సుజాత(ఫైల్)
తాడ్వాయి(ఎల్లారెడ్డి): కూతురు అనారోగ్యంతో బాధ పడుతుండడాన్ని చూసి తట్టుకోలేని ఓ తల్లి మనస్తాపంతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తాడ్వాయి మండలంలోని కన్‌కల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై అంజయ్య కథనం ప్రకారం.. దేమి కలాన్‌కు చెందిన సుజాత (32)కు, కన్‌కల్ గ్రామానికి చెందిన ఏనుగు రమేశ్‌రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు రిషిరెడ్డి, కూతురు సిగ్నిత ఉన్నారు.
ఏడేళ్ల సిగ్నిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. తన కూతురు అనారోగ్యంతో ఉండడాన్ని చూడలేక మనస్తాపానికి గురైన తల్లి.. బుధవారం రాత్రి అందరూ నిద్రించిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లింది. నేరుగా తమ పొలంలోని బావి వద్దకు వెళ్లి, అందులో దూకేసింది. గురువారం ఉదయం సుజాత కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. ఈ క్రమంలో పొలంలోని బావి వద్ద ఫోన్, చెప్పులు కనిపించాయి. బావిలోకి చూడగా, సుజాత శవమై కనిపించింది. సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment