women commits sucide
-
విషాదం: రూ.25 లక్షల కట్నం, బంగారు ఆభరణాలు.. అయినా చాల్లేదు..
సాక్షి, మెదక్ (గజ్వేల్): జగదేవ్‌పూర్‌లో పండగ పూట ఆ ఇంట విషాదం నెలకొంది. భర్త వేధింపులకు భార్య బలైంది. నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ప్రమాదంలో చికిత్స పొందుతూ పండగ పూట శుక్రవారం మృతి చెందింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవ్‌పూర్‌కు చెందిన పనగట్ల బాల్‌రాజు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు రమ ఉంది. 13 ఏళ్ల క్రితం రమను నిజామాబాద్‌కు చెందిన సంజయ్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.25 లక్షల కట్నంతో పాటు బంగారు అభరణలు పెట్టారు. రెండేళ్ల పాటు సంసారం సాఫీగా సాగింది. అప్పటి నుంచి ఆదనప్పు కట్నం కావాలని వేధింపులకు పాడ్పడడమే కాకుండా తాగుడుకు బనిసగా మారాడు. పలు సార్లు ఇరువురి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్తి చెప్పినా తనలో మార్పు రాకపోవడంతో భరించలేక రమ పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం తన అమ్మగారింటికి జగదేవ్‌పూర్‌కు వచ్చి ఇక్కడే ఉంటుంది. చదవండి: (కిరాణా షాపుకు వెళ్లొస్తానని ఒకరు.. డ్యూటీకి వెళ్తున్నానని మరొకరు..) కాగా మూడు నెలల క్రితం సంజయ్ అత్తగారింటికి భార్య, అత్తమామలకు తాను మారినట్లు నమ్మించి భార్యను తీసుకెళ్లాడు. తీసుకవెళ్లిన నాటి నుంచి మళ్లీ వేధింపులు పెట్టాడు. నాలుగు రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. చుట్టు ప్రక్కన వారు చూసి మంటలను ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. పండుగ పూట కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా జగదేవ్‌పూర్‌లోనే అమె అంత్యక్రియలు నిర్వహించారు. -
కుటుంబాన్ని ఆదుకోలేకపోతున్నానని.. సుసైడ్ నోట్ రాసి..
సాక్షి, మాదాపూర్: కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోలేక పోతున్నానన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ పోచంపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు లక్ష్మి, వానదేవుడు దంపతులు మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కూతురు బొల్లిపోగు స్నేహ (19) చదువుకుంటోంది. నెల రోజుల క్రితం తండ్రికి గుండె పోటు వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అప్పటి నుంచి స్నేహ మానసిక వేదనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి సాయం చేయలేకపోతున్నానని, జీవితంపై విరక్తితో చనిపోతున్నానని సుసైడ్ నోట్ రాసి స్నేహ బలన్మరణానికి పూనుకుంది. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: పాతబస్తీలో ఓ మహిళా ఆత్మహత్యాయత్నం
-
అన్నా.. అందుకే వెళ్లిపోతున్నా...
‘అన్నా.. నేను ఇక టీచర్‌ను కాలేను. ఈ ప్రభుత్వానికి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేనట్లుంది. మళ్లీ నోటిఫికేషన్ విడుదలలోనూ జాప్యం జరుగుతుందని పేపర్లు, టీవీల్లో చూశాను. ఇక నేను ఈ ప్రపంచంలో ఉండలేను. నా పిల్లల్ని నువ్వే చూసుకోవాలి’ – బుధవారం కర్నూలులో ఆత్మహత్య చేసుకున్న విజయలక్ష్మి తన అన్నతో చెప్పిన చివరి మాటలివి.. టీచర్ కావాలన్నది ఆమె కల. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడంతో.. తన చిరకాల స్వప్నం సాకారం కానుందని సంబరపడింది. మొక్కవోని స్థైర్యంతో రేయింబవళ్లు కష్టపడి చదివింది. ఓ పక్క కోచింగ్ కోసం అమ్మ.. అన్న.. భర్త.. వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఉద్యోగం సాధించగలనన్న ఆత్మవిశ్వాసంతో ఆమె చదువును కొనసాగించింది. అయితే ప్రభుత్వం ప్రకటించినట్టుగా నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైంది. తిరిగి అక్టోబర్ 10న నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన ప్రభుత్వం.. మళ్లీ మొండిచేయి చూపడంతో తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఇక ఎప్పటికీ తన కల నెరవేరదేమోనన్న ఆందోళనతో అన్నకు ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. కర్నూలు /దేవనకొండ : కోడుమూరు మండలం వలుకూరుకు చెంది న చంద్రప్ప, లక్ష్మీదేవి కుమార్తె విజయలక్ష్మి. పదో తరగతి వరకు కోడుమూరు జెడ్పీ హెచ్ఎస్, ఇంటర్ కర్నూలు కేవీఆర్‌లో పూర్తి చేసింది. ఇంకా చదువుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు వినకుండా పెళ్లి చేశారు. 2008లో దేవనకొండ మండలం కరివేములకు చెందిన ఆటో డ్రైవర్ గిడ్డయ్యతో వివాహం జరిపించారు. వారికి తరుణ్‌తేజ, ప్రహాసిని సంతానం. దేవనకొండ మండలంలో పోస్టుమాస్టర్‌గా పనిచేసే విజయలక్ష్మి తండ్రి చంద్రప్ప గతేడాది గుండెపోటుతో మృతిచెందారు. తల్లి, అన్న ఓబులేష్ శారదానగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. టీచర్ కావాలన్నది విజయలక్ష్మి కల. వివాహం చేయడంతో తన కల నెరవేరదేమోనని బెంగపడింది. అయితే.. భర్త సహకారంతో కర్నూలు లక్ష్మీ కళాశాలలో టీటీసీ పూర్తిచేసింది. ఏడేళ్ల నుంచి డీఎస్సీ కోచింగ్. టీటీసీ పూర్తవగానే విజయలక్ష్మి డీఎస్సీ కోచింగ్ కోసం కర్నూలులోని తల్లి, అన్న వద్దకు చేరింది. 2011 నుంచే ఓ కోచింగ్ సెంటర్లో టెట్, డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంది. 2012లో జరిగిన టెట్ కమ్ టీఆర్టీలో తక్కువ మార్కులు రావడంతో మళ్లీ గట్టిగా పోరాడాలని నిర్ణయం తీసుకుంది. 2014లో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చినా అప్పుడు పిల్లలు, కుటుంబ బాధ్యతల కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. వచ్చే డీఎస్సీలో కచ్చితంగా ఉద్యోగం సాధించాలని 2014 నుంచి రేయింబవళ్లు చదివేది. 2017 డిసెంబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎంతో సంతోషపడింది. అయితే నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ ఈ ఏడాది జూలైలో నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రూ.15 వేలు ఖర్చు చేసి డీఎస్సీ కోచింగ్ కూడా తీసుకుంది. అయితే.. నోటిఫికేషన్ విడుదలలో ప్రభుత్వం జాప్యం చేసింది. ముచ్చటగా మూడోసారి అక్టోబర్ 10న నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన ప్రభుత్వం.. దానిని విడుదల చేయకపోవడంతో విజయలక్ష్మి తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఇక నోటిఫికేషన్ రాదేమోనని భయపడింది. అమ్మ, అన్న, భర్త తన కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టారని.. వారందరికీ ఏం చెప్పుకోవాలని తలచి చివరకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. నోటిఫికేషన్ రాదేమోనన్నబెంగతో ప్రాణాలు తీసుకుంది నా భార్యకు చాలా ఆత్మవిశ్వాసం. లక్షల మందిలో మనకు ఉద్యోగం ఎలా వస్తుందని నేను ప్రశ్నిస్తే.. చదివితే ఎవరికైనా వస్తుందనేది. రేయింబవళ్లు కష్టపడేది. అక్టోబర్ 10వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మళ్లీ ఇవ్వకపోవడంతో తాను టీచర్ కాలేనేమోనని భయపడిపోయింది. స్నేహితులు, కుటుంబ సభ్యులం అందరం ధైర్యం చెప్పాం. అయినా ఇక నోటిఫికేషన్ రాదేమోనని మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. – గిడ్డయ్య, విజయలక్ష్మి భర్త ప్రభుత్వం నాటకాలాడుతోంది.. డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో ప్రభు త్వం నాటకాలాడుతోంది. పేపర్లు, టీవీల్లో ప్రకటనలతో సరిపెడుతోంది. టీచర్, విద్యార్థి నిష్పత్తి అంటూనే ఉద్యోగాల్లో కోత పెడుతోంది. డీఎస్సీ, టెట్ కోసం చదివిన నిరుద్యోగులు ప్రభుత్వ నిర్వాకంతో అసహనానికి లోనవుతున్నారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. – రామశేషయ్య, యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు -
మహిళ ఆత్మహత్య
ఆర్మూర్‌టౌన్ నిజామాబాద్ : ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని చెరువులో అలిశెట్టి వనిత(40) ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రాఘవేందర్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన వనితకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతురు నందిత చాలాకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. అది చూసి వనిత ఒక సంవత్సరం నుంచి మానసికంగా కుంగిపోతోంది. మృతురాలిని ఆస్పత్రిలో చూపించినా మానసిక స్థితి బాగుపడలేదు. దీంతో అంక్సాపూర్ నుంచి బయలుదేరి తన తల్లిగారింటికి వెళ్తుతున్నానని ఆదివారం భర్తతో చెప్పింది. ఇంటి నుంచి వెళ్లిన వనతి మానసికస్థితి సరిగ్గా లేనందున్న మనస్థాపం చెంది జీవితంపై విరక్తితో పెర్కిట్ ఊర చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. -
గరివిడిలో వివాహిత ఆత్మహత్య
గరివిడి: మండలంలోని దేవాడ గ్రామానికి చెందిన పొలసపల్లి దేవి (22) అనే వివాహిత పురుగు మందు తాగి మృతి చెందింది. ఆమె తండ్రి దేబార్కి వీరస్వామి, పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గుర్ల మండలంలోని నాగళ్లవలస గ్రామానికి చెందిన దేవికి గరివిడి మండలం దేవాడ గ్రామానికి చెందిన పోలసపల్లి మోహన్ (23)కు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే దేవిని రెండేళ్లుగా అత్త, మామ, భర్త వేధిస్తుండేవారు. దీంతో మనస్తాపానికి గురైన దేవి ఆదివారం మధ్యాహ్నం పురుగుమందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలించగా మెరుగైన చికిత్సకోసం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో మృతి చెందింది. ఎస్సై శ్రీని వాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురి ఆరోగ్యంపై బెంగతో..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): కూతురు అనారోగ్యంతో బాధ పడుతుండడాన్ని చూసి తట్టుకోలేని ఓ తల్లి మనస్తాపంతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై అంజయ్య కథనం ప్రకారం.. దేమి కలాన్‌కు చెందిన సుజాత (32)కు, కన్కల్ గ్రామానికి చెందిన ఏనుగు రమేశ్‌రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు రిషిరెడ్డి, కూతురు సిగ్నిత ఉన్నారు. ఏడేళ్ల సిగ్నిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. తన కూతురు అనారోగ్యంతో ఉండడాన్ని చూడలేక మనస్తాపానికి గురైన తల్లి.. బుధవారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లింది. నేరుగా తమ పొలంలోని బావి వద్దకు వెళ్లి, అందులో దూకేసింది. గురువారం ఉదయం సుజాత కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. ఈ క్రమంలో పొలంలోని బావి వద్ద ఫోన్, చెప్పులు కనిపించాయి. బావిలోకి చూడగా, సుజాత శవమై కనిపించింది. సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఏం కష్టం వచ్చిందో..?
కాశీబుగ్గ : ఏం కష్టం వచ్చిందో తెలీదు.. కట్టుకున్న భర్తను వదిలి.. కన్నబిడ్డను కూడా వదిలి ఆ వివాహిత బలవంతంగా ఊపిరి ఆపుకుంది. రెండున్నరేళ్ల కుమారుడు అమ్మ కోసం రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. పలాస మండలం లొద్దభద్ర పంచాయతీ శాసనాంలో సోమవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కుప్పిలి మోహిని(24) సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. వారు తెలిపిన వివరాల మేరకు..మోహిని తన భర్త మధుసూదన రెడ్డితో కలిసి శాసనాంలోని సొంతింటిలో నివాసముంటున్నారు. భర్తతో కలిసి మేడపై నివాసముంటుండగా, మిగిలిన కుటుంబ సభ్యులు కింద ఉంటున్నారు. మధుసూదనరెడ్డి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నారు. మోహిని కూడా టైలరింగ్‌లో శిక్షణ పొంది పనిచేస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల మనోజ్‌రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఏమైందో ఏమో గానీ సోమవారం మధ్యాహ్నం కుమారుడిని కింద ఉన్న వారికి అప్పగించి మేడపైకి వెళ్లి ఉరి పోసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె తండ్రి కూడా ఇటీవలే మరణించారు. చూపు లేని నానమ్మ ఘటనా స్థలానికి చేరుకుని రోదించిన తీరు అందరికీ కంటతడి పెట్టించింది. కాశీబుగ్గ ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో శవాలై తేలిన తల్లీ కొడుకులు
బొండపల్లి(గజపతినగరం) : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు గాని.. ముక్కు పచ్చలారని మూడేళ్ల కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ముద్దూరు గ్రామానికి చెందిన మునకాల అప్పలనాయుడుకు విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొరుగుపాలెంనకు చెందిన ఉమాదేవితో నాలుగు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి జ్యోతీష్ (3) కుమారుడున్నారు. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగినా, అప్పలనాయుడు మద్యానికి బానిస కావడంతో ఎప్పటికప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో వ్యసనం మానాలని భార్య ఉమాదేవి ఎప్పటికప్పుడు కోరేది. అయితే అప్పలనాయుడు వ్యసనం మానకపోగా తిరిగి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యపై ఒత్తిడి తీసుకువచ్చేవాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం కూడా అప్పలనాయుడు తాగి రావడంతో భార్యాభర్తలత మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఉమాదేవి తల్లికి ఫోన్ చేసి వెంటనే వచ్చి తనను, కుమారుడ్ని తీసుకెళ్లాలని కోరింది. లేనిపక్షంలో నా శవం చూస్తారంటూ చెప్పింది. అయితే గొడవలు సహజమని, సర్దుకుపోవాలని ఉమాదేవి తల్లి సూచించింది. తెల్లారేసరికి గ్రామ సమీపంలో ఉన్న బావిలో రెండు మృతదేహాలు ఉన్నాయని ప్రచారం జరగడంతో అందరూ వెళ్లి చూడగా బావిలో ఉమాదేవి (25), జ్యోతీష్ (3) మృతదేహాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాలను బయటకు తీశారు. అదనపు కట్నం కోసం అల్లుడే తన కుమార్తెను చంపారని తల్లి కొండమ్మ, మేనమామ లండ రమణలు ఆరోపించారు. ఇదే విషయమై బొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళిదాసు, బొండపల్లి ఎస్సై ఎస్. సుదర్శన్, బొబ్బిలి డీఎస్పీ పి. సౌమ్యలత గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం పీహెచ్‌సీకి తరలించారు. సీఐ పర్యవేక్షణలో ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.. తల్లీ, కుమారుడు మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎస్సై సుదర్శన్, సీఐ కాళిదాసులను డీఎస్పీ సౌమ్యలత ఆదేశించారు. మృతురాలి తల్లి,కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని డీఎస్పీ చెప్పారు. -
చిచ్చురేపిన కుటుంబ కలహాలు
ఖిల్లాఘనపురం (వనపర్తి): కుటుంబ కలహాలతో కుమారుడితో సహా చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన ఓ మహిళ భయంతో కుమారుడిని మాత్రం నీటిలో వదిలి బయటకు పరుగు తీసింది. మండలంలోని వెంకటాయపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో బాలుడు నీటిలో మునిగి మృతిచెందగా మూడు రోజుల తర్వాత శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గెర్ల భాగన్న, ముణెమ్మల కూతురు సుమతిని నాగర్‌కర్నూల్ మండలం బొందలపల్లికి చెందిన కరుణాకర్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన సుమతి తన కుమారుడు తరుణ్‌కుమార్(2)తో కలిసి ఈ నెల 28వ తేదీన బొందలపల్లి నుంచి తల్లిగారింటికి బయలుదేరింది. గ్రామ సమీపానికి రాగానే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని పక్కనే ఉన్న గణపసముద్రం చెరువులో పడి చనిపోదామని నిర్ణయించుకుంది. రాత్రి 8 గంటల సమయంలో కత్తి నర్సిహులు పొలం దగ్గర ఖిల్లాఘనపురం గణపసముద్రంలోకి వెళ్లింది. కొంత లోపలికి వెళ్లగానే లోతు ఎక్కువగా ఉండటంతో భయపడి బాలుడిని నీటిలోనే వదిలి పరుగున బయటకు వచ్చింది. రెండురోజులపాటు అక్కడే.. కుమారుడిని కాపాడుకోవాలని ఉన్నా నీటిలోకి దిగే సాహసం చేయలేకపోయింది. చేసేదిలేక సమీపంలోని సౌడమ్మ గుట్టపై ఉన్న బ్రంహ్మంగారి ఆలయం దగ్గర రాత్రి మొత్తం తలదాచుకుంది. కుమారుడు చెరువులో మృతిచెందాడని గమనించిన ఆమె అటు అమ్మగారి ఇంటికి.. ఇటు భర్త దగ్గరకు వెళ్లలేక గుట్టపైనే రెండు రోజుల పాటు ఉండిపోయింది. శుక్రవారం ఉదయం ఖిల్లాఘనపురంలో ఉన్న తన సొంత అక్క కుర్వ జయమ్మ దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. ఆమె వెంటనే తల్లిదండ్రులకు చెప్పడంతో అందరూ వచ్చి సుమతి చెప్పిన ప్రాంతంలో నీటిలో వెతికారు. ఓ చెట్టుకు బాలుడి మృతదేహం తట్టుకుని ఉండటంతో బయటకు తీశారు. మృతదేహాన్ని చూసి తల్లితో పాటు కుటుంబ సభ్యులంతా బోరుమని విలపించారు. బాలుని తండ్రి కరుణాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మతిస్థిమితంలేని యువతి ఆత్మహత్య
మల్యాల: కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన మతి స్థిమితంలేని ఓ యువతి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ముస్కు శ్యామల(21) అనే యువతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. తల్లి లచ్చవ్వ కూతురిని పలు హాస్పిటల్లో చూపించినా ప్రయోజనం లేకపోయింది. మంగళవారం తల్లి లచ్చవ్వ బీడీలు ఇచ్చేందుకు కంపెనీకి వెళ్లగా శ్యామల తలుపులు వేసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టగా అప్పటికే 90 శాతం కాలిపోయింది. 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా ఆమె అప్పటికే మృతిచెందింది.