renigunta railway station
-
పరిచయం చేసుకుని.. పని ఇప్పిస్తానని..
సాక్షి, చిత్తూరు: రేణిగుంట రైల్వేస్టేషన్లో గత రాత్రి కలకలం చోటుచేసుకుంది. ఆరు నెలల బాబును దుండగులు కిడ్నాప్ చేశారు. నాలుగు రోజుల క్రితం తాడి పత్రి నుంచి రేణిగుంటకు బాబుతో వచ్చిన స్వర్ణ లత అనే మహిళ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. తాడిపత్రికి చెందిన స్వర్ణలత భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లో ఉంటోంది. ఆమె తాగుబోతు భర్త అక్కడకు కూడా వచ్చి గలాట చెయ్యడంతో పుట్టింటి నుంచి బయటకు వచ్చింది. ఈక్రమంలో రేణిగుంట రైల్వే స్టేషన్లో పనిచేసే స్వీపర్ ద్వారా ఆమెకు అనిత అనే మహిళ పరిచయమైంది. తాను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నానని.. స్వర్ణలతకు పని ఇప్పిస్తానని నమ్మబలికింది. దాంతో స్వర్ణలత నాలుగు రోజుల పాటు రైలల్వే స్టేషన్లోనే గడిపింది. ఈ నేపథ్యంలో తల్లీ బిడ్డలకు కొత్త బట్టలు కొనిస్తానని తీసుకెళ్లిన అనిత.. అక్కడ ఆమెను బురిడీ కొట్టించి బాబుతో ఉడాయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఇద్దరు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
ఆరు నెలల బాలుడి కిడ్నాప్!
-
సైరన్ మోగింది..దొంగ దొరికాడు
సాక్షి, రేణిగుంట: దుండగులు పట్టపగలే దోపిడీకి యత్నించిన ఘటన రేణిగుంట రైల్వేస్టేషన్లో జరిగింది. దొంగతనం బెడసి కొట్టడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణిగుంట రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఓ వ్యక్తి బరోడా బ్యాంక్ ఏటీఎంను పగుల గొట్టేందుకు ప్రయత్నించగా సైరన్ మోగింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు మని కుమార్‌గా పొలీసుల గుర్తించారు. మనికుమార్ 2017 సంవత్సరం తిరుపతిలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో దోపిడీకి ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. -
కాసేపట్లో రైలు వస్తుందని అనౌన్స్మెంట్ ఇంతలోనే..
-
కాసేపట్లో రైలు వస్తుందని అనౌన్స్మెంట్ ఇంతలోనే..
సాక్షి, చిత్తూరు: రేణిగుంట రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ధర్నాకు దిగారు. యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్ళవలసిన అంగా ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు చెప్పపెట్టకుండా రద్దు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మరికొద్దిసేపట్లో అంగా ఎక్స్‌ప్రెస్ మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని అనౌన్స్ చేయడంతో ప్రయాణికులంతా ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి రైలు కోసం వేచిచూశారు. చాలాసేపు వేచిచూసినా రైలు రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఇంతలో అంగా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో ఆ రైల్లో వెళ్లేందుకు టికెట్లు, రిజర్వేషన్లు చేయించుకున్న దాదాపు 500 మంది ప్రయాణికులు షాక్ తిన్నారు. ఇంత దారుణమైన నిర్లక్ష్యమా? అంటూ ఆందోళనకు దిగారు. స్టేషన్ మాస్టర్ గది వద్ద ధర్నా చేపట్టారు. కనీసం రైలు రద్దయిన సమాచారాన్ని కూడా తమకు చెప్పకపోవడం దారుణమని ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో చిన్న, చిన్నపిల్లలతో ఉన్న మహిళలు తమ రైలు రద్దు కావడంతో స్టేషన్లో చిక్కుకుపోవాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ మహిళలు పిల్లలతో కలిసి ధర్నా చేశారు. -
మ్యావ్ మ్యావ్... ఏమైపోయావ్!
రక్తసంబంధీకులు దూరమైతేనే వారం... పది రోజుల పాటు బాధపడి యధావిధిగా రోజువారీ పనుల్లో నిమగ్నమవుతున్న ఈ సమాజంలో ఓ జంట, తాము కొద్దికాలంగా పెంచుకుంటున్న పిల్లి కనిపించకుండా పోయేసరికి దానికోసం పడుతున్న తపన చూపరులను తమవైపునకు తిప్పుకుంటోంది. ఏడాది పాటు తమ కుటుంబంలో ఓ సభ్యునిగా భావించి పెంచుకున్న పిల్లి కోసం ఊరుగాని ఊరిలో, భాష తెలియని ప్రాంతంలో... ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా నెల రోజులకుౖ పెగా కళ్లలో ఒత్తులేసుకుని వెతుకుతున్నారు. నేపథ్యమిదీ... గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరానికి చెందిన జయేష్, మీన దంపతులు నగరంలో హోల్‌సేల్ దుస్తులవ్యాపారం, మొబైల్షాపులతో హాయిగానే జీవిస్తున్నారు. అయితే వివాహమై పదేళ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదన్న వెలితి వారిని బాధించేది. ఏడాది కిందట ఓ పిల్లి పిల్ల వారింటికి చేరుకుంది. జయేష్, మీన దంపతులు ఆ పిల్లిని తమకు దేవుడు పంపిన బిడ్డగా భావించి కంటికిరెప్పలా పెంచుకున్నారు. చూస్తుండగానే వారికి ఆ పిల్లితో తెలియని బంధం ఏర్పడింది. అది పిల్లి కాదు.. పిల్లోడే అనుకునేంతగా వారి బంధం దృఢ పడింది. వెంకన్న దర్శనం కోసం వచ్చి... తిరుమల వెంకన్న దర్శనార్థం జయేష్, మీన దంపతులు ఇటీవల సూరత్ నుంచి పిల్లిని ప్రత్యేకంగా ఓ బుట్టలో పెట్టుకుని వెంట తెచ్చుకున్నారు. తిరుమలకు గత నెల 9న చేరుకున్నారు. నాలుగు రోజులపాటు శ్రీ వారి సన్నిధిలో గడిపిన తర్వాత తిరుగు పయనమై గతనెల 12న రాత్రి రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి ముంబైకు వెళ్లి మరో రైలెక్కి స్వస్థలం చేరాలన్న ఆలోచనతో స్టేషన్లో రైలుకోసం వేచి ఉన్నారు. పిల్లితో ఆడుకుంటూనే నిద్రలోకి జారుకున్నారు. కాసేపటి తర్వాత మెలకువ వచ్చి చూడటంతో ఒడిలో నిద్రిస్తున్న పిల్లి కనిపించలేదు. దాంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పిల్లితో చివరిసారిగా తిరుమల కొండపై దిగిన ఫోటోఫ్రేమ్‌ను చూపుతూ స్టేషన్ ప్రాంగణమంతా వెతికారు. పిల్లి ఆచూకీ లభించకపోవడంతో పిల్లి ఆచూకీ దొరికే వరకు ఈ ప్రాంతాన్ని వదిలి ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. రేణిగుంట, తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కోడూరు, గూడూరు, నెల్లూరు, కస్మూరు దర్గా.. ఇలా అన్ని చోట్లకు వెళ్లి వెతుకుతూనే ఉన్నారు. నెలరోజులు దాటినా పిల్లి ఆచూకీ తెలియలేదు.. ప్రాణసమానమైన పిల్లి జాడను దేవుడే చూపుతాడన్న విశ్వాసంతో పిల్లిని దొరకబుచ్చుకోవడమే లక్ష్యంగా కనిపించిన ప్రతి ఒక్కరినీ పిల్లి కోసం ఆరా తీస్తున్నారు. వీరి అన్వేషణ ఫలించాలని కోరుకుందాం. పిల్లి రూపురేఖలివీ... ‘ఫెలిసియో’ సంతతికి చెందిన ఈ అరుదైన పిల్లి సుమారు 3.5 నుంచి 4 కిలోల బరువుంటుంది. 14 నెలల వయస్సు కలిగిన ఈ పిల్లి 10 అంగుళాలు ఎత్తు ఉండి, తెలుపు, ఊదా రంగులతో నిలువు చారలు కలిగి ఉంటుంది.– చింత మునిశేఖర్, సాక్షి, రేణిగుంటఫొటోలు: షేక్ మహ్మద్ రఫి -
పిల్లి దొరికే వరకు వెళ్లేది లేదు
సాక్షి, రేణిగుంట : పిల్లితో పెనవేసుకున్న బంధాన్ని ఆ దంపతులు మరువలేకున్నారు. 27రోజుల కిందట రేణిగుంట రైల్వేస్టేషన్లలో అదృశ్యమైన పిల్లి తమకు సురక్షితంగా దొరికే వరకు ఇక్కడి నుంచి వెళ్లబోమని సూరత్ దంపతులు భీష్మించడం ప్రస్తుతం రైల్వే పోలీసులను అయోమయానికి గురిచేస్తోంది. సాక్షిలో మంగళవారం ‘పిల్లి కోసం తల్లడిల్లుతూ...’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో.. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో రేణిగుంట జీఆర్పీ సీఐ అశోక్ స్పందించారు. పిల్లిని పోగొట్టుకున్న సూరత్ దంపతులు జయేష్‌బాబు, మీనలను మంగళవారం ఆయన పిలిపించి విచారించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాము సాధ్యమైనంత మేరకు పిల్లిని వెతికిపెడతామని, వివరాలను ఇచ్చి స్వస్థలానికి వెళ్లాలని ఆయన వారిని కోరారు. అయితే ఇక్కడే ప్రాణాలను వదిలేందుకు తాము సిద్ధమే కానీ, కన్నబిడ్డ కంటే ఎక్కువగా భావిస్తున్న తమ పిల్లి ‘బాబు’ దొరికే వరకు ఇక్కడ నుంచి ఎక్కడికీ వెళ్లమని స్పష్టం చేశారు. దీంతో పోలీసు అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. -
జననేతకు ఘన స్వాగతం
సాక్షి, తిరుపతి: పాదయాత్ర ముగించి శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్థానిక ప్రజలు, నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గురువారం ఉదయం 10.10 గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్లో వైఎస్ జగన్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన తిరుమల చేరే వరకు.. అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ఆయన్ను చూడటానికి, చేయి కలపడానికి, అభివాదం చేయడానికి జనం పోటీపడ్డారు. జగన్‌కు స్వాగతం పలకడానికి వచ్చిన వారితో రేణిగుంట రైల్వేస్టేషన్‌కు కిక్కిరిసిపోయింది. జగన్‌ను వాహనం వద్దకు తీసుకురావడానికి భద్రతా సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. జై జగన్ నినాదాలతో స్టేషన్ ప్రాంగణం మార్మోగింది. అక్కడ నుంచి తిరుపతికి జగన్ రోడ్డుమార్గంలో బయలుదేరారు. రేణిగుంట రైల్వేస్టేషన్, కేఎస్ఎం ఆసుపత్రి కూడలిలో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వద్ద అభిమాన సందోహం మధ్య వైఎస్ జగన్ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రవేశించిన జననేతకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మహిళలు, యువకులు గుమ్మడికాయలపై కర్పూరం వెలిగించి వైఎస్ జగన్‌కు దిష్టితీశారు. ఆ రోడ్డులో బస్సుల్లో, ఇతర వాహనాల్లో వెళ్తున్నవారు కూడా ఆగి జగన్‌కు అభివాదం చేశారు. రేణిగుంట నుంచి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సమీపంలోని పద్మావతి అతిథి గృహం చేరుకొనే వరకు.. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తర్వాత పద్మావతి అతిథి గృహం నుంచి అలిపిరికి చేరుకోనే మార్గం మొత్తం జనంతో నిండిపోయింది. జగన్ కాన్వాయ్ తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావ్ పూలే సర్కిల్‌కు చేరుకోగానే యువ నాయకుడు భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది అభిమానులు, నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చుతూ ఘన స్వాగతం పలికారు. దివ్యాంగులు సైతం తమ అభిమాననేతకు స్వాగతం పలకడానికి వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు ప్రతిపక్ష నేతపై పూలవర్షం కురిపించారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ జననేత ముందుకు కదిలారు. మెట్ల మార్గంలో భక్తులకు అభివాదం చేస్తూ... నడకదారిలో అనుసరించిన వేలాది మంది.. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక దారిలో కిలోమీటరు మేర జనంతో నిండిపోయింది. తిరుమలకు వెళుతున్న భక్తులు కూడా జగన్ వస్తున్నారనే సమాచారంలో కాలినడక బాటలో నిలబడి ఎదురుచూశారు. ఆయనతో కలిసి నడవడానికి ఉత్సాహపడ్డారు. జగన్ వెంట.. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు అడుగులు వేశారు. జగన్ మెట్ల మార్గంలో నడవటం, సామాన్య భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్లు తీసుకోవడం, దివ్యదర్శనానికి అందరితోపాటు క్యూలైన్లో వచ్చి గుర్తింపు కార్డు చూపించి ఫింగర్ ప్రింట్స్ వేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. తమలో ఒకడిగా కలిసి శ్రీవారి దర్శనానికి ఆయన రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాలిబాటలో జగన్ నడిచిన వేగాన్ని అందుకోలేక కొంతమంది వెనుకబడిపోవడం కనిపించింది. తమవాడే తమతో కలసి నడిచినట్లుగా ఉందని జగన్‌తో నడిచిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సంప్రదాయ పంచెకట్టుతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న వైఎస్ జగన్ అలిపిరి మార్గంలోని రాధాకృష్ణ ఆలయంలో హారతి తీసుకుంటున్న వైఎస్ జగన్ -
తిరుపతిలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
-
రేణిగుంట రైల్వేస్టేషన్లో వరప్రసాద్‌కు ఘనస్వాగతం
-
వసతులు లేక.. ఏటీఎం గదిలో పడక
రేణిగుంట రైల్వేస్టేషన్ జంక్షన్‌గా రూపాంతరం చెంది శతాబ్దన్నర కాలం దాటుతున్నా.. స్టేషన్లో వసతుల లేమితో ప్రయాణికులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. తిరుమల క్షేత్రం దగ్గర్లోనే ఉండడంతో.. నిత్యం అనేకమంది ఇక్కడికి వస్తుంటారు. వారు సేదతీరడానికి స్టేషన్లో సరిపడా గదులు ఇప్పటికీ ఏర్పాటుచేయలేదు. దీంతో ప్రయాణికులు ప్లాట్‌ఫాంలపైనా, కనిపించిన ఖాళీ చోట్లా ఉంటున్నారు. ఆదివారం రాత్రి స్టేషన్‌కు వచ్చిన ఓ కుటుంబం ఇలా పక్కనే ఉన్న ఏటీఎం గదిలో నిద్రించింది. – రేణిగుంట -
ఫ్రైవేటు విద్యాసంస్థకు కారుచౌకగా భూమి
- రూ. 7.14 కోట్ల విలువైన భూమి రూ. 59 లక్షలకే - తిరుపతి సమీపంలో అనంత ఎడ్యుకేషనల్ సొసైటీకి ధారాదత్తం సాక్షి, హైదరాబాద్: తిరుపతికి సమీపంలోని ఆర్.అగ్రహారంలో అత్యంత విలువైన, ముఖ్యమైన ప్రాంతంలో 2.38 ఎకరాల భూమిని ప్రయివేటు విద్యా సంస్థకు కారు చౌకగా ప్రభుత్వం ధారాదత్తం చేసింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని ఆర్. అగ్రహారం ఇటు రేణిగుంట రైల్వే స్టేషన్‌కు, తిరుపతి బస్సుస్టాండుకు, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఎకరా విలువ హీనపక్షం రూ. 3 కోట్లు పైనే ఉంటుంది. ఇంత విలువైన భూమిని అనంత ఎడుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్ రవి అనంతకు ఎకరా కేవలం రూ. 25 లక్షల ధరతో 2.38 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. రూ. 7.14 కోట్ల విలువైన 2.38 ఎకరాల భూమిని కేవలం రూ. 59.50 లక్షలకే రవి అనంతకు కట్టబెడుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే దరఖాస్తు చేసినా.. గత ప్రభుత్వ హయాంలోనే తన విద్యా సంస్థ ఏర్పాటుకోసం భూమి కేటాయించాలని రవి అనంత దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు 2009 జూన్ పదో తేదీన చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు ప్రతిపాదన వచ్చింది. అయితే గత ప్రభుత్వం ఈ సంస్థకు భూమిని కేటాయించకుండా ఫైలును పక్కన పడేసింది. వ్యాపార దృక్పథంతో విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలు ఫీజులు దండుకుంటున్న ప్రయివేటు విద్యా సంస్థకు ప్రభుత్వ భూమిని కేటాయించాల్సిన అవసరం లేదని అప్పటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 అక్టోబరు 27వ తేదీన రవి అనంత మళ్లీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్నారు. దీంతో చకచకా ఫైలు కదిలింది. విద్యా సంస్థ ఏర్పాటు పేరుతో రవి అనంతకు 2.38 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెడుతూ రెవెన్యూ శాఖ గురువారం జీవో నంబరు 121 జారీ చేసింది. భారీగా ఫీజులు దండుకుంటున్న ప్రయివేటు విద్యా సంస్థకు కారు చౌకగా ప్రభుత్వ భూమి కేటాయించాల్సిన అవసరం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ‘సేవాభావంతో పనిచేసే సొసైటీలకు నామమాత్రపు ధరతో భూములు ఇవ్వడం సబబే. కానీ వ్యాపార ధోరణితో పనిచేసే విద్యా సంస్థకు ఇలా ఇవ్వడం నిజంగా అన్యాయమే. కోట్లు దండుకునే వారు భూములు కొనుక్కోలేరా? వారికి ప్రభుత్వ భూమి ఎందుకు ఇవ్వాలి?’ అని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి.