అల్లుడితో అనైతిక బంధం.. ఆత్మహత‍్య | Women Extramarital Affair With Son In Law And Life Less In Mahabubnagar | Sakshi
Sakshi News home page

అల్లుడితో అనైతిక బంధం.. వివాహిత ఆత్మహత‍్య

Published Sun, Jul 19 2020 9:17 AM | Last Updated on Sun, Jul 19 2020 9:36 AM

Women Extramarital Affair With Son In Law And Life Less In Mahabubnagar - Sakshi

శివనాయక్‌, దేవమ్మ

పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చురేపింది. విషయం తెలిసిందని వివాహిత ప్రియుడితో కలిసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు తల్లి ప్రేమకు నోచుకోక అనాథలయ్యారు. ఈ సంఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లా బౌసింగ్‌ తండా గ్రామపంచాయతీ వంపుతండాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.  

సాక్షి, మదనాపురం: వంపుతండాకు చెందిన దేవమ్మ(30, పార్వతమ్మ)కు అదే తండాకు చెందిన రాజుతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త డోజర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భర్త లేని సమయంలో అదే తండాకు చెందిన శివనాయక్ ‌(22) వరుసకు అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి తండాలో కొంత మంది చర్చించుకున్నారు. తమ వివాహేతర సంబంధం ఎక్కడ బయట పడుతుందోనని ఆందోళన చెందింది. శుక్రవారం రాత్రి ఇద్దరూ కొన్నూరు క్రాస్‌ రోడ్డు వద్ద పెద్దతొక్కుడోని బండపై పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

అటుగా పొలాల వైపు వెళ్లిన రైతులు వీరిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్‌ సాయంతో వీరిని చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్‌ తీసుకెళ్తుండగా.. ఇద్దరూ మార్గమధ్యంలో మృతిచెందారు. ఇద్దరి మృతదేహాలకు పంచనామా నిర్వహించి బంధువులకు అప్పజెప్పనున్నట్లు ఎస్‌ఐ తిరుపాజీ తెలియజేశారు. పిల్లల అమాయకపు చూపులు.. తల్లి మృతిచెందడంతో ఇద్దరు కుమార్తెలు, ఓ బాలుడు బాధతో తల్లి వైపు చూస్తున్న చూపులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement