కల్వర్టును ఢీకొన్న కారు... ఒకరి మృతి | car dashes a road bridge and one died | Sakshi
Sakshi News home page

కల్వర్టును ఢీకొన్న కారు... ఒకరి మృతి

Published Wed, Mar 11 2015 6:12 PM | Last Updated on Thu, Aug 30 2018 4:41 PM

car dashes a road bridge and one died

కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో ఓ కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న కల్వర్టు రక్షణ గోడను ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కావలికి చెందిన వెన్నెల బార్ షాపు యజమాని నరసింహారావు(50), మరో వైన్ షాపు యజమాని చక్రధర్, అల్యూమినియం ఫ్యాక్టరీ యజమాని రాజారామ్ కారులో బుధవారం సాయంత్రం నెల్లూరుకు బయల్దేరారు. కోవూరు సమీపంలోని రామన్నపాలెం గేటు వద్దకు వచ్చేసరికి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఆ సమయంలో కారు నడుపుతున్న నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందగా, రాజారామ్, చక్రధర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement