Road cum rail bridge
-
రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైలు బ్రిడ్జిపై మరమ్మతులు
-
‘అయ్యో రామా! నన్నెవరు గుర్తుంచుకోవాలి?’
బెంగళూరు: అస్సాంలోని డిబ్రూగఢ్ సమీపంలో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద రోడ్డు కమ్ రైలు వంతెన(బోగీబీల్) ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బోగీబీల్ వంతెనకు 1997లో ప్రధాని హోదాలో తానే శంకుస్థాపన చేశానని పేర్కొన్నారు. అలాంటింది ఇప్పుడు బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తనను పిలవకపోవడం బాధకరమన్నారు. తన పాలన కాలంలో కశ్మీర్ రైల్వే, ఢిల్లీ మెట్రో రైల్, బోగీబీల్ వంతెన పథకాలను మంజూరు చేశానని.. అలాగే ప్రతి ప్రాజెక్టుకు 100 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. కానీ నేడు ప్రజలు ఆ విషయన్ని మరచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతం మరిచి ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మీకు ఆహ్వానం అందలేదా అంటూ ఓ విలేకరి ప్రశ్నించగా.. అయ్యో రామా! నన్నెవరు గుర్తుంచుకోవాలి? అని చమత్కారంగా సమాధానమిచ్చారు. కాగా, బోగీబీల్ వంతెనను మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 1997 లోనే ఆమోదం.. బోగీబీల్ వంతెనను అస్సాం ఒప్పందంలో భాగంగా నిర్మించారు. ఈ ఒప్పందంలో భాగంగా 1997లోనే ఈ బ్రిడ్జి నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అదే ఏడాది జనవరి 22న నాటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ బోగీబీల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే పనులు మాత్రం అటల్ బిహార్ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా 2002, ఏప్రిల్ 1న ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో తీవ్ర జాప్యం కారణంగా అంచనా వ్యయం రూ.3,230.02 కోట్ల నుంచి 85 శాతం పెరిగి రూ. 5,960 కోట్లకు చేరింది. -
ప్రారంభమైన బోగిబీల్... ప్రత్యేకతలెన్నో!
-
ప్రారంభమైన బోగిబీల్... ప్రత్యేకతలెన్నో!
గువహటి : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘బోగిబీల్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. 5 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిగా నిలిచింది బోగిబీల్ బ్రిడ్జి. బ్రహ్మపుత్ర నది మీద అస్సాంలోని దిబ్రూఘర్, ధేమాజీ జిల్లాల నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీని వల్ల 170 కిలోమీటర్ల దూరంతో పాటు, 4 గంటల ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. చైనా సరిహద్దు సమీపం వరకూ నిర్మించిన ఈ బ్రిడ్జి భారత రక్షణ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. యుద్ధ ట్యాంక్‌ల కదలికలను, ఫైటర్ జెట్ల ల్యాండింగ్లను తట్టుకునేవిధంగా చాలా బలంగా బోగిబీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జ్‌కు సంబంధించి విశేషాలు.. 1. స్వీడన్, డెన్మార్క్‌ల మధ్య నిర్మించిన వంతెన ఆధారంగా 1997లో ఈ బ్రిడ్జ్‌ని డిజైన్ చేశారు. భారతదేశంలోనే పూర్తిస్థాయిలో వెల్డింగ్ చేసిన బ్రిడ్జిగా మాత్రమే కాక యూరోపియన్ కోడ్స్, వెల్డింగ్ స్టాండర్డ్‌ని పాటించిన తొలి బ్రిడ్జిగా బోగిబీల్ బ్రిడ్జి నిలిచింది. పూర్తిగా వెల్డింగ్ చేయడం వల్ల దీనికి నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుందంటున్నారు ఇంజనీర్లు. 2. బోగిబీల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండో అతి పొడవైన బ్రిడ్జిగా నిలిచింది. దీని జీవితకాలం 120 సంవత్సరాలు. 3. ఈ బ్రిడ్జి నిర్మాణంలో కింది భాగంలో రెండు రైల్వే ట్రాక్‌లు ఉండగా.. పై భాగంలో మూడు రోడ్ ట్రాక్‌లను నిర్మించారు. వీటి వల్ల ఢిల్లీ నుంచి దిబ్రూఘర్ మధ్య ప్రయాణ కాలం మూడు గంటలు తగ్గుతుంది. 4. బ్రిడ్జి ప్రారంభంతో పాటు మోదీ తిన్సుకియా - నహర్లాగున్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రారంభించారు. ఇది వారంలో ఐదు రోజులు నడుస్తుంది. 5. తొలుత దీన్ని రూ. 3, 200 కోట్ల బడ్జెట్‌తో 4. 31 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని భావించారు. కానీ తరువాత దీన్ని 4. 9 కిలోమీటర్ల దూరానికి పెంచారు. ఫలితంగా బడ్జెట్ రూ. 5, 900 కోట్లకు చేరింది. 6. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ 1997, జనవరి 22న ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో పని ప్రారంభించారు. నేడు వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. 7. బ్రహ్మపుత్ర నదిలో నవంబర్ నుంచి మార్చి నెలల్లో వచ్చే వరదల వల్ల దాదాపు 5 నెలల పాటు పనులకు అంతరాయం ఏర్పడిందని అందువల్లే బ్రిడ్జి నిర్మాణానికి ఇంత ఆలస్యమయ్యిందని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ మోహిందర్ సింగ్ తెలిపారు. 8. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం దాదాపు 30 లక్షల బస్తాల సిమెంట్‌ను వాడినట్లు తెలిపారు. ఇది దాదాపు 41 ఒలంపిక్ స్విమ్మింగ్ పూల్ల నిర్మాణానికి సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్‌లో కోసం దాదాపు 19, 205 మీటర్ల స్టీల్‌ను వాడారు. ఇది ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు రెండింతలన్నారు. 9. ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా, చాంగ్లాంగ్, లోహిత్, లోయర్ దిబాంగ్ వాలీ, దిబాంగ్ వాలీ, తిరాప్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. దాంతో పాటు అస్సాంలోని దిబ్రూఘర్, ధెమాజీ జిల్లాల ప్రజలు కూడా లాభపడనున్నారు. 10. చైనా సరిహద్దు సమీపం వరకూ నిర్మించిన ఈ బ్రిడ్జి భారత రక్షణ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. యుద్ధ ట్యాంక్‌ల కదలికకు, ఫైటర్ జెట్ల ల్యాండింగ్లను తట్టుకునేవిధంగా చాలా బలంగా బోగిబీల్ బ్రిడ్జి నిర్మించారు. -
21 ఏళ్ల తర్వాత పూర్తయిన అతిపెద్ద వంతెన
గువహటి : ఏళ్ల తరబడి నిర్మాణ దశలోనే మగ్గిన దేశంలోనే అతిపెద్ద వంతెన ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ 21 ఏళ్ల క్రితం శంకుస్ధాపన చేసిన బోగిబీల్ రోడ్డు కం రైలు వంతెన పూర్తయి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంగళవారం జాతికి అంకితం కానుంది. 2002లో ఈ ప్రాజెక్టు పనులను అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ప్రారంభించారు. 4.94 కిమీ పొడవున్న ఈ వంతెన అసోంలోని టిన్సుకియా అరుణాల్ప్రదేవ్లోని నహర్లగన్లను కలుపుతుంది. ఈ రూట్లో రెండు పట్టణాలను కలుపుతూ టిన్సుకియా-నహర్లగన్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రధాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈశాన్య ప్రాంత పురోభివృద్ధికి ఈ వంతెన కీలకం కానుందని అధికారులు చెబుతున్నారు.బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే ఈ డబుల్‌డెక్కర్ రైల్ రోడ్డు బ్రిడ్జి కోసం గత రెండు దశాబ్ధాలుగా అసోం, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు వేచిచూస్తున్నారు. ఈ వంతెనపై నడిచే రైలుతో ఇరు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం పదిగంటలకు పైగా తగ్గనుంది. ఇంజనీరింగ్ అద్భుతంగా కొనియాడుతున్న ఈ వంతెన ఈశాన్య సరిహద్దు రక్షణ మౌలిక వసతులకూ ఉపకరించనుంది. బ్రహ్మపుత్ర నదిపై వంతెన నిర్మాణం అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంతో పాటు సిస్మిక్ జోన్లో ఈ భూభాగం ఉండటం వంటి అవరోధాలను అధిగమించి దేశంలోనే అతిపెద్దదైన వంతెనను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఈశాన్య రైల్వేల సీపీఆర్ఓ ప్రణవ్ జ్యోతి శర్మ వెల్లడించారు. -
గోదావరి వంతెనపై పాదయాత్రకు షరతులు
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్ వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్న తరుణంలో పోలీసులు జారీ చేసిన నోటీసులు ప్రభుత్వ పక్షపాత వైఖరిని తేటతెల్లం చేశాయి. బ్రిడ్జి పైనుంచి కాకుండా మరో ప్రాంతం నుంచి పాదయాత్ర కొనసాగించాలని పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలకు జారీ చేసిన నోటీసులు కొంతసేపు హడావుడి సృష్టించాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధ్య 4.1 కిలోమీటర్ల మేర అఖండ గోదావరి నదిపై రోడ్డు కం రైలు వంతెన ఉంది. ఈ నెల 12వ తేదీన ఈ వంతెన మీదుగా జననేత జగన్ తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికేందుకు పక్షం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో ‘బ్రిడ్జి 50 ఏళ్ల క్రితం నిర్మించింది. మధ్యలో అనేకమార్లు మరమ్మతులు జరిగాయి. కండిషన్ బాగోలేనందున భారీ వాహనాలను నిషేధించాం. ఫుట్‌పాత్, రెయిలింగ్ బలహీనంగా ఉన్నాయి. వంతెన కండిషన్ దృష్ట్యా పాదయాత్ర ప్రవేశానికి మరో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసుకోండి. గత అనుభవాల దృష్ట్యా కోటిపల్లి బస్‌స్టాండ్ పరిసర ప్రాంతాల్లో తొక్కిసలాటకు అవకాశం ఉంది. బహిరంగ సభను మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోగలరు’ అని శనివారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్య ప్రకాశరావుకు నోటీసులు జారీ చేశారు. దీంతో పార్టీ సీజీసీ సభ్యురాలు, రాజానగరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి, నేతలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, కందుల దుర్గేష్ తదితరులు అర్బన్ ఎస్పీ బి.రాజకుమారితో సమావేశమయ్యారు. పాదయాత్ర విశిష్టత, బ్రిడ్జి పూర్వాపరాలపై చర్చించారు. ఈ వంతెనపై నుంచి రోజూ దాదాపు 65 రైళ్లు ప్రయాణిస్తున్నాయని, ఇందులో గూడ్స్ రైళ్లు కూడా ఉన్నాయని, ఆయా రైళ్లను సిగ్నల్ రానప్పుడు వంతనపై గంటల కొద్దీ నిలిపివేస్తున్నారని, భారీ వాహనాలు కూడా తిరుగుతున్నాయని వివరించారు. దీంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచోసుకోకుండా వలంటీర్లను నియమించుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యత వహించాలన్న షరతులతో ఎస్పీ అనుమతి మంజూరు చేశారు. -
గోదావరిలోకి దూకి మహిళ ఆత్మహత్య
రాజమహేంద్రవరం క్రైం : రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరి లోకి దూకి ఓ మ హిళ ఆత్మహత్మ చేసుకున్న సంఘటన టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నుంచి దూకింది. ఈ సంఘటనను డ్యూటీ నిమిత్తం రాజమహేంద్రవరం వైపు వస్తున్న ఓ వ్యక్తి చూసి 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన టూ టౌన్ పోలీసు లు నదిలో గజ ఈతగాళ్లను, జాలర్ల సహా యంతో వెతికించి మృతదేహాన్ని ఇస్కాన్ టెంపుల్ వెనుక ఉన్న గౌతమఘాట్ వద్ద ఒడ్డుకు చేర్చారు. మహిళ వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయని టూ టౌన్ ఎస్సై జి.ఉమా మహేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలిస్తున్నామని తెలిపారు. మృతురాలి బంధువులు ఎవరైనా ఉంటే రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. 0883–2421133 నంబర్‌ను గాని, టూ టౌన్ ఎస్సై 94932063124 ను సంప్రదించాలని తెలిపారు. -
కల్వర్టును ఢీకొన్న కారు... ఒకరి మృతి
కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో ఓ కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న కల్వర్టు రక్షణ గోడను ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కావలికి చెందిన వెన్నెల బార్ షాపు యజమాని నరసింహారావు(50), మరో వైన్ షాపు యజమాని చక్రధర్, అల్యూమినియం ఫ్యాక్టరీ యజమాని రాజారామ్ కారులో బుధవారం సాయంత్రం నెల్లూరుకు బయల్దేరారు. కోవూరు సమీపంలోని రామన్నపాలెం గేటు వద్దకు వచ్చేసరికి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఆ సమయంలో కారు నడుపుతున్న నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందగా, రాజారామ్, చక్రధర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
వారధి.. వెళ్లే దారేది
కొవ్వూరు :గోదావరి పుష్కరాల మహాపర్వం సమీపిస్తోంది. గోదావరిపై శిథిలావస్థకు చేరిన రోడ్ కం రైలు వంతెనకు మరమ్మతులు చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ పనులు మొదలు పెట్టాలంటే కొవ్వూరు-దివాన్‌చెరువు మధ్య నిర్మాణంలో ఉన్న రెండో వం తెన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. అయితే, ఆ పనులు ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోవటం లేదు. పుష్కరాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరి జిల్లాలకు తరలి వస్తా రు. ఈ నేపథ్యంలో రోడ్ కం రైలు బ్రిడ్జి మరమ్మతులతోపాటు రెండో వారధి నిర్మాణం పూర్తికాకపోతే అటు రాజ మండ్రి, ఇటు కొవ్వూరులో ట్రాఫిక్ చిక్కులు తప్పవు. శిథిలావస్థకు చేరిన రోడ్ కం రైలు వంతెనకు మరమ్మతులు చేపట్టాలంటే దాని మీదుగా వాహనాల రాకపోకలను కనీసం నెల రోజుల పాటు నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ట్రాఫిక్‌ను కొత్తగా నిర్మిస్తున్న కొవ్వూరు-దివాన్‌చెరువు వారధి మీదుగా మళ్లించాలి. ఉభయగోదావరి జిల్లాల మధ్య ప్రయాణించే వాహనాలకు రెండో వారధి ప్రత్యామ్నాయంగా కానుంది. ఇదిలావుండగా, రోడ్ కం రైలు వంతెన తాత్కాలిక మరమ్మతులకు ఈనెల 12న టెండర్లు ఖరారైనప్పటికీ వాహనాల ప్రయాణానికి ప్రత్యామ్నాయం ఉండదన్న ఉద్దేశంతో పనులను వాయిదా వేశారు. ఇటువంటి కీలక తరుణంలో రెండో వారధి నిర్మా ణం ఆలస్యమైతే ఆ ప్రభావం రోడ్ కం రైలు వంతెన మరమ్మతులపై పడుతుంది. రెండో వంతెన నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పుష్కరాల సాధికారత కమిటీ ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని చూస్తే మరో రెండు నెలలకు గాని ఈ వంతెన పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. కొనసాగుతున్న రెయిలింగ్ పనులు రెండో వంతెన ఎడమ వైపు రెండు వరుసల రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. వంతెనపై తారు రోడ్డు వేయాల్సి, 58వ పిల్లర్ సమీపంలో జాయింట్ వేయాల్సి ఉంది. ఆ పనుల ను అసంపూర్తిగా విడిచిపెట్టారు. కుడివైపు రెండు వరుసల వంతెన నిర్మాణం పూర్తయినప్పటికీ రెయిలింగ్ పనులు పూర్తి కాలేదు. 48వ కుడి పిల్లర్ నుంచి 55వ పిల్లర్ వరకు మాత్రమే రెయిలింగ్ నిర్మాణం పూర్తయ్యింది. ఈ పనులు పూర్తయితే తప్ప వంతెనపై తారు రోడ్డు వేసే పరిస్థితి లేదు. పూర్తి కాని అప్రోచ్ రోడ్ల నిర్మాణం వంతెనకు రెండువైపులా అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అన్నిరకాల అడ్డంకులు తొలగి రెండేళ్లు కావస్తున్నా పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. కొవ్వూరు వైపు 1.98 కిలోమీటర్ల పొడవున అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. కేవలం సీఆర్బీ రోడ్డు వేశారు. ప్రస్తుతం కొవ్వూరు వాటర్‌వర్క్స్ సమీపంలో నిర్మించిన అండర్ పాసేజ్ వద్ద కాంక్రీట్ పనులు అసంపూర్తిగా జరిగాయి. ఆర్టీసీ కాలనీ సమీపంలో ఇటీవలే రివిట్మెంట్ పనులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాతేరు నుంచి దివాన్‌చెరువు మీదుగా జాతీయ రహదారిని కలుపుతూ 9 కిలోమీటర్ల పొడవున అప్రోచ్ రోడ్డు నిర్మిస్తున్నారు. కాతేరు సమీపంలో అండర్ పాసేజ్ నిర్మాణంలో ఉంది. రాజ మండ్రి ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారిలో నిర్మించే అండర్ పాసేజ్ మార్గం వద్ద పనులు పూర్తికాలేదు. తోట వెంకటాచలం ఎత్తిపోతల పథకం కాలువపై అండర్ టన్నెల్ నిర్మాణంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా వైపు వంతెన నుంచి అప్రోచ్ రోడ్డుకు సుమారు కిలోమీటరు మేర ఇరువైపులా గోడ నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. కాతేరుకు అర కిలోమీటరు దూరం నుంచి దివాన్‌చెరువుకు అరకిలో మీట రు దూరం వరకు తారు రోడ్డు వేశారు. జాతీయ రహదారిని కలిపే ప్రదేశంలో సుమారు అర కిలోమీటరు మేర రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఆది నుంచీ ఆలస్యమే ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ అఖండ గోదావరిపై ఆరేళ్ల క్రితం ప్రారంభించిన రెండో వారధి నిర్మాణం పనులు తొలినుంచీ నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు గడువు పెంచినప్పటికీ నిర్మాణం పూర్తి కావడం లేదు. రూ.808 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను గామన్ ఇండియా సంస్థ బీవోటీ (నిర్మాణం, నిర్వహణ, బదిలీ) పద్ధతిపై నాలుగు వరుసల రోడ్డు వంతెత రూపంలో నిర్మిస్తోంది. 4.10 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన పనులను 2009 మే నెలలోప్రారంభించారు. 2012 మే నాటికి మొత్తం పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంది. వివిధ కారణాలతో గడువు పొడిగించుకుంటూ వచ్చారు. మార్చి నెలాఖరు నాటికి చివరి గడువు పూర్తికానుంది.