ఎన్‌ఆర్‌ఐ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య | Women Suicide With Husband Harassments Karimnagar | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

Published Thu, May 9 2019 9:07 AM | Last Updated on Thu, May 9 2019 10:13 AM

Women Suicide With Husband Harassments Karimnagar - Sakshi

రోదిస్తున్న కుటుంబ సభ్యులు,  భర్త రవీందర్‌తో లావణ్య (ఫైల్‌)

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్‌ఆర్‌ఐ పెళ్లి కొడుకు న్యూజిలాండ్‌ దేశంలో పెద్ద ఉద్యోగం లక్షల్లో జీతం పైగా చిన్నప్పటి నుండి తమ కళ్లముందే పెరిగిన మేనల్లుడు కావడంతో అడిగినంతా కట్నం ఇచ్చి అంగరంగా వైభవంగా కూతురునిచ్చి పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రల ఆశాలు అడియాశలయ్యాయి.. కాపురానికి వెళ్లి అల్లుడితో కలిసిమెలిసి జీవణం సాగిస్తుందనుకున్న తమ గారాలపట్టి తమ కళ్ల ముందే కాటికి పయణమవుతుందని వారు ఏనాడూ ఊహించలేదు.. మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెవుల దేవయ్య భాగ్యవ్వల చిన్న కూతురు చెవుల లత (22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి దూలానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు చెవుల దేవయ్య భాగ్యవ్వల చిన్న కూతురు లత లావణ్య (అత్తింటి వారు పెట్టుకున్న పేరు)ను ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన రాజం లచ్చయ్య లచ్చవ్వల రెండో కొడుకైన తమ మేనల్లుడు రాజం రవీందర్‌తో 9 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఎకరం నర భూమితో పాటు రూ.6 లక్షల కట్నం, 15 తులాల బంగారం పెట్టి వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి తరువాత రవీందర్‌ తనతో పాటు భార్య లావణ్యను వెంటబెట్టుకుని తాను ఉద్యోగం చేస్తున్న న్యూజిలాండ్‌ దేశానికి తీసుకువెల్లాడు. ఆప్యాయంగా చూసుకోవాల్సిన భార్య లావణ్యను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. నువ్వు నాకు సరితూగవంటూ హేలన చేస్తూ తనకు వేరే స్త్రీలతో సంభందాలున్నాయని నాకు విడాకులిచ్చి నీ దారి నువ్వు చూసుకోవాలంటూ హింసించాడు. అతగాడి ఆగడాలను  6 నెలల పాటు భరించిన లావణ్య అక్కడ ఇమడలేక తల్లిగారి ఇళ్‌లైన లక్ష్మీపూర్‌కి న్యూజిలాండ్‌ నుండి వచ్చేసింది.

జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని బోరున విలపించింది. మేనల్లుడే కావడంతో లావణ్య తల్లిదండ్రులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు కానీ రవీందర్‌ ససేమిరా అనడంతో విషయం పోలీస్‌ స్టేషన్‌ వరకూ చేరింది. కానీ లావణ్య భర్త రవీందర్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాధు చేసేందుకు నిరాకరించడంతో పోలీసులు ఏమి చేయలేకపోయారు. నెల రోజుల క్రితం స్వగ్రామం గొల్లపల్లికి చేరుకున్న రవీందర్‌తో పలుమార్లు పెద్ద మనుషులు పంచాయతీలు సమస్య కొలిక్కి రాలేదు. మూడు రోజుల క్రితం రవీందర్‌ న్యూజిలాండ్‌ తిరిగి వెళ్లిపోగా మనస్థాపానికి గురైన లావణ్య లక్ష్మీపూర్‌లోని తల్లిగారింట్లో ఇంటిలో ఎవరూ లేని సమయంలో బుదవారం చున్నీతో ఉరివేసుకుని ఆత్మహాత్య చేసుకుంది.

పరుగులు తీసిన పోలీసులు..
లావణ్య ఆత్మహత్య చేసుకోవడం లక్ష్మీపూర్‌ గ్రామస్తులు తట్టుకోలేకపోయారు. ఆగ్రహానికి లోనైన బందువులు, గ్రామస్తులు లావణ్య మృతదేహంతో ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని అత్తింటివారి ఇంటి ముందు ధర్నా చేయాలని నిశ్చయించుకున్నారు. తంగళ్లపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రకి తరలిస్తున్న క్రమంలో పోలీసు వాహనం వెనక వస్తుండగానే పోస్టుమార్టం కాకముందే పోలీసుల కళ్లు గప్పి ఎల్లారెడ్డిపేట వైపు తరలించారు. విషయం తెలుసుకున్న తంగళ్లపల్లి పోలీసులు ఉరుకులు, పరుగులు పెడుతూ అంబులెన్స్‌ వాహనాన్ని మార్గమధ్యమంలో ఆపిన తంగళ్లపల్లి ఎస్సై వి.శేఖర్‌ గ్రామస్తులకు నచ్చజె ప్పి తిరిగి ఆసుపత్రికి తరలించారు. లావణ్య కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాధు మేరకు ఎస్సై శేఖర్‌ కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement