
భర్త శశికాంత్‌తో ప్రత్యూష (ఫైల్)
అల్వాల్: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ. వరప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన కిషన్‌రావు కుమార్తె ప్రత్యుష (33)కు అల్వాల్ న్యూ రెడ్డి ఎన్‌క్లెవ్‌కు చెందిన శశికాంత్‌రావు అలియాస్ రాముతో 2013లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 20 లక్షల నగదు, కిలో బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. వీరికి ఓ కుమార్తె. రెండేళ్ల క్రితం శశికాంత్ అదనపు కట్నం కోసం వేధించడంతో కిషన్‌రావు స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు ముట్టజెప్పాడు. అయితే మళ్లీ కొద్ది రోజులుగా ఇటీవల మళ్లీ వేధిస్తుండడంతో మనస్తాపానికిలోనైన ప్రత్యూష బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment