
మృతిచెందిన జాస్మిన్
ఐరాల: అత్తమామలు, భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శనివారం జరిగింది. ఎస్‌ఐ ప్రసాద్‌రావు కథనం మేరకు.. నాగవాండ్లపల్లె పంచాయతీ వీఎస్ అగ్రహారానికి చెందిన బావాజాన్‌కు రెండేళ్ల క్రితం పలమనేరుకు చెందిన జాస్మిన్(23)తో వివాహమైంది.
వారికి ఇంకా సంతానం కలుగలేదు. దీంతో అత్తమామలు, భర్త వేధిస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన జాస్మిన్ శుక్రవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో కొట్టుమిట్టూడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శనివారం వేకువజామున మృతి చెందింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ ప్రసాద్ బాబు అక్కడికి చేరుకుని పంచనామా చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment