
మహాదేవి మృతదేహం, చిన్నారి మృతదేహం
నాగర్‌కర్నూల్ రూరల్ : కలహాలు ఆ కుటుంబాన్ని కుంగదీశాయి. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగు మందు ఇచ్చి తానూ తాగింది. పరిస్థితి విషమించడంతో తల్లి, కూతురు మృతిచెందింది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.
ఈ విషాదకర సంఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల భూషయ్య, మహాదేవి(30) అలియాస్ మాధవి భార్యాభర్తలు.. వీరికి అచ్యుత, మౌనిక(4నెలలు) కూతుళ్లు ఉన్నారు. కాగా, భార్యాభర్తల మధ్య మూడు నెలలుగా తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కూతుళ్లకు పురుగు మందు తాపి తాను తాగింది.
ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్తుండగా తల్లి మహాదేవితో పాటు ఆమె కూతురు మౌనిక ఆరో గ్య పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే మృత్యువాతపడ్డారు. వీరిలో చిన్నారి అచ్యుత పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాగర్‌కర్నూల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment