
సాక్షి, విజయవాడ: ఆవేశం, అనాలోచిత నిర్ణయాలతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. క్షణికావేశంలో యువత తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన విజయవాడలోని సింగ్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగంపల్లి నిహారిక అనే యువతి బెంగళూరులో మల్టీమీడియా పూర్తి చేసి, ప్రస్తుతం తల్లిదండ్రులతో నగరంలోనే ఉంటోంది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు నిహారిక తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. అయితే అందుకు వారు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. నిహారిక తల్లి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ కాగా, తండ్రి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment