గోదావరిలోకి దూకి మహిళ ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం :
రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరి లోకి దూకి ఓ మ హిళ ఆత్మహత్మ చేసుకున్న సంఘటన టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి దూకింది. ఈ సంఘటనను డ్యూటీ నిమిత్తం రాజమహేంద్రవరం వైపు వస్తున్న ఓ వ్యక్తి చూసి 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన టూ టౌన్ పోలీసు లు నదిలో గజ ఈతగాళ్లను, జాలర్ల సహా యంతో వెతికించి మృతదేహాన్ని ఇస్కాన్ టెంపుల్ వెనుక ఉన్న గౌతమఘాట్ వద్ద ఒడ్డుకు చేర్చారు. మహిళ వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని టూ టౌన్ ఎస్సై జి.ఉమా మహేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలిస్తున్నామని తెలిపారు. మృతురాలి బంధువులు ఎవరైనా ఉంటే రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. 0883–2421133 నంబర్‌ను గాని, టూ టౌన్ ఎస్సై 94932063124 ను సంప్రదించాలని తెలిపారు.