
కరీంనగర్‌క్రైం: దగ్గరి బంధువులు అవమానించారని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్‌లోని మారుతినగర్‌లో గురువారం జరిగింది. కాలనీకి చెందిన రహనా సుల్తానా(27) మూడు రోజుల క్రితం ఇంటి వద్ద పని చేసుకుంటుండగా ఆమెకు దగ్గరి బంధువు అయిన ఎండీ.నసీబ్‌ఖాన్, అతడి భార్య పర్వీన్, కూతురు ఆఫ్రిన్, అల్లుడు ఎండీ.రహీం ఇంటికి వెళ్లారు.
రహీంతో ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకున్నావు... మా ఇంటి పరువు తీస్తున్నావు.. ఎందుకు బతికి ఉన్నావు అంటూ దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన సుల్తానా గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆమెను దూషించిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్రిటౌన్ ఇన్‌స్పెక్టర్ విజయకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment