అనూష మృతదేహం
తాండూరు టౌన్ : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. అదనపు కట్నం కోసం భర్త పెడుతున్న వేధింపులకు తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన తాండూరు పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ ప్రతాప్‌లింగం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాతతాండూరుకు చెందిన చాకలి అనూష (22)కు దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన అరుణ్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన వివాహం జరిగింది.
అయితే మృతురాలు భర్త, తన తల్లిదండ్రులతో కలిసి సంగారెడ్డి జిల్లా కంది పట్టణంలో జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల భర్త అరుణ్ అదనపు కట్నం తేవాలని, అలాగే పలు అనుమానాలతో వేధిస్తున్నాడు. ఇటీవల అనూష పుట్టింటికి వచ్చింది. భర్త పెట్టే మానసిక వేధింపులు తాళలేక శుక్రవారం తల్లిగారింట్లో దూలానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ మేరకు మృతురాలి తల్లి చంద్రమ్మ, తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. అనూష ఉరేసుకున్న విషయంపై వికారాబాద్ డీఎస్పీ శిరీష శుక్రవారం రాత్రి పాతతాండూరులో విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment