Chitoor
-
బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు....మిన్నంటిన రోదనలు
దేవుడా ఎంత పని చేశావయ్యా.. సంతోషంగా శుభకార్యానికి వెళ్తున్న వారిని ఎందుకింత నిర్దయగా కబళించావు.. మేము ఏం పాపం చేశామయ్యా.. ఇంత విషాదాన్ని మా కుటుంబాలకు మిగిల్చావు’ అంటూ బస్సు ప్రమాద బాధితులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద లోయలో బస్సు బోల్తాపడిన ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను అంబులెన్సుల్లో ధర్మవరానికి తీసుకురాగానే బాధితుల రోదనలు మిన్నంటాయి. సాక్షి, ధర్మవరం టౌన్/ అర్బన్/ తనకల్లు/ కదిరిటౌన్/ పుట్టపర్తి: ధర్మవరంలోని ప్రముఖ పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు వేణు వివాహ నిశ్చితార్థ వేడుకలకు తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణమండపానికి బయల్దేరిన వారిని బస్సు ప్రమాద రూపంలో మృత్యువు వెంటాడింది. భాకరాపేట వద్ద లోయలో శనివారం రాత్రి బస్సు బోల్తాపడిన ఘటనలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందగా, ఆదివారం సాయంత్రం మరొకరు చనిపోయారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మృతుల్లో ధర్మవరానికి చెందిన మలిశెట్టి మురళి (45), తమ్ముడు మలిశెట్టి గణేష్ (42), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ (38), బంధువు, పెళ్లిళ్ల పేరయ్య అయిన మలిశెట్టి వెంగప్ప (75), భార్య నాగలక్ష్మి (60), తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన జింకా చంద్ర కుమార్తె చందన (10), ధర్మవరానికి చెందిన బస్సు డ్రైవర్ నబీరసూల్ (42), కదిరికి చెందిన క్లీనర్ షకీల్ (22), మలిశెట్టి మురళి స్నేహితుడు, విలేకరి అయిన బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఆదినారాయణరెడ్డి (45) ఉన్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మరో కుటుంబంలో దంపతులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం మిగి ల్చింది. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు 33 మంది ఉన్నారు. కన్నీటి వీడ్కోలు.. బస్సు ప్రమాద మృతుల్లో ఎక్కువమంది ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. తిరుపతి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ మృతదేహాలను ఆదివారం అంబులెన్స్‌లో కొత్తపేట ఉషోదయ స్కూల్ వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు బోరున విలపించారు. మృతదేహాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు, వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఏపీ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ వడ్డే బాలాజీ, దేవరకొండ రమేష్, గుండా ఈశ్వరయ్య సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గరుడంపల్లి సమీపాన మలిశెట్టి మురళి పొలంలో నిర్వహించిన ముగ్గురి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మలిశెట్టి వెంగప్పకు హిందూ శ్మశాన వాటికలోను, డ్రైవర్ నబీరసూల్‌కు ముస్లిం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. కదిరిలో క్లీనర్ షకీల్, బుక్కపట్నం మండలం మారాలలో విలేకరి ఆదినారాయణరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారి చందనకు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ సమీపంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృత్యువులోనూ వీడని బంధం.. ధర్మవరం పట్టణానికి చెందిన మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ముగ్గురు అన్నదమ్ములూ పట్టుచీరల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. కానీ బస్సు ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. మురళి కుమారుడు వేణు (పెళ్లికొడుకు), భార్య లలితమ్మ, తమ్ముడు గణేష్ భార్య భైరవి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మురళి మృతితో అన్నదమ్ముల కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయినట్లయ్యింది. నీ వెంటే నేనూ.. ధర్మవరానికి చెందిన మలిశెట్టి వెంగప్ప శనివారం రాత్రి బస్సు ప్రమాదంలో మృతిచెందగా, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య నాగలక్ష్మి (60) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. భర్త మృతి చెందిన విషయం కూడా ఆమెకు తెలియకనే కన్నుమూసింది. అర్ధంతరంగా ముగిసిన విలేకరి జీవితం.. బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ఆదినారాయణరెడ్డి 20 ఏళ్లుగా పత్రికారంగంలో విలేకరిగా పనిచేస్తున్నారు. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో ఆయన కుమారుడి నిశ్చితార్థానికి ఆదినారాయణరెడ్డి బస్సులో వెళ్లారు. అలా వెళ్లిన విలేకరి అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈయనకు భార్య గౌతమి, కుమార్తె మనీషా, కుమారుడు గణేష్‌రెడ్డి ఉన్నారు. అయ్యో ‘పాపం'.. ధర్మవరం కొత్తపేట నివాసి జింకా చంద్ర కుమార్తె జింకా చందన (10) స్థానిక మున్సిపల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. బంధువుల నిశ్చితార్థానికి వెళ్లి బస్సు ప్రమాదంలో చందన మృతి చెందింది. తండ్రి చంద్ర తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి సొంతూరు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్. ఛిద్రమైన పేదల బతుకులు బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ నబీరసూల్, క్లీనర్ షకీల్ నిరుపేదలు. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాలు ఛిద్రమయ్యాయి. కదిరికి చెందిన క్లీనర్ షకీల్ అవివాహితుడు. నార్పల మండలం గూగూడుకు చెందిన డ్రైవర్ నబీరసూల్ 12 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం తాడిపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి ధర్మవరం చేరుకుని డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఊహించని విధంగా మృత్యువాత పడటంతో ఇతని భార్య, ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇతని సోదరుడు హైదర్‌వలి కూడా లారీడ్రైవర్‌గా వెళ్తూ 16 క్రితం ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. (చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!) -
నలుగురు కలికిరి బ్యాంకు ఉద్యోగుల సస్పెన్షన్
-
ఏంటా వింత వస్తువు?!
కూరపర్తివారిపల్లె పంచాయతీ లచ్చాయకుంట సమీపంలో బ్యాటరీ, సిగ్నల్ డిటెక్టర్, గొడుగు, బెలూన్లతో కూడిన ఎలక్ట్రానిక్ పరికరం శుక్రవారం కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటమోహన్ అక్కడకు చేరుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాతావరణ అధ్యయనానికి పరిశోధకులు గాల్లోకి బెలూన్ సాయంతో దీన్ని పంపి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్థారణకొచ్చారు. దీనిగురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. – ఎర్రావారిపాళెం(చిత్తూరు జిల్లా) -
మహిళకు నడిరోడ్డు మీద కాన్పు : చిత్తూరు
-
చిత్తూరు : ఫోన్ మాట్లాడుతూ బావిలో పడ్డ వ్యక్తి ని కాపాడిన ఫైర్ సిబ్బందీ
-
తిరుపతి వివాహిత హత్యకేసు : భర్త హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారణ
-
చిత్తూరు : పలమనేరు ప్రాంతంలో ఏనుగుల సంచారం
-
అగ్గిపెట్టె మచ్చా పేరిట అరుదైన ఘనత!
‘నమస్తే అన్నా..’ అంటూ ఆప్యాయంగా సంభాషణ మొదలుపెట్టే అగ్గిపెట్టె మచ్చా, అవతలి వాళ్లు రెచ్చగొట్టడం, అటుపై తనదైన స్టైల్లో వాళ్లపై తిట్ల పురాణం అందుకోవడం ద్వారా ఫేమస్ అయ్యాడని తెలిసిందే. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్లేస్టోర్‌లో అతని పేరిట రిలీజ్ అయిన ఓ గేమ్.. లక్షకు పైగా డౌన్లోడ్లు సాధించడం విశేషం. ఒక మీమ్ క్యారెక్టర్.. అందునా తెలుగు మీమ్ క్యారెక్టర్ మీద వీడియో గేమ్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్లే స్టోర్‌లో Game on Aggipettimacha అనే ఈ గేమ్.. ‘గేమ్ ఆన్ మీమ్’ తరపున డెవలప్ అయ్యింది. లక్షకు పైగా డౌన్ లోడ్స్, 4.4 రేటింగ్(మచ్చా ఫ్యాన్సే అయి ఉండొచ్చు) దక్కించుకోగా, 20 ఎంబీ సైజ్ ఉన్న ఈ గేమ్‌ను ఆదరిస్తుండడం విశేషం. ఇందులో కోపధారి మనిషి, జాంబీరెడ్డి, తమిళ మీమ్ క్యారెక్టర్ ఎంజీఆర్ నగర్ బిజిలీ కూడా ఉండగా.. తెలుగు నుంచి మచ్చానే టాప్ డౌన్లోడ్లతో నిలిచాడు. సాధారణంగా సెలబ్రిటీలు, సినిమాల విషయంలో ఇలాంటి గేమ్స్ ఆదరణ దక్కించుకుంటున్నప్పటికీ.. ఒక తెలుగు ఇంటర్నెట్ సెలబ్రిటీ, అది కూడా మచ్చా ఖాతాలో ఈ ఘనత చేరడం విశేషం. చిరు సాయం కాగా, మానసిక స్థితి సరిగా లేని కిరణ్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. తన చేష్టలతో అవతలివాళ్లకు హాస్యాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని క్యాష్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని టీవీ ఛానెల్స్ కూడా అతన్ని జనాల ముందుకు తీసుకొచ్చాయి. అయినప్పటికీ ఎంతో కొంత ఆర్థిక సాయం ద్వారా అతను ఊరట చెందుతుండగా.. మరోవైపు తనదైన చేష్టలతో, ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇక ఈ గేమ్ నిర్వాహకులు కూడా మచ్చాకు ఎంతో కొంత సాయం చేయడం మంచిదేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని మార్చండి మచ్చాకి ఉన్న ఫేమ్‌తో ఈ గేమ్ బాగుందని కొందరు అంటున్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫ్రెండ్లీ ఫీచర్లను ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ గేమ్‌లో నమస్తే అన్నా.. అంటూ మొదలుపెట్టే మచ్చా, తన స్టైల్ పాట పాడడం, ‘ఎగిరి తంతా’.., ‘పోతే పోయిందని గానీ యెధవ ప్రాణం’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లెవెల్స్‌ను పెంచడంతో పాటు ఖతర్ పాప లాంటి కొన్ని మీమ్ క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అప్డేట్ చేయాలని పలువురు రివ్యూల ద్వారా రిక్వెస్ట్ చేస్తుండడం విశేషం. చదవండి: సుఖం కోసం కష్టమెందుకు! -
మైనర్ బాలిక కుటుంబం పై కాల్పులు జరిపిన యువకుడు
-
వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: పోలీసుల పనితీరు, ఆలోచన తీరును మార్చేందుకు డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. తద్వారా సైబర్ క్రైమ్, మహిళల రక్షణ వంటి అనేక అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. టెక్నాలజీ మెరుగుపరిచేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా తిరుపతిలో ఏపీ పోలీస్ డ్యూటీ మీట్‌ను సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఆరేళ్లుగా పోలీస్ డ్యూటీ మీట్ జరగలేదని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు చెడ్డపేరు తెచ్చేవిధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్న ఆయన.. ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: స్థలం + ఇల్లు.. రెట్టింపు ఆనందం) తప్పు చేసింది ఎవరైనా వదలొద్దు ‘‘గత ప్రభుత్వం తమ వాళ్లు ఏం చేసినా చూసీ చూడనట్లు వ్యవహరించాలని చెప్పింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. కానీ మా ప్రభుత్వం అన్యాయం ఎవరు చేసినా శిక్షించాలని స్పష్టం చేసింది. ఎవరు చేసినా తప్పు తప్పే. మా వాళ్లు తప్పు చేసినా సరే.. ఎవరినీ వదలొద్దని మరోసారి చెబుతున్నా. గత 18 నెలల పాలన ప్రతిపక్షంలో ఉన్నవారికి గుబులు పుట్టిస్తోంది. కులం,మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా పథకాలు ఇస్తున్నాం. అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి ప్రజలు ఆనందంగా ఉంటే ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. ఇంత మంచి చేసిన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కష్టమని గుర్తించి నాయకులు కుట్రలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’’ అని టీడీపీ తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు అసలు మనుషులేనా? ‘‘కొంతమందికి దేవుడు అంటే భయంలేదు, భక్తి లేదు. దేవుడిపై రాజకీయం చేస్తున్నారు. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడుతున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసి పచ్చ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లు అసలు మనుషులేనా.. కులాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇలాంటి కేసులను విచారించే పరిస్థితిలోకి మనం వచ్చాం. దేవుడి విగ్రహాలను పగులగొడితే ఎవరికీ లాభం? ఆలయాల్లో అరాచకం చేస్తే ఎవరికీ లాభం? ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు, విష ప్రచారం చేస్తే ఎవరికి లాభం? ఎవరిని టార్గెట్ చేసి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు?’’ ప్రతిపక్షాల తీరును సీఎం జగన్ ఎండగట్టారు. ఇలాంటి వాటిని ప్రజలు నిశితంగా గమనించాలని విజ్ఞప్తి చేశారు. మంచి కార్యక్రమం మొదలుపెట్టిన ప్రతిసారీ.. ‘‘ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రలు చేస్తున్నారు’’ అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని, రాజకీయంగా జరుగుతున్న గొరిల్లా యుద్ధతంత్రాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పోలీసులకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. జన సంచారం లేని చోట, టీడీపీ నేతల పర్యవేక్షణలో ఉన్న ఆలయాల్లోనే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని, 20వేల ఆలయాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా సీసీ కెమెరాలు పెట్టామన్నారు. కొన్ని మీడియా సంస్థలను ప్రజలను రెచ్చగొడుతున్నాయని, పథకం ప్రకారమే కుట్రలు పన్నుతున్నారన్నారు. ► 2019 నవంబర్ 14న ఒంగోలులో మనబడి నాడు నేడు ప్రారంభించాం. ఆ సమయంలో గుడిని కూల్చారని అసత్య ప్రచారం చేశారు. ► 2020 జనవరి 21న పిఠాపురంలో 23 విగ్రహాలు ధ్వంసం చేశారని ప్రచారం చేశారు. ► అదే రోజు దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ధరల స్థిరీకరణ పథకం ప్రారంభించాం. రొంపిచర్లలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారని ప్రచారం చేశారు. ► ఫిబ్రవరి 14న తూర్పు గోదావరి జిల్లాలో ఆలయ రథాన్ని దగ్ధం చేశారు. ► రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారని, దానికి ప్రచారం రాకూడదని ఇలాంటి పని చేశారు. ఒక్క దిశ పోలీస్‌స్టేషన్ ప్రారంభిస్తే మూడు ఘటనలకు పాల్పడ్డారు. ► ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో దుర్గ గుడి వెండి సింహాలను మాయం చేశారు. ► రైతన్నల కోసం బోర్లు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో అక్టోబర్ 8న విద్యా కానుకను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాం. మూడు రోజుల ముందు ఆలయాల ధ్వంసాలకు కుట్ర పన్నారు ►విజయనగరంలో సీఎం జగన్ వస్తున్నారని తెలిసి రామాలయంలో విగ్రహం ధ్వంసం చేశారు. ఇందులో చాలా ఆలయాలులో దేవాదాయ శాఖ పరిధిలోని కావు. ఇవన్నీ మారుమూల ప్రాంతాల్లో, జన సంచారం లేని ప్రాంతాల్లో జరిగిన ఘటనలు. చాలా ఆలయాలో టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ఉన్నాయి. -
ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు పాజిటివ్
సాక్షి,న్యూఢిల్లీ : చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప కరోనా వైరస్ బారినపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఎంపీకి పార్లమెంట్ సచివాలయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అరకు ఎంపీ మాధవికి కూడా కరోనా సోకింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఎంపీ.. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో రెండు వారాల పాటు ఢిల్లీలోనే చికిత్స తీసుకోనున్నారు. కాకినాడ ఎంపీ వంగ గీతా సైతం ఇదివరకే వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా దేశంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగానే ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటవ్‌గా తేలింది. ఇక స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్ ఇదివరకే ప్రకటించారు. (పార్లమెంట్లో కరోనా కలకలం..!) -
హార్సిలీహిల్స్‌కు కోవిడ్ ముప్పు!
ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్. ఇది ప్రఖ్యాత వేసవి విడది కేంద్రం. వేసవిలో సేద తీరడానికి ఇక్కడికి పలు రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి పర్యాటకులు వచ్చి వెళుతున్నారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల కాలంలో కర్ణాటక పర్యాటకులతోపాటు విదేశీయులూ వచ్చి వెళుతున్నారు. ఆయా ప్రాంతాల్లో కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడి స్థానికులు, ఉద్యోగులకూ కోవిడ్ సోకే ప్రమాదం ఉంది. సాక్షి, చిత్తూరు: మండలంలోని హార్సిలీహిల్స్‌పై కోవిడ్ ముప్పు పొంచివుంది. ఇక్కడి పరిస్థితులు, వాతావరణం నేపథ్యంలో వ్యాధి ఉధృతమయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. హార్సిలీహిల్స్‌కు వస్తున్న సందర్శకుల్లో అత్యధికులు సరిహద్దులోని కర్ణాటకకు చెందినవారే. ఆ రాష్ట్రంలో కోవిడ్ అధికమైన పరిస్థితుల్లో హార్సిలీహిల్స్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది. బెంగళూరుకు చెందిన సందర్శకులు అత్యధికులు ఇక్కడికి వస్తున్నారు. ముందుగానే గదులను ఆన్లైన్లో నమోదు చేసుకుని ఇక్కడికి వస్తారు. విడిది చేసి తిరిగి వెళ్తారు. ఈ పరిస్థితుల్లో వ్యాధి సోకిన వారు గదులను తీసుకుని విడిది చేసి వెళ్లే ప్రమాదం ఉంది. అలాంటి వారితో వ్యాధి ఒకసారిగా విజృంభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీనికితోడు ఇటీవల కొండకు వస్తున్న సందర్శకుల్లో విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. గతనెల రోజుల్లో ఇటలీ, బ్రిటన్ దేశాలకు చెందిన సందర్శకులు వచ్చి వెళ్లారు. అంతకుముందు కూడా కొందరు సందర్శకులు నాలుగైదురోజులు గడిపి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వ్యాధి వారి ద్వారా కూడా ప్రబలే ప్రమాదం ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులను పరీక్షించేందుకు ఎలాంటి పరికరాలు ఏర్పాటు కాలేదు. ఆన్లైన్ మూసేయాలి హార్సిలీహిల్స్‌లో టూరిజంశాఖ 54కు పైగా అతిథిగృహాలను బార్, రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. ప్రైవేటుగా మరో ముగ్గురు అతిథిగృçహాలను నిర్వహించుకుంటున్నారు. వీటిని తక్షణమే నిలిపివేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి వెళ్లే వారి వివరాలు టూరిజంశాఖ వద్ద ఉంటా యి. టూరిజంశాఖ గదుల కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేయడమేకాక, ప్రైవేటు అతిథిగృహలను మూసివేస్తే ప్రయోజనం ఉంటుంది. కొంతకాలం సందర్శకులను నిషేధించడం లేదా పరీక్షలు నిర్వహించాక అనుమతించడం చేయాల్సివుంది. -
సైరన్ మోగింది..దొంగ దొరికాడు
సాక్షి, రేణిగుంట: దుండగులు పట్టపగలే దోపిడీకి యత్నించిన ఘటన రేణిగుంట రైల్వేస్టేషన్లో జరిగింది. దొంగతనం బెడసి కొట్టడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణిగుంట రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఓ వ్యక్తి బరోడా బ్యాంక్ ఏటీఎంను పగుల గొట్టేందుకు ప్రయత్నించగా సైరన్ మోగింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు మని కుమార్‌గా పొలీసుల గుర్తించారు. మనికుమార్ 2017 సంవత్సరం తిరుపతిలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దోపిడీకి ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. -
కోట్లు దండుకుని బోర్డు తిప్పేశారు!
సాక్షి, పలమనేరు : ప్రజల నుంచి డిపాజిట్ల రూపేణా కోట్లాది రూపాయలు వసూలు చేసి ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. పలమనేరులో మంగళవారం ఇది వెలుగుచూసింది. స్థానిక ఏజెంట్ల మాయమాటలతో మోసపోయామని తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం...హెచ్బీఎన్, అసూర్ అనే ప్రైవేటు సంస్థల పేరిట పలమనేరుతోపాటు జిల్లాలోని పలుచోట్ల కార్యాలయాలను రెండేళ్ల క్రితం నిర్వాహకులు ప్రారంభించారు. ఆయా మండలాల్లో ఏజెంట్లను నియమించారు. తమ వద్ద రూ.500 నుంచి ఎంత మొత్తమైనా డిపాజిట్ కడితే ఆపై రుణాలిస్తామంటూ ప్రచారం చేయించారు. దీంతో స్థానిక ఏజెంట్లు తమకు తెలిసిన వారి నుంచి లక్షలాది రూపాయలను డిపాజిట్లుగా కట్టించారు. అయితే హెచ్బీఎన్లో కంటే అసూర్ కంపెనీలో బాగా లాభాలున్నాయంటూ ఇందుకు సంబందించిన ముఖ్య ఏజెంట్లు హరినాథ్‌రెడ్డి, దేవరాజులు స్థానిక ఏజెంట్లను నమ్మించారు. అయితే ఆ తర్వాత ఆ కార్యాలయాలు బోర్డు తిప్పేశాయి. దీంతో డబ్బులు కట్టిన జనం ఏజెంట్లను నిలదీశారు. వారు తమకేమీ సంబంధం లేదని చెప్పడంతో బాధితులు, ఏజెంట్లు కలసి డీఎస్పీ ఆరీఫుల్లా, సీఐ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఇలా డిపాజిట్ల రూపంలో ఇలా వసూలు చేసిన డబ్బు రూ.3కోట్లకుపైగా ఉంటుందని ఏజెంట్లు చెబు తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ మాటలు నమ్మి, లక్షలు కట్టించి, మోసపోయామని జరావారిపల్లెకు చెందిన ఏజెంట్ కళావతి వాపోయింది. తాను రూ.50లక్షలు డిపాజిట్ల రూపేణా కట్టించానని, నిర్వాహకులు అదృశ్యం కావడంతో అందరూ తనను నిలదీస్తుండడంతో తనకు దిక్కుతోచడం లేదని తొరిడి గ్రామానికి చెందిన ఏజెంట్ రుక్మిణి కన్నీటిపర్యంతమైంది. తాను ఏజెంట్‌గా వీ.కోట మండలంలో రూ.20లక్షల వరకూ కట్టించానని, మమ్మల్ని నమ్మించి మోసం చేశారంటూ దొడ్డిపల్లెకు చెందిన మోహన్ ఆక్రోశించాడు. -
వెలుగు చూసిన పురాతన ఆలయం
బి.కొత్తకోట మండలం ఒకప్పుడు వైడుంబ సామంత రాజ్యంలో ఉండేదా..? తర్వాత పల్లవులు, విజయనగర రాజుల పాలనలో సాగిందా..? శీలంవారిపల్లె సమీపంలోని కోనాపురం ప్రాంతంలో సోమవారం వెలుగులోకి వచ్చిన ఆలయ శిథిలాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బి.కొత్తకోట మండలంలో చారిత్రక కట్టడాలకు కొదువలేదు. అందులో శిథిలమైన ఈ ఆలయం తాజాగా వెలుగుచూసింది. పొలం పనులు చేస్తుండగా బయటపడిన ఆలయ శిథిలాలు, అక్కడ కనిపించే శిలలు, స్తంభాలు, శిలాశాసనం, శిల్పకళ, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో మూడు రాజ్యాల పాలన సాగిందని కన్పిస్తోంది. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మరిన్ని విగ్రహాలు, ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉందని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు) : మండలంలోని శీలంవారిపల్లె సమీపంలోని పొలంలో ఆలయ శిథిలాలు లభ్యమైన ప్రాంతం ఒకప్పుడు కోనాపురం గ్రామంగా విరాజిల్లింది. ఇప్పటికీ ఇక్కడి వారు ఈ ప్రాంతంగా కోనాపురంగానే పిలుచుకుంటున్నారు. ఆలయం, దాని పరిసరాల్లో నివాసాలతో నిండి ఉండేదని తెలుస్తోంది. దీనికి దగ్గర్లోని చిటికివారిపల్లె ఆలయం శిథిలం తర్వాత ఏర్పడినట్టుగా చెబుతున్నారు. నివాసాలకు సంబం ధించిన ఆధారాలు కనిపిస్తున్నాయి. తొమ్మిది నుంచి 13వ శతాబ్దం వరకు చిత్తూరు జిల్లా వైడుంబి సామంతరాజుల పాలనలో ఉండేదని శాసనాల ద్వారా తెలుస్తోంది. వీరు పశ్చిమ చాణుక్యులకు సామంతులుగా కూడా పనిచేశారు. వీరికి రాష్ట్ర కూటులు, బాణులు, నలంబ పల్లవులు సమకాలికులు. వీరు పీలేరు నియోజకవర్గంలోని కలకడ, కర్ణా్ణటకలోని కోలా రును రాజధానులుగా చేసుకుని పాలన సాగించారు. వీరి కాలంలో వేసిన శిలా శాసనం ఒకటి ఆల య శిథిలాలకు సమీపంలోని పొలంలో ఉం డడం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఒక వీరుడు స్వర్గస్తుడై స్వర్గానికి చేరినట్టుగా చెక్కారు. అతనే కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో విల్లు కలిగి ఉన్నాడు. ఇతను సాహసవంతుడు అని తెలిపేలా కింద గుర్రం, దానిపైన రెండు నాగుపాము పడగలు ఉన్నాయి. అతని విల్లుకు ఎదురుగా ముగ్గరు ఉన్నట్టు శిల్పం చెక్కారు. వీటిపైన తెలుగు–కన్నడ భాషలా కనిపించే అక్షరాలు లిఖించి ఉన్నాయి. ఈ శాసనాన్ని వీరగల్ శాసనంగా పేర్కొంటున్నారు. ఇతను శత్రువులను తదముట్టించి వారి చేతిలో చనిపోగా, అతన్ని వీరుడిగా చిత్రీకరిస్తూ వేసిన శిలాశాసనాన్ని బట్టి అది వైడుంబ రాజులు వేయించినట్టుగా నిర్ధారణ అవుతోంది. వైడుంబి పాలనలోనే వీరులు ఎక్కువగా ఉండేవారు కావడంతో వీరి శిలాశాసనం ద్వారా నిర్ధారణ అయ్యింది. వీరి సామంత పాలనకు సాక్ష్యంగా పురాతన సున్నం తో తయారైన శిలకు చెందిన శిరస్సు లభ్యమైం ది. సున్నంతో శిలల తయారీ వీరి కాలం నాటిదే అని పురావస్తు అధికారులు స్పష్టం చేస్తున్నారు. పల్లవ, విజయనగర రాజ్యాల్లో.. ఈ ప్రాంతాన్ని క్రీ.శ 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు పల్లవులు, క్రీ.శ 1336 నుం చి 1646 వరకు విజయనగర రాజులు పాలిం చారని తెలుస్తోంది. ఆలయ శిథిలాల్లోని శిల్పాలు, వాటిపై చెక్కిన శిల్పకళ, వన్యప్రాణులు, దేవతా విగ్రహాలు, నామాలు పరిశీలిస్తే పల్లవులు, విజయనగర రాజుల పాలనలో ఈ ఆల యం విరాజల్లినట్టుగా కనిపిస్తుంది. స్తంభాలపై సింహాల చిత్రాల శైలి పల్లవుల కాలం నుంచి ఉంది. కానీ విజయనగర పాలనలోనూ ఇలాగే కనిపిస్తాయి. స్తంభాలను మోస్తున్న భారవాహకుడు, యక్షుడు ఈ రాతి స్తంభాలకు పునాదులు గా కనిపిస్తారు. మకరం (మొసలి), సింహాల గుర్తులు పల్లవుల రాజ్య శైలి అయినప్పటికీ విజయనగర పాలనలో మకరం గుర్తులు కనిపిస్తాయి. ఇలాంటి గుర్తులే ములకలచెరువు మం డలంలోని సొంపాళ్యంలోని చెన్నకేశవాలయంలో కనిపిస్తాయి. వాటి పోలికలు శిథిలాల్లోని శిల్ప కళలో కనిపిస్తుండగా, ఆలయం విజయనగర పాలనకు ముందే నిర్మాణమైనట్టుగా ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఆధారాలను బట్టి విష్ణు ఆలయమే శీలంవారిపల్లె సమీప పొలాల్లో లభ్యమైన శిథిలాలు, మహలక్ష్మి విగ్రహాన్ని పరిశీలిస్తే ఇది కచ్చితంగా విష్ణు ఆలయమే అన్న అభిప్రాయం ఉంది. పురావస్తుశాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. లభించిన పానవట్టం, శిథిలాల్లో కనిపిస్తున్న నిర్మాణ ఆకా రాలు, స్తంభాల ఆధారం, వాటిపై చెక్కిన శం ఖు, చక్రాలతో విష్ణు ఆలయంగా నిర్ధారణ అవుతోంది. పేరు ఏదైనా వైష్ణవ ఆలయం కచ్చితమని స్పష్టంగా తెలుస్తోంది. కాగా శిథిలాల్లో విష్ణువు, గరుడుడు తదితర విగ్రహాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. కాగా ఆలయాన్ని మూడెంచెల పద్ధతిలో నిర్మించినట్టు కనిపిస్తుంది. ఆలయం చుట్టూ కోటలాంటి కట్టడం కనిపిస్తుంది. తర్వాత రెండో అంచెలో మైదానం, మూడో అంచెలో గర్భగుడి నిర్మాణం జరిగినట్టుంది. ఇప్పడు కనిపిస్తున్న శిథిలాలే గర్భగుడిగా నిర్ధారణ అయ్యింది. మహాలక్ష్మి విగ్రహానికి విశిష్ట ప్రత్యేకలు లభ్యమైన మహాలక్ష్మి విగ్రహానికి ఎన్నో విశిష్ట ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం అరుదైనదిని భావిస్తున్నారు. విగ్రహానికి నాలుగు చేతులున్నాయి. పైనున్న రెండు చేతుల్లో తామర పూలు ఉండగా, ఎడమ చేయి వరద హస్తం, కుడిచేయి అభయహస్తం కలిగి ఉన్నా యి. నుదుట మూడు నామాలు, శరీరంపై జం ద్యం ఉన్నాయి. అరచేతులు, కాళ్లకు రేఖలు కనిపిస్తున్నాయి. సుఖ ఆసనంలో ఉన్నట్టు కనిపిస్తున్న విగ్రహం మెడలో గొలుసు, ఇరువైపులా చెవులకు చక్రాలు, తలపై విష్ణువు ధరించే కిరీ టం కనిపిస్తాయి. అన్నింటికంటే ప్రధానంగా శిల్పం చెక్కిన తీరు అద్భుతం. సాధారణంగా శిల్పం ముందుభాగంలోనే విగ్రహం తయారవుతుంది. ఈ విగ్రహానికి ముందు, వెనుక రెండు వైపులా శిల్పాన్ని తయారు చేశారు. ఒకవైపే కాకుండా ముందు, వెనుక వైపు శరీర ఆకృతి ఉండడం విశేషం. పోలీస్‌స్టేషన్‌లో శ్రీమహాలక్ష్మి పాపం దేవుళ్లకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లక తప్పలేదు. శీలంవారిపల్లె సమీపంలోని కోనాపు రం పొలంలో సోమవారం శ్రీమహాలక్ష్మి విగ్రహం బయల్పడ్డ విషయం తెలిసిందే. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో తహసీల్దార్ సుబ్బన్న, ఎస్ఐ సుమన్ పరిశీలిం చి వివరాలు నమోదు చేశారు. శ్రీమహాలక్ష్మి విగ్రహాన్ని ఎస్ఐకి తహసీల్దార్ అప్పగించారు. ఎస్ఐ సోమవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. గదిలో నేలపై వస్త్రాన్ని పరచి విగ్రహాన్ని పడుకోబెట్టారు. ఆలయంలో ఉండాల్సిన శ్రీమహాలక్ష్మి ఇలా పోలీస్‌స్టేషన్ చేరుకుంది. విగ్రహాన్ని తమకు అప్పగించాలని పలు గ్రామాలకు చెందిన ప్రజలు అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం ఇవ్వడానికి కుదరదని స్పష్టంచేసి తీసుకొచ్చారు. మంగళవారం మళ్లీ అధికారుల వద్దకు వెళ్లిన గ్రామస్తులు రాతి విగ్రహం ఇస్తే పూజలు చేసుకుంటామని, తమ సంరక్షణలో ఆలయంలో ఉంచుతామని పట్టుబట్టారు. దీనిపై విగ్రహం అప్పగించేందుకు తహసీల్దార్ సుబ్బన్న అంగీకరించారు. విగ్రహాన్ని అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు. లిపిని శోధించాలి వీరగల్ శిలాశాసనంలోని లిపిని శోధిస్తే ఆలయ చారి త్రక ఆధారాలు లభ్యమవుతాయి. ఈ లిపి తెలుగు–కన్నడ భాష కనిపిస్తోంది. ఆలయ ప్రాం గణం, లభించిన మహాలక్ష్మి విగ్రహాన్ని పరి శీలిస్తే అది కచ్చితంగా విష్టు ఆలయమే. అయితే చెన్నకేశవ, నరసింహ, వేణుగోపాలస్వామి ఆలయాల్లో ఒకటి కావొచ్చు. ఇది శిలలు, వాటిపై చెక్కిన బొమ్మలను పరి శీలిస్తే పల్లవరాజుల శైలి, విజయనగర రాజు ల చిహ్నలు ఉన్నాయి. దీన్నిబట్టి శిథిలాల్లో ఇంకా శాసనాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. విగ్రహాలు కూడా లభించవచ్చు. ఆలయ చరిత్ర వెలుగులోకి తీసుకురావడానికి కృషిజరగాలి. – విజయకుమార్, రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్, పురావస్తుశాఖ ఆలయ విగ్రహాల తరలింపు శిథిలాలున్న ప్రాంతంలో కోనాపురం గ్రామంగా ఉండేదని మా పూర్వీకులు చెప్పేవారు. ఆలయానికి చెందిన ధ్వజస్తంభం, బలిపీఠాన్ని బి.కొత్తకోట మండలంలోని కాండ్లమడుగు అమరనారాయణపురం ఆలయంలో ప్రతి ష్ఠించారు. కొన్నింటిని తిరుమల, తెట్టు వేణుగోపాలస్వామి, గట్టులోని ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయాలకు తరలించినట్టు చెప్పేవారు. ఆలయ నిర్వహణకు సంబంధించిన కొన్నిపేర్లు వాడుకలో ఉన్నాయి. వాయిద్యాకారులకు ఇచ్చిన భూమి ప్రాం తాన్ని మేళ్లచెరువుగా, పూలను తెచ్చేవారి కోసం నిర్మించిన ప్రాంతాన్ని పూలచెట్ల బావిగా, ఉత్సవాల కోసం పేరుమాళ్లబండ పేర్లతో పిలుచుకునే ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. – శీలం వేణుగోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్, శీలంవారిపల్లె -
విద్యార్థి దారుణ హత్య
సాక్షి, తిరుపతి : నగరంలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థిని దారుణంగా హత్యచేసిన ఘటన సోమవారం తిరుపతిలో చోటుచేసుకుంది. అలిపిరి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ షేక్షావలి తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా కోడూరుకు చెందిన ద్వారకానాథ్(20) తిరుపతి–రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. స్థానిక శెట్టిపల్లెలో స్నేహితుడు సాయితో కలిసి అద్దెకు గదిలో ఉంటున్నాడు. విద్యార్థి తలిదండ్రులు కువైట్æలో ఉంటున్నారు. ఇలా ఉండగా కొంతకాలంగా బయట విద్యార్థులతో గొడవలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఎంఆర్. పల్లిలోని కొందరు వ్యక్తులతో ద్వారకానాథ్ గొడవ పడినట్లు సమాచారం. అనంతరం ఆ యువకులు విద్యార్థిన్ని శెట్టిపల్లి గేటు సమీపంలోకి పిలిపించారు. అక్కడికి వచ్చిన ద్వారకనాథ్‌పై బీరుబాటిళ్లతో దాడి చేసి కత్తులతో మెడపై పొడిచారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని గుర్తించిన కొందరు రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారిస్తున్నారు. హత్యకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేనసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ కళాశాలకు తరలించారు. -
తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు..
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలోని వివిధ ట్రస్తులకు శుక్రవారం రూ.4.5 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.4 కోట్లను విరాళంగా అందించాడు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆ దాత డీడీని అందజేశాడు. అయితే మరి కొందరు దాతలు 2.1 కోట్లను విరాళంగా ఇవ్వగా వీటిలో అన్నప్రసాదానికి రూ.కోటి, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10లక్షలు, శ్రీనివాస శంకరనేత్రాలయ ట్రస్టుకు రూ.10 లక్షలు, బర్డ్ ఆసుపత్రి ట్రస్టుకు రూ.40లక్షలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.20లక్షలు, ప్రాణ దాన ట్రస్టుకు రూ.30లక్షల విరాళాలను భక్తులు టీటీడీ అధికారులను కలసి అందజేశారు. -
మదనపల్లెలో మహిళ దారుణ హత్య
మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణ నడిబొడ్డున ఓ మహిళ గురువారం రాత్రి దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు మహిళను అతి కిరాతకంగా గొంతుకోసి చంపారు. ఈ హత్య పథకం ప్రకారమే జరిగినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో తీవ్ర కలకలం రేపిన ఈ దారుణ హత్యకు సంబంధించి డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, టూటౌన్ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ విలేకర్లకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని తారకరామ సినిమా థియేటర్ వీధి (నర్సింగ్ హోం సందు)లో ఓ అద్దె ఇంటిలోని మూడో అంతస్థులో ముతవల్లి (మతగురువు) షేక్ అంజాద్, భార్య ఎస్.తహశీన్ (28) కాపురం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు తయూబ్(3), తలాల్(2), తాయూబ(1) ఉన్నారు. గురువారం ఇందిరానగర్‌లో ఉంటున్న అంజాద్ తల్లి పర్వీన్ తన కోడలు, మనవళ్లు, మనవరాలిని చూడటానికి ఇందిరానగర్ నుంచి వారి వద్దకు వచ్చింది. ఆమెను కొడుకు, కోడలు ఆ రోజంతా గౌరవంగా చూసుకున్నారు. సాయంత్రం చీకటి పడగానే పర్వీన్ తిరిగి ఇందిరానగర్‌కు వెళ్లాలని కొడుకుకు చెప్పింది. వెంటనే ఆయన తన పిల్లలను ట్యూషన్లో వదిలి, తల్లిని తన ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని ఇందిరానగర్‌కు వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా తహశీన్‌ను ఎవరో కత్తితో గొంతుకోసి చంపారు. ట్యూషన్ పూర్తవగానే పిల్లలను ఇంటికి తీసుకొచ్చిన ఆయా, రక్తపు మడుగులో పడివున్న తహశీన్‌ను చూసి కేకలు పెట్టింది. స్థానికులు విషయాన్ని అంజాద్‌కు ఫోన్లో సమాచారం అందించారు. అదేవిధంగా 108కు ఫోన్ చేయడంతో సిబ్బంది గోపి, అమర అక్కడికి చేరుకున్నారు. తహశీన్‌ను పరిశీలించి, ఆమె మృతిచెందినట్లు తెలిపారు. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తహశీన్ తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. హత్యపై అన్నీ అనుమానాలే.. తహశీన్ హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్య జరిగిన వెంటనే రక్తపుమరకలను తుడిపేయడానికి నిందితులు బకెట్‌తో నీళ్లు తెచ్చి జగ్గుతో కడిగే ప్రయత్నం చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అలాగే పెనుగులాటలో మహిళ కుడికాలి వెండి మెట్టె, మెడలోని బంగారు బొట్టు గొలుసు ఆమె మృతదేహానికి సమీపంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అంతే కాకుండా రక్తపు మరకలున్న కాళ్లతో నిందితులు ఇళ్లంతా తచ్చాడినట్లు స్పష్టమైన గుర్తులు కనిపిస్తున్నాయి. పడక గదికి ఆనుకుని ఉన్న బీరువా తెరచి రెండు మూడు చీరలు బయటకు తీసి కిందపడేసి వెళ్లినట్లు చిత్రీకరించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తలుపుకు గడియ పెట్టే చోట కూడా రక్తపు మరకలు అంటుకుని ఉండడంతో హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యను దొంగతనం చేయడానికి వచ్చిన దుండగులు చేసి ఉంటే, ఆమె కొత్త వ్యక్తులను చూడగానే కేకలు వేయడం, లేదా పెనుగులాడిన ఆనవాళ్లు గానీ, తోపులాట జరిగినట్లు గానీ కనిపించేదని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాణాపాయం నుంచి బయటపడటానికి ఆపదలో ఉన్న ఎవరైనా పోరాడినట్లు కనిపించకపోవడంతో హత్యపై పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. కుటుంబ సభ్యుల పనేనా? ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ హత్య వెనుక కుటుంబ సభ్యుల హస్తమేమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు పాల్పడినవారు ఎంతటి వారైనా వదలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు. సంఘటనా స్థలంలో లభించిన కొన్ని కీలక ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. -
వేళకురాని వైద్యులు..రోగుల ఎదురుచూపులు
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యులు దేవుడితో సమానమని దీని అర్థం. అంతటి ప్రాధాన్యత ఉన్న డాక్టర్లు సమయ పాలన పాటించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన సమయంలో వైద్యం అందక పలువురు మృత్యు ఒడికి చేరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ దుస్థితి కనిపిస్తోంది. సాక్షి, వరదయ్యపాళెం : 24గంటలు స్థాయి కలిగిన మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు వైద్యసేవలు దూరమవుతున్నాయి. ముగ్గురు వైద్యులున్న ఈ ఆస్పత్రిలో సోమవారం ఉదయం 11గంటలు కావస్తున్నా ఏ ఒక్కరూ హాజరుకాలేదు. వైద్యం కోసం వచ్చిన రోగులు డాక్టర్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. నిరీక్షించలేని రోగులు ఆస్పత్రిలో ఉన్న నర్సు ద్వారా తాత్కాలిక వైద్యం చేయించుకుని వెనుదిరిగారు. 11 గంటలు దాటిన తర్వాత ఓ వైద్యాధికారి వచ్చారు. మరో వైద్యాధికారిణి 11.40గంటలకు వచ్చారు. సరిగ్గా ఒంటిగంటకు వీరు తిరుగుపయనమయ్యారు. ఆస్పత్రికి వైద్యం కోసం ప్రతిరోజూ 100మందికి వస్తుంటారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంఖ్య క్రమేణా తగ్గుతోంది. మండు వేసవి కారణంగా గ్రామాల్లో వడదెబ్బ బాధితులు అధికంగా ఉన్నారు. విషజ్వరాలు కూడా ప్రబలమవుతున్నాయి. ఇటీవల చిన్న పాండూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంజీనగర్ గిరిజనకాలనీలో ఊరంతా విషజ్వరాలు ప్రబలి నలుగురు మృతి చెందారు. అయినా ఇక్కడి వైద్యుల పనితీరులో మాత్రం మార్పు కనిపిం చడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు వేసవి కాలం దృష్ట్యా ఉదయం 10 గంటలపైబడి ప్రభుత్వ కార్యాలయాల వద్దకు సామాన్య ప్రజలను రప్పించద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చిన్న పాండూరు ఆస్పత్రిలో పది గంటల వరకు డాక్టర్లు విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. ఆస్పత్రి పనితీరు రోజురోజుకూ దిగజారుతోంది. 24 గంటలు స్థాయి కలిగిన ఈ ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్యులను ప్రభుత్వం నియమించింది. అయితే వీరు ముగ్గురు ఒక్క రోజు కూడా హాజరుకావడం లేదు. రోజు మార్చి రోజు విధులకు హాజరవుతూ హాజరు పట్టికలో మాత్రం నెలంతా హాజరైనట్లు నమోదు చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వం తప్పనిసరిగా బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ అక్కడ నెట్ పనిచేయలేదన్న సాకుతో బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోలేదు. రోజులో విధులకు హాజరయ్యే ఆ ఒక్క వైద్యుడు సైతం 2గంటలు మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ మొక్కుబడి విధులు నిర్వహించడమేమిటంటూ పరిసర ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
రైతే రాజయ్యేలా..
