ఆత్మహత్యకు పాల్పడిన సౌందర్య
ఆసిఫాబాద్: అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గుండి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ మల్లయ్య కథనం ప్రకారం వాంకిడి మండలం జైత్‌పూర్ గ్రామానికి చెందిన కోలె రమేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. ఏడాది కిందట పెద్ద కుమార్తె కోలె సౌందర్య(20)ను ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన పులుగం గురుమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహ సమయంలో రూ.3 లక్షల నగదు, ఒక తులం బంగారంతోపాటు లాంఛనాలు ఇచ్చారు.
కొన్ని నెలలు కాపురం సజావుగానే సాగినా.. నాలుగు నెలలుగా మరో రూ.3 లక్షల అదనపు కట్నంతోపాటు కళ్యాణలక్ష్మీ డబ్బులు కూడా తనకే ఇవ్వాలని సౌందర్యను భర్తపాటు అత్తామామలు పులుగం నాగయ్య, విమలాబాయి మానసికంగా శారీరకంగా వేధించారని తెలిపారు. సౌందర్య ఈ వేధింపులు భరించలేక బుధవారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment