రక్తపు మడుగులో లక్ష్మీ, ఉరేసుకున్న శ్రీనివాస్
మల్యాల(చొప్పదండి): అనుమానం పెనుభూత మై రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. అనారోగ్యానికి అనుమానం తోడవడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్యను గొంతు కోసి హత్య చేసిన అనంతరం భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.ఎస్సై మిథున్ కథనం ప్రకారం.. మల్యాల మండలకేంద్రానికి చెందిన కరబూజ శ్రీనివాస్(37)కు ఏడేళ్ల క్రితం సారంగాపూర్ మండలం అర్పల్లి గ్రామానికి చెందిన ముంజాల లక్ష్మీతో వివాహమైంది. మూడేళ్ల కూతురు విషిత ఉంది. గతంలో గీత కార్మిక వృత్తి చేసిన శ్రీనివాస్ రెండేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ రెండేళ్ల అనంతరం నెల రోజుల క్రితం గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో ఇంట్లో ఉన్న పిల్లలను బయటకు పంపించి గది తలుపులు వేశాడు. దీంతో పిల్లలు లక్ష్మీ కుటుంబసభ్యులకు ఫోన్‌లో సమాచారమందించారు. పిల్లలు ఏడుస్తుండడంతో ఇంటి పరిసరాల్లో ఉండేవారు శ్రీనివాస్ అన్న మల్లేశంకు చెప్పారు. మల్లేశం ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, ఇద్దరు విగతజీవులై ఉన్నారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటరమణ, సీఐ నాగేందర్, ఎస్సై మిథున్ పరిశీలించారు. మృతురాలి తల్లి ముంజాల గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
పాపం.. చిన్నారులు
శ్రీనివాస్ మొదటి భార్య ఎనిమిదేళ్ల క్రితం నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి స్పందన, విశాంత్ సంతానం. మొదటి భార్య కుమారుడు అమ్మమ్మవాళ్లింట్లో ఉంటున్నాడు. కూతురు శ్రీనివాస్‌తోనే ఉంటోంది. అనంతరం లక్ష్మీని వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల విషిత సంతానం.
Comments
Please login to add a commentAdd a comment