
సాక్షి, హైదరాబాద్: మద్యానికి బానిసైన భర్త తరచూ గొడవ పడుతుండటంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిజాంపేట్ భవ్యాస్ ఆనంద్‌లో నివాసముండే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మామిడి ప్రసాద్, స్పందన(35)లు భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా ప్రసాద్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలో బంగారు నగలను సైతం జల్సాలకు విక్రయించాడు. దీంతో మనస్తాపానికి గు రైన స్పందన ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరే సుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రియురాలి విషయంలో వాగ్వాదం.. స్నేహితుడే హంతకుడు
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment