husband harrasment
-
దుబాయ్‌లో శ్రీకాకుళం మహిళకు భర్త వేధింపులు
సాక్షి, అమరావతి: దుబాయ్‌లో భర్త వేధింపులకు గురవుతున్న శ్రీకాకుళానికి చెందిన మహిళతోపాటు ఆమె తల్లిదండ్రులను ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) సురక్షితంగా భారతదేశానికి చేర్చింది. శ్రీకాకుళానికి చెందిన కావ్య, తన భర్త అవినాష్, రెండేళ్ల కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. ఇటీవల భర్త అవినాష్ అదనపు కట్నం కోసం తనతోపాటు కుమార్తెను, తల్లిదండ్రులను సైతం వేధిస్తున్నాడని కావ్య ఇటీవల వీడియో ద్వారా తెలియజేసింది. తాము భారత్ రాకుండా అడ్డుకునేందుకు అవినాష్ అక్కడి కోర్టును ఆశ్రయించి తన రెండేళ్ల కుమార్తె ప్రయాణంపై నిషేధం విధించేలా చేశాడని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డ్టాకర్ సీదిరి అప్పలరాజు తమ దృష్టికి తీసుకువచ్చారని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. తాము వెంటనే వివరాలు సేకరించి కావ్య తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ఇండియాకు తిరిగి వెళ్లే విధంగా ఎంబసీ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే కావ్య కుమార్తెను కూడా స్వదేశానికి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత కావ్య సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తాము క్షేమంగా భారత్‌కు చేరుకునేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ చేసిన సాయం మరువలేనిదని, తన పాపను కూడా తీసుకొచ్చే విధంగా చూడాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
ఆడపిల్లను కన్నావు.. అదనపు కట్నం తెస్తేనే సంసారం
ఖిలా వరంగల్: ‘ఆడపిల్లను కన్నావు.. అదనపు కట్నం తెస్తేనే సంసారం’అంటూ కట్టుకున్న భర్తతోపాటు అత్తామామలు వేధించారు. భరించలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ ముష్క శ్రీనివాస్ కథనం ప్రకారం.. వరంగల్ విశ్వనాథ కాలనీకి చెందిన చిల్కూరు దేవేందర్‌రెడ్డి కుమార్తె భవానిరెడ్డి (25)కి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి దొంగల రాకేశ్‌రెడ్డితో 2020లో వివాహమైంది. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.7లక్షల నగదు, 16తులాల బంగారం, ఇతర సామన్లు ఇచ్చారు. వీరికి ఇటీవల కుమార్తె పుట్టింది. దీంతో ‘ఆడపిల్లను కన్నావు.. ఆదనపు కట్నం తెస్తే సంసారం చేస్తా. లేకుంటే వదిలేస్తా. కట్నం తెచ్చేవరకు తల్లిగారింటి దగ్గరే ఉండు’అంటూ భర్త రాకేశ్‌రెడ్డి వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 16న కూడా భర్త, అత్తామామలు ఫోన్ చేసి మరీ హెచ్చరించారు. దీంతో భవాని అదేరోజు ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. తల్లిదండ్రులు ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. భవాని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీడియో కాల్‌తో భార్యను ‘రొంపి’లోకి దించేందుకు భర్త యత్నం
పురుషులు మహిళలను ఇంకా ఆట వస్తువుగానే భావిస్తున్నారు. ఆమెను అడ్డంగా పెట్టుకుని అప్పనంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలు వికృత రూపాలకు దారి తీస్తోంది. డబ్బుపై ఆశతో అబలను పాడు వృత్తిలోకి దింపుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఓ వ్యక్తి తన భార్యను ఆ వృత్తిలోకి దింపేందుకు ప్రయత్నించాడు. భార్య నిద్రిస్తుండగా ఆమెను వీడియో కాల్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఆమె శరీరంపై వికృత చేష్టలు చేస్తూ అవతలి వారికి వీడియో కాల్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న భార్య పోలీసులను ఆశ్రయించింది. అలా చేసిన వ్యక్తి ఓ వైద్యుడు. పైగా ముంబైలోని ఓ స్టార్ హోటల్ యజమాని పుత్రరత్నం. ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ ఫిజియోథెరపిస్టు 2014లో ఓ యువతి (28)ని వివాహం చేసుకున్నాడు. అతడు ముంబైలోని ఓ స్టార్ హోటల్ యజమాని కుమారుడు. వీరికి ఏడేళ్లయినా ఇంతవరకు సంతానం కలగలేదు. దీంతో అత్తింటి వారు వేధించడం మొదలుపెట్టారు. అయితే భర్తకు అశ్లీల వీడియోలు చూడడం బాగా అలవాటు. వాటికి బానిసగా మారాడు. ఇక పిల్లలు పుట్టడం లేదుగా నువ్వు పోర్న్ స్టార్ అయితే డబ్బులు బాగా సంపాదించొచ్చు అని భార్యకు చెప్పాడు. ఆ వృత్తిలోకి దింపేందుకు ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తీసుకు వస్తున్నాడు. అయితే భార్య ససేమిరా అటోంది. దీనిపై కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్త ఇలా అయితే కాదని జూన్ నెలలో ఒకరోజు భార్య నిద్రిస్తుండగా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాడు. ఓ వ్యక్తికి తన భార్యను చూపించేందుకు ప్రయత్నం చేశాడు. ఆమె నిద్రిస్తుండగా ప్రైవేటు పార్ట్స్‌లో వికృత చేష్టలు చేస్తూ అవతలి వ్యక్తికి లైవ్‌లో చూపిస్తున్నాడు. వెంటనే తేరుకున్న ఆమె భర్త చేసిన పనికి హతాశయురాలైంది. ఈ విషయం అత్తామామలకు చెప్పగా వారు కుమారుడిని వెనకేసుకొచ్చారు. ఆమె పుట్టింటికి చేరింది. మతాచారం ప్రకారం విడాకులు తీసుకో అని అత్తింటి వారు చెప్పగా ఆమె తిరస్కరించింది. ‘భారతదేశంలో ఉన్నాం.. చట్టపరంగా విడాకులు తీసుకుంటా’ అని ప్రకటించి పోలీసులను ఆశ్రయించింది. ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి గజనాన్ కబ్డులే తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. అతడు వినియోగించిన ఫోన్‌ను సీజ్ చేశాం’ అని వివరించారు. -
వివాహిత ఆత్మహత్య
-
ఆడపిల్లకు జన్మనిచ్చిందని..!
-
ఎన్ఆర్ఐ భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎన్ఆర్ఐ పెళ్లి కొడుకు న్యూజిలాండ్ దేశంలో పెద్ద ఉద్యోగం లక్షల్లో జీతం పైగా చిన్నప్పటి నుండి తమ కళ్లముందే పెరిగిన మేనల్లుడు కావడంతో అడిగినంతా కట్నం ఇచ్చి అంగరంగా వైభవంగా కూతురునిచ్చి పెళ్లి చేసిన ఆ తల్లిదండ్రల ఆశాలు అడియాశలయ్యాయి.. కాపురానికి వెళ్లి అల్లుడితో కలిసిమెలిసి జీవణం సాగిస్తుందనుకున్న తమ గారాలపట్టి తమ కళ్ల ముందే కాటికి పయణమవుతుందని వారు ఏనాడూ ఊహించలేదు.. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చెవుల దేవయ్య భాగ్యవ్వల చిన్న కూతురు చెవుల లత (22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి దూలానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు చెవుల దేవయ్య భాగ్యవ్వల చిన్న కూతురు లత లావణ్య (అత్తింటి వారు పెట్టుకున్న పేరు)ను ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన రాజం లచ్చయ్య లచ్చవ్వల రెండో కొడుకైన తమ మేనల్లుడు రాజం రవీందర్‌తో 9 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఎకరం నర భూమితో పాటు రూ.6 లక్షల కట్నం, 15 తులాల బంగారం పెట్టి వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి తరువాత రవీందర్ తనతో పాటు భార్య లావణ్యను వెంటబెట్టుకుని తాను ఉద్యోగం చేస్తున్న న్యూజిలాండ్ దేశానికి తీసుకువెల్లాడు. ఆప్యాయంగా చూసుకోవాల్సిన భార్య లావణ్యను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. నువ్వు నాకు సరితూగవంటూ హేలన చేస్తూ తనకు వేరే స్త్రీలతో సంభందాలున్నాయని నాకు విడాకులిచ్చి నీ దారి నువ్వు చూసుకోవాలంటూ హింసించాడు. అతగాడి ఆగడాలను 6 నెలల పాటు భరించిన లావణ్య అక్కడ ఇమడలేక తల్లిగారి ఇళ్లైన లక్ష్మీపూర్‌కి న్యూజిలాండ్ నుండి వచ్చేసింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని బోరున విలపించింది. మేనల్లుడే కావడంతో లావణ్య తల్లిదండ్రులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు కానీ రవీందర్ ససేమిరా అనడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. కానీ లావణ్య భర్త రవీందర్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాధు చేసేందుకు నిరాకరించడంతో పోలీసులు ఏమి చేయలేకపోయారు. నెల రోజుల క్రితం స్వగ్రామం గొల్లపల్లికి చేరుకున్న రవీందర్‌తో పలుమార్లు పెద్ద మనుషులు పంచాయతీలు సమస్య కొలిక్కి రాలేదు. మూడు రోజుల క్రితం రవీందర్ న్యూజిలాండ్ తిరిగి వెళ్లిపోగా మనస్థాపానికి గురైన లావణ్య లక్ష్మీపూర్‌లోని తల్లిగారింట్లో ఇంటిలో ఎవరూ లేని సమయంలో బుదవారం చున్నీతో ఉరివేసుకుని ఆత్మహాత్య చేసుకుంది. పరుగులు తీసిన పోలీసులు.. లావణ్య ఆత్మహత్య చేసుకోవడం లక్ష్మీపూర్ గ్రామస్తులు తట్టుకోలేకపోయారు. ఆగ్రహానికి లోనైన బందువులు, గ్రామస్తులు లావణ్య మృతదేహంతో ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని అత్తింటివారి ఇంటి ముందు ధర్నా చేయాలని నిశ్చయించుకున్నారు. తంగళ్లపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రకి తరలిస్తున్న క్రమంలో పోలీసు వాహనం వెనక వస్తుండగానే పోస్టుమార్టం కాకముందే పోలీసుల కళ్లు గప్పి ఎల్లారెడ్డిపేట వైపు తరలించారు. విషయం తెలుసుకున్న తంగళ్లపల్లి పోలీసులు ఉరుకులు, పరుగులు పెడుతూ అంబులెన్స్ వాహనాన్ని మార్గమధ్యమంలో ఆపిన తంగళ్లపల్లి ఎస్సై వి.శేఖర్ గ్రామస్తులకు నచ్చజె ప్పి తిరిగి ఆసుపత్రికి తరలించారు. లావణ్య కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాధు మేరకు ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. -
భర్త ఇంటి ముందు పోరాటం
అన్నానగర్: తనతో కలిసి జీవించాలని కోరుతూ ఓ మహిళ రెండు నెలల బిడ్డతో మంగళవారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. చెన్నై కొరుక్కుపేట, ఎలిల్‌నగర్ ప్రాంతానికి చెందిన రమేష్‌కుమార్ (28)కు తండయారుపేటకు చెందిన పవిత్ర (33)తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరికి వివాహం జరిగిన కొన్ని నెలల్లో రమేష్‌కుమార్ తండ్రి మృతి చెందాడు. భార్య తన ఇంటిలో అడుగుపెట్టడం వల్లే తన తండ్రి మృతిచెందాడని రమేష్‌కుమార్ ఆమెను హింసించేవాడు. ఈ క్రమంలో పవిత్రని పుట్టింటికి పంపించాడు. కొన్ని రోజుల తర్వాత తీసుకెళతానని తెలిపాడు. అయితే పవిత్రకు ఆడపిల్ల పుట్టి రెండు నెలలైనా రమేష్‌కుమార్ ఆమెను తీసుకెళ్లలేదు. ఆమెను తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో మంగళవారం రమేష్‌కుమార్ ఇంటి ముందు బిడ్డతో కూర్చొని ధర్నాకు దిగింది. దీనిపై తండయారుపేట మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
పశ్చిమగోదావరి,ఏలూరు టౌన్: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలం పోణంగి గ్రామానికి చెందిన జువ్వల ఏసుబాబు, మౌనికకు 22 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఏసుబాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మౌనిక తల్లి తండ్రి కూడా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్యభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మౌనిక ఇంటిలో పడకగదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే సమయంలో మౌనిక తల్లి కూడా ఆమె ఇంటికి చేరుకుంది. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్న మౌనికను భర్త కిందికి దించాడు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక మృతి చెందినట్టు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వృద్ధుడి మృతి ఏలూరు టౌన్: ఏలూరు శాంతినగర్ ఒకటో రోడ్డులో గుర్తు తెలియని వృద్ధుడు(65) ఒక అపార్టుమెంట్ వద్ద మృతిచెంది పడి ఉన్నాడు. స్థానికులు సమాచారం అందించటంతో త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ వృద్ధుడు ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడని, అతని పేరు తుమ్మల నరేంద్ర చౌదరి అని చెబుతున్నారు. వివరాలు తెలిసిన వారు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై పైడిబాబు ఫోన్ నెంబర్ 9063334448కు గానీ, 08812 22338కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఆర్థిక బాధలు తాళలేక.. ఏలూరు టౌన్: భర్త అనారోగ్యంతో బాధపడటం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు సతమతం చేయటంతో ఆర్థిక బాధలు తాళలేక వివాహిత అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ వెంకటాపురం పంచాయతీ రామనగర్ కాలనీకి చెందిన కిశోర్‌కుమార్, పుష్పకు కొంతకాలం క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. రెండేళ్ల క్రితం కిశోర్‌కుమార్‌కు పక్షవాతం రావటంతో అప్పటి నుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు. ఇంటి వద్ద చిన్న దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావటంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్ప అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఏలూరు టౌన్: కడుపునొప్పి తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన మోహన్ ఒక ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మోహన్‌కు తీవ్రస్థాయిలో కడుపునొప్పి రావటంతో భరించలేక ఇంటివద్దనే మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
బావిలో శవాలై తేలిన తల్లీ కొడుకులు
బొండపల్లి(గజపతినగరం) : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు గాని.. ముక్కు పచ్చలారని మూడేళ్ల కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ముద్దూరు గ్రామానికి చెందిన మునకాల అప్పలనాయుడుకు విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొరుగుపాలెంనకు చెందిన ఉమాదేవితో నాలుగు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి జ్యోతీష్ (3) కుమారుడున్నారు. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగినా, అప్పలనాయుడు మద్యానికి బానిస కావడంతో ఎప్పటికప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో వ్యసనం మానాలని భార్య ఉమాదేవి ఎప్పటికప్పుడు కోరేది. అయితే అప్పలనాయుడు వ్యసనం మానకపోగా తిరిగి అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యపై ఒత్తిడి తీసుకువచ్చేవాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం కూడా అప్పలనాయుడు తాగి రావడంతో భార్యాభర్తలత మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఉమాదేవి తల్లికి ఫోన్ చేసి వెంటనే వచ్చి తనను, కుమారుడ్ని తీసుకెళ్లాలని కోరింది. లేనిపక్షంలో నా శవం చూస్తారంటూ చెప్పింది. అయితే గొడవలు సహజమని, సర్దుకుపోవాలని ఉమాదేవి తల్లి సూచించింది. తెల్లారేసరికి గ్రామ సమీపంలో ఉన్న బావిలో రెండు మృతదేహాలు ఉన్నాయని ప్రచారం జరగడంతో అందరూ వెళ్లి చూడగా బావిలో ఉమాదేవి (25), జ్యోతీష్ (3) మృతదేహాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి మృతదేహాలను బయటకు తీశారు. అదనపు కట్నం కోసం అల్లుడే తన కుమార్తెను చంపారని తల్లి కొండమ్మ, మేనమామ లండ రమణలు ఆరోపించారు. ఇదే విషయమై బొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళిదాసు, బొండపల్లి ఎస్సై ఎస్. సుదర్శన్, బొబ్బిలి డీఎస్పీ పి. సౌమ్యలత గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం పీహెచ్‌సీకి తరలించారు. సీఐ పర్యవేక్షణలో ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.. తల్లీ, కుమారుడు మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎస్సై సుదర్శన్, సీఐ కాళిదాసులను డీఎస్పీ సౌమ్యలత ఆదేశించారు. మృతురాలి తల్లి,కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని డీఎస్పీ చెప్పారు. -
భార్యపై ఒత్తిడి తీసుకురావొద్దు: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : భార్య వస్తువు కాదని.. ఇష్టం ఉన్నా, లేకున్నా ఆమెను బలవంతంగా భర్త తన దగ్గరే ఉండాలనడం సరైన పద్ధతి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టం లేదని ఎంత మొత్తుకున్నా తన ఇంట్లోనే, తన దగ్గరే ఉండాలని భర్త క్రూరమైన చర్యలకు దిగుతున్నాడంటూ ఓ వివాహిత సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భర్తపై వేసిన క్రిమినల్ కేసు పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం బాధితురాలకి బాసటగా నిలిచేలా తీర్పు వెల్లడించింది. ‘భార్యేం వస్తువు కాదు. నీతో ఉండాలని భార్యను బలవంతం చేయవద్దు. ఆమె నీ వద్ద ఉండాలని కోరుకోవడం లేదు. నీ ఇంట్లోనే, నీతోనే ఉండాలని నువ్వు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నావంటూ’ మదన్ బి లోకూర్, దీపక్ గుప్తా ధర్మాసనం ఆ వివాహిత భర్తను ప్రశ్నించింది. భార్య తనతోనే ఉండాలన్న నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవాలని, ఆమె ఒప్పుకుంటే ఎలాంటి సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు. కానీ మహిళకు ఇష్టం లేని పక్షంలో ఆమె కోరుకున్న చోట ఉండే స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుందని చెప్పారు. ఆగస్ట్ 8న మరోసారి విచారణకు రానుంది. మహిళ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘భర్త చిత్రహింసలు తట్టుకోలేక విడాకులు తీసుకోవాలని భావిస్తోంది. అయినా భర్తను క్షమించి కేసు వెనక్కి తీసుకోవాలని చూస్తున్నాం. అయితే భర్త నుంచి ఆమె వేరుగా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించిందని’ చెప్పారు. -
భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
జహీరాబాద్ టౌన్: భర్త వేధింపులు భరించలేక వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రంజోల్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య చిన్న కూతురు గుండమ్మ(19)ను ఝరాసంగం మండలంలోని కంకర్వాడ గ్రామానికి చెందిన బోయిని విఠల్ (30)కు ఇచ్చి నాలుగు నెలల కిత్రం పెళ్లి చేశారు. పెళ్లయిన నాటి నుంచి భర్త గుండమ్మను వేధిస్తున్నాడు. మద్యం తాగి శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ పెట్టించారు. ఇక నుంచి ప్రవర్తన మార్చుకోవాలని, మద్యం తాగడం మాని వేయాలని గ్రామ పెద్దలు విఠల్‌ను ఒప్పించారు. అయినా అతడిలో మార్పురాలేదు. యథావిధిగా మద్యం తాగి భార్యను కొట్టడంతో జీవితంపై విరక్తి చెందిన గుండమ్మ రంజోల్ గ్రామ సమీపంలోని ఓ బావిలో దూకి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీకాంత్ వివరించారు. -
అక్క.. చెల్లి.. ఓ అమ్మ!
సమాజమా.. ఏమి సమాధానం చెప్తావు! ఉరికొయ్యకు వేలాడుతున్న చిన్నారుల ఆత్మను ఎలా శాంతపరుస్తావు.. ఆ..వేదనకు ఎవరు కారణమంటావు.. అత్తగా మారిన తల్లికిఆడపిల్ల గిట్టదెందుకు.. అమ్మ కడుపునపుట్టిన కొడుక్కి బిడ్డ నచ్చదెందుకు..తనలో ఉన్నదీ అమ్మ రక్తమేననిగ్రహించరెందుకు..ఆమె చేతుల్లో ఏమీ లేదని తెలిసినా..ఈ వేధింపులెందుకు..నవమాసాలు మోసీ.. తండ్రిని చేసీ.. మగాడిగా నిలబెట్టినందుకాఈ ఛీత్కారం?రెక్కలొచ్చి కొడుకులెగిరిపోతే.. కాటికిపోయే దాకా కన్నీరు కార్చేది కూతురే కదా!అలసిన మనసుకు ఊరటఆమె నవ్వులు కాదా?అమ్మ కావాలి.. అక్కాచెల్లి కావాలి.. భార్య కావాలి..మరి కూతురెందుకు వద్దు..రాజ్యాలేలినా.. అంతరిక్షంలోకాలుమోపినా ఆడ..పిల్లగానే చూస్తారెందుకు!ఎందుకిలా.. ఎన్నాళ్లిలా? ఆడపిల్లలు నట్టింట్లో తిరుగాడుతుంటే దేవతలు సంచరిస్తున్నంత కళ. అలాంటి చిట్టితల్లులు కళ్లెదుట కనపడుతుంటే ఓర్వలేకపోయాడో కసాయి తండ్రి. ఆడపిల్లలను కన్నతల్లిలా చూసుకోవాల్సిందిపోయి అనుక్షణం ఇల్లాలిని మగపిల్లలు లేరంటూ వేధిస్తుండటంతో ఆ తల్లి నరకయాతన అనుభవించసాగింది. అవమానాలు దిగమింగుతూ బతుకీడ్చేకంటే దేవుడి దగ్గరకు వెళ్లిపోవడమే శరణ్యమని ఇద్దరు చిన్నారులకు ఉరితాడు బిగించి తానూ ఉరేసుకుంది. హిందూపురం అర్బన్: భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలకు ఉరివేసి అనంతరం తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా నాయనపల్లిలో మంగళవారం జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు, ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాలివీ.. సోమందేపల్లి మండలం తుంగోడుకు చెందిన రత్నమ్మ, శివాచారి దంపతుల కుమారై కల్పనకు లేపాక్షి మండలంలోని నాయనపల్లికి చెందిన వీరభద్రాచారితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మేఘన (6), యశస్విని (4) సంతానం. దంపతులిద్దరూ హిందూపురంలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం భర్త విధులకు వెళ్లిన సమయంలో కల్పన (25) తన ఇద్దరు కుమార్తెలకు ఇంట్లోనే ఉరిపోసి తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సర్పంచ్ సదాశివరెడ్డి ఇనుప సమ్మెట అవసరమై కల్పన ఇంటి తలుపు తట్టగా ఎవరూ స్పందించ లేదు. అనుమానం వచ్చి కిటికీలో చూడగా పిల్లలతో పాటు తల్లి ఉరేసుకుని ఉండటాన్ని చూసి వీరభద్రాచారికి విషయం తెలిపాడు. ఇంటికి చేరుకున్న ఆయన తలుపులు తీసి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఆడపిల్లలు పుట్టారని తరచూ వేధింపులు.. ఆడపిల్లలు పుట్టారనే విషయమై దంపతులు మధ్య తరచుగా గొడవ జరుగుతుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మూడురోజుల క్రితం కూడా ఇదే విషయమై భార్యాభర్తలు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా కల్పన ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంట్లోనే పిల్లలతో ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కల్పన క్షణికావేశంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, అల్లుడే ఈ ఘోరానికి పాల్పడి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య
శంషాబాద్: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ సుపారీ ఇచ్చి భర్తను చంపించిన కేసులో ఆర్జీఐఏ పోలీసులు గురువారం నలుగు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా ఫారుఖ్‌నగర్‌కు చెందినఅక్బర్ అహ్మద్(40) దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. పదినెలల క్రితం నగరానికి తిరిగొచ్చిన అతను ప్రతిరోజూ తప్పతాగి తన భార్య రయిస్‌బేగంను వేధించేవాడు. దీంతోపాటు ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. అతడి వేధింపులను తట్టుకోలేని రయిస్‌బేగం తన భర్తను చంపించాలని నిర్ణయించుకుంది. ఇందుకుగాను తనకు పరిచయస్తులైన సయ్యద్ అదమ్ (30), అబ్దుల్ హబీబ్(28)తో రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకుని కొంత అడ్వాన్స్ చెల్లించింది. గతనెల 18న అదమ్, హబీబ్ అహ్మద్‌కు మద్యం తాగించి శంషాబాద్‌లోని కొత్వాల్‌గూడ సమీపంలోని ఆర్కే వెంచర్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అతడి తలపై రాడ్డుతో మోదడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రయిస్ బేగంపై అనుమానంతో ఆమెను విచారించగా నేరం అంగీకరించింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.