాజీ ఎంపీపీ పొలకల ప్రభాస్‌కుమార్‌రెడ్డి(చిట్టిరెడ్డి)తో పెద్దిరెడ్డి దాదాపు గంటసేపు మంతనాలు జరిపారు. చిత్తూరులో వైఎస్ఆర్ సీపీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన చర్చించారు. చర్చల అనంతరం పలువురు నాయకులు పెద్దిరెడ్డి సమక్షంలో తమ అనుచరులతో కలిసి పార్టీలోకి చేరేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. వీరంతా రెండు, మూడురోజుల్లో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ .జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో వైఎస్ఆర్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్ మనోహర్, జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ అమర్నాథ్, నగర కన్వీనర్ పూల రఘునాథరెడ్డి, నాయకులు క ట్టమంచి ప్రతాప్‌రెడ్డి, బాలసుబ్రమణ్యంరెడ్డి, కట్టమంచి మనోహర్‌రెడ్డి, ఆర్ చంద్ర, త్రిమూర్తి, శ్రీధర్‌రెడ్డి, సయ్యద్, మాజీ కౌన్సిలర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతలతోనే తెలంగాణ సస్యశ్యామలం
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణంతోనే సాధ్యమని రాజకీయ విశ్లేషకుడు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు శిక్షణా శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పరిగి అభివృద్ధి అనే అంశంపై అవగాహన కల్పించారు. గోదావరి నది నుంచి 4వేల టీఎంసీలు ఏటా సముద్రం పాలవుతున్నాయని, అవసరమైన చోట్ల ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టి నీటిని ఆయా ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు ఎత్తిపోతల కల సాకారమవుతుందన్నారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి అవసరమైన అభివృద్ధి పనుల కోసం ప్రణాళికలు రూపొందించాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. ఆయా పనులు పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చేలా రామ్మోహన్‌రెడ్డి చూస్తారని అన్నారు. పరిగిలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కృషి చేయాలని టీఆర్‌ఆర్‌ను కోరారు. అంతకుముందు ‘అభివృద్ధిలో అలుపెరగని బాటసారి డాక్టర్ టీఆర్ఆర్’ అనే పాటల సీడీని ఆవిష్కరించారు. వైఎస్ పథకాలతో పేదలకు మేలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేశాయని పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్ తదితర పథకాలు అన్ని వర్గాల వారిని ఆదుకున్నాయని అన్నారు. ప్రజలకు అత్యంత అవసరమున్న కార్యక్రమాలు చేపట్టారు కాబట్టే డాక్టర్ వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోయారని అన్నారు. పరిగి అభివృద్ది రామ్మోహన్‌రెడ్డి చలవే పరిగి నియోజకవర్గ అభివృద్ధి టి.రామ్మోహన్‌రెడ్డి చలవేనని పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌కు నివేదించి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పరిగి వరకు పొడిగించే హామీని పొందారన్నారు. నియోజకవర్గానికి తాగునీటి సరఫరా కోసం కోయిల్‌సాగర్ టెండర్ ప్రక్రియ పూర్తికావడం, 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం కావటం, 400 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు సీఎం కిరణ్ హామీ ఇవ్వటం, పాలమూరు ఎత్తిపోతల సర్వే, రూ.5 కోట్లతో పరిగి పట్టణ అభివృద్ధి, డిగ్రీ కళాశాల తదితర అభివృద్ధి పనులు టీఆర్ఆర్ కృషి ఫలితమేనని అన్నారు. పరిగిలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: టీఆర్ఆర్ సార్వత్రిక ఎన్నికల్లో పరిగిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయటం ఖాయమని పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవిలో లేకున్నా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బొంపల్లి రాములు, కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, రాములు, భీంరెడ్డి, వెంకట్రాంరెడ్డి, వెంకటయ్య, సుభాష్‌చందర్ రెడ్డి, సిద్దాంతి పార్థసారథి, ఆంజనేయులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.