సాక్షి, శ్రీకాళహస్తి : రుణమాఫీ మాయాజాలంతో అంతు చిక్కని మోసం..విత్తన, ఎరువుల పంపిణీలో అవినీతి జాడ్యం..ధీమా ఇవ్వని పంటల బీమా, వాతావరణ బీమా పథకాలు..పంట రుణాల మంజూరులో తిరకాసులు..సంక్షేమ పథకాల లబ్ధిలో పైరవీలు...వెరసి ఐదేళ్ల టీడీపీ పాలనలో దగాపడ్డ అన్నదాతలు. తమను ఆదుకునే నాథుడే లేరా అంటూ ఎదురుచూస్తున్న తరుణంలో ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రూపంలో చిరుదివ్వెలా కనిపించిన వెలుగు.. మహాజ్వాలగా మారి అంధకారం నిండుకున్న రైతుల జీవితాల్లో వెలుగులు ప్రసరించ సాగింది. నవరత్నాల పథకాలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా వరాలు ప్రకటించిన జననేత అన్నదాతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రకటించిన హామీలపై అన్నదాతల్లో హర్షం వ్యక్తంమవుతోంది. ‘సహాయనిధి’ చాలా సంతోషం 2015లో అతివృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేదు. ఈ ఏడాది అనావృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు రూ.4 వేల కోట్లు సహాయనిధి ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇవ్వడం హర్షణీయం – కలివేలయ్య, పాపనపల్లి వడ్డీ రాయితీతో ఎంతో మేలు బ్యాంకుల్లో తీసుకునే పంట రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించి రైతులకు పూర్తిగా రాయి తీ కల్పించడం ఎంతో మేలు. టీడీపీ ప్రభుత్వం విధానాలతో పంట రుణాలపై వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయి. జగన్ ఇచ్చిన హామీ పేద రైతులకు ఎంతో మేలు. – ప్రసాద్‌నాయుడు,, సూరావారిపల్లి -
ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం
-
రైతుల భూములపై మంత్రి కన్ను
-
వేధింపులతో వివాహిత ఆత్మహత్య
ఐరాల: అత్తమామలు, భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శనివారం జరిగింది. ఎస్ఐ ప్రసాద్‌రావు కథనం మేరకు.. నాగవాండ్లపల్లె పంచాయతీ వీఎస్ అగ్రహారానికి చెందిన బావాజాన్‌కు రెండేళ్ల క్రితం పలమనేరుకు చెందిన జాస్మిన్(23)తో వివాహమైంది. వారికి ఇంకా సంతానం కలుగలేదు. దీంతో అత్తమామలు, భర్త వేధిస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన జాస్మిన్ శుక్రవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో కొట్టుమిట్టూడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శనివారం వేకువజామున మృతి చెందింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ ప్రసాద్ బాబు అక్కడికి చేరుకుని పంచనామా చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ధ్యానం గోడౌన్లో అగ్నిప్రమాదం
-
అదే తీరు.. 9తోనే సరి
సాక్షి, చిత్తూరుఎడ్యుకేషన్ : ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకొకసారి జరిగే జెడ్పీ సర్వ సభ్య సమావేశం నిర్వహణలో తీరు మారలేదు. ఎప్పటి లాగే ప్రధాన అంశాలు చర్చకు రాలేదు. శనివారం స్థానిక అంబేడ్కర్ భవనంలో జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన జిల్లా పరి షత్ సర్వసభ్య సమావేశంలో చిన్న చిన్న సమస్యలపైనే చర్చించి, మమ అనిపించారు. సమావేశానికి పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి హాజరయ్యారు. ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూ డా సమావేశానికి కాకపోవడం గమనార్హం. ఇక జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మాత్రం సమావేశానికి యథావిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జేసీ గిరీషా, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, ఏఓలు ప్రభాకర్‌రెడ్డి, వెంకటరత్నం, అధికారులు పాండురంగస్వామి, విజయకుమార్, రవిప్రకాష్‌రెడ్డి, కుర్మానాథ్, ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, దొరబాబు, జిల్లా గ్రంథా లయ చైర్మన్ కన్నయ్యనాయుడు పాల్గొన్నారు. టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలి బైఠాయింపు జెడ్పీ పాలకవర్గం తమకు అనుకూలంగా ఉన్న వారికే నిధులు కేటాయిస్తోందని నాగలాపురం టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత సమావేశంలో స్టేజీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళనని తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, తదితర పనులను తమ మండలానికి కేటాయించడం లేదని తెలిపారు. తొమ్మిదింటితో సరిపెట్టేశారు జెడ్పీ సమావేశం ఉదయం 11.10 గం టలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల కాంట్రాక్టులకు సంబంధించిన జీఎస్టీపై 45 నిమిషాలు గడిపేశారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ వెంకటరెడ్డి యాదవ్ గళం విప్పారు. అజెండాలో 42 అంశాలు ఉండగా కేవలం 9 అం శాలపై మాత్రమే చర్చలు జరిపి తూతూ మం త్రంగా సభను ముగించేశారు. సాక్షరభారత్ రద్దుపై వాడివేడి చర్చ రాష్ట్ర ప్రభుత్వం సాక్షరభారత్పై కుట్రపన్ని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసిందని పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ ఆరోపించారు. దీనిపై మంత్రి అమరనాథరెడ్డి జోక్యం చేసుకుని ఆ నిర్ణయం తమది కాదని కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని సమాధానమిచ్చారు. ఏ ఇతర రాష్ట్రాల్లో లేని రద్దు రాష్ట్రంలో మాత్రమే ఎందుకు విధించారని సభ్యులు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఇక్కడ మాట్లాడితే ఏం లాభముంటుందని మంత్రి అన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ‘నువ్వు వైఎస్సార్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ మారావు. నీవు మాకు నీతులు చెప్పడం ఏమిటి?.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుల మధ్యవాదోపవాదాలు జరిగాయి. విద్యాశాఖపై సుదీర్ఘచర్చ అజెండాలో రెండో అంశమైన విద్యాశాఖపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్నభోజన నిధులు విడుదల కావడం లేదని, విద్యాసంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించలేకపోయారన్నారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చుపెట్టి ఇషా విద్యను నడపడం సబబు కాదన్నారు. రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెడ్పీ పాఠశాల స్థలాలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మా ట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకనే దాన్ని టీడీపీ నాయకుల ఘనతగా పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలనడం సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు జిప్సం అందడంలేదు ఐరాల, పూతలపట్టు ప్రాంతాల్లో చాలా మంది రైతులకు జిప్సం అందడం లేదు. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాసమస్యలపై మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరం. ప్రజా సమస్యలపై వారు చర్చించరు... మేము చర్చిస్తే విరుద్ధంగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయే గాని బోధించేందుకు టీచర్లు లేకపోవడం దారుణం. – సునీల్‌కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు జరపడం లేదు మోడల్ స్కూళ్లల్లో పేద విద్యార్థులు చేరడానికి వెళుతుంటే అడ్మిషన్లు లేవని ప్రిన్సిపాళ్లు తిప్పి పంపుతున్నారు. 20 శాతం అధికంగా విద్యార్థులను చేర్చుకోవచ్చనన్న నిబంధన ఉన్నప్పటికీ అడ్మిషన్లు చేయడం లేదు. ఈ విషయంపై డీఈఓ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉండడంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. – దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే ఫలితం దక్కడం లేదు ప్రతిసారీ సర్వసభ్య సమావేశానికి, స్థాయి సంఘ సమావేశాలకు హాజరవుతూనే ఉన్నాం. జెడ్పీకి ఎన్ని నిధులు వచ్చా యి... ఏఏ పనులకు ఖర్చు పె ట్టారు... అన్న వివరాలను చెప్పడం లేదు. పాఠశాలలో అదనపు తరగతులు అవసరమున్న చోట కట్టకుండా ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారు. సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నా ఫలితం దక్కడం లేదు. – వెంకటరెడ్డి యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు, పుంగనూరు