
దేవి మృతదేహం
గరివిడి: మండలంలోని దేవాడ గ్రామానికి చెందిన పొలసపల్లి దేవి (22) అనే వివాహిత పురుగు మందు తాగి మృతి చెందింది. ఆమె తండ్రి దేబార్కి వీరస్వామి, పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
గుర్ల మండలంలోని నాగళ్లవలస గ్రామానికి చెందిన దేవికి గరివిడి మండలం దేవాడ గ్రామానికి చెందిన పోలసపల్లి మోహన్ (23)కు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే దేవిని రెండేళ్లుగా అత్త, మామ, భర్త వేధిస్తుండేవారు. దీంతో మనస్తాపానికి గురైన దేవి ఆదివారం మధ్యాహ్నం పురుగుమందు తాగింది.
వెంటనే కుటుంబ సభ్యులు గమనించి చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించగా మెరుగైన చికిత్సకోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మృతి చెందింది. ఎస్సై శ్రీని వాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment