యువతి ఆత్మహత్య | Woman commits suicide while making arrangements for marriage | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య

Published Mon, Apr 24 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

Woman commits suicide while making arrangements for marriage

పాల్వంచ ‌: తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా, తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఉల్వనూరుకు చెందిన బెల్లంకొండ భవాని (22)కి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

కాని అసలు పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టంలేదని భవాని తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ వారు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తీవ్ర మనస్థాపానికి గురైన భవాని సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సుధాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement