
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు బంధువులపై చీటింగ్ కేసు నమోదైంది. తన ప్రాపర్టీలో అక్రమంగా ఉంటున్నారని దండు లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. తన్నీరు గౌతం, బోయినిపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావుపై మియాపూర్ పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.
బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోటు తీసుకుని హరీష్‌రావు బంధువులు చీటింగ్‌కు పాల్పడ్డారని.. తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారంటూ జంపన ప్రభావతిపై లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని.. ఈ విషయంపై 2019 నుంచి పోరాడుతున్నానని లచ్చిరాజు అంటున్నారు.
ఇదీ చదవండి: సాహితీలో తవ్వేకొద్దీ డొల్ల కంపెనీలు
Comments
Please login to add a commentAdd a comment