women suicide
-
కష్టపడి పెంచిన బిడ్డా.. ఇడిసిపోతివా?
చందుర్తి(వేములవాడ): ఆస్తి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఒక్కగానొక్క బిడ్డవని రెక్కల కష్టం చేసి, పెంచి పెద్ద చేసుకుంటిని బిడ్డా.. నన్ను ఇడిసిపెట్టి ఎలా పోవాలనిపించింది బిడ్డా.. ఎవరిని చూసుకొని బతకాలె బిడ్డా అంటూ ఆమె తల్లి రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. చందుర్తి మండలం బండపల్లికి చెందిన కుమ్మరి లచ్చయ్యకు భార్య లలిత, కుమారుడు బాబు ఉన్నారు. లలిత తల్లిగారింటికి వెళ్లిపోయి, కాపురానికి రాలేదు. తర్వాత లచ్చయ్య లచ్చవ్వను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కూతురు శ్రీవాణి(14) జన్మించింది. ఆమె తొమ్మిదోతరగతి చదువుతోంది. లచ్చయ్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటివరకు ఎలాంటి బాధ లేని ఆ కు టుంబంలో లచ్చయ్య మరణంతో ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ఇంటితోపాటు రెండెకరాల భూమిలో తమ కు వాటా ఉందని అతని మొదటి భార్య కొడుకు బాబు పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అప్పటినుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఇంటి వెనక స్థలంలో గుడిసె వేసుకోవాలని బాబు చూడగా లచ్చవ్వ అడ్డు చెప్పింది. ఆస్తిలో తనకు హక్కు ఉందని అతను.. తమకు వీలునామా రాశాడని ఆమె గొ డవ పడుతున్నారు. దీంతో శ్రీవాణి మనస్తాపానికి గురైంది. ఈ నెల 1న ఇంట్లోనే దూలానికి ఉరి పెట్టుకుంది. గమనించిన తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి, ఆమెను కిందికి దించారు. అపస్మారక స్థితిలోకి చేరిన శ్రీవాణిని ఆటోలో వేములవాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు బాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాగా, శ్రీవాణి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, రాత్రి స్వగ్రామం తరలించారు. -
ట్రోలింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గీతాంజలి అనే మహిళ ప్రభుత్వ పథకాలు తీసుకొని ఏ విధంగా లబ్ధి పొందిందో ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పింది. ఆమె ప్రభుత్వ పథకాల వల్ల తమ కుటుంబానికి ఎంతగా లబ్ధి చేకూరిందీ, వారి పిల్ల లకి కూడా భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా విధానం ఎంతగా ఉపయోగ పడనున్నదో సంతోషంగా తెలియ పరిచింది. కానీ ఆమె అభిప్రాయంపై కొందరు వ్యక్తులు (ప్రతి పక్షాల కార్యకర్తలు) అనుచిత, అన్పార్ల మెంటరీ పదాలతో కూడిన కామెంట్లు చేశారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారు తల్లిలేని పిల్లలయ్యారు. ఈ మధ్యకాలంలో ‘సోషల్ ట్రోలింగ్’ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా రాజ కీయాలలో ఇది మరింత తీవ్రంగా ఉంది. ఒక పార్టీనీ, ఒక వ్యక్తినీ, ఒక నాయకుణ్ణీ, ఒక విధానాన్నీ సమర్థిస్తూ మాట్లాడితే వెంటనే సామాజిక మాధ్యమాల్లో పలు పార్టీలకు సంబంధించిన వారు అదే పనిగా వారిని విమర్శించడం కనిపిస్తోంది. అయితే ఇందులో మహిళలను కించపరచడం, వారిని తక్కువ చేసి మాట్లాడటం, అనరాని మాటలు అనడం బాధాకరం. రాజకీయ చర్చల్లో సాధారణంగా చిన్న పిల్లల్నీ, మహిళలనూ కించపరచకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కేవలం రాజకీయ వర్గాలే కాదు సాధారణ ప్రజలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి బాలికలు మాట్లా డిన ఇంగ్లీష్‌పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టి వారు ముందుకు దూసుకువెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అటువంటి పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్‌పై వ్యంగ్యా స్త్రాలను ఆ యా వర్గాలకు చెందిన వారే కొందరు ట్రోల్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్న మహిళలూ, బడిపిల్లలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వారిని క్షోభ పెట్టడం ప్రతిపక్ష కార్యకర్తలకు తగదు. ఇలా చేస్తే వారు అవమానంతో ఆత్మహత్యలు చేసుకోవడం పెరుగుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు... ట్రోల్ చేసేవారిని గుర్తించి, నియంత్రించడానికి ప్రత్యేక టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా తమ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా తగిన నియంత్రణా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అటువంటి వారికి జరిమానాలు విధించాలి. భావస్వేచ్ఛ ఉందికదా అని ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదుకదా? ఇటువంటి వారి ప్రవర్తన సామాజిక మాధ్య మాల్లో చురుగ్గా ఉండే యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అసలు ఈ ట్రోలింగ్‌లో పాల్గొంటున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండటం ఇందుకు నిదర్శనం. గీతాంజలి ఆత్మహత్య కేసులో పోలీసులు గురు వారం ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని గుంటూరు ఎస్పీ తుషార్ ప్రకటించారు. ఇలా కఠినంగా వ్యవహరిస్తేనే ట్రోలింగ్‌ను అరికట్టడం సాధ్య మవుతుంది. – డా‘‘ శ్రవణ్ కుమార్ కందగట్ల sravankuc@gmail.com -
బైక్ లిఫ్ట్ అడగడమే ఆమెకు శాపమైంది.. ఫొటోలు తీసి..
సాక్షి, ఏలూరు: మహిళలు, యువతులపై వేధింపులు తగ్గించేందుకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కొందరు మృగాలు మాత్రం మారడం లేదు. చట్టాలు తమకు వర్తించవు అనే రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కొందరు ఆకతాయిల వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనపై ఎస్ఐ చావా సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమడోలు మండలం లక్ష్మీపురానికి చెందిన సుంకర లక్ష్మణరావుకు దెందులూరుకు చెందిన పావని (35)కి 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. పిల్లల చదువుల నిమిత్తం గుండుగొలనులోని గంగానమ్మ గుడి సమీపంలోని ఓ అద్దె ఇంట్లో గత రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 15న పావని ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తూ అటుగా వస్తున్న ఓ మోటార్ స్లైక్లిస్ట్‌ను లిఫ్ట్ అడిగి వెళుతోంది. అయితే, ఆ సమయంలో లక్ష్మీపురానికి చెందిన పాత నేరస్తుడు బోను శివకృష్ణ ఆమె బండి ఎక్కి వెళుతున్న దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీసి తన సహచరులైన బోను పవన్, సుంకర యశ్వంత్, శనపతి రాజబాబులతో కలిసి ద్వారకాతిరుమల వరకు వారిని వెంబడించారు. అక్కడ వారిని అడ్డగించి తమ కోరిక తీర్చాలని లేదంటే వీడియో వైరల్ చేసి అల్లరి పాలు చేస్తామని బెదిరించారు. అయినా ఆమె వారికి లొంగలేదు. కాగా, ఈనెల 10న బోను శివకృష్ణ సదరు మహిళ బైక్ ఎక్కి వెళ్లిన వీడియోను గ్రామంలో అందరికి షేర్ చేశాడు. వ్యభిచారిణిగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వివాహిత అదేరోజు ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. మృతదేహానికి వీఆర్వోలు వి.వెంకటేశ్వరరావు, కందులపాటి శంకర్ పంచనామా నిర్వహించారు. పావని మృతికి కారణమైన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి వీడియోలను తీసిన సెల్ఫోన్లను కూడా సీజ్ చేశామని చెప్పారు. నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. చేపల పట్టుబడికి వెళుతూ జీవనం పొందుతున్న భర్త, పిల్లలు పావని ఆత్మహత్యతో తల్లడిల్లిపోయారు. ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో యువ జంట దుర్మరణం -
మేనరికపు పెళ్లి వల్లే పిల్లలకు అనారోగ్యం.. ఎంత పని చేశావ్ అమ్మా!
సాక్షి, అల్వాల్: కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలూ అల్పాయుష్షుతోనే కన్నుమూశారు. ప్రస్తుతం జన్మనిచిన కవలలూ అనారోగ్యానికి గురయ్యారు. మేనరికపు పెళ్లి కారణంగానే పిల్లలు ఆయుర్దాయం లేకుండా చనిపోతున్నారని ఆవేదనకు గురైంది ఆ తల్లి. భవిష్యత్‌లో తాను మాతృమూర్తిగా మనగలిగే పరిస్థితి ఉండదని భావించిన ఆమె పదిరోజుల వయసున్న పసికందులను ఇంటి ఆవరణలోని సంపులో పడేసి తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాజీగూడ శివనగర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన నర్సింగ్‌రావుకు మేనమామ కూతురు సంధ్యారాణితో 2012లో వివాహమైంది. 5 సంవత్సరాల అనంతరం ఇద్దరు కవల పిల్లలు జన్మించి అనారోగ్యంతో చనిపోయారు. 2018లో పుట్టిన కొద్ది రోజులకే కూతురు మరణించింది. అనంతరం ఈ నెల 11న ఇద్దరు కవల (మగ, ఆడ) పిల్లలు జన్మించారు. వీరు సైతం అనారోగ్యానికి గురయ్యారు. బాబుని కొంపల్లిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 14వ తేదీన ఇంటికి తీసుకువచ్చారు. పుట్టిన పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతూ మృత్యువాత పడుతుండడం.. ఈ ఇద్దరు పసికందులు కూడా దక్కకుండాపోతారేమోనని భావించిన సంధ్యారాణి.. ఆదివారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి ఆవరణలో ఉన్న సంపులో వారిని పడేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అర్ధరాత్రి సంధ్యారాణి కనిపించకపోడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలిస్తూ సంపులో వెతకగా సంధ్యారాణి, ఇద్దరు పిల్లల మృతదేహాలు సంపులో కనిపించాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మేనరికపు పెళ్లి వల్లే పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు రాసి ఉన్న సూసైట్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Crime: ‘పిన్నమ్మా.. నాకు పెళ్లి చెయ్యవా?’ -
తమిళనాడులో విషాదం.. వరకట్న వేధింపులతో..
సాక్షి, చెన్నై: వరకట్న వేధింపులు తాళలేక బిడ్డతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోని కడకల్ తోపుకు చెందిన లాలూ బాషా కుమార్తె ఫిర్దోస్ (22)కు తిరువణ్ణామలై జిల్లా కిలిపెన్నత్తూరుకు చెందిన అబ్దుల్లా(25)తో గతేడాది ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. తిరువణ్ణామలైలోని ఓ దుకాణంలో అబ్దుల్లా పనిచేస్తున్నాడు. ఫిర్దోస్ గర్భం దాల్చడంతో ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. 50 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు హయాన అని పేరు పెట్టారు. ఈ నెల 2వ తేదీ బిడ్డతో కలిసి ఆవూరులోని భర్త ఇంటికి వెళ్లింది. అనంతరం ఈ నెల 17న తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఫిర్దోస్, చిన్నారి కనిపించకుండాపోయారు. తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. రాత్రి 10 గంటలకు వ్యవసాయ బావిలో చిన్నారి శవమై తేలడాన్ని ఆ ప్రాంత వాసులు గుర్తించి ఫిర్దోస్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. సెంజి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియదర్శిని, ఇన్స్పెక్టర్ తంగం, సబ్ ఇన్స్పెక్టర్ శంకర సుబ్రమణ్యం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అబ్దుల్లా వరకట్నం తేవాలని వేధించేవాడని తెలిసింది. వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముండియంబాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అబ్దుల్లాని అరెస్టు చేశారు. -
వివాహిత ఆత్మహత్య.. కారణం అదేనా?
కృష్ణరాజపురం: భర్త మరణాన్ని తట్టుకోలేక ఆవేదనకు లోనైన వివాహిత యువతి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర సంఘటన బెంగళూరు మహాదేవపురలోని కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో సౌందర్య (24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే ఆమె భర్త కూడా బలవన్మరణానికి పాల్పడడం గమనార్హం. అప్పుల బాధతో భర్త.. వివరాలు ప్రకారం.. సౌందర్య భర్త నగరంలోని మాగడి రోడ్డులో ఒక ఆడిటర్ వద్ద జీఎస్టీ వ్యవహారాలు చూసేవాడు. అతడు పలు కారణాల వల్ల రూ. 3 కోట్ల వరకూ అప్పులు చేసి ఆ బాధలు పడలేక 15 రోజుల క్రితం తన ఆఫీసులో ఉరి వేసుకొన్నాడు. భర్త శాశ్వతంగా దూరం కావడంతో అప్పటినుంచి సౌందర్య లోలోపలే కుమిలిపోతోంది. ఓఫారం సమీపంలోని పుట్టింటికి వెళ్లి నివసిస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకొని తనువు చాలించింది. మృతురాలికి యేడాదిన్నర కుమారుడు ఉన్నాడు. తల్లీతండ్రీ దూరమై అనాథగా మిగిలాడు. కాడుగోడి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. కారణం అదేనా?
కృష్ణరాజపురం: మానసిక ఆందోళనతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఈ విషాద ఘటన గురువారం రాత్రి కర్నాటకలోని కృష్ణరాజపురం నగరంలోని బసవేశ్వర నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న టెక్కీ స్వాతి (26) ఇక్కడి గ్లోబల్ విలేజ్‌లో విధులు నిర్వహిస్తోంది. అయితే, రెండేళ్ల క్రితం ఐటీ ఉద్యోగి దామోదర్‌ను వివాహం చేసుకుంది. తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
డీఎంకే మంత్రి సోదరుడి కుమార్తె ఆత్మహత్య.. కారణం అదేనా?
వేలూరు: తమిళనాడు జనవనరుల శాఖ మంత్రి, డీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ అన్న కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, మంత్రి దురై మురుగన్ అన్న.. మహాలింగం కుమార్తె భారతి(55) తన భర్త రాజ్‌కుమార్‌తో కలిసి కాట్పాడిలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, సోమవారం సాయంత్రం కాట్పాడి సమీపంలోని లత్తేరి వద్ద రైలు కింద పడి ఆమె మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు అడుక్కంబరై ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భారతి దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా.. మనోవేదనకు గురై ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. -
ఒక్కసారి మేమైనా నీకు గుర్తుకు రాలేదా తల్లి?
ఉరవకొండ: ఆస్తి కోసం కడతేరుస్తారనుకోలేదమ్మా.. ఎంతటి నరకయాతన అనుభవించావో కదా.. ఒక్కసారి మేమైనా నీకు గుర్తుకు రాలేదా తల్లి? ఈ దుర్మార్గులను వదిలేసి వచ్చుంటే కంటికి రెప్పలా చూసుకునేవాళ్లం కదమ్మా? అంటూ మృతురాలి తల్లిదండ్రుల రోదనలతో ఉరవకొండ ఆస్పత్రి ఆవరణం మారుమోగింది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఉరవకొండలోని మాస్టర్ సీవీవీ నగర్లో నివాసముంటున్న శివరాంపేట మల్లికార్జున కుమారుడు కురుబ వినోద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన ఓబులేసు, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె శిరీష (26)తో 2020, నవంబర్ 21న వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.2 లక్షల వరకట్నం, 26 తులాల బంగారు నగలను వధువు తల్లిదండ్రులు ఇచ్చారు. పెళ్లి ఖర్చులకు తండ్రి తన భూమిని విక్రయించాడు. అంతేకాక కుమార్తె జీవితం బాగుంటుందని భావించిన అతను బుక్కరాయసముద్రంలో విలువైన ఐదు సెంట్ల స్థలాన్ని శిరీష పేరున రాసిచ్చాడు. అయితే, ఆ స్థలాన్ని తన పేరున రిజిస్టర్ చేసివ్వాలంటూ వినోద్ మొండిపట్టుపట్టాడు. ఈ విషయంగానే తరచూ భార్యను వేధించేవాడు. శారీరకంగా హింసించేవాడు. వినోద్‌తో పాటు అతని తల్లి సుజాత, అక్క భారతి, బావ ధనుంజయ, మేనమామ ప్రకాష్ సైతం శిరీషను చిత్రహింసలకు గురి చేసేవారు. ఏడాది క్రితం గర్భిణి అయిన శిరీషను ఇంట్లోంచి వెల్లగొట్టడంతో పెద్దమనుషుల సమక్షంలో రాజీ కుదిర్చారు. అయినా వినోద్, వారి కుటుంబసభ్యుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే శిరీష ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో ఇంట్లోనే మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మీదేవి, ఓబులేసు, సోదరుడు శివప్రసాద్ ఆగమేఘాలపై ఉరవకొండకు చేరుకున్నారు. ఆస్పత్రిలోని మార్చరీలో ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శేఖర్, ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. కాగా, మృతురాలికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. -
కలహాలతో విసిగి.. పిల్లలతో కలిసి చెరువులో దూకి..!
నవాబుపేట: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ తల్లి.. తన ముగ్గురు పిల్లలతో చెరువులోకి దూకింది. ఈ సంఘటనలో కవల పిల్లలతో సహా తల్లి గల్లంతు కాగా.. మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం పరిధిలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. కాకర్లపహాడ్‌కు చెందిన అద్దాల మైబు, రమాదేవి (35)కి దాదాపు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు నవ్య, కవల పిల్లలు చందన (4), మారుతి (4) ఉన్నారు. భార్యభర్తలు హైదరాబాద్‌లోనే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం భార్య రమాదేవి.. కవల పిల్లలు చందన, మారుతిలతో కలిసి హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చింది. అక్కడి నుంచి దేవరకద్ర కేజీబీవీలో ఆరో తరగతి చదువుకుంటున్న నవ్యను తీసుకొని నవాబ్‌పేట బస్సులో స్వగ్రామానికి బయల్దేరింది. కాగా కాకర్లపహాడ్ సమీపంలోనే బస్సు దిగి గ్రామానికి నల్లకుంట చెరువు మీదుగా వెళ్దామని ముగ్గురు పిల్లలకు చెప్పి.. నడుచుకుంటూ తీసుకెళ్లింది. అయితే చెరువు సమీపంలోకి వెళ్లిన తర్వాత పిల్లలు భయపడడంతో.. వారిని గట్టిగా పట్టుకుని నీటిలోకి వెళ్లింది. పెద్ద కూతురు నవ్య గట్టిగా అరుస్తూ.. చెల్లిని బయటకు లాగే ప్రయత్నం చేసినా.. తల్లి రమాదేవి ఇద్దరు కవల పిల్లలతో నీటిలోకి వెళ్లడంతో వారు ముగ్గురు మునిగిపోయారు. నవ్య నీటిలోని ఓ చెట్టుకొమ్మను పట్టుకుని ఒడ్డుకు చేరుకొని ప్రాణాలతో బయటపడింది. ఆ చిన్నారి రోడ్డుపైకి వచ్చి అటు వైపు వెళ్తున్న గ్రామస్తులకు విషయం చెప్పడంతో బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టినా.. వారి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం మరోసారి గాలిస్తామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. భర్తతో గొడవ పడి ఇలాంటి నిర్ణయం తీసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. -
భర్తకు దూరంగా ఒంటరి జీవితం.. లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరై..
భర్తకు దూరంగా ఉంటూ ఆమె(33) జీవనం సాగిస్తోంది. ఇంతలో ఆమెకు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పరిచయమయ్యాడు. తనను ప్రేమిస్తున్నానని దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహాజీవనం సాగించాడు.ఈ క్రమంలో ఆమెకు శారీరకంగా దగ్గరై.. 14 సార్లు గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి విషయం ఎత్తాక.. 14 సార్లు అబార్షన్ చేయించాడు. ఇలా నమ్మిస్తూ మోసం చేయడంతో తీవ్ర మసస్థాపానికి గురైన బాధితురాలు చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జత్పూర్ ప్రాంతంలో ఓ మహిళ(33) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె డెడ్ బాడీ పక్కనే సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, సూసైడ్ నోట్లో.. తనను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. కొన్నేళ్లుగా తనతో సహజీవనం కొనసాగించాడని పేర్కొంది. ఈ క్రమంలో శారీరకంగా దగ్గర అవడంతో 14 సార్లు తనకు అబార్షన్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు పెళ్లి చేసుకోవాలని నిలదీయంతో.. అతను పెళ్లికి నిరాకరించడంతో వేరే దారిలేక ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. అయితే, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. ఆమెకు తన భర్త నుంచి విడిపోయే 8 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తోందని తెలిసింది. ఇదిలా ఉండగా.. ఆమె పేరెంట్స్ బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో నివాసముంటున్నారని అన్నారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు డీసీపీ తెలిపారు. ఇక, ఈ ఘటనలో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. అతడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. -
కటకటాల్లోకి ఎస్ఐ విజయ్‌కుమార్
పామిడి/అనంతపురం క్రైం: అనంతపురం జిల్లా పామిడి మండలం గురుమాంజనేయ కొట్టాలకు చెందిన సభావత్ తిరుపాల్‌నాయక్, సీతమ్మ దంపతుల కుమార్తె ఎస్.సరస్వతి (21) ఆత్మహత్యకు కారణమైన తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐ రమావత్ విజయ్‌కుమార్ నాయక్‌ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పామిడి పోలీస్‌స్టేషన్‌లో తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గురుమాంజనేయ కొట్టాల గ్రామానికే చెందిన రమావత్ విజయ్‌కుమార్ నాయక్ 2018లో ఎస్ఐగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం చంద్రగిరిలో పనిచేస్తున్నాడు. వరుసకు మామ కూతురైన సరస్వతిని రెండేళ్లుగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతపురానికి చెందిన భారతితోనూ ప్రేమాయణం నడిపాడు. ఆమె అనంతపురం దిశ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కడంతో భారతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ విజయ్‌కుమార్ తనను వంచించడంతో సరస్వతి మనస్తాపానికి గురై బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ విజయ్‌కుమార్‌పై 420, 376, 306 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పామిడిలో శనివారం అతన్ని అరెస్టు చేశారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి.. రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
భర్త మృతి.. ఆ తర్వాత భార్య ఏం చేసిందంటే..?
సాక్షి, బెంగళూరు: భర్త మరణ వార్తను ఆమె తట్టుకోలేకపోయింది. కట్టుకున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. మరణ వార్త తెలిసిన కొన్ని గంటల్లోనే తన ఆరు నెలల కుమారుడిని చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్నాటకలోని రాయ్‌చూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మంగళూరులోని అగ్నిమాపక దళంలో గంగాధర్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, గంగాధర్ (36), శ్రుతి(30) భార్యాభర్తలు.. వీరికి ఆరు నెలల కుమారుడు అభిరామ్ ఉన్నాడు. గంగాధర్ కుటుంబం రాయ్‌చూర్‌లో నివాసం ఉంటోంది. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి.. గంగాధర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కుంటికాన సమీపంలో నేషనల్ హైవే-66పై గంగాధర్ దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే, రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోయాడన్న వార్త శ్రుతికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిన భార్య.. భర్తలేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం అర్దరాత్రి సమయంలో తన ఆరు నెలల చిన్నారి అభిరామ్‌ను హత్యచేసి, తాను సూసైడ్ చేసుకుంది. ఒక్క మరణంతో ఆ కుటుంబంలో ఊహించని పరిస్థితులు నెలకొనడంతో ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్టు తెలిపారు. -
అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య
సంగారెడ్డి:రాఖీ పండుగ వేడుకలు దేశమంతటా ఘనంగా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సోదరసోదరీమణుల సందడితో అన్నీ ఇళ్లూ కళకళలాడుతుంటాయి.తమ సోదరులకు రాఖీ కట్టి ప్రేమను చాటుకుంటున్నారు అక్కాచెల్లెళ్లు. కానీ ఇదే రాఖీ పండగ రోజు ఆ ఇంట్లో మాత్రం విషాదం నెలకొంది. అందరిలానే ఆమె కూడా తన అన్నకు రాఖీ కట్టాలనుకుంది. ఆదివారం రాఖీ పండగ కావడంతో అందరు చెల్లెళ్ల మాదిరే మమత అనే యువతి కూడా తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లింది. కానీ ఆ యువతి చేత రాఖీ కట్టించుకునేందుకు తన అన్నయ్య రమేశ్ నిరాకరించాడు. కారణమేంటో తెలియదు గానీ తాను రాఖీ మాత్రం కట్టించుకోనని స్పష్టం చేశాడు. అన్నపై ఎంతో ప్రేమతో రాఖీ తీసుకొచ్చిన మమత తన అన్నయ్య ఆ మాట అనగానే కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఇంటికి వచ్చిన పెద్ద సోదరి సరితతో రమేశ్ రాఖీ కట్టించుకున్నాడు. తన అక్కతో అన్నయ్య రాఖీ కట్టించుకుని తనతో రాఖీ కట్టించుకోలేదన్న మనస్తాపానికి గురైన మమతను తండ్రి ఓదార్చి పొలానికి వెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో మమత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి వచ్చిన బసన్నకు కూతురు శవమై కనిపించడంతో బోరున విలపించాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ శ్రీకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. జహీరాబాద్ ఎస్ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారెడ్డి నగర్ కాలనీలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న బసన్న(బస్వరాజ్)కు నలుగురు సంతానం. భార్య చనిపోయింది. పెద్ద కూతరుకు పెళ్లయింది. పెద్ద కుమారుడు కూడా వేరుగా నివసిస్తున్నాడు. బసన్నతో పాటు చిన్న కొడుకు రమేశ్, చిన్న కూతురు మమత(22)లు ఉంటున్నారు. నాలుగైదు రోజులుగా అన్నాచెల్లెళ్ల మధ్య గొడవల కారణంగా మమతతో రమేశ్ మాట్లాడటం లేదని తెలిపారు. అయితే స్థానికులు మాత్రం మమత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాఖీ కట్టించుకోనంత మాత్రన ఇలా ఆత్మహత్య చేసుకుంటారా అని సందేహపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మూడ నమ్మకంతో తనను తానే బలిచ్చుకున్న యువతి
లక్నో: సాధారణంగా గ్రామ దేవతలకు కోళ్లను, పొట్టేళ్లను బలివ్వడం చూస్తుంటాం. కానీ ఓ యువతి ఏకంగా తనను తానే బలిచ్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో కలకలం రేపింది. ఇక ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మీరట్ జిల్లా ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామానికి సమీపంలోని అడవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మవారిని నిత్యం ఎంతో ఇష్టంగా అత్యంత భక్తి శ్రద్దలతో పూజించేది. భక్తి పారవశ్యంతో కాళీమాత ఆలయానికి ప్రతి రోజూ వెళ్లేది. అయితే ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఆ యువతి తనను తాను కాళీమాత కుమార్తెగా భావించడం మొదలు పెట్టింది. తాను మహా భద్రకాళి కూతురునని అమ్మవారి కోసం తన ప్రాణం త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఇదే క్రమంలో ఆ యువతి ఒంటరిగా తెల్లవారు జామున ఆలయానికి వెళ్లింది. అటవీ ప్రాంతం కావడంతో ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేరు. ప్రతి రోజూ పూజారి కూడా సాయంత్రం వచ్చి అమ్మవారికి పూజ చేసి వెళ్లిపోయేవాడు. అయితే ఆ యువతి చాలాసేపు పూజ చేసిన తరువాత ఊహించని నిర్ణయం తీసుకుంది. తొలుత గొంతు కోసుకుని ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది. గొంతు కోసుకున్న ప్రాంతంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై ఇబ్బంది పడుతూనే గుడి గంటలకు ఉరి తాడు బిగించుకుని ప్రాణ త్యాగానికి పాల్పడింది. అయితే రోజూలానే ఆ రోజు సాయంత్రం ఆలయ పూజారి వచ్చి చూసేసరికి ఆ యువతి గుడి గంటలకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. దీనితో ఆ పూజారి షాక్‌కు గురయ్యాడు. కొంతసేపటికి తేరుకుని గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించాడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ యువతి మూఢ విశ్వాసాల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానీ ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ గ్రామంలోని కొందరు ఆ యువతి మూఢ నమ్మకాల కారణంగానే తనను తాను బలిచ్చుకుందని అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం కుటుంబ సమస్యల వల్లే ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నారు. ఏ విషయంలోనో అదే రోజు కుటుంబ సభ్యులకు, ఆ యువతికి మధ్య వాగ్వాదం జరిగడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆలయానికి వెళ్లి ఉరేసుకుని వుండొచ్చని మరికొందరు అంటున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతికి అసలు కారణమేంటో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి.. భర్తతో గొడవ.. అత్తింటి ముందే సజీవ దహనం
బైరెడ్డిపల్లె : విభేదాల నేపథ్యంలో తన భర్తను కలిసేందుకు అత్తగారింటికి వచ్చిన మహిళ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణం చెందింది. శుక్రవారం ఉదయం ఈ సంఘటన మండలంలోని మునిపల్లెలో చోటుచేసుకుంది. ఎస్ఐ మునిస్వామి కథనం...గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు హరిప్రసాద్‌రెడ్డి, తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌కు చెందిన ఏకాంబరం కుమార్తె సత్యవాణి(32) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవారు. వీరి పరిచయం ప్రేమగా మారడంతో గత ఏడాది వివాహం చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగినప్పటికీ తర్వాత విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న గురువారం హరిప్రసాద్‌ను కలిసేందుకు సత్యవతి బెంగళూరు నుంచి ద్విచక్రవాహనంపై మునిపల్లెకు వచ్చింది. అయితే హరిప్రసాద్ లేకపోవడంతో అతడిని పిలిపించాలని అత్తమామలను పట్టుబట్టింది. దీంతో వారు అతడిని పిలిపించడంతో వారి ఎదుటే ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో సత్యవతి క్షణికావేశానికి గురైంది. వస్తూ..వస్తూ..క్యాన్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఒక్కసారిగా భగ్గున మంటలు రేగాయి. వాటిని ఆర్పేందుకు ఆమె అత్తమామలు, హరిప్రసాద్, గ్రామస్తులు యత్నించినప్పటికీ ఫలితం శూన్యం. అక్కడికక్కడే సత్యవాణి సజీవదహనమైంది. గ్రామస్తుల సమాచారంతో ఎస్ఐ అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నతో ఎంగేజ్మెంట్, తమ్ముడితో పెళ్లి.. ఆపై ఆత్మహత్య
హైదారాబాద్: పెళ్లయి నెల గడవక ముందే ఓ యువతి జీవితం బలైపోయింది. తన ప్రమేయం లేకుండానే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములతో ఒకరితో ఎంగేజ్మెంట్, మరొకరితో వివాహం చివరికి ఆ యువతిని బలికొంది. ఇక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.. పాతబస్తీకి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిన్‌తో జల్పల్లి న్యూ బాబానగర్‌కు చెందిన మీర్ ఇస్మాయిలుద్దీన్ అలీకి గత నెల 12న పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. అయితే మూడు సంవత్సరాల క్రితమే ఇస్మాయిలుద్దీన్ వివాహం చేసుకున్న షాహిన్భేగంకు తన అన్నయ్య జలాలుద్దీన్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్నాళ్ళకి ఉపాధి నిమిత్తం అన్నదమ్ములిద్దరూ దుబాయికి వెళ్లారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వివాహం చేసుకునేందుకు జలాలుద్దీన్ దుబాయి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అయితే కొద్ది రోజుల క్రితమే తన తమ్ముడు ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తిరిగి తన స్వస్థలం చేరుకున్నాడు. ఇది ఇలా ఉండగా దుబాయ్‌లో జలాలుద్దీన్ ఆచూకి తెలియని పరిస్థితి కుటుంబ సభ్యులకు ఎదురైంది. దీనితో తప్పని పరిస్తితుల్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్‌ను ఇస్మాయిలుద్దీన్ అలీకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గత జులై నెల 12న వారిరువురికి వివాహం జరిపించారు. అయితే ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ షాహిన్‌ను రోజూ హింసించసాగాడు. తన అన్న ఎంతో ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్న యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేశారంటూ ఇస్మాయిలుద్దీన్ తీవ్రంగా ఆలోచించేవాడు. అంతేకాక తన అన్నకు భార్యగా ఉండాల్సిన యువతిని తన భార్యగా అంగీకరించలేనంటూ ఆమెను మానసికంగా వేధించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇరు కుటుంబాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే షాహిన్‌కు అత్తమామల నుంచి సైతం వేదింపులు మొదలయ్యాయి. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన షాహిన్ బేగం గత శనివారం తన గదిలో ఉన్న ఫాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే షాహిన్ బేగం మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
బయటకు వెళ్లకుండా తల వెంట్రుకలను కట్ చేయించి..
సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సాకు చెందిన పరమేశ్వర్ 20ఏళ్ల కిందట లక్ష్మీగూడలో నివాసం ఏర్పా టు చేసుకున్నాడు. ఆయనకు నలుగురు సంతానం. ఇదే ప్రాంతానికి చెందిన అక్రం అలియాస్ అప్సర్(20) నివసిస్తున్నాడు. పరమేశ్వర్ చిన్న కూతురు లీజా(20) అప్సర్ ఒకే కళాశాలలో ఇంటర్ చదువుకున్నారు. వీరి ఇళ్లు కూడా దగ్గరగా ఉండడంతో కళాశాలకు వెళ్తూ, వచ్చే సమయంలో ప్రేమలో పడ్డారు. విషయం గమనించిన లీజా కుటుంబ సభ్యులు పలుమార్లు అప్సర్‌ను హెచ్చరించారు. చదవండి: బ్యుటిషియన్ ఆత్మహత్య లీజాను బయటకు వెళ్లనీయకుండా తల వెంట్రుకలను కట్ చేయించి ఇంట్లోనే ఉంచారు. దీంతో ఆ యువతి మానసికంగా కుంగిపోయింది. దీనికి తోడు అప్సర్ తరుచూ ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేని యువతి ప్రియుడితో సుమారు గంటపాటు ఫోన్లో మాట్లాడాక ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమె మృతి చెందాక కూడా అఫ్సర్ 135 సార్లు ఫోన్ చేశాడు. ఇరువురు ఫోన్ మాట్లాడుకుంటూనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్నేహితులు, బంధువులు వాపోతున్నారు. ఈ మేరకు అఫ్సర్‌ను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చదవండి: బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని.. -
పూజా చవాన్ ఆత్మహత్య.. మంత్రి రాజీనామా
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అటవీ మంత్రి సంజయ్ రాథోడ్ ఆదివారం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. రాష్ట్రంలో ఓ మహిళ మరణానికి సంజయ్ రాథోడ్ కారణమని ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మహిళ మరణంపై నీచ రాజకీయాలు చేస్తున్నారని సంజయ్ రాథోడ్ మండిపడ్డారు. సత్యం నిగ్గుతేలాలన్న ఉద్దేశంతోనే మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన పూజా చవాన్ (23) ఫిబ్రవరి 8న పుణేలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంజయ్ వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. బాధిత మహిళతో మంత్రి ఉన్నట్లు, మాట్లాడినట్లుగా చెబుతున్న ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో రాజీనామా చేసిన తొలిమంత్రి సంజయ్ రాథోడ్. -
అల్లుడితో అనైతిక బంధం.. ఆత్మహత్య
పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. విషయం తెలిసిందని వివాహిత ప్రియుడితో కలిసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు తల్లి ప్రేమకు నోచుకోక అనాథలయ్యారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బౌసింగ్ తండా గ్రామపంచాయతీ వంపుతండాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాక్షి, మదనాపురం: వంపుతండాకు చెందిన దేవమ్మ(30, పార్వతమ్మ)కు అదే తండాకు చెందిన రాజుతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త డోజర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భర్త లేని సమయంలో అదే తండాకు చెందిన శివనాయక్ (22) వరుసకు అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి తండాలో కొంత మంది చర్చించుకున్నారు. తమ వివాహేతర సంబంధం ఎక్కడ బయట పడుతుందోనని ఆందోళన చెందింది. శుక్రవారం రాత్రి ఇద్దరూ కొన్నూరు క్రాస్ రోడ్డు వద్ద పెద్దతొక్కుడోని బండపై పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అటుగా పొలాల వైపు వెళ్లిన రైతులు వీరిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్ సాయంతో వీరిని చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్ తీసుకెళ్తుండగా.. ఇద్దరూ మార్గమధ్యంలో మృతిచెందారు. ఇద్దరి మృతదేహాలకు పంచనామా నిర్వహించి బంధువులకు అప్పజెప్పనున్నట్లు ఎస్ఐ తిరుపాజీ తెలియజేశారు. పిల్లల అమాయకపు చూపులు.. తల్లి మృతిచెందడంతో ఇద్దరు కుమార్తెలు, ఓ బాలుడు బాధతో తల్లి వైపు చూస్తున్న చూపులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. -
కోరిక తీర్చాలంటూ టీడీపీ నేత ఒత్తిడి
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): తనను సుఖపెట్టాలంటూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో తట్టుకోలేక ఓ మహిళ సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి నాగమల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లి బ్రహ్మానందపురంలో నివాసం ఉండే వలపర్ల నాగరాజుకు మంగళగిరికి చెందిన సుజాతతో 2014లో వివాహమైంది. నాగరాజు ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గత రెండు నెలల నుంచి వీరు అద్దెకు ఉంటున్న ఇంటి పక్కన ఉండే టీడీపీ నాయకుడు సత్యాల బాలశౌరి సుజాతతో మీకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు ఇప్పిస్తాను.. నా కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. సుజాత ఒప్పుకోకపోవడంతో ‘నువ్వు చనిపోయేలోపు నిన్ను అనుభవిస్తాను, నిన్ను నీ భర్తతో కాపురం చేయనివ్వను’ అంటూ బెదిరించాడు. ఆదివారం రాత్రి సుజాత భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి కోరిక తీరుస్తావా లేదా? అంటూ బలవంతపెట్టడంతో సుజాత కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేసరికి బాలశౌరి అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరం మనస్తాపంతో సుజాత ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందినట్లు సుజాత తల్లి నాగమల్లేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. బాలశౌరి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చైర్మన్ పదవిలో ఉంటూ కొంతమంది మహిళలను ఇలాగే వేధించినట్లు ఆరోపణలున్నాయి. రౌడీషీటర్‌తో రాజీ మంతనాలు: సుజాత తల్లిదండ్రులు మంగళగిరిలో ఉండటంతో, అక్కడే ఉంటున్న మాజీ రౌడీషీటర్‌తో రాజీకి రావాలంటూ బాలశౌరి మంతనాలు ప్రారంభించాడు. సుజాత ఆత్మహత్య అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలశౌరి టీడీపీ నేతల ఇళ్లలో దాక్కుని రాజీ ప్రయత్నాలు చేస్తున్నాడని సుజాత బంధువులు ఆరోపిస్తున్నారు. రాజీకి రాకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. -
ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తున్న విద్యార్థిని ప్రేమ పేరుతో వేధింపులకు గురై, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన పూనెం వాసవి(17) అనే విద్యార్థిని పాల్వంచలోని సిద్ధార్థ ఒకేషనల్ నర్సింగ్ కళాశాలలో చదువుతుంది. టీచర్స్ కాలనీలో వరుసకు అన్న అయిన మాచర్ల గోపి ఇంట్లో రెండు నెలలుగా అద్దెకు ఉంటూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా చేరింది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన బంధువులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందింది. అయితే కోయగూడెంకు చెందిన వరుసకు బంధువైన గీతారత్నం అనే యువకుడు ప్రేమ పేరుతో కొన్ని రోజులుగా వేధింపులకు దిగడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం గీతారత్నం, అతని స్నేహితుడితో కలిసి వాసవి ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగడంతో మనస్థాపం చెందిందని, ఈ విషయాన్ని తనకు ఫోన్లో కూడా చెప్పిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాసవి మృతితో కోయగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పతి వద్ద విద్యార్థిని స్నేహితులు విలపించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. -
వేధింపులకు బీహెచ్ఈఎల్ ఉద్యోగిని బలి
-
వాళ్లు నన్ను చంపేస్తారు; ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఉన్నతాధికారి వేధింపులు తాళలేక బీహెచ్ఈఎల్ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లైంగిక వేధింపులకు పాల్పడి తనను చిత్రవధ చేస్తున్నారని సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రఘురాం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోపాల్‌కు చెందిన రాజుకుమారి, తులసీరాం దంపతుల కుమార్తె నేహా చౌక్సే (33) బీహెచ్ఈఎల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జైపూర్‌కు చెందిన సునీల్ కండిల్‌వాల్‌తో ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ కంపెనీలో అకౌంట్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న నేహా.. తన భర్త 2018 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు రావడంతో ఆమె కూడా ఆర్సీపురంలోని బీహెచ్ఈఎల్కు బదిలీ చేయించుకుంది. ప్రస్తుతం వీరిద్దరు మియాపూర్, ప్రజయ్‌సిటీలోని భానుటౌన్‌షిప్‌లో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో భోపాల్‌లో పని చేసే సమయంలో అదే కంపెనీలో పనిచేస్తున్న డీజీఎం నేహను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అయితే బదిలీ అయి నగరానికి వచ్చిన తర్వాత కూడా అతడి వేధింపులు కొనసాగాయి. ఇందులో భాగంగా గత కొన్నిరోజులుగా తన ఫోన్ టాపరింగ్ చేసి రికార్డింగ్ చేస్తున్నాడని నేహా నోట్లో పేర్కొంది. సదరు డీజీఎం తన పలుకుబడితో తనపై కంపెనీలో చెడుగా ప్రచారం చేస్తున్నారని మనస్తాపానికి లోనైంది. ‘ఆర్థర్ కిషోర్ కుమార్ అనే వ్యక్తి నాపై అత్యాచారానికి పాల్పడి.. చంపాలని చూస్తున్నాడు. ఆ తర్వాత నా సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ నకిలీ లేఖను సృష్టించి కేసు నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడు. ఈ నోట్‌ను నేను వాష్‌రూంలో రాస్తున్నా. నేను ఆఫీసు నుంచి వచ్చే ముందు ఓ వ్యక్తి నన్ను కలిశాడు. ఈరోజు ఎలాగైనా నాపై లైంగిక దాడికి పాల్పడతామని చెప్పాడు. గతంలో కూడా వాళ్లు ఇలాగే చేశారట. ఈ విషయం గురించి నాకు ఒకరు చెప్పారు. ఆధారాలు లేనిదే అత్యాచారాన్ని నిరూపించలేరనే ధైర్యంతో తనపై దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్పారు. వాళ్లు కచ్చితంగా నన్ను చంపేస్తారు’ అని నేహ తన డైరీలో రాసుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి ఆత్మహత్య
జవహర్‌నగర్: పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో నిర్చితార్ధం చేసుకున్న ఓ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువతి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన గోర్ల సుబ్బలక్ష్మి యాప్రాల్‌లో నివాసముంటోంది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె మల్లీశ్వరీ(24). కొన్నాళ్ల క్రితం తమ బంధువు సుధాకర్‌తో మల్లీశ్వరికి నిశ్చితార్ధం జరిగింది. ఆ తర్వాత సుధాకర్ పెళ్లి విషయాన్ని దాటవేస్తుండగంతో సుబ్బలక్ష్మి గత ఏప్రెల్‌లో జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో సుధాకర్ అంగీకరించాడు. అయితే ఈ నెల 9న నెల్లూరులో అతను మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో మల్లీశ్వరీ ఈ నెల 11న పురుగు మందు (హిట్) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణానదిలో దూకిన మహిళ
సాక్షి, కర్నూలు/శ్రీశైలం: కుటుంబ సమస్యలతో లింగాలగట్టుకు చెందిన మైలపల్లి రూతమ్మ (26) కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఆమె మృతదేహం కనిపించింది. కుమారుడు యుగంధర్ (5)తో కలిసి ఆమె కృష్ణా నదిలో దూకి ఉండవచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు యుగంధర్ ఆచూకీ లభ్యం కాలేదు. శ్రీశైలం టూ టౌన్ ఎస్ఐ చిన్నపీరయ్య తెలిపిన మేరకు.. లింగాలగట్టు గ్రామానికి చెందిన రూతమ్మ.. ప్రకాశం జిల్లా దోర్నాల గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డిని కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో రూతమ్మ లింగాలగట్టులోని ఆమె తల్లి మైలపల్లి చిన్నతల్లి, అన్న రాజుల వద్దకు వచ్చింది. తన ఇద్దరు కుమారులతో పాటు ఉంటూ చిన్న హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. శుక్రవారం రాత్రి అన్న కొడుకు పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్న సమయంలో బంధువులను ఆహ్వానించే విషయంలో రూతమ్మకు ఆమె తల్లి, అన్నల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో క్షణికావేశానికి గురైన రూతమ్మ చిన్నకుమారుడు యుగంధర్‌ను తీసుకొని వెళ్లింది. కోపంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని కుటుంబసభ్యులు భావించారు. అయితే శనివారం శ్రీశైలం బ్రిడ్జి అవతల భాగంలో ముళ్లచెట్లకు తగులుకుని రూతమ్మ మృతదేహం పైకి తేలింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్ఐ చిన్నపీరయ్య.. మృతదేహాన్ని శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రభుత్వాసుపత్రికి శనివారం సాయంత్రం తరలించారు. యుగంధర్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అదనపు కట్నం.. మహిళ బలవన్మరణం
అల్వాల్: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ. వరప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన కిషన్‌రావు కుమార్తె ప్రత్యుష (33)కు అల్వాల్ న్యూ రెడ్డి ఎన్‌క్లెవ్‌కు చెందిన శశికాంత్‌రావు అలియాస్ రాముతో 2013లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 20 లక్షల నగదు, కిలో బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. రెండేళ్ల క్రితం శశికాంత్ అదనపు కట్నం కోసం వేధించడంతో కిషన్‌రావు స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు ముట్టజెప్పాడు. అయితే మళ్లీ కొద్ది రోజులుగా ఇటీవల మళ్లీ వేధిస్తుండడంతో మనస్తాపానికిలోనైన ప్రత్యూష బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త వేధింపులతో ఆత్మహత్య
సాక్షి, బూర్గంపాడు(ఖమ్మం) : భర్త వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సారపాకలోని ముత్యాలమ్మపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యాలమ్మపేటకు చెందిన గండికోట లలిత (32) ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భద్రాచలానికి చెందిన గండికోట రాము.. సారపాకకు చెందిన లలితను పదేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఎనిమిదేళ్ల సంతోష్ అనే కుమారుడున్నాడు. ఐదేళ్ల క్రితం రాము భద్రాచలంలో మరో యువతి దుర్గను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. కొంతకాలంగా రాము మొదటి భార్య లలితను నిర్లక్ష్యం చేసి ఇంటికి రావటం లేదు. ఈ క్రమంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల పెద్దమనుషుల సమక్ష్యంలో పంచాయతీ కూడా నడిచింది. ఆదివారం భార్యాభర్తలు ఇద్దరు చర్లకు వెళ్లి సాయంత్రం తిరిగి సారపాకకు వచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరు గొడవపడి లలితను రాము కొట్టాడు. ఆ తరువాత భర్త భద్రాచలం వెళ్లేందుకు బయలుదేరాడు. దీంతో మనస్తాపానికి గురైన లలిత ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుంది. భద్రాచలం వెళ్లేందుకు బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేసిన రాము మళ్లీ ఇంట్లోకి వచ్చాడు. అప్పటికే తలుపులు వేసి ఉండటంతో రాము కిటికిలోంచి చూశాడు. ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి కిందకు దించేసరికి ఆమె కొనఊపిరితో ఉంది. వెంటనే రాము లలిత సోదరులకు ఫోన్ చేశాడు. వారు వచ్చేసరికే లలిత మృతిచెంది ఉంది. మృతురాలి సోదరుడు రమేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాంజీనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం రాలేదని పురుగుల మందు తాగి యువకుడు.. చుంచుపల్లి: మండల పరిధిలోని రామాంజనేయ కాలనీకి చెందిన ఓ యువకుడు ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రామాంజనేయ కాలనీకి చెందిన జంగం కిరణ్‌కుమార్ (29) పీజీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఈనెల 25న ఇంటి వద్ద పురుగుల మందు సేవించగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. -
ఆర్థిక ఇబ్బందులతో బ్యూటీషియన్..
కేపీహెచ్‌బీకాలనీ: ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీ నారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు గ్రామానికి చెందిన గోపాలకృష్ణ సత్య శిరీష దంపతులు నగరానికి వలస వచ్చి కేపీహెచ్‌బీకాలనీలో ఉంటున్నారు. గోపాలకృష్ణ ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తుండగా సత్య శిరీష (35) స్థానికంగా బ్యూటీ పార్లర్ నిర్వహించేది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శిరీష మనస్తాపానికిలోనై మంగళవారం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను ఆసుత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్దారించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డను బావిలో తోసి.. తల్లి ఆత్మహత్య
నెక్కొండ: భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన గొడవలు తల్లీకూతుర్ల మృతికి దారితీసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండలో శనివారం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం సూరిపల్లికి చెందిన మంగ రమేష్‌కు పర్వతగిరి మండలం గోపనపల్లికి చెందిన బెల్లం మంజుల(27)తో ఐదేళ్ల క్రింత వివాహం జరిగింది. వీరికి కూతురు నిషిత(3) జన్మించిది. రమేష్ నెక్కొండలో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ ఆర్థిక పరమైన గొడవులు జరుగుతున్నాయి. ఏడాది క్రితం మంజుల అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో నడుముకు శస్త్ర చికిత్స చేయించాడు. వైద్య ఖర్చులతో ఆర్థిక భారం పెరగడంతో కాపురంలో కలహాలు పెరిగి పంచాయితీ పెద్దమనుషుల వరకు పోయింది. వారు చెప్పిన విధంగా నడుచుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మళ్లీ గొడవ జరగడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మంజుల తన తమ్ముడు బెల్లం రాజుకు చెప్పి కూతురు నిషితను తీసుకుని నెక్కొండకు చేరుకుంది. సమీప ఊర చెరువు వద్దకు వెళ్లగా అక్కడ కొందరు వ్యక్తులు ఉండడంతో అక్కడి నుంచి ఓ వ్యవసాయ బావి వద్దకు చేరింది. ముందుగా కూతురు బావిలోకి తోసి తనూ దూకింది. పరిసరాల్లో చూసిన పలువురు తల్లీ కూతుళ్లు కనిపించకపోవడంతో బావి వద్దకు వెళ్లి పరిశీలించగా శవాలై కనిపించారు. దీంతో పోలీ సులకు సమాచారం ఇవ్వడంతో నెక్కొండ సీఐ పెద్దన్నకుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతురాలి తండ్రి బెల్లం ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కిరాతక భర్తలు..
భార్యలను ప్రేమగా చూసుకోవాల్సిన ఆ భర్తలు కిరాతకంగా మారారు. ఒకరు వివాహేతర సంబంధం నెరపుతుందనే అనుమానంతో భార్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టి హతమార్చాడు. మరొకరు అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తుండటంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తే తమ కూతురుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలు ఉభయ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నాయి.. పాల్వంచ: అనుమానం ఆమె పాలిట శాపమైంది.. భార్య వివాహేతర సంబంధం నెరుపుతుందని కక్ష పెంచుకుని కొంత కాలంగా వేధిస్తూ చివరికి ఆమెను హతమార్చిన సంఘటన పాల్వంచ మండలంలో చోటుచేసుకుంది.. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మడత రమేష్ వివరించారు. పట్టణంలోని సీతారాంపట్నం ఏరియా చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కందుకూరి శివ 15 సంవత్సరాల క్రితం భద్రాచలానికి చెందిన మేనకోడలు అరుణ (32)ను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు వారి సంసారం సాఫీగా సాగింది. సంవత్సర కాలంగా భార్య అరుణను అనుమానించడం మొదలు పెట్టాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతున్నావంటూ వేధిస్తున్నాడు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా చేశారు. అయినా మార్పు రాలేదనే కక్షతో రగిలిపోయాడు. గురువారం అర్ధరాత్రి 2గంటల సమయంలో భార్య నిద్రిస్తుండగా కర్రతో తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తల, ముఖం తీవ్రంగా పగిలి రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే శివ పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని సీఐ మడత రమేష్, ఎస్ఐ ముత్యం రమేష్ సందర్శించారు. శివ అంబేడ్కర్ సెంటర్ వద్ద ఉన్నాడనే సమాచారంతో అక్కడకు వెళ్లి పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు, ఉన్నారు. వరకట్న వేధింపులకు మహిళ బలి కారేపల్లి: వరకట్న వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండా గ్రామంలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ధర్మారంతండా గ్రామానికి చెందిన బారోతు మాలు కుమార్తె స్వాతిబాయి (22)కి, దుబ్బతండా గ్రామానికి చెందిన భూక్యా శ్రీనివాస్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా భర్త శ్రీనివాస్‌కు వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చారు. శ్రీనివాస్ మద్యానికి బానిసై తరచూ స్వాతిబాయిని అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడు. దీనిపై ఇరువురి తల్లిదండ్రుల సమక్షంలో గతంలో పంచాయతీలు జరిగాయి. అయినా తీరు మార్చు కోని శ్రీనివాస్ అదనపు కట్నం తీసుకురావాలని గురువారం రాత్రి గొడవ పడటంతో తీవ్ర మనస్తాపం చెందిన స్వాతి ఇంట్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తే హతమార్చాడు.. కుటుంబ సభ్యులు భర్తే స్వాతిని కొట్టి చంపాడని, ఆపై ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి బారోతు మాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఏఎస్ఐ కృష్ణప్రసాద్రావు కేసు నమోదు చేయగా, సింగరేణి తహసీల్దార్ సీహెచ్ స్వామి పంచనామా నిర్వహించారు. ఈ కేసు విషయమై ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజీ రమేష్ దర్యాప్తు చేపట్టారు. -
ఎన్ఆర్ఐ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు న్యూజిలాండ్ దేశంలో పెద్ద ఉద్యోగం లక్షల్లో జీతం పైగా చిన్నప్పటి నుండి తమ కళ్లముందే పెరిగిన మేనల్లుడు కావడంతో అడిగినంతా కట్నం ఇచ్చి అంగరంగా వైభవంగా కూతురునిచ్చి పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రల ఆశాలు అడియాశలయ్యాయి.. కాపురానికి వెళ్లి అల్లుడితో కలిసిమెలిసి జీవణం సాగిస్తుందనుకున్న తమ గారాలపట్టి తమ కళ్ల ముందే కాటికి పయణమవుతుందని వారు ఏనాడూ ఊహించలేదు.. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెవుల దేవయ్య భాగ్యవ్వల చిన్న కూతురు చెవుల లత (22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి దూలానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు చెవుల దేవయ్య భాగ్యవ్వల చిన్న కూతురు లత లావణ్య (అత్తింటి వారు పెట్టుకున్న పేరు)ను ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన రాజం లచ్చయ్య లచ్చవ్వల రెండో కొడుకైన తమ మేనల్లుడు రాజం రవీందర్‌తో 9 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఎకరం నర భూమితో పాటు రూ.6 లక్షల కట్నం, 15 తులాల బంగారం పెట్టి వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి తరువాత రవీందర్ తనతో పాటు భార్య లావణ్యను వెంటబెట్టుకుని తాను ఉద్యోగం చేస్తున్న న్యూజిలాండ్ దేశానికి తీసుకువెల్లాడు. ఆప్యాయంగా చూసుకోవాల్సిన భార్య లావణ్యను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. నువ్వు నాకు సరితూగవంటూ హేలన చేస్తూ తనకు వేరే స్త్రీలతో సంభందాలున్నాయని నాకు విడాకులిచ్చి నీ దారి నువ్వు చూసుకోవాలంటూ హింసించాడు. అతగాడి ఆగడాలను 6 నెలల పాటు భరించిన లావణ్య అక్కడ ఇమడలేక తల్లిగారి ఇళ్లైన లక్ష్మీపూర్‌కి న్యూజిలాండ్ నుండి వచ్చేసింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని బోరున విలపించింది. మేనల్లుడే కావడంతో లావణ్య తల్లిదండ్రులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు కానీ రవీందర్ ససేమిరా అనడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. కానీ లావణ్య భర్త రవీందర్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాధు చేసేందుకు నిరాకరించడంతో పోలీసులు ఏమి చేయలేకపోయారు. నెల రోజుల క్రితం స్వగ్రామం గొల్లపల్లికి చేరుకున్న రవీందర్‌తో పలుమార్లు పెద్ద మనుషులు పంచాయతీలు సమస్య కొలిక్కి రాలేదు. మూడు రోజుల క్రితం రవీందర్ న్యూజిలాండ్ తిరిగి వెళ్లిపోగా మనస్థాపానికి గురైన లావణ్య లక్ష్మీపూర్‌లోని తల్లిగారింట్లో ఇంటిలో ఎవరూ లేని సమయంలో బుదవారం చున్నీతో ఉరివేసుకుని ఆత్మహాత్య చేసుకుంది. పరుగులు తీసిన పోలీసులు.. లావణ్య ఆత్మహత్య చేసుకోవడం లక్ష్మీపూర్ గ్రామస్తులు తట్టుకోలేకపోయారు. ఆగ్రహానికి లోనైన బందువులు, గ్రామస్తులు లావణ్య మృతదేహంతో ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని అత్తింటివారి ఇంటి ముందు ధర్నా చేయాలని నిశ్చయించుకున్నారు. తంగళ్లపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రకి తరలిస్తున్న క్రమంలో పోలీసు వాహనం వెనక వస్తుండగానే పోస్టుమార్టం కాకముందే పోలీసుల కళ్లు గప్పి ఎల్లారెడ్డిపేట వైపు తరలించారు. విషయం తెలుసుకున్న తంగళ్లపల్లి పోలీసులు ఉరుకులు, పరుగులు పెడుతూ అంబులెన్స్ వాహనాన్ని మార్గమధ్యమంలో ఆపిన తంగళ్లపల్లి ఎస్సై వి.శేఖర్ గ్రామస్తులకు నచ్చజె ప్పి తిరిగి ఆసుపత్రికి తరలించారు. లావణ్య కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాధు మేరకు ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. -
ఇది దొంగలు చేసిన కీడు!
శకునాలు, అపశకునాలంటే ఎంతో గురి ఉన్న ఆ వ్యక్తి తామున్న ప్రాంతంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడాన్ని కీడుగా భావించాడు. తమ ఇంటిపై ఆ కీడు పడకుండా ఉండాలని కుటుంబ సభ్యులందరినీ ఓ ఆలయంలో నిద్రించి రావాలని వేరే ప్రాంతానికి పంపాడు. ఆయనేమో తన భవనంపై చల్లగా ఉంటుందని పడుకుని నిద్రించాడు. ఇదే అవకాశంగా దొంగలు పడి పెద్ద కీడే చేశారు! నగా నట్రా డబ్బూ మొత్తం ఊడ్చేశారు. చిత్తూరు అర్బన్ : స్థానిక సాయినగర్ కాలనీ ఎక్స్‌టెన్షన్‌లోని ఓ ఇంటిని దొంగలు ఓ చూపుచూశారు. ఆదివారం అర్ధరాత్రి రూ.19లక్షల విలువ చేసే 80 సవర్ల బంగారంతోపాటు రూ.1.50లక్షలు చోరీ చేశారు. కూతవేటు దూరంలోనే ఎస్పీ నివాసం, క్రైమ్ స్టేషన్‌తో పాటు మరో రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నా దొంగలు దర్జాగా తమ పనికానిచ్చేశారు. బాధితులు, పోలీసు కథనం.. చిత్తూరులోని రాములగుడివీధికి చెందిన ఓ కాఫీ పౌడర్ దుకాణ యజమాని యోగీశ్వరన్ సాయినగర్ కాలనీ ఎక్స్టెన్షన్లో కాపురముంటున్నాడు. ఇటీవల వారి నివాస ప్రాంతం సమీపంలో అమర్‌రాజా ఫ్యాక్టరీలో పనిచేసే ఉమామహేశ్వరి అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని కీడుగా భావించి యోగీశ్వరన్ శాంతి కోసం తన తల్లి, భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆలయంలో నిద్రించి రావాలని చెన్నైకు పంపించాడు. ఆదివారం రాత్రి యోగీశ్వరన్ ఇంటి మిద్దెపైన పడుకున్నాడు. ఉదయం కిందకు వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటం చూసి ఆందోళన చెందాడు. తీరా ఇంట్లో చూడగా బీరువాను పగులగొట్టి దాదాపు రూ.19 లక్షల విలువ చేసే 80 సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రూ.1.50 లక్షల నగదు సైతం చోరీ చేసినట్లు గుర్తించి బావురుమన్నాడు. చోరీకి గురైన నగలన్నీ రెండు తరాల క్రితం నాటివని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిత్తూరు క్రైమ్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో వెళ్లి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. అలాగే, క్లూస్ టీమ్ పోలీసులు వేలిముద్రలు సేకరించారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. -
అనుమానమే పెనుభూతమై..
రెబ్బెన(ఆసిఫాబాద్): కట్టుకున్న భార్యపై ఉన్న అనుమానానికి తోడు అదనపు కట్నంకోసం జీవితాంతం తోడుగా నిలవాల్చిన భర్తే భార్యను కడతేర్చిన సంఘటన రెబ్బెన మండలం నారాయణపూర్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నారాయణపూర్ గ్రామానికి చెందిన కుడికాలు రామకృష్ణ ఆటోడ్రైవర్. ఈయనకు తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన సరిత (27)తో 2011లో వివాహమైంది. వీరికి అరవింద్ (7), శ్రీనిధి(5) పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. రెండేళ్లుగా రామకృష్ణ భార్య సరితపై అనుమానం పెంచుకున్నాడు. అప్పటినుంచి కలహాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలోనే రామకృష్ణ తల్లి కమల, తండ్రి హన్మంతుతో కలిసి సరితను అదనపు కట్నంకోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. నారాయణపూర్ గ్రామంలో సరిత పేరుపై రెండెకరాల వ్యవసాయ భూమి ఉండగా.. దానిని అమ్మాలని ఒత్తిడి తెచ్చారు. దానికి సరిత ససేమిరా అనటంతో వేధింపులు మరింత అధికమయ్యాయి. దీంతో ఎలాగైనా సరితను అంతమొందించాలనే పథకం పన్నిన రామకృష్ణ.. తల్లిదండ్రుల ప్రోద్బలంతో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పడుకుని ఉన్న సరిత తలపై బలమైన ఆయుధంతో మోదడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రెబ్బెన సీఐ రమణమూర్తి, ఆసిఫాబాద్ సీఐ మల్లయ్య, ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలి తమ్ముడు ములుకుట్ల లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆమె ప్రేమ యవ్వారం ఈమె ప్రాణాల మీదకు తెచ్చింది!
మదనపల్లె టౌన్ : చిన్ననాటి స్నేహితురాలు అదృశ్యం ఓ అమాయక యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. అదృశ్యమైన అమ్మాయి కుటుంబ సభ్యుల వేధింపులు, సూటిపోటి మాటలకు ఆమె కుంగిపోయింది. వీరి నడుమ ఉంటే తనకే ముప్పు తప్పదని తన బిడ్డతో పాటు ఊరు వదిలి దూరాన ఉన్న పెదనాన్న ఇంటికి వచ్చినా వేధింపుల పర్వకం ఆగలేవు. దీంతో ఆమె ఉరేసుకుని బలవన్మరణం చెందింది. శుక్రవారం రాత్రి మదనపల్లెలో ఈ విషాద సంఘటనకు చోటుచేసుకుంది. రెండో పట్టణ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం..ములకలచెరవు మండలం పాళ్యంవారిపల్లెకు చెందిన గంగరాజు ఐదేళ్లక్రితం మదనపల్లె మండలం బొమ్మన చెరువుకు చెందిన భవాని(22)ని వివాహం చేసుకున్నాడు. కారుడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భవాని పినతల్లికి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో ఆమె తోడుగా ఉండేందుకు రెండు నెలల క్రితం పుట్టినిల్లు అయిన బొమ్మన చెరువుకు వచ్చింది. గ్రామంలో ఉన్న ఓ యువతి భవానికి చిన్ననాటి స్నేహితురాలు. ఆమెకు కూడా వివాహమైంది. అయితే ఆ యువతి కట్టుకున్న భర్తను కాదని ఆదే గ్రామానికి చెందిన మరో యువకుని ప్రేమలో పడింది. వాళ్లిద్దరూ ఇష్టపడి కొంతకాలం సహజీవనం సాగించినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన భవాని స్నేహితురాలు తన ప్రియునితో కలసి పది రోజుల క్రితం అదృశ్యమైంది. దీనికి భవానీయే కారణమంటూ ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెను వేధించసాగారు. అంతుచూస్తామని బెదిరించడంతో ఆందోళన చెందిన భవాని తన పిన తండ్రి ఉంటున్న స్థానిక అనపగుట్టకు చేరుకుని తలదాచుకుంది. అయిననూ అక్కడికి వచ్చి సైతం వారు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైంది. ఇక చావే శరణ్యమని భావించిన భవాని మరణాన్ని ఆశ్రయించింది. సూసైడ్ నోట రాసి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందడంతో టుటౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామ నిర్వహించి మృతదేహాన్ని స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై హత్యకేసు నమోదు చేయాలి ప్రియుని మోజులో పడి వెళ్లిపోయిన యువతి కుటుంబ సభ్యులు ఏ పాపం తెలియని తన భార్య బలవన్మరణానికి కారణమయ్యారని భవాని భర్త విలపించారు. వారిపై హత్యకేసు నమోదు చేయాలని గంగరాజుతో పాటు మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. శనివారం ఉదయం టూటౌన్ స్టేషన్‌కు వచ్చి కన్నీరు మున్నీరు అయ్యారు. విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇచ్చారు. మృతురాలికి మూడేళ్ల కుమారుడు యశ్వంత్ ఉన్నాడు. -
కుమార్తెలకు పెళ్లికావడం లేదని..
రసూల్‌పురా:కుమార్తెలకు వివాహం జరగడం లేదని మనస్తాపానికిలోనైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయికిరణ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబోయిన్‌పల్లి కోయబస్తీకి చెందిన నర్సమ్మ (35) మల్కాజిగిరి సబ్రిజిష్ట్రర్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేసేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెళ్లీడు వచ్చినా తన కుమార్తెలకు సంబంధాలు కుదరడం లేదని గత కొన్ని రోజులుగా బాధపడుతోంది. ఈ విషయమై ఈనెల 23న బంధువులతో గొడవపడగా, వారు ఆమెను మందలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గదిలోకి వెళ్లిన నర్సమ్మ చీరతో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను బాలనగర్ లోని బీబీఆర్ ఆసుపత్రిలో తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కూకట్‌పల్లిలో ఓ మహిళ ఆత్మహత్య
-
భర్త వేధింపులు భరించలేక...
ఆసిఫాబాద్: అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గుండి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ మల్లయ్య కథనం ప్రకారం వాంకిడి మండలం జైత్పూర్ గ్రామానికి చెందిన కోలె రమేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. ఏడాది కిందట పెద్ద కుమార్తె కోలె సౌందర్య(20)ను ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన పులుగం గురుమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహ సమయంలో రూ.3 లక్షల నగదు, ఒక తులం బంగారంతోపాటు లాంఛనాలు ఇచ్చారు. కొన్ని నెలలు కాపురం సజావుగానే సాగినా.. నాలుగు నెలలుగా మరో రూ.3 లక్షల అదనపు కట్నంతోపాటు కళ్యాణలక్ష్మీ డబ్బులు కూడా తనకే ఇవ్వాలని సౌందర్యను భర్తపాటు అత్తామామలు పులుగం నాగయ్య, విమలాబాయి మానసికంగా శారీరకంగా వేధించారని తెలిపారు. సౌందర్య ఈ వేధింపులు భరించలేక బుధవారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అనుమానాస్పదంగా వివాహిత మృతి
బాన్సువాడ: మూడు రోజుల క్రితం కరెంట్ షాక్‌తో మృతిచెందిన ఓ వివాహితను హత్య చేశారంటూ బంధుమిత్రులు, తండావాసులు శవాన్ని ఏరియా ఆసుపత్రిలో ఉంచి, వివాహిత సోదరుడు వచ్చే వరకు పోస్టుమార్టం చేయకుండా ఆపేశారు. ఇండియన్ ఆర్మీలో ఉండే వివాహిత సోదరుడు మంగళవారం నాడు బాన్సువాడకు రాగా, వీడియోగ్రఫీ మధ్య శవాన్ని పోస్టుమార్టం చేశారు. బాన్సువాడ సీఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజాంసాగర్ మండలం సింగీతం జీపీ పరిధిలోని శనివార్‌పేట తండాకు చెందిన నెనావత్ గోపాల్‌కు 9 ఏళ్ళక్రితం గండివేట్ తండాకు చెందిన వినావత్ వినోద(29)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే తరచుగా అత్తామామలు అదనపు కట్నం కోసం వేధించేవారు. అలాగే భూమి విషయంలోనూ తరచుగా గొడవలు జరిగేవి. అయితే వినోద భర్త హైదరాబాద్‌లో ఉండగా, ఆదివారం నాడు వినోదకు కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు అత్తామామలు చుట్టుపక్కల వారికి తెలియజేశారు. పొలంలో వెళ్తుండగా, కరెంటు వైరు తగిలి మృతి చెందినట్లు చెప్పడంతో, తండావాసులకు అనుమానాలు వచ్చి ఆమె శవాన్ని పోస్టుమార్టం చేయకుండా నిలిపివేశారు. శవాన్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వినోద అన్నయ్య అయిన కిషన్ ఇండియన్ ఆర్మీలో పని చేస్తాడని, అతను వచ్చే వరకు శవానికి పోస్టుమార్టం చేయవద్దంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆది, సోమ, మంగళవారాల్లో శవాన్ని పోస్టుమార్టం గదిలో డీఫ్రిజ్‌లో శవాన్ని భద్రపర్చారు. కిషన్ బాన్సువాడకు రాగా, సీఐ మహేష్‌గౌడ్ సమక్షంలో వీడియోగ్రఫీ మధ్య పోస్టుమార్టం నిర్వహించారు. తన చెల్లెలు కరెంటు షాక్‌తో మృతి చెందలేదని, భర్త, అత్తామామలే చంపేశారని, కరెంటు షాక్‌తో మృతి చెందినట్లు చెబుతున్నారని కిషన్ విలేకరులతో ఆరోపించారు. తనకు స్థానిక పోలీసులు, వైద్యులపై నమ్మకం లేదని, శవానికి సరిగా పోస్టుమార్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ, తండావాసులను సముదాయించి పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయి విచారణ జరుపుతామని, దోషులెవరైనా పట్టుకొట్టామని సీఐ మహేష్‌గౌడ్ పేర్కొన్నారు. -
వివాహమైన నెలరోజులకే...
ఆలేరు, నల్గొండ : పెళ్లయి నెల రోజులైంది. పెళ్లి సమయంలో ఒప్పుకున్న కట్నం డబ్బు తేవాలని భర్తతోపాటు అత్తామామ వేధించసాగారు. సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన ఆ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. కొల్లూరుకు చెందిన బుసిగంపల నర్సయ్య, శోభ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతను వృత్తిరీత్యా గీతకార్మికుడు. ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. చిన్న కూతురైన మానస(22)ను రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, గుల్కాపూర్‌కు చెందిన నోముల జ్ఞానేశ్వర్, జ్యోతిల కుమారుడు నోముల విక్రం అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. డిసెంబర్ 14న వీరి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం కింద లక్ష రూపాయలు ఇచ్చారు. మరికొంత తర్వాత ఇస్తామని ఒప్పుకున్నారు. పెళ్లి అయిన ఐదు రోజులకే విక్రం తన భార్య మానసను దుర్భాషలాడి చేయి చేసుకున్నాడు. మిగతా కట్నం కోసం మానసను అత్తామామలు వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టిల్లు కొల్లూరుకు చేరుకుంది. నెల రోజులుగా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. మానసను తీసుకెళ్లేందుకు అత్తామామ, భర్త విక్రం మంగళవారం కొల్లూరుకు చేరుకున్నారు. మానసను సూటిపోటీ మాటలు అనడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మానస ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు మానసను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ మేరకు మానస తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అత్తామామలు, భర్త, ఆడపడుచులు వేధించడం వల్లే తన కుమార్తె ఉరేసుకొని చనిపోయిందని మానస తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు. -
ఆడపిల్లల మనసు అర్థం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్ : ‘బాల్యవివాహాలు చేయకండి.. ఆడపిల్లల మనసు అర్థంచేసుకోండి.. రోజూ ఏడ్చుకుంటూ వుండలేను...అందుకే వెళ్లిపోతున్నా... అందరూ నన్ను క్షమించండి...’ అంటూ జీవితంపై విరక్తి చెందిన ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఎల్ కాలనీ గాయత్రిపురంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన నర్సయ్య, లక్ష్మి దంపతుల కూతురు గీతాంజలి (26)కి ఖడెం మండలం లక్ష్మీపురానికి చెందిన శంకర్‌తో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. శంకర్ మహారాష్ట్రలో ప్రయివేటు లెక్చరర్‌గా చేస్తుంటాడు. శనివారం సాయంత్రం గీతాంజలి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గీతాంజలి రాసిన ఏడు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్న తనంలోనే వివాహం చేయటం.... అర్ధం చేసుకోలేని భర్త...చదువుకుని ఉద్యోగం చేయాలన్న కల నెరవేరలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ వల్ల అర్ధం అవుతుందని పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ చివర తన పేరు గీతాంజలి, ఐపీఎస్ అని వ్రాసింది, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య
జూలపల్లి(పెద్దపల్లి): మండలంలోని కుమ్మరికుంటకు అనుబంధ గ్రామమైన గొల్లపల్లికి చెందిన తమ్మడవేని లక్ష్మి(32) భర్త,అత్త,మామ, బావల వేధింపులతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పాలకుర్తి మండలం పూట్నురుకు చెందిన లక్ష్మికి 16ఏళ్ల క్రితం గొల్లపల్లికి చెందిన రాజుతో వివాహమైంది. వీరికి 12ఏళ్ల కొడుకు, 11 ఏళ్ల కూతురు ఉంది. లక్ష్మి మాజీ ఉపసర్పంచ్. ఇంటిపని విషయమై లక్ష్మిని ఆమె కుటుంబసభ్యులు తరుచూ వేధించేవారు. అనేకసార్లు గొడవలతో పంచాయితీలు జరిగాయి. ఇదే విషయమై ఈ నెల 7న లక్ష్మిని భర్త రాజు కొట్టాడు. ఇంట్లో నుంచి పోయిన లక్ష్మి ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారంఉదయం గాలించగా మృతదేహం లభ్యమైంది. భర్త రాజు, బావ కొంరయ్య, అత్త గట్టమ్మ, మామ పోచాలుల వేధింపులతోనే లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని మేనమామ కాల్వ మల్లయ్య చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కేసు భయంతో ప్రాణం తీసుకుంది
సారంగాపూర్(జగిత్యాల): మండలంలోని పోతా రం గ్రామానికి చెందిన తులసి అనంతమ్మ(45) పోలీసుకేసు భయంతో ఈనెల 27న పురుగుల మందుతాగింది. చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. అనంతమ్మ మృతికి కారణమం టూ గ్రామానికి చెందిన లింగం మల్లేశం ఇంటిఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. మృతురాలి కటుంబసభ్యుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తులసి అనంతమ్మకు చెందిన కోడిని పిల్లి నోటకరుచుకుని పారిపోయింది. గమనించిన అనంతమ్మ వెంబడించింది. పక్కనే ఉన్న మేడి మల్లీశ్వరి ఇంటివైపు పిల్లి వెళ్లింది. అనంతమ్మ తన చేతిలోని కర్రను పిల్లి వైపు విసిరింది. అది మల్లీశ్వరి ఇంటిఎదుట ఉన్న మిరపచెట్లకు తాకింది. తనపై దాడి చేసేందుకే అనంతమ్మ కర్ర విసిరిందని మల్లీశ్వరి గొడవకు దిగింది. ఇద్దరిమధ్య వివాదం ముదిరింది. మల్లీశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనంతమ్మపై ఈనెల 24న 290,323 పెట్టీ కేసు నమోదు చేశారు. ఒక్కసారి స్టేషన్‌కు హాజరైంది. మరోసారి పోలీసులు పిలవగా వెళ్లలేదు. ఒకింత భయాందోళనకు గురై ఈనెల 27న తనఇంట్లో పురుగుల మందు, చీమలమందు కలుపుకుని తాగింది. గమనించిన కుటుంబసభ్యులు జగిత్యాలలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతు శనివారం ఉదయం చనిపోయింది. మృతదేహంతో ఆందోళన మృతదేహాన్ని నేరుగా గ్రామానికి తీసుకొచ్చారు. తప్పుడు ఫిర్యాదు చేయడంతోనే అనంతమ్మ ఆత్మహత్య చేసుకుందని, ఈ కేసులో ప్రమేయం ఉన్న మల్లీశ్వరి, పెద్దమనిషిగా వ్యవహరించిన లింగం మల్లేశంతో, పాటు మరోఇద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు లింగం మల్లేశం ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆం దోళన చేశారు. విషయం తెలుసుకుని ఎస్సై రాజయ్య అక్కడికి చేరుకొని, మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. నలుగురిపై కేసు.. అనంతమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడి మల్లీశ్వరి, లింగం మల్లేశంతో పాటు కేసులో సాకు‡్ష్యలుగా వ్యవహరించిన గొల్లపల్లి రాయలింగు, బుర్ర పోషమల్లుపై ఐపీసీ 306 కింద కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
బిడ్డకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
తమిళనాడు, సేలం: ఆడపడచు ఆత్మహత్యకు కారణమంటూ భర్త తిట్టాడనే ఆవేదనతో పది నెలల కుమార్తెకు పురుగుల మందు తాపించి, ఆ తర్వాత తానూ తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సేలంలో బుధవారం చోటు చేసుకుంది. నామక్కల్ జిల్లా రాసిపురం సమీపంలోని వేపిల్లై కుట్టంకు చెందిన కూలీ కాట్టముత్తు (26). ఇతని భార్య కౌసల్య (20). వీరి కుమార్తె ప్రతీషా (10 నెలలు). కాట్టముత్తు చెల్లెలు ఇలవరసి కుటుంబ తగాదాల కారణంగా ఈ నెల 26వ తేదీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. ఆ సమయంలో తన చెల్లెలు మృతికి కౌసల్యనే కారణమంటూ భార్యను కాట్టముత్తు తిట్టాడు. దీంతో కౌసల్య తీవ్ర ఆవేదనకు గురైంది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత కౌసల్య తన కుమార్తె ప్రతీషాను తీసుకుని ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. తిరిగి తానే వస్తుందిలే అనుకుని కాట్టముత్తు ఉన్నాడు. అయితే రాత్రి పొద్దుపోయినప్పటికీ కౌసల్య ఇంటికి రాలేదు. దీంతో బుధవారం ఉదయం ఆమె కోసం గాలించగా, కౌసల్య, ఆమె కుమార్తె ప్రతీషా మృతదేహాలు సమీపంలోని దిమ్మనాయకంపట్టిలో ఉన్న మొక్కజొన్న తోటలో లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న మంగళంపల్లి పోలీసు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వారి మృత దేహాలను స్వాధీనం చేసుకుని శవ పంచనామా నిమిత్తం నామక్కల్ జీహెచ్‌కు తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ముందు ప్రతీషాకు పురుగుల మందు తాపించి, ఆ తర్వాత కౌసల్య కూడా తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
చిత్తూరు, తొట్టంబేడు: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తొట్టంబేడు మండలం చిన్నకన్నలి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. టూటౌన్ ఎస్ఐ జయశ్యామ్ కథనం మేరకు.. చిన్నకన్నలి గ్రామానికి చెందిన కిలారి రామానాయుడు, ఆయన భార్య స్వప్న(36) మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ నేపథ్యంలో స్వప్న మంగళవవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్ట్‌మార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కూతురు నిలదీసిందని.. తల్లి ఆత్మహత్య
జూలూరుపాడు ఖమ్మం: ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ శివాజీ గణేష్ తెలిపిన వివరాలు... గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో దినసరి కూలీగా పనిచేస్తున్న సూర్నపాక కమల(38), పడమటనర్సాపురంలో నివాసముంటోంది. ఆమెకు ఇరయ్యేళ్ల క్రితం పెళ్లయింది. కుమారడు, కూతురు ఉన్నారు. భర్తతో గొడవపడి కొంతకాలంగా పడమటనర్సాపురంలో కూతురు కావ్యతో వేరుగా ఉంటోంది. గత నెల 31న ఆమె కూతురు కావ్య, తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఈ నెల 3న (శనివారం) తిరిగొచ్చేసరికి ఇంటిలో కమలతో మరో వ్యక్తి ఉన్నాడు. తల్లిని కూతురు నిలదీసింది. దీనిని తట్టుకోలేని కమల, ఆదివారం తెల్లవారు జామున గడ్డి మందు తాగింది. కొత్తగూడెం ప్రభుత్వ మెయిన్ ఆసుపత్రిలో మృతిచెందింది. ఆమె సోదరి జబ్బా వెంకటలక్ష్మి ఫిర్యాదుతో కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాల్వచంలో వివాహిత... పాల్వంచ: కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని గట్టాయిగూడెంలో ఇది జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గట్టాయిగూడెంలోని అద్దె ఇంటిలో కేటీపీఎస్ ఉద్యోగి దేవబక్తిని శ్రీకాంత్ కుటుంబం నివసిస్తోంది. కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో ఆయన భార్య కవిత(35), ఆదివారం చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని ఎస్ఐలు ఎం.రమేష్, రవి సందర్శించారు. -
భర్త కలలోకి వస్తున్నాడని...
పతినే ప్రాణంగా భావించింది... ఆయన లేడన్న నిజం నిత్యం తనను బాధించింది.. ఆర్నెళ్ల నుంచి కన్నీరుమున్నీరుగా విలపించింది.. ముగ్గురు పిల్లల పోషణ భారమైంది... చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం పిల్లల పాలిట శాపమైంది.. తాను ఆత్మహత్యకు పాల్పడి పిల్లలను అనాథలను చేసింది. ఈఘటన శనివారం ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.పతినే ప్రాణంగా భావించింది... ఆయన లేడన్న నిజం నిత్యం తనను బాధించింది.. ఆర్నెళ్ల నుంచి కన్నీరుమున్నీరుగా విలపించింది.. ముగ్గురు పిల్లల పోషణ భారమైంది... చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం పిల్లల పాలిట శాపమైంది.. తాను ఆత్మహత్యకు పాల్పడి పిల్లలను అనాథలను చేసింది. ఈఘటన శనివారం ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు క్రైం: భర్త లేడన్న బాధతో చౌడు శ్రీలక్ష్మి (44) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని ఆచార్లకాలనీ, శ్రీనివాసపురంలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భర్త సుధాకర్ ఆరు నెలల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన భార్య శ్రీలక్ష్మి తీవ్ర మనోవేదనతో బాధపడుతూ ఉండేది. రాత్రి వేళల్లో భర్త కలలోకి వస్తున్నాడని, అతను పక్కనే ఉన్నట్లు తనకు అనిపిస్తోందని పిల్లలతో చెప్పేది. కుమార్తెలు, బంధువులు ఆమెకు ధైర్యం చెబుతూ వచ్చేవారు. ఈ క్రమంలో వారి ఇంటి పక్కన ఒక మహిళ శనివారం మృతి చెందడంతో ఉదయం 6 గంటల సమయంలో ఆమె నిద్రలేచి మృతదేహాన్ని కూడా చూశారు. అయితే 6.30 గంటల తర్వాత కుమార్తెలు నిద్రలేచి చూస్తే తల్లి బెడ్రూంలో కనిపించలేదు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ ఉంది. పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న బంధువులు వచ్చి చూడగా ఆమె మృతి చెందింది. కాటేసిన మద్యం చౌడు సుధాకర్ చేనేత పని చేసేవాడు. గతంలో అతను మద్యం బాగా తాగేవాడు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. మద్యం తాగడం మానుకోవాలని ఆమె భర్తను కోరేది. భార్య అభ్యర్థన మేరకు సుధాకర్ మద్యం తాగడం మానేశాడు. కొన్ని నెలల తర్వాత బంధువుల పెళ్లికి వెళ్లిన సుధాకర్ మద్యం సేవించి నడవలేని స్థితిలో ఇంటికి వచ్చాడు. అతన్ని చూసిన శ్రీలక్ష్మి తీవ్ర ఆవేదన చెందారు. తాగనని చెప్పి మళ్లీ తాగి ఇంటికి వస్తారా అంటూ భర్తతో చెప్పారు. తాగనని మాట ఇచ్చి మద్యం తాగి రావడం, భార్య బాధ పడటం చూసిన అతను ఆవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలోనే మగ్గం కొయ్యకు చీర కట్టుకొని ఈ ఏడాది ఏప్రిల్ 20న ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తను ఎంతగానో ప్రేమించే శ్రీలక్ష్మి ఆయన మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయింది. భర్త దూరమైన నాటి నుంచి ఆమె దిగులుగా ఉంటోంది. పిల్లలే ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెబుతూ వచ్చేవారు. ఈ క్రమంలో భర్త ఆత్మహత్య చేసుకున్న చోటే ఆమె కూడా మగ్గం కొయ్యకు చీర కట్టుకొని ఉరి వేసుకుంది. అర్బన్ సీఐ జయానాయక్, ఎస్ఐ కృష్ణంరాజునాయక్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. అనాథలైన పిల్లలు... ఆర్నేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సుధాకర్, శ్రీలక్ష్మికి ధరణి, చరణి ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు కార్తీ్తక్ ఉన్నాడు. ధరణి బీటెక్, చరణి తొమ్మిది, కుమారుడు ఆరో తరగతి చదువుతున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కుమార్తెలు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోధన అక్కడి వారిని కలచివేసింది. ఒంటరి వారిని చేసి వెళ్లిపోయారా అంటూ గుండెలు పగిలిలేలా విలపించారు. -
పంట దూరమై.. బతుకు భారమై
ఒక ప్రాణం బలైపోయింది. తిత్లీ మిగిల్చిన విషాదాన్ని పెంచుతూ ఓ అభాగ్యురాలు ఊపిరి ఆపుకుంది. తుఫాన్ ధాటికి ధ్వంసమైపోయిన జీడి పంటను చూసి బతుకుపై ఆశలు వదులుకుంది. నాశనమైపోయిన ఆ తోటను చూసి ఆ గుండె తట్టుకోలేకపోయింది. రాకాసి గాలుల ధాటికి నిలువెల్లా చీలిపోయిన చెట్లను చూసి, దిగుబడి ఇక ఉండదనే నిజం తెలిసి సైని నారాయణమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. వజ్రపుకొత్తూరు రూరల్: తిత్లీ మిగిల్చిన విషాదం ప్రాణాలు తోడేస్తోంది. నాశనమైన తోటలు చూడలేక ఉద్దానం బిడ్డలు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో జీడి రైతు సైని నారాయణమ్మ(49) జీడి పంటను పోగొట్టుకుని తట్టుకోలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. కళ్ల ముందే తిత్లీ తుఫాన్ ప్రభావంతో పంట నాశనం కావడంతో దీన్ని జీర్జించుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. తరతరాలుగా తమ సాగులో ఉన్న 2.50 ఎకరాల జీడి పంట తుఫాన్ సృష్టించిన బీభత్సానికి పూర్తిగా పడిపోయింది. పంట సాగు చేసేందుకు చేసిన అప్పులు తీర్చలేక, కళ్ల ముందే మోడు బారిన చెట్లను చూడలేక బతుకు భయంతో ఆమె చనిపోయినట్లు వారు తెలిపారు. పంటను చూడలేక.. ప్రస్తుతం గ్రామాల్లో జరిగిన పంట నష్టాన్ని అధికారులు నమోదు చేస్తుండటంతో మృతురాలి పెద్ద కుమారుడు దిలీప్ కుమార్ స్వగ్రామానికి రెండు రోజుల కిందటే వచ్చారు. శుక్రవారం ఉదయం తల్లితో కలిసి తోటను చూడడానికి వెళ్లారు. అయితే కనుచూపు మేరకు ఎండిన మోడులు కనిపించడంతో ఆమె భరించలేక ఇంటికి వెళ్లిపోయారు. కుమారుడు తోట చూసి కొద్ది సేపటికి ఇంటికి చేరారు. అప్పటికే ఆమె ఇంటి దూలానికి ఉరి వేసుకుని ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. చుట్టుపక్కల వారి సాయంతో ఆమెను కిందకు దించారు. బతుకంతా కష్టమే.. నారాయణమ్మ కుటుంబానికి జీడితోటే ఆధారం. ఆమె భర్త ఆనందరావు ఏడేళ్ల కిందట చనిపోయారు. దీంతో ఇక్కడ అంతగా ఆదాయం లేక నారాయణమ్మ ఇద్దరు కుమారులు విజయవాడలో ప్రైవేట్ కంపెనీలో పనులు చేసుకుంటున్నా రు. దీంతో మృతురాలు చినవంకలో ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడు తుఫాన్ ధాటికి పంట పోవడంతో అప్పులు తీర్చలేనేమోనని ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పండగ పూట విషాదం దసరా పండగ నాడు ఆనందంగా గడపాల్చిన చినవంకలో ఆమె మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. తుఫాన్ తాకిడితో సర్వం కోల్పోయిన వారు తమకు తోచిన మేరకు పంటను జరుపుకోవడానికి సిద్ధమవుతుండగా ఈ వార్త తెలియడంతో అంతా విషాదంలోకి వెళ్లిపోయారు. మృతిరాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ రూరల్ సీఐ తాతారావు, స్థానిక ఎస్సై కె.వి సురేష్‌లు సంఘటన స్థలానికి చేరుకోని మృతి జరిగిన తీరును పరిశీలించారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. బతుకుతెరువు లేదని బాధపడింది రెండురోజుల క్రితం ఊరు వచ్చాను. అమ్మ నాతో ఆడిన చివరి మాటలు అయ్యా మన జీడి తోట పూర్తిగా పోయింది. మన కు ఇక బతుకుతెరువు లేదు అని బాధపడింది. శుక్రవారం ఇద్దరం కలిసి తోటకి వెళ్లాం. అమ్మ ముందుగానే తిరి గి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది సేపు అయిన తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇంతలో అమ్మ చనిపోయి కనిపించింది. గతంలో తం డ్రి.. ఇప్పు తల్లి కూడా మాకు దూరమైంది. సైని దీలిఫ్‌కుమార్, మృతురాలి కుమారుడు -
ప్రేమ పేరుతో బెదిరింపుల కారణంగానే...
సాక్ష, ఇల్లెందు(ఖమ్మం): పట్టణంలోని నెంబర్–2 బస్తీకి చెందిన ఎం.సంధ్య(19) ఆత్మహత్యకు ఓ యువకుడి వేధింపులు, బెదిరింపులే కారణమని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆమె సోమవారం మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడుపు నొప్పి భరించలేకనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదంటూ అదే రోజు రాత్రి తండ్రి శ్రీనివాస గౌడ్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత, తన కుమార్తె ఆత్మహత్యకు ఓ యువకుడి వేధింపులు, బెదిరింపులే కారణమంటూ మరోసారి ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం, ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ప్రధాన రహదారిపై ఆమె కుటుంబీకులు బైఠాయించారు. ఇల్లెందు పట్టణంలోని నెంబర్–2 బస్తీకి చెందిన సిద్ధూ అనే యువకుడి వేధింపులు, ప్రేమ పేరుతో బెదిరింపుల కారణంగానే సంధ్య ప్రాణం తీసుకుందని ఆరోపించారు. ఆమె తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లైన నెల రోజులకే.. నవ వధువు ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా/ లావేరు: పెళ్లయిన నెల రోజులుకే నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెంలో చోటుచేసుకుంది. వధువు సోదరుడు లంకలపల్లి కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..లావేరు గ్రామానికి చెందిన లంకలపల్లి సూర్యనారాయణ, గోవిందమ్మ దంపతుల మూడో కుమార్తె రోహిణి(25)ని ఆమదాలవలస పట్టణంలోని పెంటయ్యకాలనీకు చెందిన యర్నాగుల వెంకటరావు, వెంకటరత్నం దంపతుల కుమారుడు మోహన్‌కుమార్‌తో ఈ ఏడాది ఆగస్టు 25న వివాహం చేశారు. మోహన్‌కుమార్ విశాఖపట్నం జిల్లా పరవాడలో ఫార్మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 3న విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంలో అపార్టుమెంటును అద్దెకు తీసుకొని నూతన దంపతులు ఉంటున్నారు. ఈ నెల 27న సాయంత్రం మోహన్‌కుమార్ డ్యూటీ నుంచి అపార్టుమెంటుకు తిరిగి రాగా భార్య రోహిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని లావేరులోని అత్తమామాలుకు ఫోన్లో తెలియజేయడంతో వారు గురువారం రాత్రి అపార్టుమెంటుకు చేరుకుని బోరున విలపించారు. రోహిణి సోదరుడు, కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సమయంలోనే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులు తట్టుకోలేకే: రోహిణి కుటుంబ సభ్యులు భర్త మోహన్‌కుమార్ వేధింపులు తట్టుకోలేకే రోహిణి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు సూర్యనారాయణ, గోవిందమ్మ, సోదరుడు కృష్ణలు శుక్రవారం ‘సాక్షి’తో తెలిపారు. కట్నకానుకలు బాగానే ఇచ్చి పెళ్లి చేశామని, పెళ్లి సరదాలు తీరకముందే వేధింపులకు కుమార్తె బలైపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. తనతో చనువుగా ఉండటం లేదని కుమార్తె చెప్పినా..సర్దుకుంటారులే అని అనుకున్నామని, ఇంతలోనే ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. దీనికంతటికీ కారణమైన మోహన్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం లావేరు తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పెళైన రెండు నెలలకే!
పెగడపల్లి(ధర్మపురి): పెళ్లయిన రెండు నెలలకే ఓ యువతి తనువు చాలించింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికనపల్లిలో శనివారం జరిగింది. ఇన్చార్జి ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి నాగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి–లక్ష్మి దంపతుల కుమారుడు సురేందర్‌రెడ్డికి వెల్గటూర్ మండలం జగదేవ్‌పేట గ్రామానికి చెందిన లోక మల్లారెడ్డి–గంగవ్వ కూతరు నిరోజ(20)తో 2018, జూన్ 7న వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.లక్ష నగదు, మూడు తులాల బంగారం, 30 గుంటల భూమి కట్నం కింద ఇచ్చారు. పెళ్లయిన కొద్దిరోజులకే అత్తింట్లో అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో నిరోజ వేధింపులు భరించలేక శనివారం ఉదయం అత్తవారింట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త సురేందర్‌రెడ్డి, అత్త లక్ష్మి, మామ శ్రీనివాస్‌రెడ్డి, మరిది నరేందర్‌రెడ్డి తమ కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని నిరోజ తల్లిదండ్రులు మల్లారెడ్డి, గంగవ్వ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నిరోజది హత్యా, ఆత్మహత్యా అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని ఎస్సై తెలిపారు. -
కొడుకు జులాయిగా తిరుగుతున్నాడని..
భీమారం : కొడుకు పాఠశాలకు వెళ్లకుండా జులా యిగా తిరుగుతున్నాడని మనస్తాపానికి గురై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈసంఘటన కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాదవనగర్ ప్రాంతం భగత్‌సింగ్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. అలివేలుమంగమ్మ(38)కు ఇద్దరు కూతు ళ్లు, కుమారుడు సోమశేఖర్ ఉన్నారు. సోమశేఖర్ స్థానిక పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. అతడు జులాయిగా తిరుగుతుండటంతో మందలించినా మార్పు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న సీఐ మహేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
మహిళ ఆత్మహత్య
రాయచోటి టౌన్(వైఎస్సార్ కడప) : రాయచోటి పట్టణ పరిధిలోని కొత్తపేట రాజు బుక్‌స్టాల్ సమీపంలో నివాసం ఉంటున్న బొంగాని జనార్ధన్ భార్య కృష్ణవేణి (40) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుమార్తె విష్ణుప్రియ తలకు పేలు నివారణ మందు పెట్టే విషయమై భార్యభర్తలు గొడవ పడ్డారు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భర్త ఇంటిలో సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారిన తరువాత ఇంటిలోని వారు గుర్తించి ఫ్యాన్ నుంచి వేరు చేసి చూడగా అప్పటికే మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇరుగు పొరుగు వారి ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సాయంత్రం వెళ్లి విచారణ చేపట్టారు. మృతురాలి తమ్ముడు చేసిన ఫిర్యాదు మేరకు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు అర్బన్ ఎస్ఐ సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. దర్యాప్తు చేసి నిజాలు నిగ్గుతేలుస్తామని ఆయన పేర్కొన్నారు. -
కట్నం వేధింపులకు తాళలేక..
సిద్దిపేటటౌన్ : అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సిద్దిపేట అర్బన్ మండలంలోని తడ్కపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ మండలంలోని రాగట్లపల్లికి చెందిన అన్నపూర్ణను తడ్కపల్లి గ్రామానికి చెందిన అశోక్‌కు ఇచ్చి 2017 ఫిబ్రవరి 19న వివాహం జరిపించారు. భారత సైన్యంలో సైనికునిగా పనిచేస్తున్నాడు. పెళ్లైన మూడు నెలల వరకు బాగానే ఉన్న అత్తమామలు మూడు నెలల తర్వాత నుంచి అదనపు కట్నం కోసం వేధించసాగారు. అశోక్ సెలవులు ముగిసిన అనంతరం విధుల నిర్వహణకు జమ్మూకాశ్మీర్‌కు వెళ్లాడు. అశోక్ లేకపోవడంతో అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత అన్నపూర్ణను అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామని చెప్పి పుట్టింటికి పంపించారు. దీంతో మొదట ఇచ్చిన కట్నానికి తోడు మరో లక్ష రూపాయలు ఇచ్చి అన్నపూర్ణను అత్తింటికి పంపించారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బాగానే చూసుకున్న అత్తింటి వారు మళ్లీ వేధింపులు మొదలు పెట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో అన్నపూర్ణ ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిందని అత్తమామలు మృతురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మృతురాలి అత్తమామలు, కుటుంబ సభ్యుల సాయంతో మృతదేహాన్ని ఆదివారం ఉదయం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చి మార్చురీ వద్ద వేసి తిరిగి ఇంటికి వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. పని చేసుకుంటేనే పూట గడిచే పరిస్థితి తమదని అయినా కూతురు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతో పెళ్లి సమయంలో రూ. 6 లక్షల కట్నంకు తోడు 12 తులాల బంగారం, బైక్ కట్నంగా ఇచ్చామని భాదితురాలి తండ్రి పోచయ్య తెలిపారు. మరో సారి కట్నం కావాలంటే అప్పు చేసి డబ్బులు ఇచ్చామని, అయినా తమ కూతురిని వేధించడం మానలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కూతురిని అత్తమామలు, కుటుంబ సభ్యులు కలిసి గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. తమ కూతురుని పొట్టన పెట్టుకున్న వారిని శిక్షించాలని పోలీసులను కోరారు. పోచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ ఎస్ఐ కోటేశ్వర్రావు హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
తాండూరు టౌన్ : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. అదనపు కట్నం కోసం భర్త పెడుతున్న వేధింపులకు తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాతతాండూరుకు చెందిన చాకలి అనూష (22)కు దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన అరుణ్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన వివాహం జరిగింది. అయితే మృతురాలు భర్త, తన తల్లిదండ్రులతో కలిసి సంగారెడ్డి జిల్లా కంది పట్టణంలో జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల భర్త అరుణ్ అదనపు కట్నం తేవాలని, అలాగే పలు అనుమానాలతో వేధిస్తున్నాడు. ఇటీవల అనూష పుట్టింటికి వచ్చింది. భర్త పెట్టే మానసిక వేధింపులు తాళలేక శుక్రవారం తల్లిగారింట్లో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు మృతురాలి తల్లి చంద్రమ్మ, తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. అనూష ఉరేసుకున్న విషయంపై వికారాబాద్ డీఎస్పీ శిరీష శుక్రవారం రాత్రి పాతతాండూరులో విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
వివాహిత బలవన్మరణం
దేవనకొండ(కర్నూలు): మండలంలోని మాదాపురం గ్రామంలో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పత్తికొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ(25)కు మండలంలోని మాదాపురం గ్రామానికి చెందిన సురేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పెళ్లయిన తర్వాత కొన్నాళ్ల పాటు వారి సంసారం సాఫీ సాగింది. అయితే గతేడాది నుంచి అదనపు కట్నం తేవాలని భర్తతోపాటు అత్త మారెమ్మ రాములమ్మను నిత్యం వేధిస్తుండే వారు. ఈనేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ గంగయ్యయాదవ్ ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా భర్త, అత్త కలిసి రాములమ్మను చంపేసి ఉరి వేసుకున్నట్లు సృష్టించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగిన తల్లి
నాగర్‌కర్నూల్ రూరల్ : కలహాలు ఆ కుటుంబాన్ని కుంగదీశాయి. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగు మందు ఇచ్చి తానూ తాగింది. పరిస్థితి విషమించడంతో తల్లి, కూతురు మృతిచెందింది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల భూషయ్య, మహాదేవి(30) అలియాస్ మాధవి భార్యాభర్తలు.. వీరికి అచ్యుత, మౌనిక(4నెలలు) కూతుళ్లు ఉన్నారు. కాగా, భార్యాభర్తల మధ్య మూడు నెలలుగా తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కూతుళ్లకు పురుగు మందు తాపి తాను తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్తుండగా తల్లి మహాదేవితో పాటు ఆమె కూతురు మౌనిక ఆరో గ్య పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే మృత్యువాతపడ్డారు. వీరిలో చిన్నారి అచ్యుత పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగర్‌కర్నూల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి.. వివాహమాడి..ఆపై..!
రాయచోటి టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అన్యోన్య జీవితాన్ని గడుపుదామన్నాడు. కోర్కెలకు రెక్కలు తొడిగాడు. చివరికి అనుమానించి వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులు తాళలేక తన చిన్న బిడ్డను అనాథగా చేసి తనను తాను శిక్షించుకొంటూ చివరకు ఉరి వేసుకొని ఊపిరి తీసుకొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని స్వగ్రామం నుంచి వెనక్కు తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండలం గడికోట గ్రామం మాధవాండ్లపల్లె గ్రామానికి చెందిన శ్రీనాథరెడ్డి ఎమ్మెస్సీ చదివాడు. లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లెకు చెందిన చందన (27) అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ డిగ్రీలు పూర్తి చేసి రాయచోటి జగధాంబ సెంటర్లోని డిష్ రెడ్డెన్న వీధిలో కాపురం పెట్టారు. వీరికి 5 సంవత్సరాల కుమార్తె ఉంది. శ్రీనాథరెడ్డి జీవనోపాధి కోసం ఒక ఇనిస్టిట్యూట్ నడుపుతున్నారు. ఆమె గతంలో బ్యాంక్ కోచింగ్ కూడా వెళ్లి వచ్చింది. అయినా ఉద్యోగం రాలేదు. ఇద్దరికీ ఉద్యోగం రాకపోవడంతో రాయచోటిలోనే విద్యార్థులకు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో వీరి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ గురువారం తన భర్త ఇంటిలో లేని సమయంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకొంది. రాత్రి 9గంటల తరువాత ఇంటిలోకి వచ్చిన భర్త గుట్టుచప్పుడు కాకుండా చాకచక్యంగా మృతదేహాన్ని తన స్వగ్రామైన గడికోటకు తీసుకెళ్లాడు. తన స్వగ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించడానికి సిద్ధం చేసుకున్నాడు. అయితే విషయం పోలీసులకు తెలియడంతో అర్బన్ సీఐ తన సిబ్బందిని గడికోటకు పంపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావాలని ఆదేశించారు. విధిలేని పరిస్థితిలో మృతదేహాన్ని తిరిగి వెనక్కు తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె మెడకు ఉరి వేసుకున్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఆత్మహత్య చేసుకొందని నిర్ధారించుకొని కేసు నమోదు చేసినట్టు అర్బన్ ఎస్ఐ గోవింద్ రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని తెలిపారు. -
అత్తమామలు మందలిస్తారని..
చిన్నశెట్టిపల్లె(రాజుపాళెం) : అత్తమామలు మందలిస్తారనే భయంతో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజుపాళెం మండలం చిన్నశెట్టిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామానికి చెందిన అశ్రిత(26)కు ఆరేళ్ల క్రితం చిన్నశెట్టిపల్లె గ్రామానికి చెందిన మెట్టుపల్లి చిన్నయ్యగారి శివరామిరెడ్డితో వివాహమైంది. వీరికి మూడేళ్ల ధృవన్‌రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త శివరామిరెడ్డి కర్నూలు జిల్లాలోని ప్రియ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండటంతో అక్కడే నివాసముంటున్నారు. ఈనేపథ్యంలో వారం రోజుల క్రితం అతను అశ్రితను తీసుకొచ్చి చిన్నశెట్టిపల్లెలో అతని అమ్మానాన్నల వద్ద వదిలి వెళ్లాడు. పిల్లవాడు ఎక్కువగా అల్లరి చేస్తున్నాడనే కారణంతో గత సోమవారం ఆమె బాలుడిని మందలించింది. దీంతో తన అత్తమామలు ఏమైనా అంటారేమోననే భయంతో సోమవారం ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి గోపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఏం కష్టమొచ్చిందో...
చీపురుపల్లి విజయనగరం : ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో...తెలియదుగాని ఆ కష్టాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియకో... లేదంటే ఎవరితో చెప్పి వారిని బాధించడం ఎందుకు అనుకుందో తెలియదుగాని శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. మరో రెండు రోజుల్లో కాశీ వెళ్తేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారట. మరి ఆ కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకునే భాగ్యం ఆమెకు లేదేమో.. చిన్న, చితకా ఆర్థిక సమస్యలు అనుకుందామంటే అదీ కాదు. ఎందుకంటే స్థానికంగా మైనింగ్ వ్యాపారాల్లో నంబర్‌వన్‌గా ఉన్న వ్యాపారి భార్య ఆమె. అయినప్పటికీ భర్త ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని వెంకటేశ్వరనగర్‌లో నివాసం ఉంటున్న సుజాత అగర్వాల్(47) మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలచివేసింది. ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి వచ్చిన అల్లుడు మనోజ్‌కుమార్ చాలా సేపు తలుపులు కొట్టినప్పటికీ తీయకపోవడంతో స్థానికుల సహకారంతో మరోసారి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్ఐ టి.కాంతికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆ ఇంటికి చేరుకుని తలుపులు విరగ్గొట్టి చూసేసరికి ఊరి వేసుకొని సుజాత అగర్వాల్ మృతదేహం కన్పించింది. మృతురాలి భర్త మైనింగ్ వ్యాపారి ఓంప్రకాష్ అగర్వాల్(పప్పు అగర్వాల్) మైనింగ్ వ్యాపారం పని నిమిత్తం సోమవారం రాయఘడ వెళ్లారు. రాత్రికి ఆయన ఇంటికి రాలేదు. మంగళవారం ఉదయం సమాచారం తెలుసుకుని మధ్యాహ్నం 3 గంటల సమయంలో నివాసానికి చేరుకున్నాడు. మృతురాలు సుజాత అగర్వాల్ కుమారుడు నితీష్ అగర్వాల్ రాజాం పట్టణంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న నితీష్ తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. ఏమైందో... ఆమెకు ఎలాంటి కష్టం లేదు. ఎందుకు ఇలా చేసిందో నాకు తెలియదు. సోమవారం రాయగడ వెళ్లాను. నాతో ఏమీ చెప్పలేదు. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. నన్ను చూసుకునే దిక్కు కూడా ఇప్పుడు లేదు. దేశంలో ఆమెను ఎన్నో పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లాను. మరో రెండు రోజుల్లో కాశీ వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. ఆమె ఏం చెప్పినా చేసేవాడిని. తనకు ఏదైనా సమస్య ఉంటే చెబితే బాగున్ను. - ఓంప్రకాష్ అగర్వాల్, మృతురాలి భర్త దర్యాప్తు చేస్తున్నాం..... మాకు కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దర్యాప్తు చేస్తున్నాం. భర్త, కుమారుడితో మాట్లాడుతున్నాం. కుటుంబ సభ్యులు మధ్య అంతగా సత్సంబంధాలు కనిపించడం లేదు. కేసు నమోదు చేస్తున్నాం. దర్యాప్తు నిర్వహిస్తాం. - టి.కాంతికుమార్, ఎస్ఐ -
ఉరేసుకొని గృహిణి ఆత్మహత్య
తాండూరు: ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు.. కొడుకు కోసం మరో పెళ్లి చేసుకుంటానని భర్త తరచూ వేధించడంతో మనస్థాపం చెందిన భార్య ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పట్టణ సీఐ ప్రతాపలింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతపూర్ జిల్లాకు చెందిన గంగిరెడ్డి లక్ష్మీదేవి(35)కు అదే జిల్లాకు చెందిన శంకరనారాయణరెడ్డితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొత్తలో తాండూరుకు వలస వచ్చి నాపరాళ్ల వ్యాపారం చేస్తూ శంకర్‌నారాయణ తాండూరులో కుటుంబ సభ్యులతో కలిసి స్థిరపడ్డాడు. అయితే వీరికి ఇద్దరు ఆడపిల్లలు లాసిని(9), హాసిని(8) ఉన్నారు. కొడుకును కనలేదని భర్త శంకర్‌నారాయణరెడ్డి భార్యను సూటిపోటి మాటలతో వేధించే వాడు. రోజులు గడుస్తున్న కొద్దీ శంకర్నారాయణరెడ్డికి కొడుకు లేని లోటు వేధించసాగింది. కొడుకు కోసం మరో పెళ్లి చేసుకుంటానని తరచూ భార్య లక్ష్మీదేవిని మాటలతో చిత్రహింసలకు గురి చేసేవాడు. భర్త వేధింపులను భరించలేక మనస్థాపం చెంది శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం కుటుంబ సభ్యులు గమనించి తాండూరు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ప్రతాపలింగం సంఘటన స్థలంలో విచారణ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను సేకరించారు. అనంతరం మృతదేహన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మారం రంగారెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
తల్లిదండ్రులపై కోపంతో యువతి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: ఆవేశం, అనాలోచిత నిర్ణయాలతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. క్షణికావేశంలో యువత తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన విజయవాడలోని సింగ్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగంపల్లి నిహారిక అనే యువతి బెంగళూరులో మల్టీమీడియా పూర్తి చేసి, ప్రస్తుతం తల్లిదండ్రులతో నగరంలోనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు నిహారిక తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. అయితే అందుకు వారు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. నిహారిక తల్లి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ కాగా, తండ్రి గన్నవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుమారుడు మందలించాడని తల్లి ఆత్మహత్య
ఆదోని టౌన్: కుమారుడు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. హొళగుంద ఎస్ఐ నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు.. హొళగుంద మండలం వందవాగిలి గ్రామానికి చెందిన వీరేష్‌కు కొన్నేళ్ల క్రితం వడ్డే నాగమ్మ(45)తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. అయితే వీరేష్ 15 రోజుల క్రితం వరుసకు కోడలైన మరో మహిళతో బెంగళూరుకు వెళ్లిపోయాడు. ఇటీవల అక్కడ బేల్దారి పని చేస్తుండగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని అతడు భార్యకు ఫోన్ ద్వారా తెలియజేశారు. దీంతో ఆమె భర్తను చూసేందుకు వెళదామని కుమారులను కోరింది. దీనిపై రెండో కుమారుడు రాజు తల్లిని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడంతో శుక్రవారం మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బాబుకు న్యాయం చేయాలి
బోయినపల్లి(చొప్పదండి): అత్తింటి ఆరళ్లకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సౌజన్యారెడ్డి కుమారుడికి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబికులు డిమాండ్ చేశారు. మండలంలోని మల్లాపూర్‌లో సౌజన్యారెడ్డి భర్త రాజేందర్‌రెడ్డి ఇంటి ఎదుట శనివారం బైటాయించారు. మండలంలోని శాభాష్‌పల్లికి చెందిన నాయిని బుచ్చిరెడ్డి వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో కుటుంబంతో సహా అద్దెకు ఉంటున్నాడు. ఇతడి పెద్ద కూతరు సౌజన్యారెడ్డి(లహరి)కి బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన రాజేందర్‌రెడ్డితో 16 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లిలో పెద్ద మొత్తంలో కట్న కానుకలు ఇచ్చారు. వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. కొద్ది రోజులు కాపురం సజావుగానే సాగింది. సౌజన్యారెడ్డి భర్త రాజేందర్‌రెడ్డి, మామ అదనపు కట్నం కోసం వేధించేవారు. అంతేకాకుండా సౌజన్యారెడ్డిని భర్త పుట్టింటిలో వదిలేసి వెళ్లడంతో మానసిక వేదనకు గురైంది. గత నెల 24న తన పుట్టింట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో వరగంల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 6న మృతిచెందింది. సౌజన్యారెడ్డి కుమారుడికి న్యాయం చేయాలంటూ శనివారం సాయంత్రం ఎదుట ధర్నాకు దిగారు. అయితే ఆదే సమయంలో ఆమె భర్త ఇంటికి తాళం వేసి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. వేములవాడ రూరల్ సీఐ రఘుచందర్, ఎస్సై ఎన్.వెంకటకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. రాత్రి వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
భర్త తాగొచ్చాడని భార్య ఆత్మహత్య
రాజుపాళెం : భర్త మద్యం తాగొచ్చాడని భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొర్రపాడులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చిం ది. కొర్రపాడు గ్రామానికి చెందిన కృష్ణపట్నం శివాంజనేయులుకు జమ్మలమడుగు మండలంలోని ఎస్.ఉప్పలపాడు గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (30)తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి శివకుమార్ (10), సుదర్శన్ (8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శివాంజనేయులు కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంతకాలం వారి కాపురం అన్యోన్యంగా సాగింది. తర్వాత మద్యం వారి పాలిట శాపం అయింది. అతను తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చే వాడు. మానేయ్యాలని ఆమె చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడూ గొడవ పడే వారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మానేయాలని చెబుతూ గొడవ పడింది. ఇద్దరి మధ్య మాటకుమాట పెరిగింది. తాను ఇంటి నుంచి వెళ్లిపోతానని ఆమె చెప్పింది. నీవు ఎందుకు పోవడం, తానే వెళ్తానని అతను ఇంటి నుంచి కొంత దూరం బయటకు వచ్చేశాడు. తాను ఎంత చెప్పినా భర్త మద్యం మానలేదని జీవితంపై విరక్తి చెందింది. ఇంటి తలుపు వేసి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అతనితోపాటు కుటుంబ సభ్యులు వెంటనే తలుపు పగులగ్గొట్టి ఇంట్లోకి వెళ్లారు ఆమెను రక్షించేందుకు ఆటోలో ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి ప్రొద్దుటూరు రూరల్ సీఐ ఓబులేసు, రాజుపాళెం ఎస్ఐ శ్రీనివాసులు చేరుకుని పరిశీలించారు. మృతురాలు తమ్ముడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొంతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. -
మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య
మిరుదొడ్డి(దుబ్బాక): తీవ్ర మనస్తాపానికి గురై వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని తొగుట మండలం గుడికందుల గ్రామంలో జరిగినట్లు ఎస్ఐ విజయ్‌భాస్కర్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం... గుడికందుల గ్రామానికి చెందిన సూకూరి నర్సింహులుతో తొగుట మండల కేంద్రానికి చెందిన కవిత(వర్షిత)(24)కు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా ఇటీవల కవిత టీఆర్టీ పరీక్ష రాసింది. పరీక్షా ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. మనస్తాపానికి గురైన కవిత బుధవారం ఇంట్లో ఎవరులేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి రాస కనకవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
సారీ వెళ్లిపోతున్నా..
మెదక్ మున్సిపాలిటీ: ‘అడిగినవన్నీ ఇచ్చాం.. అయినా నా బిడ్డను చంపేశారు’ అంటూ రోదించిన ఆ తల్లిదండ్రుల తీరు అందరిని కంటతడి పెట్టించింది. అత్తింటి వేధింపులకు మరో అమాయకురాలు బలైంది. ఈ సంఘటన మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలం జంగపల్లి గ్రామానికి చెందిన అంజమ్మ–వెంకటయ్య దంపతుల కుమార్తె శిరీష(23)కు మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి చెందిన బక్కొళ్ల రాజు–సుశీల దంపతుల కుమారుడు మహేశ్‌తో గత ఏడాది మే 22న వివాహం జరిగింది. మహేశ్ చిన్నశంకరంపేట మండలం మందాపూర్ తండా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా గతంలో రామాయంపేటలో అద్దెకున్నారు. కాగా ఈ నెల 1 నుంచి మెదక్‌లోని సాయినగర్ కాలనీలో అద్దెకుంటున్నారు. మహేశ్ రోజుమాదిరిగా మంగళవారం పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి లోపలి నుంచి శిరీషా ఎంతకీ తలుపు తీయక పోవడంతో కిటికి అద్దం పగులగొట్టి చూసేసరికి బెడ్రూంలో ఉరేసుకుని కనిపించింది. తలుపు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకున్న శిరీషాను కిందకు దించి, సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, పట్టణ సీఐ శ్రీరాం విజయ్‌కుమార్, ఎస్ఐ శేఖర్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నా బిడ్డ ఏంపాపం చేసింది..! నా బిడ్డ ఏంపాపం చేసింది...అడిగివన్నీ ఇచ్చాం.. అయినా మా బిడ్డను ఉరివేసి చంపేశాడు.. ఊరికే వదిలిపెట్టొద్దంటూ శిరీషా తల్లిదండ్రులు గుండెలు బాధుకున్నారు. ఉద్యోగం ఉందని అడిగినంత రూ.8లక్షల కట్నంతోపాటు 20 తులాల బంగారం, ఇటీవల బుల్లెట్ కొనుకునేందుకు రూ.2లక్షలు, పుస్తెలు కోసమంటే మరో రూ.50వేలు కూడా ఇచ్చామని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. తమ కూతురును వేధించి వేధించి అత్తింటివారే చంపేశారని వారు ఆరోపించారు. సారీ వెళ్లిపోతున్నా.. ‘అమ్మా...నాన్న..తమ్ముడు సారీ వెళ్లిపోతున్నా.. .అంటూ మృతురాలు శిరీష సూసైడ్‌నోట్ రాసింది. ‘పెళ్లికి ముందు నుంచే వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి తర్వాత నా భర్త మేనమామ నన్ను , మా అమ్మనాన్న, తమ్ముడిని నానా బూతులు తిట్టారు. ప్రతిసారి వేధింపులకు గురిచేశారు. వారిని మహేశ్ ఒక్కసారి కూడా అడగలేదు. వారి తిట్లకు నాకు బతకాలని లేదు... అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను... అమ్మ... నాన్న, తమ్ముడు.. సారీ’ అంటూ మృతురాలు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లో చెప్పకుండా వెళ్లి... బావిలో శవమై తేలి..!
కేతేపల్లి(నకిరేకల్) : కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మూడు రోజుల కిత్రం ఇంటి నుంచి వెళ్లిన మహిళ వ్యవసాయం బావిలో శవమై తేలింది. ఈ సంఘటన కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామంలో గురువారం జరిగింది. కేతేపల్లి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామానికి చెందిన మౌనిక(28)కు, కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన కొండ క్రిష్ణతో పదే ళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. క్రిష్ణ సూర్యాపేట ఆంధ్రబ్యాం కు శాఖ తరఫున గ్రామంలో బ్యాంకుమిత్రగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో నాలుగు రోజుల కిత్రం క్రిష్ణ గ్రామానికి చెందిన బ్యాంకు ఖాతా దారులకు చెల్లించేందుకు çసూర్యాపేట బ్యాంకు నుంచి దా దాపు రూ.2లక్షలను తీసుకొచ్చి ఇంట్లో దాచాడు. ఈవిషయం తెలియని ఆయన భార్య మౌనిక ఇంటి తలుపులు వేయకుండానే పక్కనే ఉన్న ఇరుగుపొరుగు వారి ఇంటికి వెళ్లింది. ఊళ్లోకి వెళ్లి ఇంటికి వచ్చిన క్రిష్ణకు తలుపులు బార్లాగా తెరిచి ఉండడంతో పాటు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భార్య మౌనికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక ఈ నెల 19న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. మౌనిక ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెదికినా ఫలితం లేకపోవడంతో క్రిష్ణ తన భార్య కనిపించడం లేదంటూ ఈనెల 20న కేతేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా మూడు రోజుల కిత్రం కనిపించకుండా పోయిన మౌనిక గురువారం స్థానికంగా చౌళ్లగూడెం వెళ్లే దారిలో రైతు సత్తిరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో శవమై లేలింది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు కేతేపల్లి పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీయించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని కేతేపల్లి ఎస్ఐ రజనీకర్‌రెడ్డి తెలిపారు. -
అలేఖ్యకు కన్నీటి వీడ్కోలు
రాయికల్(జగిత్యాల): రాయికల్‌లో మంగళవారం అనుమానాస్పదంగా మృతిచెందిన అయిత అలేఖ్య(27)కు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబసభ్యులు, వందలాది మంది గ్రామస్తులు తరలివచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన మృతురాలి కుటుంబసభ్యుల ఆందోళనతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. రాత్రి ఒంటి గంట సమయంలో డీఎస్పీ భద్రయ్య హామీతో నాటకీయ పరిణామాల మధ్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వివరాలు బంధువులు, స్థానికుల కథనం ప్రకారం. రాయికల్ మండలం కట్కాపూర్‌కు చెందిన అలేఖ్య వివాహం ఐదేళ్ల క్రితం మండల కేంద్రానికి చెందిన అయిత నరేందర్‌తో జరిగింది. వివాహ సమయంలో సుమారు రూ.10 లక్షల కట్నకానుకలు అప్పజెప్పారు. కాగా అదనపు కట్నం కోసం మామ, అత్త, మరిది తరచూ వేదించేవారు. ఈక్రమంలోనే కుటుంబసభ్యులే మంగళవారం అలేఖ్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి బంధువులు, స్థానికులు ధర్నాకు దిగారు. హంతకులను శిక్షించాలని, ఆస్తిపాస్తులను అనాథాశ్రమానికి రాయాలని కోరుతూ వందలాది మంది మంగళవారం రాత్రి ఒంటి గంట వరకు ఆందోళనకు దిగారు. జగిత్యాల డీఎస్పీ భద్రయ్య అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. డీఎస్పీ హామీతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లారు. బుధవారం అలేఖ్య అంత్యక్రియలు నేపథ్యంలో కట్కాపూర్, తాట్లవాయికి చెందిన సుమారు వెయ్యి మంది తండావాసులు తరలివస్తున్నారనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు. జిల్లాలోని 8 మంది ఎస్సైలు మండలంలోని రామాజీపేట, తాట్లవాయి, ఆలూరు, రాయికల్‌లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జగిత్యాల నుంచి అలేఖ్య మృతదేహాన్ని పోలీసుల బందోబస్తు మధ్య నేరుగా శ్మశానవాటికకు తీసుకొచ్చారు. మృతురాలి తండ్రి భూమన్న చితికి నిప్పంటించగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆశ్రునివాళి మధ్య అలేఖ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఐదుగురిపై కేసు అలేఖ్య భర్త అయిత నరేందర్, అత్త అయిత రమ, మామ అయిత రాజన్న, మరిది అయిత నాగరాజు, చిన్నమామ అయిత శివకుమార్‌పై హత్య, అదనపు కట్నం కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు. వీరు పోలీసుల అదుపులో ఉన్నారు. -
శాడిస్ట్ భర్త వేధింపులు భరించలేక..
-
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని..
ములకలపల్లి : మండలంలోని మూకమామిడి గ్రామంలో శుక్రవారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... మూకమామిడి గ్రామస్తురాలు సున్నం మౌనిక(18), ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది. ఖమ్మానికి చెందిన గణేష్, పాల్వంచలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రెండు నెలల క్రితం ఫోన్ ద్వారా మౌనికకు పరిచయమయ్యాడు. ప్రేమించానని, పెళ్లాడతానని ఆమెను అతడు నమ్మించి మోసగించాడు. ఇది భరించలేని మౌనిక, శుక్రవారం తన ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి సుజాత ఫిర్యాదుతో కేసును ఎస్సై ఉదయ్‌కిరణ్ నమోదు చేశారు, దర్యాప్తు జరుపుతున్నారు. -
భర్త కన్నా ఎక్కువ జీతం సంపాదిస్తుందని..
-
ఆమె జీతం 7 లక్షలు.. అతని జీతం 4 లక్షలు?
పెదవాల్తేరు(విశాఖతూర్పు) : ఉన్నత చదువు.. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం.. రూ.లక్షల్లో వేతనం. సాఫీగా సాగిపోవాల్సిన జీవితం... కానీ అత్తింటి వారి వేధింపులు ఓ మహిళను పొట్టనపెట్టుకున్నాయి. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చాయి. భర్త కన్నా అధిక మొత్తంలో సంపాదించడమే ఆమె పాలిట శాపంగా మారింది. తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాలివి.. నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన పీతల అప్పారావు ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో రెండో కుమార్తె వాణి(35)కి 2011లో జిల్లా పరిషత్ దరి కృష్ణానగర్‌కు చెందిన పసుపులేటి బుల్లయ్య కుమారుడు గంగాధర్‌తో వివాహం జరిగింది. వివాహం సమయంలో అధిక మొత్తంలో కట్న, లాంఛనాలు సమర్పించారు. తరువాత భార్యాభర్తలిద్దరూ అమెరికా వెళ్లి అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేశారు. వీరికి ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. వాణి నెల వేతనం రూ.7.80 లక్షలు కాగా.. ఆమె భర్త నెల వేతనం రూ.4 లక్షలు. దీంతో భర్త గంగాధర్‌లో అసూయ బాగా పెరిగిపోయింది. అమెరికాలో ఉండగానే వాణికి భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇంకా కట్నం, కానుకలు తేవాలని సూటిపోటి మాటలతో వేధించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేయాలని కూడా ఒత్తిడి తెచ్చాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ ఈ ఏడాది ఏప్రిల్ 29న విశాఖ వచ్చేశారు. వాణి ఇంటి నుంచే హోం టు వర్క్ ఉద్యోగం చేస్తున్నారు. భర్త మాత్రం బంధువుతో కలసి మెడికల్ బిజినెస్ ప్రారంభించారు. ఈ క్రమంలో అత్తింటి వేధింపులు భరించలేక వాణి తన ఇద్దరు కుమారులను తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. ఆమె తల్లిదండ్రులు చినవాల్తేరు దరి కిర్లంపూడి లేఅవుట్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆమె భర్త గంగాధర్ తన మేనత్త కుమారుడిని పంపించి, తన ఇద్దరు కుమారులను తీసుకురమ్మని చెప్పారు. దీంతో వాణి తాను కూడా వస్తానని చెప్పగా గంగాధర్ బంధువు నిరాకరించారు. ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయి ఇద్దరు కుమారులను భర్త వద్దకు పంపించింది. కాగా..గంగాధర్ తన చిన్న కుమారుడికి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం వాణి తల్లిదండ్రులు ఆమెను నిద్రలేపడానికి ఎన్నిసార్లు గది తలుపుకొట్టినా.. స్పందన లేకపోవడంతో ఆందోళన చెందారు. తలుపు తెరిచి చూసేసరికి వాణి విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం చూసి కుప్పకూలిపోయారు. వారిని ఓదార్చ డం ఎవరి తరమూ కాలేదు. మూడో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. కేసును ఎస్ఐ ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. -
తొందరపడ్డావు తల్లీ..!
ఇద్దరు ఆడబిడ్డలు పుట్టగా.. మగబిడ్డకోసం భర్త, అత్తమామలు వేధించారు.. మళ్లీ ఆడబిడ్డ పుడితే.. అన్న ఆలోచనతో ఆడబిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్టులో ఆమె కడుపులో ఉన్నది మగశిశువని తేలింది. తొందరపడ్డావేమో తల్లీ అంటూ బంధువులు దుఃఖిస్తున్నారు. చిత్తూరు రూరల్ : చిత్తూరు రూరల్ మండలం పేయనకండ్రిగకు చెందిన గర్భిణి సరళ (25) తన ఇద్దరు కుమార్తెలు జాహ్నవి (5), దేవిశ్రీ (2)లతో సహా బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. మగబిడ్డ లేద న్న కారణంతో భర్త, అత్త, మామ ఆమె ను కొంతకాలంగా వేధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం వారు ఆమెను కొట్టడం, దుర్భాషలాడడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇరుగుపొరుగుతోనూ తన బాధను చెప్పుకోలేక జీవితం పై విరక్తి చెంది గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తాను లేకపోతే తన ఇద్దరు కుమార్తెలు ఏమైపోతారో.. వాళ్ల ఆలనాపాలన ఎవ రు చూసుకుంటారో.. తనకు పట్టిన గతి వాళ్లకూ పడుతుందేమోనని వ్యథచెంది తనతో పాటు వారినీ మృత్యు ఒడిలోకి చేర్చింది. కడుపులో మగబిడ్డే.. బుధవారం ఇద్దరు బిడ్డలతో సహా గర్భిణి సరళ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. గురువారం మధ్యాహ్నం సరళ మృతదేహాన్ని పోలీసులు, వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టంలో సరళ కడుపులో ఉన్నది మగబిడ్డ అని తేలింది. సాయంత్రం డీఎస్పీ సుబ్బారావు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. విషయం తెలు సుకున్న తండ్రి, బంధువులు ‘తొందర పడ్డావు తల్లీ’ అంటూ రోదిస్తున్నారు. ఆత్మహత్య కారణమైన కుటుంబీకుల అరెస్ట్ ఇద్దరు ఆడబిడ్డలతో సహా గర్భిణి సరళ ఆత్మహత్యకు కారణమైన కుటుంబీల ను గురువారం తాలూకా పోలీసులు అ రెస్టు చేశారు. భర్త గురునాథం (35), అత్త చిన్నమ్మ (45), మామ రాజేంద్ర (55)లను పోలీసులు డీఎస్పీ సుబ్బారావు ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో భర్త, అత్తమామలతో పాటు ఆడపడుచు బేబి ప్రమేయం కూడా ఉందని విచారణలో తేలినట్లు డీఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లో ఆమెను కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. కుటుంబంలో కలహాలు ఏర్పడితే మహిళలు సమీపంలోని పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించాలని సూచించారు. సమావేశంలో ఎస్ఐలు సోమశేఖర్‌రెడ్డి, రామ్‌లక్ష్మీరెడ్డి, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
చెత్త సమస్య.. మహిళ ఆత్మహత్య
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): ఇంటి పక్కన డబ్బాలో వేసిన చెత్త ఇంట్లోకి వస్తుందని పక్కింటి మహిళతో వాగ్వాదానికి దిగిన ఓ వివాహిత మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని చౌదరిగూడలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బక్క సుమలత కూలీ పని చేస్తుంది. వీరి ఇంటి వెనుక బక్క కళమ్మ ఇల్లు ఉంది. కళమ్మ తన ఇంట్లోని చెత్తను ఓ డబ్బాలో వేసి సుమలత ఇంటి పక్కన పెడుతుంది. గాలికి ఈ చెత్త డబ్బాలో నుంచి ఎగిరి వచ్చి సుమలత ఇంట్లోకి వస్తోంది. చెత్త డబ్బాను అక్కడ నుంచి తీసివేయాలని సుమలత ఎన్నిసార్లు చెప్పినా కళమ్మ వినిపించుకోలేదు. ఈ విషయమై పలుమార్లు వారి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి సమయంలో గాలికి డబ్బాలోని చెత్త ఇంట్లోకి రావడంతో సుమలత వెళ్లి కళమ్మను అడిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. సుమలతను బెదిరించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. గమనించిన చుట్టు పక్కల వారు మంటలార్పి 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి సుమలత మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కడతేర్చిన కలహాలు
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) / అగనంపూడి(గాజువాక) : తాళి కట్టినప్పటి నుంచీ భర్త నుంచి వేధింపులే. కుటుంబ పోషణకు చాలీచాలని డబ్బులు ఇవ్వడం... గట్టిగా అడిగితే కొట్టడం... ఈ వేధింపులు ఏడేళ్లుగా భరించిన ఆ మాతృమూర్తి ఇక తనవల్ల కాదంటూ బలవంతంగా తనువు చాలించింది. తను లేని లోకంలో బిడ్డలు ఏమైపోతారో అన్న బాధతో వారినీ వెంట తీసుకెళ్లిపోవాలనుకుంది. ఈ క్రమంలో కుమారుడు అమ్మ వెంటే అందని లోకాలకు వెళ్లిపోగా... గాయాలతో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ హృదయ విదారకర దుర్ఘటన యల్లపువానిపాలెం – దువ్వాడ మధ్యలో రైల్వే ట్రాక్‌పై బుధవారం సంభవించింది. భార్యాభర్తల మధ్య కలహాలు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసేశాయి. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సమీప పరసపాడుకు చెందిన ఇందిరకు పార్వతీపురం సమీపంలోని వెంకంపేటకు చెందిన కోరంగి చంద్రశేఖర్‌తో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. అనంతరం వీరు బతుకుదెరువు కోసం విశాఖ శివారు వడ్లపూడి కణితి నిర్వాసిత కాలనీకి వలస వచ్చారు. భర్త ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా ఇందిర టైలరింగ్ పనిచేస్తూ చేదోడుగా ఉండేది. అయినప్పటికీ భార్యను చంద్రశేఖర్ నిత్యం వేధిస్తుండేవాడు. కుటుంబ పోషణకు కూడా సరిపడా డబ్బులు ఇచ్చేవాడుకాదు. దీంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కుటుంబ పెద్దలు సర్ది చెబుతుండేవారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట కూడా భార్యను చంద్రశేఖర్ తీవ్రంగా కొట్టాడు. దీంతో విషయం తెలుసుకున్న ఇందిర తండ్రి శ్రీనివాసరావు వచ్చి అల్లుడిని మందలించి వెళ్లిపోయాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోగా బుధవారం మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇందిర తన ఆరేళ్ల కుమార్తె జ్యోత్స్న, నాలుగేళ్ల కుమారుడు బద్రినాథ్‌ను తీసుకుని బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. సాయంత్రానికి తల్లీ కుమారుడు విగతజీవులుగా మారారు. తల్లీ తమ్ముడి మృతదేహాల వద్ద ఏడుస్తూ... బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చేపల వేట ముగించుకుని వస్తున్న మత్స్యకారులు యల్లపువానిపాలెం – దువ్వాడ మధ్య పొలంబొట్టపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ పక్కన కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టులైపోయారు. తల్లి, తమ్ముడి మృతదేహాల పక్కన చిన్నారి వెక్కివెక్కి ఏడుస్తుండడాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని గోపాలపట్నం పోలీసులకు సమాచారం అంచారు. సీఐ పైడియ్యతో పాటు ఎస్ఐ తమ్మినాయుడు సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనా స్థలిలో లభించిన ఫోన్ ఆధారంగా మృతుల వివరాలు తెలుసుకున్నారు. చిన్నారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వడ్లపూడి వాసులుగా గుర్తించి దువ్వాడ రైల్వే పోలీసులకు, వడ్లపూడి పోలీస్ స్టేషన్‌కూ సమాచారం అందించారు. అయితే అప్పటికే తన భార్య కనిపించడం లేదని చంద్రశేఖర్ వడ్లపూడి పోలీసులను ఆశ్రయించడంతో విషయం తెలియజేసి గోపాలపట్నం రప్పించారు. చంద్రశేఖర్‌ను ఏసీపీ అర్జున్, సీఐ పైడియ్య, ఎస్ఐ తమ్మినాయుడు విచారించారు. సంఘటన ఎలా జరిగిందో తెలియదని, బుధవారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అనంతరం 11 గంటల నుంచి కనిపించలేదని చెప్పాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. -
అశ్రునయనాల మధ్య స్వప్న అంత్యక్రియలు
గన్నేరువరం(మానకొండూర్) : వరకట్న వేదింపులకు బలైన మండలంలోని గుండ్లపల్లికి చెందిన కట్కూరి స్వప్న అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. భార్య చనిపోయిన చూసేందుకు భర్త రాకపోవడంతో మృతురాలి తండ్రి, కూతురే చితికి నిప్పుపెట్టారు. స్వప్న మృతికి కారకులైన వారిని శిక్షించే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే, గ్రామస్తుల హామీతో మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంత్యక్రియలతో సద్దుమణిగాయి. ఈనెల 31న మృతి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన కట్కూరి స్వప్న ఈనెల 31న ఇంట్లోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త శ్రీపాల్‌రెడ్డి, అత్తామామ అరుణ–అంజిరెడ్డి వేదింపులతోనే ఆత్మహత్య చేసుకుందంటూ మృతురాలి కుటుంబసభ్యులు అత్తవారింటి ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు ఆస్తిని మృతురాలు కూతుళ్లు విస్మయ, విన్నత్న పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అంగీకరించిన అత్తారింటి వారు అనంతరం పరారవడంతో ఆందోళన ఉధృతం చేశారు. గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై రాస్తారోకో సైతం చేశారు. ఇలా ఐదు రోజులుగా హైడ్రామాల మధ్య స్వప్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. మృతురాలి కుటుంబానికి గ్రామస్తులు, వివిధ పార్టీలు, సంఘాల నుంచి మద్దతు పెరిగింది. ఎమ్మెల్యే, గ్రామస్తుల హామీతో.. నాలుగో రోజు ఆదివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, ఆర్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. పిల్లలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, దహనసంస్కారాలు నిర్వహించాలని సూచించారు. ఐదోరోజు సోమవారం గ్రామస్తులు కలిసి దహనసంస్కారాలు నిర్వహించాలని సర్పంచ్ చాడ కృష్ణామోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కోరారు. ఎలాంటి పరిస్థితుల్లోనైన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా ఉంటామని ఒప్పంద హామీ ఇచ్చారు. దీంతో స్వప్న అంత్యక్రియలకు కుటుంబసభ్యులు అంగీకరించారు. నిప్పుపెట్టిన తండ్రి, కూతురు ఐదు రోజులు శవంతో ఆందోళన చేసిన కుటుంబసభ్యులు అశ్రునయనాల మధ్య స్వప్న మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించారు. భార్య మృతి చెందిన కనికరం లేకుండా భర్త పరారీలో ఉండడంతో మృతురాలు తండ్రి వెంకటప్రకాశ్, పెద్ద కూతురు విస్మయతో కలిసి నిప్పుపెట్టారు. స్వప్న చితికి నిప్పుపెడుతున్న తండ్రి, కూతురు పోలీసుల వైఫల్యమే : డాక్టర్ నగేశ్ పోలీసుల వైఫల్యంతోనే నిందితులు తప్పించుకున్నారని, వారిని వెంటనే అరెస్ట్ చేసి మృతురాలు కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ డిమాండ్ చేశారు. గుండ్లపల్లిలో భర్త ఇంటి వద్ద శవంతో ధర్నా చేస్తున్న స్వప్న కుటుంబసభ్యులను సోమవారం పరామర్శించారు. ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సమంజసంకాదన్నారు. న్యాయం దక్కే వరకు అండగా ఉంటామని మృతురాలి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్‌వర్మ, జిల్లా కార్యదర్శి డీటీ సుధాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాచమల్ల నర్సయ్య, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకటి అనిల్ ఉన్నారు. -
పిల్లలకు విషం ఇచ్చి..తానూ...
ఇచ్చోడ(బోథ్): అత్తంటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన వివాహిత యర్వ సుమలత అలియాస్ లావణ్య (30) ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కూతురు అక్షిత(7), కూమారుడు శ్రీతిన్(4)లకు సూపర్ వాస్మోల్ ఇచ్చి తానూ తాగింది. రిమ్స్‌లో చికిత్స పొందుతూ సుమలత మరణించగా అక్షితను హైదరాబాద్ తరలించారు. మృతురాలు బంధువులు, ఎస్సై ఎల్.రాజు తెలిపిన వివరాలివీ.. జగిత్యాల జిల్లా మెట్‌పెల్లికి చెందిన లావణ్యకు ఇచ్చోడ మండలం బోరిగామకు చెందిన మోహన్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహామైంది. రెండేళ్ల క్రితం మోహన్ బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లి ఇటీవల తిరిగొచ్చాడు. కాగా రెండేళ్లుగా మోహన్ తల్లి వెంకటమ్మ, అడపడుచూ జ్యోతి అలియాస్ పెద్ద బూదాయిలు లావణ్యను మానసికంగా వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి శుక్రవారం తిరిగి వచ్చింది. వచ్చి రాగానే అత్త, అడపడుచు, భర్తతో గొడవ జరిగింది. తీవ్ర మనస్థాపం చెందిన లావణ్య ఇంట్లో ఉన్న సూపర్‌వాస్మోల్ ఇద్దరు పిల్లలకు ఇచ్చి తానూ తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి అక్షిత పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. శ్రీతిన్ పరిస్థితి ఫర్వాలేదని ఎస్సై తెలిపారు. మృతురాలు అన్న అంజిత్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల ఆత్మహత్య
కొల్చారం(నర్సాపూర్) : మండలంలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన తాండాకు చెందిన లంబాడి లక్ష్మణ్ భార్య ప్రేమ్‌లి(45) ఆదివారం ఉదయం ఇంట్లో పురుగుల మందును సేవించడంతో చికిత్స కోసం మెదక్ తరలిస్తుండగా మార్గమద్యంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమ్‌లి మృతికి కుటుంబ కలహాలే కారణమని కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ పెంటయ్య తెలిపారు. పదిహేను రోజుల నుంచి ప్రేమ్‌లికి, భర్త లక్ష్మణ్, కుమారులకు మధ్య గొడవలు జరగినట్లు తెలిసింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం సైతం గొడవ జరగడం, కుమారుడు చేయి చేసుకోవడంతో పనస్థాపం చెందిన ప్రేమ్‌లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. పైతరలో : మండల పరిధిలోని పైతర గ్రామానికి చెందిన బోయిని మల్లేశం భార్య రాజమణి(35) కుటుంబ కలహాల కారణంగా మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగినట్లు గ్రామస్థులు తెలిపారు. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ పెంటయ్య తెలిపారు. -
నాలుగు రోజుల నుంచి శవంతో ఆందోళన
గన్నేరువరం(మానకొండూర్) : ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన పాపమో.. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వడం పాపమో గాని అత్తింటి వేధింపులకు స్వప్న అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అమ్మ మృతదేహం శవపెటికలో.. నాన్న ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి ఆ చిన్నారులది. నాలుగురోజులైన అంత్యక్రియలు జరగకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. బాధితులకు రోజురోజుకు వివిధ పార్టీలు, గ్రామస్తులు, మహిళ సంఘాల మద్దతు పెరుగుతున్నా ఈ కేసు కొలిక్కి రావడం లేదు. నిందితులను పోలీసులే తప్పించారని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తుండగా.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఏదిఏమైనా శవంతో భర్త ఇంటి ఎదుట నాల్గో రోజు ఆందోళన కొనసాగుతోంది. నిందితులను పట్టుకునేదెప్పుడో.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో గుండ్లపల్లికి చెందిన కట్కూరి శ్రీపాల్‌రెడ్డి భార్య కట్కూరి స్వప్న మే 31న అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుళ్లు విస్మయ్య, విన్నత్న ఉన్నారు. తల్లి మృతి చెందడంతో చిన్నారులను తండ్రి పట్టించుకునే పరిస్థితి లేదని పేర్కొంటూ ఆస్తిని పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేయాలనే డిమాండ్‌తో శవంతో ఆందోళన చేపట్టారు. అదేరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మృతురాలి అత్తామామ అరుణ–అంజిరెడ్డిని తరలించారు. అక్కడికి వెళ్లాక మరునాడు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామనే హామీతో మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. రెండోరోజు స్పందన లేకపోవడంతో గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆ సమయంలో 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని సీపీ కమలాసన్‌రెడ్డి హామీతో రాస్తారోకో విరమించి శవాన్ని మళ్లీ భర్త ఇంటికి తరలించారు. అయినా మూడో రోజు వరకు నిందితులను పోలీసులు పట్టుకున్న దాఖలాలు లేవు. ఎమ్మెల్యే పరామర్శ పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో నాల్గోరోజు ఆదివారం శవంతో భర్త ఇంటి ముందు ఆందోళనను మృతురాలి కుటుంబసభ్యుల కొనసాగించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, ఆర్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి పరామర్శించి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు శారద–వెంకటప్రకాష్ ఎమ్మెల్యేకు తమ ఆవేదనను విన్నపించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు వేధించి హత్య చేశారని, పిల్లలకు న్యాయం చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. నాలుగురోజులుగా శవంతో ఆందోళన చేస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. మహిళ సంఘాల సభ్యులు, గ్రామ మహిళలు సైతం జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తీవ్ర దిగ్బ్రాంతి కలిగే విచారకరమైన ఘటన అని, ఇలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అన్నారు. పిల్లలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాయకుల పరామర్శ మృతురాలి కుటుంబ సభ్యులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వైఎస్సార్ పార్టీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్‌వర్మ, బెజ్జంకి మండల బీజేపీ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు పలువురు స్వప్న కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. పోలీసులు తక్షణమే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకటి అనిల్, ఏఐవైఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్కల మల్లేశం, అందె స్వామి, కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మీ, లక్ష్మినారాయణ, మాడిశెట్టి భాగ్యలక్ష్మి, కిన్నెర మల్లవ్వ ఉన్నారు.