husband harrassements
-
‘అమ్మా నన్ను క్షమించండి.. వెళ్లాలని లేకున్నా వెళ్తున్నా’
సాక్షి. పెద్దపల్లి: ‘అమ్మా నన్ను క్షమించండి.. నేను మళ్లీ మీ కడుపున పుడతా. కానీ మళ్లీ వాడికిచ్చి పెళ్లి చేయకండి. వాడి వేధింపులు భరించలేకపోతున్న.. వెళ్లాలని లేదు కానీ తప్పదు వెళ్తున్నా. వెళ్తున్న అంటే బతకడానికి కాదు వెతకండి మీకు దగ్గరలో కనపడతా. మీరు అందరూ నాకు కావాలి.’ అంటూ ఓ వివాహిత భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి ఒడ్డెరకాలనీలో జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాలు.. గ్రామానికి చెందిన ఒల్లపు సోని(21)కి మూడేళ్ల క్రితం ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి అలమకుంట రమేశ్‌తో వివాహం జరిగింది. వివాహం అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మళ్లీ గొడవ జరుగగా ఐదు రోజుల క్రితం పుట్టిల్లు పెగడపల్లికి వచ్చింది. ఈక్రమంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోని తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. సమీపంలోని ఓ రైతు వ్యవసాయ బావిలో శవమై తేలింది. తన ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోటు బావి ఒడ్డున లభించింది. సూసైడ్ లెటరు చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఘొల్లుమంటూ రోదించారు. అత్తింటి వేధింపులు, అల్లుడు రమేశ్ కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. -
భర్త ఆగడాలు తట్టుకోలేక.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మద్యానికి బానిసైన భర్త తరచూ గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిజాంపేట్ భవ్యాస్ ఆనంద్‌లో నివాసముండే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మామిడి ప్రసాద్, స్పందన(35)లు భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా ప్రసాద్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో బంగారు నగలను సైతం జల్సాలకు విక్రయించాడు. దీంతో మనస్తాపానికి గు రైన స్పందన ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరే సుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రియురాలి విషయంలో వాగ్వాదం.. స్నేహితుడే హంతకుడు ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే డబ్బులు కావాలని వేధింపులు.. తట్టుకోలేక
సాక్షి, ఆదిలాబాద్: వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకున్న సంఘటన మండలంలోని నిర్మల్ జిల్లా గంజాల్‌లో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామానికి చెందిన అడెల్ల–శంకర్ కూతురు అరుణ(24)ను సోన్ మండలం గంజాల్ గ్రామానికి చెందిన గుండారపు గంగాసాగర్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. వృత్తిరీత్యా ఫొటో గ్రాఫర్ అయిన గంగాసాగర్ పెళ్లి అయిన కొద్ది రోజుల నుంచే తనకు డబ్బులు అవసరం ఉన్నాయని రూ.లక్ష తీసుకురమ్మని వేధించసాగాడు. ఆమె తీసుకురాకపోవడంతో భార్యపై అనుమానం పెంచుకుని మానసికంగా వేధించాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. బుద్ధిగా వుంటానని చెప్పి భార్యను కాపురానికి తీసుకువచ్చిన గంగాసాగర్ మళ్లీ కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభించాడు. అరుణ డబ్బుల విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. ఈక్రమంలో భర్త వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. అరుణకు మూడేళ్ల కూతురు సంస్కృతి ఉంది. అరుణ తమ్ముడు నల్ల అనిల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. చదవండి: పిల్లలు చూస్తుండగానే భార్య గొంతు కోసి... -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోకుండా మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య మహిళా సంఘాల నాయకులతో కలిసి ఇంటి ఎదుట ఆందోళనకు చేపట్టింది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన దేవులపల్లి వేణుకుమార్ (46), కల్పన (42)కు 18ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. కొంతకాలంగా బడంగ్‌పేట శివనారాయణపురంలో నివాసమున్నారు. వేణుకుమార్ నగరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వేణు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని భార్య కల్పన ఆరోపిస్తూ గతంలో వరంగల్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వేణుపై కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో మెయింటెనెన్స్ కేసు నడుస్తోంది. తనను దూరం పెట్టాలనే ఉద్ధేశంతో మూడేళ్లుగా తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని కల్పన శుక్రవారం స్థానిక మహిళా సంఘాల నాయకులతో కలిసి శివనారాయణపురంలోని భర్త ఇంటికి వచ్చి బైఠాయించి పోలీసులు, కోర్టు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ ఫిర్యాదులు చేయగా కేసు విచారిస్తున్నామని సీఐ తెలిపారు. చదవండి: బిహార్‌లో కల్తీ మద్యం కలకలం.. 11మంది మృతి -
‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’
సాక్షి, హైదరాబాద్: అత్తింటి వేధింపులతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్కు చెందిన ఖాజా మోయియుద్దీన్ అన్సారీ ఐదో కుమార్తె ఫిర్దోస్ అన్సారీ (29) వివాహం రెండేళ్ల క్రితం మహ్మద్ సుల్తాన్ పటేల్‌తో జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానంతో భర్త వేధించసాగాడు. అంతేకాకుండా అదనపు కట్నం తేవాలంటూ సుల్తాన్‌తో పాటు అతని తల్లి కూడా వేధించారు. వేధింపులు తట్టుకోలేక ఫిర్దోస్ తల్లిగారింటికి వచ్చి నివాసం ఉంటోంది. అయినప్పటికీ సుల్తాన్ షాహిన్‌నగర్ వచ్చి తరచూ భార్యతో గొడవపడి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఒకటిన రాత్రి సుల్తాన్ భార్యను ఇష్టానుసారంగా కొట్టి, తిట్టి వెళ్లాడు. దీంతో జీవితంపై విరక్తిచెందిన ఫిర్దోస్ మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గన్‌తో బెదిరించేవాడు.. తన మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వరాదంటూ.. తాను అనుభవించిన నరకాన్ని ఫిర్దోస్ డైరీలో రాసింది. గన్‌తో బెదిరించి చిత్రహింసలకు గురిచేశాడని రాశారు. ఎన్నో హత్యలు చేశానని, ఎవరికీ భయపడనని అంటూ కొట్టేవాడని పేర్కొన్నారు. -
మూడేళ్లు ప్రేమించి,రెండు నెలల క్రితం వివాహం.. పెళ్లైన మరుసటి రోజే..
సాక్షి, ఖమ్మం: ‘మూడేళ్ల పాటు ప్రేమించిన యువకుడు రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నా.. ఆ తర్వాత ముఖం చాటేశాడు... నాకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు’ అని చెబుతూ ఓయువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రఘునాథపాలెంకు చెందిన మౌనిక, అదే మండలానికి చెందిన వీరబాబు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో జనవరి 8న వీరికి పోలీసుల సమక్షాన వివాహం జరిగింది. ఆ మరుసటి రోజూ మౌనికను ఆమె ఇంటి వద్ద వదిలేసిన వీరబాబు ఫోన్ ఎత్తకపోవడమే కాక, స్వయంగా వెళ్లినా ఏం సంబంధం లేదని దుర్బాషలాడుతూ వెళ్లగొట్టాడు. ట్యాంక్ కింద వలతో ఫైర్ సిబ్బంది దీంతో రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోలేదని, స్టేషన్ వద్ద బైఠాయించగా ఇరు కుటుంబాలు మాట్లాడుకోవాలని సూచిస్తూ పంపించారని మౌనిక ఆరోపించింది. ఈమేరకు శుక్రవారం ఖమ్మంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కిన ఆమె ఆత్మహత్యకు సిద్ధంకాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో టూటౌన్ ఎస్ఐ రాము, సిబ్బందిచేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ అధికారి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్ చేరుకుని మౌనిక దూకినా ఏమీ జరగకుండా ట్యాంక్ క్రింద వలలు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా మౌనిక వినకపోవడంతో చివరకు ఓ మహిళా కానిస్టేబుల్‌తో సెల్‌ఫోన్ పంపించారు. అయితే, సెల్‌ఫోన్ తీసుకున్నాక వెంటనే దిగకపోతే దూకుతానని అనడంతో కానిస్టేబుల్ వచ్చేసింది. ఈమేరకు ఎస్ఐ రాము ఫోన్లో మౌనికతో మాట్లాడి న్యాయం చేస్తామని, వీరబాబు, ఆయన కుటుంబసభ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చచెబుతూ మళ్లీ మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్‌ను పంపించి మౌనికను కిందకు తీసుకొచ్చారు. మొత్తంగా గంటన్నర సేపు ఉత్కంఠ సాగగా ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మౌనికపై కేసు నమోదు చేయడమే కాక ఆమె వద్ద ‘తన చావుకి పురం వీరబాబు, ఆయన కుటుంబ సభ్యులే కారణం’ అని రాసి ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నామని, మౌనిక ఫిర్యాదు మేరకు వీరబాబు, కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ, దాంతో
సాక్షి, మల్లాపూర్(హైదరాబాద్): కుటుంబ కలహాలతో మనస్తాపానికిలోనైన ఓ మహిళ కుమార్తెను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కిరణ్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం విలేజ్‌కు చెందిన తెలుగు మద్దిలేటి, ఉమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర్‌కు, జమ్మిగడ్డ శ్రీశివసాయినగర్కు చెందిన దీపిక అలియాస్ చందన (27) 2019లో వివాహం జరిగింది. వీరికి రుత్విక(01) కుమార్తె ఉంది. చంద్రశేఖర్ అమీర్‌పేట్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. ఈ నెల 4న రుత్విక బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తగారు పాపకు పెట్టిన బంగారు గొలుసు విషయమై భార్యాభర్తల మధ్య తరచు గొడవ జరుగుతున్నట్లు సమాచారం. గురువారం ఉదయం రెండో ఫ్లోర్లో చంద్రశేఖర్ పని చేసుకుంటున్నాడు. మొదటి అంతస్తులో పాప ఏడుస్తుందని కిందకు వచ్చిన దీపిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకొని పాప మొహంపై దిండుతో అదిమి చంపివేసింది. అనంతరం ఉయ్యాల తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం కిందకు వచ్చిన చంద్రశేఖర్ సోదరుడు డోర్ కొట్టగా ఎంతకు తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా దీపిక ఉరివేసుకుని కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి హుటాహుటిన తల్లిబిడ్డలను నాచారం ప్రసాద్ ఆస్పత్రికి తరలించారు. చదవండి: సర్కారు భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాచారం పోలీసులు మృతురాలి భర్త, మరిది, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె మూర్తి, ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్తే చంపాడు.. చంద్రశేఖర్ తన కూతురిని, బిడ్డను హత్య చేశాడని దీపిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి వద్దే చంద్రశేఖర్ కుటుంబసభ్యులపై వారు దాడి చేశారు. -
‘ప్రేమించి పెళ్లి.. అమ్మ, నాన్న మిస్ యూ.. నా చావుకు వారే కారణం’
తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని.. అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వారని, తనకు న్యాయం జరగాలని, అమ్మా నాన్న మిస్ యూ అంటూ’ ప్రవళిక సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సాక్షి, నిజామాబాద్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల వరకు వారి దాంపత్యం సాఫీగానే సాగింది. కొద్ది రోజులుగా అదనపు వరకట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం దుబ్బాకలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన దోర్ల శోభ– వెంకట్ రెడ్డిల కూతురు ప్రవళికను(28) బోర్గాం(పి) గ్రామానికి చెందిన చామకూర మహేశ్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరిద్దరూ చదువుతున్న సమయంలో ప్రేమించుకోవడంతో ఇరువైపులా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో కట్నకానుకలతో పాటు బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి ఇచ్చారు. కొన్నేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. మహేశ్ నిర్మల్‌లో మిషన్ భగీరథలో అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం పోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. అయితే అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్త వారి దగ్గర బంధువులు ప్రవళికను వేధించారు. సుమారు ఆరు నెలల క్రితం కూతురి బాధను చూడలేని తల్లిదండ్రులు రూ. నాలుగు లక్షల వరకు డబ్బులు ఇచ్చినట్లు ప్రవళిక బంధువులు తెలిపారు. అయితే మళ్లీ అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్త, వారి బంధువులు వేధించడంతో భరించలేక పుట్టింటికి వచ్చిన ప్రవళిక శుక్ర వారం తెల్లవారుజామున ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి: భర్త వివాహేతర సంబంధం.. మహిళా డాక్టర్ ఏం చేసిందంటే..? ఆమె తల్లి ఫిర్యాదు మేరకు భర్త చామకూర మహేశ్, అత్త చామకూర రాజవ్వ, సమీప బంధువులైన మేనమామలు, మేనత్తపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీశైలంతో పాటు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. భర్త, అత్తతో పాటు వారి సమీప బంధువులపై వరకట్నం కేసు నమోదు చేసినట్లు, బాధితుల ఫిర్యాదు, సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్టు చేసి శిక్షపడేలా చేస్తామని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: సాయం చేస్తానని చెప్పి ... వ్యభిచార గృహానికి విక్రయించేందుకు యత్నం -
ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం.. సెల్ఫీ తీసి!
సాక్షి, తూర్పుగోదావరి : భార్యలపై అనుమానంతో శాడిస్టు భర్త వారిని అంతమొందించేందుకు అమానుషంగా ప్రవర్తించాడు. మొదటి భార్యను ముక్కు, చెవులు కోసి హతమార్చాలని ప్రయత్నించగా, రెండో భార్యపై ఏకంగా పెట్రోల్ పోసి నిప్పటించాడు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టిలో ఈ దారుణం వెలుగుచూసింది. చింతూరు ఎస్ఐ సురేష్ బాబు కథనం ప్రకారం.. చట్టిలో నివసముంటున్న కళ్యాణం వెంకన్నకు ఇద్దరు బార్యలు. వారిద్దరికిపై అనుమానం పెంచుకున్న అతను వారిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈనెల 3న రెండో భార్యను గ్రామంలోని దేవతా విగ్రహం వద్దకు తీసుకువెళ్లి వేడి నూనెలో చేతిని ముంచి ప్రయాణం చేయించాడు. ఈ నెల 5న మొదటి భార్యను ఇంట్లోనే చిత్రహింసలకు గురిచేసి, ముక్కు, చెవులు కోసేందుకు యత్నించాడు. ఈ దాడి నుంచి తప్పించుకున్న మహిళ తన పుట్టింటికి పారిపోయింది. అదే రోజు రెండో భార్యను మండలంలోని నర్సింపురం సమీపంలోని ఆటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్ పోలీస నిప్పంటించడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె కూడా భద్రాయలంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తనను చంపేస్తాడనే భయంతో ఆమె ఈ నెల 16న చింతూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, మొదటి భార్యను వేధింపులకు గురి చేస్తున్న సమయంలో నిందితుడు స్వయంగా సెల్ఫీ వీడియో తీశాడు. అది కాస్తా బయటకు రావడంతో ఈ అమానుష ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రెండో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తుచేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ -
విశాఖలో నిత్య పెళ్లి కొడుకు ఆరాచకాలు
-
ఎనిమిది మందితో ప్రేమ పెళ్లి.. వ్యభిచారం చేయాలంటూ!
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో ఓ నిత్య పెళ్లికొడుకు అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని అరుణ్ కుమార్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు వారితో సఖ్యతగా మెలిగి ఆ తరువాత వ్యభిచారం చేయాలని భార్యలపై ఒత్తిడి పెంచాడు. గంజాయి వ్యభిచార ముఠాలో సంబంధాలున్న అరుణ్.. భార్యలతో కాకుండా తన మొదటి భార్య కుమార్తెను వ్యభిచార ముఠాకు అమ్ముతానంటూ వేధింపులకు గురిచేశాడు. మాట వినకపోతే చంపుతానంటూ తుపాకీ, కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డాడు. మొదటి భార్య గీతాంజలి, రెండో భార్య లక్ష్మీని వ్యభిచారం వృత్తిలో దింపి చిత్రహింసలు పెట్టాడు. అయితే అరుణ్ కుమార్ మొదటి భార్య ఎదురు తిరగడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తున్నాయి. కీచక భర్త ఆగడాలపై గత నెలలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక అరుణ్ కుమార్‌కు సంబంధాలున్నాయని, అందుకే అరుణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మహిళ సంఘాలను ఆశ్రయించడంతో వారు ఈ విషయాన్ని సీపీ మనీష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు ప్రాణహాని ఉందని, తక్షణమే అరుణ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని సీపీ మనీష్ కుమార్‌కు బాధితులు వాయిస్ మెసేజ్ పెట్టారు. దీనిపై స్పందించిన సీపీ నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులపై డీజీపీ సీరియస్ కాగా నిత్యపెళ్లికొడుకు అరుణ్‌పై కేసు నమోదులో నిర్లక్ష్యంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించారు. కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపైనా దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. చదవండి: పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి, నాలుగు నెలలకే.. -
ఏడాదిగా భార్యను టాయిలెట్లో బంధించి..
చంఢీఘర్: హరియాణాలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఏడాదిగా మరుగు దొడ్డిలో బంధించిన భర్త ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పానిపట్ జిల్లా రిష్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు మహిళ, శిశు సంరక్షణ అధికారులకు సమాచారం అందించడంతో ఆమెను కాపాడారు. ఏడాది పాటు పాయిఖానాలో బందీగా ఉన్న ఆమె పరిస్థితిని చూసి అధికారులు సైతం చలించిపోయారు. బలహీనంగా ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐపీసీ సెక్షన్ 498 ఏ, 342 కింద కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు నరేష్ కుమార్‌తో మహిళకు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ అధికారణి రజనీ గుప్తా మాట్లాడుతూ, ‘ఒక మహిళను టాయిలెట్లో ఏడాది పైగా బంధించి ఉంచినట్లు మాకు సమాచారం అందింది. మా బృందంతో కలిసి వెంటనే ఇక్కడకు చేరుకున్నాం. ఆమె పరిస్థితి చూస్తే చాలా రోజులుగా ఆమె ఏమీ తినలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై ఆమె భర్తను ప్రశ్నించగా భార్యకు మానసిక స్థితి సరిగా లేదని చెప్పాడు. అయితే అది వాస్తవం కాదని మాకు అర్థమైంది. ఆమె మానసిక స్థితి బాగానే ఉంది.’ అని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇక ఈ విషయంపై బాధితురాలి భర్త నరేష్ కుమార్ మాట్లాడుతూ, ‘నా భార్య మానసిక పరిస్థితి బాగోలేదు. మేం ఆమెను ఇంట్లోకి రమ్మని చెబుతున్నా.. ఆమె టాయ్‌లెట్ నుంచి ఎప్పుడు బయటకు రాదు. ఆమె మానసిక స్థితిపై డాక్టర్‌కు కూడా చూపించాం. అయినా ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు’ అని పేర్కొన్నాడు. చదవండి: ఇద్దరు పిల్లలను కొట్టి చంపిన తండ్రి -
పోలీస్ భర్త వేధింపులు.. నిప్పంటించుకున్న భార్య
సాక్షి, మైసూరు : పెళ్ళి సమయంలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని భార్యను ఓ కిరాతక భర్త ప్రతి రోజూ వేధిస్తుండటంతో బాధితురాలు తట్టుకోలేక కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని రెండురోజులు విలవిలలాడి మరణించింది. ఈ దారుణ సంఘటన కేఆర్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతురాలు కేఆర్ నగరంలోని హెబ్బాలు గ్రామానికి చెందిన భారతి (25). ఆ శాడిస్టు భర్త శ్రీధర్ (32) డిఏఆర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. (టీవీ నటి ఆత్మహత్య) ఘనంగా కట్న కానుకలు వివరాలు ఈ ఇద్దరికి ఆరు సంవత్సరాలక్రితం వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో 200 గ్రాముల బంగారం, రూ.3 లక్షల నగదు, ఒక బైకు ఇచ్చి వైభవంగా పెళ్లిని జరిపించారు. కొంతకాలం తరువాత ఇంటి స్థలం కూడా ఇస్తా మని అల్లునికి హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు బాగానే ఉన్న భర్త కొంతకాలం నుంచి భార్యపై పగబట్టాడు. ఇంటి స్థలం రాసివ్వాలని ప్రతిరోజు వేధించేవాడు. ఆమె తల్లిదండ్రులతో అనేకసార్లు గోడు వెళ్లబోసుకుంది. త్వరలోనే స్థలం ఇప్పిస్తామని నచ్చజెప్పేవారు. కానీ కిరాతక భర్త పీడించడం మాత్రం వదల్లేదు. శుక్రవారం రాత్రి కూడా డ్యూటీ నుంచి రాగానే భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తీవ్ర విరక్తి చెందిన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను మైసూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఆమె కుటుంబ సభ్యులు శ్రీధర్ పైన ఫిర్యాదు చేయడంతో కేఆర్ నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (ఆంధ్రజ్యోతి వాహనం సీజ్ ) -
శామీర్‌పేట్‌లో దారుణం; పిల్లలకు విషమిచ్చి..
సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహ విషమిచ్చి తల్లి ఆత్మహత్యయత్నం చేసింది. దురదృష్టవశాత్తు ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, తల్లి ప్రీతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా అనాధ అయిన ప్రీతి వరంగల్ అనాధాశ్రయంలో పెరిగింది. ఆరు సంవత్సరాల క్రితం గోపినాధ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. గోపీనాథ్ ప్రీతి దంపతులు షామీర్ పేటలోని మజీద్ పూర్లో గత కొంత కాలంగా జీవనం కొనసాగిస్తున్నారు. పెళ్ళైన కొంత కాలం నుంచి భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో ఆమె తరచు అనాధ ఆశ్రమానికి వెళ్ళేది. (వివాహేతర సంబంధం ఇంట్లో తెలియడంతో..! ) అనంతరం పెద్దలు నచ్చజెప్పడంతో గోపినాథ్ వద్దకు ప్రీతి తిరిగి వచ్చింది. అయినప్పటికీ ప్రీతికి వేధింపులు ఎక్కువవడంతో గత్యంతరం లేక పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీనితో తల్లి బిడ్డలను చికిత్సా నిమిత్తం మేడ్చల్‌లోని లీలా ఆసుపత్రిలోచేర్చగా..చికిత్సా పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి ప్రీతి పరిస్థితి విషమంగా ఉంందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (అర్థరాత్రి నుంచి ఓఆర్ఆర్పై రాకపోకలు) -
రెండో భర్తపై నటి ఫిర్యాదు
చెన్నై,పెరంబూరు: సినీ నటి తన రెండో భర్త లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై, తూర్పు ముగప్పేర్‌కు చెందిన ఆమె (39) తన భర్తకు విడాకులిచ్చి విడిగా జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. కాగా షెనాయ్ నగర్లో ఆ నటి సొంతంగా యోగా శిక్షణశాలను నిర్వహిస్తోంది. సినీ, టీవీ సీరియళ్లలోనూ చిన్నచిన్న పాత్రల్లో నటిస్తోంది. నటుడు శివకార్తికేయన్ హీరోగా నటించిన మాన్ కరాటే చిత్రంలో ఆమె నటించింది. అలా సాంకేతిక నిపుణుడు శరవణన్ సుబ్రమణి(42)తో పరిచయం కలిగింది. దీంతో అతనితో రెండో పెళ్లికి దారి తీసింది. కాగా సహాయ నటి బుధవారం స్థానిక తిరుమంగళం మహిళా పోలీస్‌స్టేషన్‌లో శరవణన్ సుబ్రమణిపై ఫిర్యాదు చేసింది. రెండో భర్త శరవణన్ సుబ్రమణి తన నగలను, నగదును దోచుకున్నాడని పేర్కొంది. అంతే కాకుండా లైంగిక వేధిపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. అతని స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వారి ముందు డాన్స్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పింది. తన పిల్లలను చితక బాదుతున్నట్లు తెలిపింది. శరవణన్ సుబ్రమణికి ఇంతకు ముందే ఆర్తి అనే మహిళతో పెళ్లి అయ్యిందని, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు, ఆమెకు ఒక బిడ్డ ఉన్నట్టు తెలిసిందని చెప్పింది. కాగా సుబ్రమణి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి తనను మరో పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్పింది. అంతే కాకుండా ఇప్పుడు తన మొదటి భార్యతో కలిసి కిరాయి మనుషులతో హతమార్చుతానంటూ బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. భర్త, అతడి మొదటి భార్యతో పాటు దిండిగల్ శరవణన్, కిరాయి మనుషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరింది. కేసును సీఐ విజయలక్ష్మి విచారణ జరుపుతున్నారు. -
భర్త వేధింపులు భరించలేక...
ఆసిఫాబాద్: అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గుండి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ మల్లయ్య కథనం ప్రకారం వాంకిడి మండలం జైత్పూర్ గ్రామానికి చెందిన కోలె రమేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. ఏడాది కిందట పెద్ద కుమార్తె కోలె సౌందర్య(20)ను ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన పులుగం గురుమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహ సమయంలో రూ.3 లక్షల నగదు, ఒక తులం బంగారంతోపాటు లాంఛనాలు ఇచ్చారు. కొన్ని నెలలు కాపురం సజావుగానే సాగినా.. నాలుగు నెలలుగా మరో రూ.3 లక్షల అదనపు కట్నంతోపాటు కళ్యాణలక్ష్మీ డబ్బులు కూడా తనకే ఇవ్వాలని సౌందర్యను భర్తపాటు అత్తామామలు పులుగం నాగయ్య, విమలాబాయి మానసికంగా శారీరకంగా వేధించారని తెలిపారు. సౌందర్య ఈ వేధింపులు భరించలేక బుధవారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
న్యాయం కోసం... భర్త ఇంటి ఎదుట ధర్నా
జూబ్లీహిల్స్: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..వారికి ఇద్దరు సంతానం. కొన్నేళ్ల తర్వాత భర్త మరో మహిళ మోజులో పడి భార్యను వదిలేశాడు. పిల్లలను తీసుకొని ఇంటికి తాళం వేసి వెళ్లడంతో దిక్కుతోచని బాధితురాలు భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగిన సంఘటన మధురానగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామానికి చెం దిన తోట లక్ష్మి, కృష్ణశంకర్ 2008లో ప్రేమ వివా హం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. రెండేళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన లక్ష్మి, కృష్ణ శంకర్ దంపతులు మధురానగర్‌లోని సీ 83బ్లాక్‌లోని దివ్య రెసిడెన్సీలో అద్దెకు ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం శంకర్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసిన లక్ష్మి భర్తతో గొడవకు దిగింది. గత జనవరిలో ఎర్రుపాలెంలో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణశంకర్ తన ఇంటికి తాళం వేసుకొని పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. తన పిల్లలను అపహరించాడ ని ఆమె ఎస్సార్‌నగర్‌లో ఫిర్యాదు చేయగా, తమ పరిధి కాదని, మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టా లని వారు సూచించడంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకురన్న పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. చేతిలో చిల్లిగవ్వా లేదు... చేతిలో చిల్లిగవ్వా లేదు. తిండి లేదు. బట్టలు కూడా లేవు. తాళం పగలగొట్టి లోపలికి వెళదామంటే ఇరుగుపొరుగు అడ్డుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నాకు న్యాయం చేయాలి. బాధితురాలు లక్ష్మి -
వేధింపులతో వివాహిత ఆత్మహత్య
ఐరాల: అత్తమామలు, భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శనివారం జరిగింది. ఎస్ఐ ప్రసాద్‌రావు కథనం మేరకు.. నాగవాండ్లపల్లె పంచాయతీ వీఎస్ అగ్రహారానికి చెందిన బావాజాన్‌కు రెండేళ్ల క్రితం పలమనేరుకు చెందిన జాస్మిన్(23)తో వివాహమైంది. వారికి ఇంకా సంతానం కలుగలేదు. దీంతో అత్తమామలు, భర్త వేధిస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన జాస్మిన్ శుక్రవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కొన ఊపిరితో కొట్టుమిట్టూడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శనివారం వేకువజామున మృతి చెందింది. సమాచారం అందుకున్న తహసీల్దార్ ప్రసాద్ బాబు అక్కడికి చేరుకుని పంచనామా చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అనుమానమే పెనుభూతమై..
మల్యాల(చొప్పదండి): అనుమానం పెనుభూత మై రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. అనారోగ్యానికి అనుమానం తోడవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్యను గొంతు కోసి హత్య చేసిన అనంతరం భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.ఎస్సై మిథున్ కథనం ప్రకారం.. మల్యాల మండలకేంద్రానికి చెందిన కరబూజ శ్రీనివాస్(37)కు ఏడేళ్ల క్రితం సారంగాపూర్ మండలం అర్పల్లి గ్రామానికి చెందిన ముంజాల లక్ష్మీతో వివాహమైంది. మూడేళ్ల కూతురు విషిత ఉంది. గతంలో గీత కార్మిక వృత్తి చేసిన శ్రీనివాస్ రెండేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ రెండేళ్ల అనంతరం నెల రోజుల క్రితం గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో ఇంట్లో ఉన్న పిల్లలను బయటకు పంపించి గది తలుపులు వేశాడు. దీంతో పిల్లలు లక్ష్మీ కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారమందించారు. పిల్లలు ఏడుస్తుండడంతో ఇంటి పరిసరాల్లో ఉండేవారు శ్రీనివాస్ అన్న మల్లేశంకు చెప్పారు. మల్లేశం ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, ఇద్దరు విగతజీవులై ఉన్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, సీఐ నాగేందర్, ఎస్సై మిథున్ పరిశీలించారు. మృతురాలి తల్లి ముంజాల గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పాపం.. చిన్నారులు శ్రీనివాస్ మొదటి భార్య ఎనిమిదేళ్ల క్రితం నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి స్పందన, విశాంత్ సంతానం. మొదటి భార్య కుమారుడు అమ్మమ్మవాళ్లింట్లో ఉంటున్నాడు. కూతురు శ్రీనివాస్‌తోనే ఉంటోంది. అనంతరం లక్ష్మీని వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల విషిత సంతానం. -
పిల్లలు కావడం లేదని భార్యను...
నల్లబెల్లి: మూడుముళ్లు వేసి కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పిల్లలు కావడం లేదని కట్టుకున్న భార్య చిక్కుడు అశ్విని(25)ని భర్త ముకేష్ హత్య చేసిన సంఘటన ఆలస్యంగా మండలంలోని బోల్లోనిపల్లిలో గురువారం వెలుగుచూసింది. మృతురాలి తల్లిదండ్రులు ఉస్తం భద్రమ్మ, వెంకటయ్య, సోదరుడు అశోక్‌ల కథనం ప్రకారం... పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన భద్రమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తె అశ్వినిని ఆరేళ్ల క్రితం మండలంలోని బోల్లోనిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు ముకేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరి దాంపత్య జీవితం రేండేళ్ల వరకు సజావుగానే సాగింది. కుల వృత్తిలో భాగంగా కాటిపాపల కథలు చెబుతూ జీవనం కొనసాగించేవారు. పిల్లలు కావడం లేదని ఆస్పత్రులు తిరుగుతున్నారు. అశ్విని గర్భసంచిలో లోపం ఉండడంతో పిల్లలు కావడం లేదని వైద్యులు చెప్పడంతో రెండేళ్లుగా ముకేష్తో పాటు కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. కుల వృత్తిలో భాగంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెంకు కథలు చెప్పేందుకు అశ్విని, ముకేష్ దంపతులు వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు కావడం లేదు బంధువుల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొంటానని అశ్వినితో గొడవపడి భర్తతో పాటు అతని బంధువులు కలిసి మంగళవారం కొట్టిచంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. రాయిగూడెంలో చంపిన తమ బిడ్డను గుట్టుచప్పుడుగా బోల్లోనిపల్లికి తీసుకవచ్చి దహన సంస్కారాలు చేసేందుకు ప్రయత్నించిన అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఎస్సై నరేందర్‌రెడ్డిని వివరణ కోరగా మృతదేహాన్ని తీసుకొని సంఘటన జరిగిన నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేయాలని మృతురాలి బంధువులకు సూచించడంతో మృతదేహాంతో వారు అక్కడికి వెళ్లారని తెలిపారు. -
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
గంట్యాడ : మండలంలోని వసాది గ్రామానికి చెందిన వర్రి అర్జునమ్మ(30) భర్త వేధింపులు భరించలేక మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి సంబంధించి గంట్యాడ ఎస్ఐ పి.నారాయణరావు తెలిపిన వివరాలు...వసాది గ్రామానికి చెందిన అర్జునమ్మ తన ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. జామి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అర్జునమ్మకు వసాది గ్రామానికి చెందిన వర్రి సర్వారావుతో 2013 మే 31న వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరూ ఆడ పిల్లలు కావడంతో కొన్నాళ్లుగా భర్త సర్వారావుతో పాటు ఆడపడుచు వర్రి దేవుడమ్మను వేధిస్తున్నట్టు మృతురాలి సోదరుడు సబ్బవరపు శ్రీను తమకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అందిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ డి.రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్తతో పాటు ఆడపడుచును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. తహసీల్దార్ నీలకంఠరావు సమక్షంలో మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. విచారణలో రూరల్ ఎస్ఐ రామకృష్ణ, నెల్లిమర్ల ఎస్ఐ ఉపేంద్ర పాల్గొన్నారు. -
గరివిడిలో వివాహిత ఆత్మహత్య
గరివిడి: మండలంలోని దేవాడ గ్రామానికి చెందిన పొలసపల్లి దేవి (22) అనే వివాహిత పురుగు మందు తాగి మృతి చెందింది. ఆమె తండ్రి దేబార్కి వీరస్వామి, పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గుర్ల మండలంలోని నాగళ్లవలస గ్రామానికి చెందిన దేవికి గరివిడి మండలం దేవాడ గ్రామానికి చెందిన పోలసపల్లి మోహన్ (23)కు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే దేవిని రెండేళ్లుగా అత్త, మామ, భర్త వేధిస్తుండేవారు. దీంతో మనస్తాపానికి గురైన దేవి ఆదివారం మధ్యాహ్నం పురుగుమందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించగా మెరుగైన చికిత్సకోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మృతి చెందింది. ఎస్సై శ్రీని వాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వేధింపులు తాళలేక గర్భిణి బలవన్మరణం
ముస్తాబాద్(సిరిసిల్ల): కలకాలంతోడు నీడగా ఉంటాడనుకున్న భర్త.. పెళ్లయిన కొద్దిరోజులకే వేధింపులకు గురిచేశాడు. అయినా సర్దుకుపోయింది. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో.. లోకం కూడా చూడని బిడ్డతోపాటు బలవన్మరణానికి పాల్పడింది. గంభీరావుపేట ఎస్సై లక్ష్మారెడ్డి, మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ముస్తాబాద్ మండలం పోత్గల్‌కు చెందిన నాంపెల్లి, లక్ష్మి దంపతుల నాలుగో కూతురు హారిక(25)కు ఆరేళ్ల క్రితం గంభీరావుపేట మండలం ముచ్చర్లకు చెందిన ఆవునూరి చిరంజీవులతో వివాహం జరిపించారు. వీరికి హర్షవర్ధన్(5) కొడుకు ఉన్నాడు. కొద్ది సంవత్సరాలు బాగానే ఉన్న వారి దాంపత్యంలో కలహాలు మొదలు అయ్యాయి. మంగళవారం రాత్రి కూడా ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీంతో ఎనిమిది నెలల నిండు గర్భిణీ అయిన హారిక ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ముస్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కాగా తన కూతురును చిరంజీవులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని నాంపెల్లి పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉమామహేశ్వరికి న్యాయం చేయాలి
పశ్చిమగోదావరి, కొవ్వూరు : ప్రేమించి, పెళ్ళి చేసుకుని ఐదేళ్లు కాపురం చేసిన వ్యక్తి ఇపుడు తనను కాదని కట్నంకోసం వేరే యువతిని వివాహం చేసుకునేందుకు సిద్దపడుతున్నాడని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా మద్దూరులో బండి ఉమామహేశ్వరి అనే యువతి నిరాహారదీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ ఎనిమిదిరోజులుగా భర్త ఇంటి ఎదుటే కూర్చుని దీక్ష కొనసాగిస్తోంది. నిరసన దీక్ష చేపట్టిన బండి ఉమామహేశ్వరికి వెంటనే న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు, ఆమె బంధువులు డిమాండ్ చేశారు. ఆర్డీఓ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె బంధువులు, మద్దతుదారులు కొవ్వూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. గోదావరిపై నాలుగో వంతెన సమీపంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో కొవ్వూరు, రాజమండ్రితో పాటు తూర్పుగోదావరి జిల్లా కడియం, ఆలమూరు మండలాలకు చెందిన ఉమామహేశ్వరి బంధువులు, మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కొవ్వూరు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కన్వీనర్లు తానేటి వనిత, గిరిజాల బాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని కాపు సంఘం నేత మారిశెట్టి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు సుమారు నాలుగు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. దాదాపుగా పది కిలోమీటర్ల మేర వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ నినాదాలు హోరెత్తాయి. మంత్రి కేఎస్ జవహర్, కలెక్టర్, ఎస్పీలు రావాలంటూ నినాదాలు చేశారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరులో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాస్తారోకో కొనసాగింది. డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ఘటనాస్థలానికి చేరుకుని ఉమామహేశ్వరి భర్త దుబాయ్ వెళ్లినట్టు చెప్పారు. అతడిని ఇండియా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సోమవారంలోపు దోషులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భార్యభర్తల వివాదాల్లో సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నందున్న కొంత ఇబ్బందులున్నాయన్నారు. దోషులను సత్వరం అరెస్ట్ చేయిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి రూరల్ కన్వీనర్ గిరిజాల బాబు, కడియం మండల టీడీపీ అధ్యక్షుడు, ఎంపీపీ మార్గాని లక్ష్మీ సత్యనారాయణ, టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు పాలపర్తి కుమారి రోజా ప్రకాష్, కడియపు లంక సర్పంచ్ వారా పాపా రాము, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వెలుగుబంటి నాని, తాడాల వీరన్న, ఆలిండియా నర్సరీ ప్రెసిడెంట్ పల్లా సుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గురుజు బాలమురళీకృష్ణ, నాయకులు నగళ్లపాటి శ్రీనివాస్, యాళ్ల నరిసింహ రావు, కొయ్యల భాస్కరరావు, అడ్డూరి సుబ్బారావు,కొవ్వూరు, తాళ్లపూడి మండల కాపు అధ్యక్షులు ఉప్పులూరి రాజేంద్రప్రసాద్, నామా ప్రకాశం పాల్గొన్నారు. న్యాయం చేసేంత వరకూ పోరాటం బాధితురాలికి సోమవారంలోపు న్యాయం చేయకపోతే తానే స్వయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి ప్రకటించారు. న్యాయం చేయాలని ఒక ఆడ బిడ్డ తొమ్మిది రోజుల నుంచి దీక్ష చేస్తున్నా స్థానిక మంత్రి కేఎస్ జవహర్ కనీసం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. బాధితురాలికి అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత తెలిపారు. -
భార్యను నిర్బంధించి కిరాతకం
బనశంకరి : ప్రేమించి పెళ్లి చేసుకుని బుద్ధిగా నడుచుకోవాల్సిన భర్త, భార్యను తీవ్రంగా గాయపరిచిన సంఘటన నగరంలో శుక్రవారం ఆలస్యంగా వెలుచూసింది. వివరాలు...యాదగిరి తాలూకా వక్కనళ్లి గ్రామానికి చెందిన వివాహిత తిమ్మవ్వ (40) భర్తకు దూరంగా ఉంటోంది. పశువులు మేతకు వెళ్లే సమయంలో అదే జిఆల్ల కోయలూరుకు చెందిన దేవప్ప (35)తో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. వయసులో పెద్దది కావడంతో దేవప్ప కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించినా కూడా పెద్దలను ఎదిరించి ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బతకుదెరువు కోసం ఇద్దరు బెంగళూరు కంటోన్మెంట్‌కు చేరుకుని కూలి పనులకు వెళ్తున్నారు. వీరితో పాటు దేవప్ప తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. ఇదిలా ఉంటే జనవరి 1 నుంచి తిమ్మవ్వను నిర్భందించి ఆమె సున్నిత భాగాల్లో తీవ్రంగా గాయపరిచారు. చివరకు ఆమెను తగులబెట్టడానికి దేవప్ప యత్నించాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని ఆమెను యాదగిరికి తరలించి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.