
సాక్షి, రేణిగుంట: దుండగులు పట్టపగలే దోపిడీకి యత్నించిన ఘటన రేణిగుంట రైల్వేస్టేషన్‌లో జరిగింది. దొంగతనం బెడసి కొట్టడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణిగుంట రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఓ వ్యక్తి బరోడా బ్యాంక్ ఏటీఎంను పగుల గొట్టేందుకు ప్రయత్నించగా సైరన్ మోగింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు మని కుమార్‌గా పొలీసుల గుర్తించారు. మనికుమార్ 2017 సంవత్సరం తిరుపతిలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దోపిడీకి ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment