palvancha
-
పాల్వంచ KTPS కూలింగ్ టవర్ల కూల్చివేత
-
పెళ్లై.. రెండు నెలలు కాలేదు.. అంతలోనే..
భద్రాద్రి: రెండు నెలల క్రితం వివాహమైంది. బతుకుదెరువు కోసం భాగ్యనగరం వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు చెట్టును ఢీకొని నవ వధువు మృతి చెందింది. భర్త, అత్త, మామలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం కుందారం సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన అంబడి ప్రశాంత్‌కు ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన సింధూజ(23)తో గత జూన్ 8న వివాహం జరిగింది. కారు నడుపుతూ జీవనం సాగిస్తున్న ప్రశాంత్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి క్యాబ్ నడుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల భార్యతోపాటు తల్లిదండ్రులు శ్రీనివాస్, నాగమణి తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లి, అద్దెకు ఇల్లు తీసుకుని వచ్చాడు. మంగళవారం రాత్రి ఉల్వనూరులో ఇంటికి తాళంవేసి నలుగురూ కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో జనగామ జిల్లా పాలకుర్తిరోడ్లోని కుందారం సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో సింధూజ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ప్రశాంత్, అతని తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వివాహమై రెండు నెలలు కాకముందే.. ప్రశాంత్, సింధూజకు వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తిగా నిండలేదు. ఇక్కడ బతుకుదెరువు లేకపోడంతో హైదరాబాద్ వెళ్లి కారు క్యాబ్ నడుపుకునేందకు కుటుంబం అంతా బయల్దేరారు. అవసరమైన నిత్యావసర వస్తువులు బియ్యం, ఉప్పు, కారం, పచ్చళ్లు, కుట్టు మిషన్ వంటి సామగ్రి వెంట తీసుకెళ్తున్నారు. ప్రమాదస్థలిలో నిత్యావసర వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉన్న తీరు చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహం జరిగిన రెండు నెలలు కాకముందే సింధూజ మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఉల్వనూరు, ముత్తగూడెం గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
వనమా రాఘవ ఎక్కడ?
-
రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో వనమా రాఘవేంద్ర అరెస్ట్..
-
వనమా రాఘవపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: భట్టి విక్రమార్క
-
అధికార పార్టీ ఎమ్మెల్యే రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?
సాక్షి, హైదరాబాద్: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన అందరిని కలిచి వేసిందని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత(సీఎల్పీ) లీడర్ భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు రాఘవ బెదిరింపులు తట్టుకోలేక రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ధ్వజమెత్తారు. రామకృష్ణ తన ఆవేదనను సెల్ఫీ రూపంలో వివరించాడని పేర్కొన్నారు. గతంలోనే ఓ వ్యక్తి వనమా రాఘవ పేరు రాసి చనిపోయాడని గుర్తు చేశారు. ఆ రోజే వనమా రాఘవపై చర్యలు తీసుకుంటే ఈ రోజు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొని ఉండేది కాదన్నారు. ఇంత దారుణానికి కారణమైన రాఘవను ఇంతవరకు అరెస్టు చేయలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. వనమా రాఘవపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ప్రజల మానప్రాణాలు కాపాడటం అధికారం యంత్రాంగం బాధ్యతనని పేర్కొన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉన్న దోషులను ప్రభుత్వం రక్షిస్తోందని మండిపడ్డారు. చదవండి: ఏ భర్తకూడా వినకూడని మాటలు విన్నాను.. -
Khammam: మూడేళ్ల చిన్నారిపై బాలుడు అఘాయిత్యం
సాక్షి, పాల్వంచ: ఓ చిన్నారిపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పట్టణానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై ఇంటి పక్కనే ఉండే బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు బాలుడు, తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్ష నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. చదవండి: గర్భవతిని చేసి పరార్.. నా భర్త నాకు కావాలి.. ఓ భార్య పోరాటం.. -
పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి
పాల్వంచ రూరల్: రెండు కాళ్లు చచ్చుబడి 12 ఏళ్లుగా ఓ మహిళ దయనీయ జీవనం గడుపుతోంది. భర్తే అన్ని తానై సపర్యలు చేస్తున్నాడు. పేదరికం కారణంగా మెరుగైన వైద్యం అందించలేకపోతున్నట్లు వాపోతున్నాడు. మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన ఉల్వనూరుకు చెందిన పేద దంపతులు ఆసోదు జేమ్స్, నర్సమ్మ. రోజూ వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. 2009, అక్టోబర్ 20న ఇంటివద్ద చలిమంట కాస్తుండగా, ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుని నర్సమ్మ రెండు కాళ్లు 40శాతం కాలిపోయాయి. దీంతో నరాలు దెబ్బతిన్నాయి. (చదవండి: తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం) ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. రూ.2 లక్షలపైన ఖర్చు చేశారు. చికిత్స అనంతరం కొన్నాళ్లు బాగానే నడిచింది. క్రమంగా రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకుంది. 12 ఏళ్లుగా ఇంట్లో మంచానికే పరిమితమై ఉంటోంది. బాత్రూమ్కు వెళ్లాలన్నా భర్త తన రెండు చేతుల మీదుగా ఎత్తుకెళ్లాల్సి వస్తోంది. భర్త ఇంటివద్ద లేకుంటే రెండు చేతులకు చెప్పులు వేసుకుని నేలపైన పాకుతూ బాత్రూమ్ వరకు వెళ్తుంది. ఆర్థిక స్తోమత లేక వైద్యం అందించలేకపోతున్నానని, దాతలు స్పందించి చికిత్స అందించేందుకు ఆర్థికసాయం చేయాలని నర్సమ్మ భర్త జేమ్స్ వేడుకుంటున్నాడు. దాతలు 63094 69154 నంబర్లో సంప్రదించాలని, తన ఎస్బీఐ అకౌంట్ నంబర్ 62281587607 అని తెలిపాడు. చదవండి: పెళ్లాం వేధింపులు తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌కే నిప్పు -
పాల్వంచలో అగ్ని ప్రమాదం
-
కేకు ఆశ చూపి.. ఆరేళ్ల బాలికపై..
సాక్షి. పాల్వంచ: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని గట్టాయిగూడేనికి చెందిన కడాలి శ్రీనాథ్ తాను పనిచేసే బేకరికి దగ్గర్లో ఆడుకోవడానికి వచ్చిన ఓ బాలికకు కేకు ఆశ జూపి దగ్గరకు తీసుకుని అత్యాచారానికి యత్నించాడు. దీంతో బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి శ్రీనాథ్‌కు దేహశుద్ధి చేశారు. అయితే బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గురువారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శ్రీనాథ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జె.ప్రవీణ్ తెలిపారు. చదవండి: విషాదం: పోలీస్ దంపతుల ఆత్మహత్య -
ఒకేరోజు ముగ్గురి ఆత్మహత్య
సాక్షి, పాల్వంచ: వేర్వేరుచోట్ల ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పురుగుల మందు తాగి, ఒకరు ఉరి వేసుకుని మృతి చెందారు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి తన ఇంటికి రాకపోవడంతో భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన పాల్వంచలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన జజ్జెర ప్రసాద్(30) మద్యానికి అలవాటు పడి కుటుంబ పోషణను పట్టించుకోవడంలేదు. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ప్రసాద్, భార్య సంధ్య పిల్లలతో కలిసి గొందిగూడెంలోని అత్తగారింటికి వెళ్లారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌పై నిషేధం) కరోనా లాక్‌డౌన్‌తో రెండు నెలలపాటు అక్కడే ఉన్నారు. ఇటీవల ప్రసాద్ ఒక్కడే పాల్వంచ వచ్చాడు. భార్యను ఇంటికి రమ్మని పలుమార్లు కోరగా, నువ్వే వచ్చి తీసుకెళ్లాలని చెబుతూ వస్తోంది. దీంతో మనస్తాపంతో ఉన్న ప్రసాద్ మద్యం మత్తులో ఆదివారం పురుగుల మందు తాగాడు. గమనించిన తల్లి కమలమ్మ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు జజ్జెర రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అంతులేని వ్యథ.. లక్సెట్టిపేట వాసి విషాదగాథ ) చర్లలో పురుగుల మందు తాగి.. చర్ల: పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండల పరిధిలోని కలివేరులో సోమవారం చోటు చేసుకుంది. మృతుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కలివేరు గ్రామానికి చెందిన పూనెం సతీష్ (22) భార్య, పిల్లలు దుమ్ముగూడెం మండలంలోని తన అత్తగారింటి వద్ద ఉన్నారు. సతీష్ ఆదివారం మద్యం చిత్తుగా తాగి తనకు బైక్ ఇవ్వాలని, తాను వెళ్లి భార్యాపిల్లలను చూసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పారు. మద్యం మత్తులో ఉన్నావని, రేపు వెళ్లవచ్చని తల్లిదండ్రులు వారించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంటి వెనుకకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి సత్యనారాయణపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి భద్రాచలం ఏరియావైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం ) పండుగ వేళ విషాదం ఇల్లెందు: రంజాన్ పర్వదినం రోజు ఓ ముస్లిం కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఎల్బీఎస్ నగర్లో నివాసం ఉంటున్న బాసిత్(35) ఎలక్ట్రీషియన్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాసిత్, భార్య కరీమాల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. రంజాన్ పర్వదినం సందర్భంగా భార్య ఇంట్లో లేదని మనస్తాపం చెంది, ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భద్రాద్రి జిల్లాలో స్వల్ప భూకంపం
పాల్వంచ/ పాల్వంచ రూరల్/బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం మధ్యా హ్నం 12.30 గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాల్వంచ మండలం రంగాపురం, జగన్నాథపురం, పాండురంగాపురం, లక్ష్మీదేవిపల్లి, కేశవాపురం, బస్వతారక కాలనీల్లో మూడు సెకండ్లపాడు, బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర, అంజనాపురం, పినపాక పట్టీనగర్ గ్రామాల్లో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం.. ఈ క్రమంలోనే భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు ఏం జరుగుతుందోననే ఆందోళనతో ఒక్కసారిగా పరుగులు తీశారు. అలాగే పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ కాలనీలు, గట్టాయిగూడెం, బొల్లేరుగూడెం, కాంట్రాక్టర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ, సీతారాంపట్నం తదితర ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ప్రకంపనలకు ఇళ్లలో వంట సామగ్రి కిందపడినట్లు ప్రజలు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్‌పై ఈ ప్రకంపనలు 2.6 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
పాల్వంచలో కంపించిన భూమి!
భద్రాద్రి కొత్తగూడెం: కరోనా భయాలతో వణికిపోతున్న పాల్వంచ జనాన్ని భూమాతా భయపెట్టింది. ఆదివారం మధ్యాహ్నం అక్కడ భూమి రెండు సెకన్లపాటు కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అసలే దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో జనమంతా ఇళ్లల్లోనే గడుపుతున్న సమయంలో ఈ పరిణామం ఒకింత కలవరపెట్టిందని స్థానికులు అంటున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 272 కేసులు నమోదు కాగా.. 11 మంది మరణించారు. ఇక జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (చదవండి: కరోనా కల్లోలం) -
బావమర్దినే పెళ్లి చేసుకోవాలని మందలించడంతో..
సాక్షి, పాల్వంచ: తన బావమర్దితో పెళ్లికి ఒప్పుకోకుండా, వేరే వ్యక్తితో వివాహానికి ఎలా అంగీకరించావంటూ అన్న కొట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన సప్పిడి భూమికకు జనవరి 9న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. బాలికకు 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండడంతో మైనార్టీ తీరిన తర్వాత వివాహం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ నెల 12న తల్లిదండ్రులు ఆరోగ్య పరీక్షల నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లగా, భూమికను పాతపాల్వంచలోని అన్న రాంబాబు ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం బాలిక పక్కనే ఉన్న జ్యోతినగర్‌లోని ఇంటికి వచ్చింది. కొద్ది సేపటికే అక్కడికి వచ్చిన రాంబాబు మద్యం మత్తులో భూమికతో ఘర్షణ పడి, చేయి చేసుకున్నాడు. అనంతరం అతిగా మద్యం సేవించి ఉండడంతో అక్కడే పడిపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగింది. స్థానికులు గుర్తించి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యసేవల నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. పాల్వంచ సీఐ నవీన్, ఎస్ఐ జే.ప్రవీణ్ మృతదేహాన్ని సందర్శించారు. తల్లి రాధ ఫిర్యాదు మేరకు రాంబాబుపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రాంబాబు స్నేహితుడిపై అనుమానం.. కాగా రాంబాబుతో పాటు అతని స్నేహితుడు కూడా మద్యం సేవించి, భూమిక వద్దకు వచ్చాడని, గొడవ అనంతరం అతిగా మద్యం సేవించి ఉండడంతో రాంబాబు పడిపోయిన తర్వాత అతని చెల్లిపై అఘాయిత్యానికి యత్నించాడని, అందువల్లే బాలిక బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి. -
ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తున్న విద్యార్థిని ప్రేమ పేరుతో వేధింపులకు గురై, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన పూనెం వాసవి(17) అనే విద్యార్థిని పాల్వంచలోని సిద్ధార్థ ఒకేషనల్ నర్సింగ్ కళాశాలలో చదువుతుంది. టీచర్స్ కాలనీలో వరుసకు అన్న అయిన మాచర్ల గోపి ఇంట్లో రెండు నెలలుగా అద్దెకు ఉంటూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా చేరింది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన బంధువులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందింది. అయితే కోయగూడెంకు చెందిన వరుసకు బంధువైన గీతారత్నం అనే యువకుడు ప్రేమ పేరుతో కొన్ని రోజులుగా వేధింపులకు దిగడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం గీతారత్నం, అతని స్నేహితుడితో కలిసి వాసవి ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగడంతో మనస్థాపం చెందిందని, ఈ విషయాన్ని తనకు ఫోన్లో కూడా చెప్పిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాసవి మృతితో కోయగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పతి వద్ద విద్యార్థిని స్నేహితులు విలపించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. -
పాల్వంచలో మరో విద్యుత్ ప్లాంట్ !
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో మరో విద్యుత్ ప్లాంట్ నిర్మించడంపై జెన్కో యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన సూపర్ క్రిటికల్ ఆల్ట్రా యూనిట్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై గురువారం సర్వే చేపట్టారు. 1966 –78 మధ్య కాలంలో నిర్మించిన కేటీపీఎస్ ఓఅండ్ఎం(720 మెగావాట్ల) ప్లాంట్లలో ఈ ఏడాది డిసెంబర్ 31తో ఉత్పత్తి ఆపేయాల్సి ఉంది. అనంతరం కర్మాగారాన్ని నేలమట్టం చేస్తారు. అయితే ఇక్కడి భౌగోళిక వనరులను ఉపయోగించి ఓఅండ్ఎం కర్మాగారం స్థానంలో మరో ప్లాంట్ నిర్మించే అంశంపై బీహెచ్ఈఎల్, జెన్కో సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సర్వే చేశారు. మూసివేత అనంతరం నేల మట్టం చేయకుండా భవిష్యత్ ప్లాంట్‌కు ఉపయోగకరంగా పనిచేసే నిర్మాణాలను పరిశీలించారు. ముఖ్యంగా కూలింగ్ టవర్ల స్థితిగతులపై అధ్యయనం చేశారు. అయితే, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ కంటే మెరుగైన టెక్నాలజీతో ప్లాంట్ రూపుదిద్దుకోవడానికి ఇక్కడ భూమితో పాటు బొగ్గు, నీటి వసతులు పుష్కలంగా ఉన్నాయని సర్వే బృందం గుర్తించింది. దీని వల్ల అతి తక్కువ మోతాదులో మాత్రమే కాలుష్యం వెలువడుతుందని చెబుతున్నారు. కొత్త టెక్నాలజీతో నిర్మించే సూపర్ క్రిటికల్ ఆల్ట్రా యూనిట్లను భారత దేశంలోనే మొదటిసారిగా పాల్వంచలో ఏర్పాటు చేయాలని యోచిస్తుండటం విశేషం. ఇప్పటివరకూ యూనిట్లకు మరమ్మతులు వస్తే.. చాలా రోజుల పాటు రాష్ట్ర గ్రిడ్‌కు ఉత్పత్తి నిలిచిపోయేది. అయితే ఆల్ట్రా యూనిట్లకు మరమ్మతులు తక్కువని, ఒకవేళ వచ్చినా చేయడం సులువని అధికారులు చెబుతున్నారు. -
డిగ్రీలో సగం ఖాళీలే..!
సాక్షి, పాల్వంచ: అర్హత కలిగిన లెక్చరర్లు, అధునాతన భవన సముదాయాలు ఉన్నా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం లేదు. వాటిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అయితే వీటిలో అడ్మిషన్లు సక్రమంగా లేక సుమారు సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. దీంతో కళాశాలల మనుగడ ప్రశార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆన్లైన్ (దోస్త్) ద్వారా విద్యార్థుల ప్రవేశాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే విద్యార్థులు నామమాత్రంగానే చేరడంతో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బతిమిలాడాల్సి వస్తోంది. వేల రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు కళాశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీలకు మాత్రం పంపించడం లేదు. కొరవడిన పర్యవేక్షణ... ప్రభుత్వ కళాశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలలో సరిపడా బోధన సిబ్బంది ఉండడం లేదు. ఇక అనేక కాలేజీల్లో ఇన్చార్జ్ ప్రిన్సిపాళ్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 డిగ్రీ కళాశాలలు ఉండగా.. నలుగురు మాత్రమే రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగిలిన ఏడుగురు ఇన్‌చార్జీలే. ప్రభుత్వ కాలేజీల్లో ఇలాంటి సమస్యలు నెలకొనడంతో.. తమ పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులు ఎంత కష్టమైనా భరించి ప్రైవేటు కళాశాలల్లోనే చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఖాళీ సీట్ల వివరాలిలా... పాల్వంచలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 420 సీట్లు ఉండగా అందులో 221 మాత్రమే భర్తీ అయ్యాయి. 199 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కొత్తగూడెంలోని కళాశాలలో 360 సీట్లకు 180 భర్తీ అయ్యాయి. మరో 180 ఖాళీగా ఉన్నాయి. భద్రాచలం కళాశాలలో 540 సీట్లకు 418 భర్తీ అయ్యాయి. 122 ఖాళీగా ఉన్నాయి. మణుగూరులో 420 సీట్లకు 162 మాత్రమే భర్తీ అయ్యాయి. 258 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇల్లెందు డిగ్రీ కాలేజీలో 360 సీట్లు ఉండగా 105 భర్తీ అయి, 255 ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో.. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో 1500 సీట్లకు 1391 భర్తీ కాగా, 109 ఖాళీగా ఉన్నాయి. మహిళా డీగ్రీ కళాశాలలో 480 సీట్లకు 271 మంది విద్యార్థినులు అడ్మిషన్లు పొందారు. ఇంకా 209 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నేలకొండపల్లిలో 420 సీట్లు ఉండగా 39 అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ మరీ దారుణంగా 371 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మధిరలో 180 సీట్లు ఉండగా 47 అడ్మిషన్లు రాగా, 133 ఖాళీగా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లిన గార్ల కళాశాలలో 420 సీట్లకు 35 భర్తీ అయి 385 ఖాళీగా ఉన్నాయి. సత్తుపల్లిలో 600 సీట్లకు 400 భర్తీ కాగా ఇంకా 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. -
అత్తను చంపిన కోడలు అరెస్ట్
పాల్వంచ: కొడుకు ప్రేమ వివాహం చేసుకుని తీసుకొచ్చిన కోడలికి, అత్తకు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వారికి కూతురు పుట్టడంతో వారసుడు పుట్టలేదంటు సూటిపోటీ మాటలతో తిడుతుండటంతో తట్టుకోలేక క్షణికావేశంలో రోకలిబండతో అత్త తల పగులగొట్టి హత్య చేసింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మడత రమేశ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన స్థానిక ఇందిరాకాలనీలో మైల కనకతార (53) కోడలు చైతన్య చేతిలో హత్యకు గురైంది. కనకతార భర్త సింగరేణి ఉద్యోగి. కొన్ని సంవత్సరాల కిందటే చనిపోయాడు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ముగ్గురి వివాహాలు జరిగాయి. కనకతార తన చిన్న కొడుకు నాగరాజు కుటుంబంతో కలిసి ఉంటోంది. నాగరాజు గతంలో చైతన్యను ప్రేమ వివాహాం చేసుకుని తీసుకొచ్చాడు. వారికి ఒక కూతురు కూడా ఉంది. నాగరాజు కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా ఇక్కడి ఇంట్లో కనకతార, చైతన్య కలిసి ఉంటున్నారు. అయితే అత్త తన కొడుకుని ప్రేమలోకి దించి పెళ్లి చేసుకున్నావు? ఆడపిల్లను కన్నావు? అంటూ వేధిస్తుండటంతో వారి మధ్య తరచూ మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గత ఆదివారం మధ్యాహ్నం గొడవ జరగడంతో కోడలు చైతన్య అత్త కనకతారను రోకలి బండతో తలపై కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో పోలీసులు కోడలిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె హత్య చేసినట్లు తేలిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ ముత్యం రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ మానవ సంబంధాలను మెరుగు పర్చుకోవాలి తప్ప, వాటిని పాడుచేసుకోవద్దని, క్షణికావేశంతో హంతకులుగా మారొద్దని తెలిపారు. చిన్న చిన్న తాగాదాలు ప్రతి కుటుంబాల్లో సహజమని, ఇతరుల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్‌కు వస్తే కౌన్సెలింగ్ ఇస్తామని స్పష్టం చేశారు. -
ఉద్యోగం ఇప్పించండి..
సాక్షి, పాల్వంచ: పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేసి ఓ వ్యక్తి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఓ రోడ్డు ప్రమాదంలో అతడి భార్య కదల్లేని స్థితిలో ఉంది. అదే రోడ్డు ప్రమాదంలో వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక మిగిలింది ఆ ఇంట్లో వారి కూతురు. ఆమెకు తన తండ్రి ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటోంది. తద్వారా తన తల్లిదండ్రులకు మంచి వైద్యం చేయించుకుంటానని, చివరి అంకంలో వారికి చేదోడువాదోడుగా ఉంటానని చెబుతోంది. ఆ కుటుంబ దీన గాథ పలువురిని కలచివేస్తోంది.పాల్వంచ పట్టణంలోని బాపూజీ నగర్‌కు చెందిన షేక్ ఖాసీం పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించాడు. 1999లో పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో మంచానికే పరిమితమయ్యాడు. అతడి ఉద్యోగం భార్య మొగలాబీ చేయాలంటే ఖాసీంకు సపర్యలు చేసే దిక్కులేదు. దీంతో ఉద్యోగం కుమారుడు యాకూబ్‌పాషాకు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులకు ధరఖాస్తు చేసుకున్నాడు. ఐదేళ్లుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నారు. ఇంతలో గత జనవరి 4వ తేదీన కొత్తగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు యాకూబ్‌పాషాతో పాటు మనవడు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొగలాబీ నడుము విరిగింది. ఏ పని చేయలేని పరిస్థితికి చేరింది. దీంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయి ఉంది. ఇక కుటుంబ భారం మొత్తం ఎకైక కూతురు షేక్ మీరాబిపై పడింది. తల్లిదండ్రులు ఇద్దరు మంచానికి పరిమితం అవడంతో తండ్రి ఉద్యోగం తనకు కల్పించాలని కూతురు మీరాబీ వేడుకుంటోంది. తన భర్త ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, ఒక్కడు పనిచేస్తేనే మందులకు, ఇళ్లు గడవడానికి ఇబ్బందికరంగా మారిందని వాపోతోంది. పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీలతో పాటు, ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించినా సంవత్సరాల తరబడి తిరగాల్సి వస్తోంది తప్ప ఉద్యోగం ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమవుతోంది. ఇప్పటికైనా తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ఆదుకోవాలని వేడుకుంటోంది. -
ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
సాక్షి, పాల్వంచ: పేలుడు పదార్థాలతో, ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తున్న కరపత్రాలతో వెళుతున్న ముగ్గురు మావోయిస్టు పార్టీ కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించారు. స్థానిక పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాలు... పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఐ మడత రమేష్, ఎస్ఐ వెంకటప్పయ్య ఆధ్వర్యంలో ఈ నెల 8న పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో టేకులచెరువు గ్రామంలో మారుతి లింగయ్య ఇంటి వద్దకు వెళ్లారు. పోలీసులను చూడగానే పారిపోయేందుకు మారుతి లింగయ్య, అశ్వాపురం మండలం మామిళ్ళవాయి గ్రామానికి చెందిన మడలి ఇరమయ్య, బూర్గంపాడు రాజీవ్‌నగర్‌కు చెందిన మద్వి యెడమయ్య ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పేలుడు పదార్ధాలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లను స్వాధీనపర్చుకున్నారు. మావోయిస్ట్ పార్టీలో లింగయ్య చురుగ్గా పనిచేస్తున్నాడు. మావోయిస్టు పార్టీ తూర్పు గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శి ఆజాద్‌కు కొంతకాలంగా కొరియర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఖమ్మం, మహబుబాబాద్ నుంచి పేలుడు పదార్థాలను సేకరించి ఆజాద్‌కు చేరవేశాడు. 2018 మార్చిలో ఆజాద్ ఆదేశాలతో విజయవాడలో వాకీటాకీలు, సెల్ ఫోన్లు, పవర్ బ్యాంక్, యూనిఫామ్, బూట్లు, సిమ్ కార్డ్‌లు, పేలుడు పదార్థాలు సేకరించి ఇచ్చాడు. ఆజాద్‌కు ఇతడు నమ్మిన బంటు. ఆజాద్ ఆదేశాలతో గత నెల 25న అశ్వాపురం, పాల్వంచ, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల్లో (ఎన్నకలు బహిష్కరించాలని రాసి ఉన్న) పోస్టర్లు వేశాడు. పేలుడు పదార్థాలు అక్రమంగా సేకరించి, మావోయిస్టులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచాడు. ఇంతలోనే పోలీసులకు దొరికిపోయాడు. క్వారీల నుంచి పేలుడు పదార్ధాల సేకరణ క్వారీల్లో బ్లాసింగ్‌కు ఉపయోగించే పేలుడు పదార్థాలను వీరు కొంత కాలంగా సేకరిస్తున్నారని ఓఎస్డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. క్వారీల్లోని సిబ్బందితో వీరు సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారి నుంచి పేలుడు పదార్థాలను రోజుకు కొంత చొప్పున పక్కదోవ పట్టించి, మావోయిస్ట్ కొరియర్లకు అమ్ముతున్నారని చెప్పారు. సమావేశంలో పాల్వంచ డీఎస్పీ మధుసూధన్ రావు, సీఐ మడత రమేష్, బూర్గంపాడు ఎస్ఐ వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రా వలస వాదిని ఓడించాలి
పాల్వంచ: ఆంధ్రా వాసి రేణుకా చౌదరిని ఓడించాలని, తెలంగాణ వాడినైన తనను గెలిపించాలని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక బీసీఎం రోడ్‌లోని మెక్ వెంకటేశ్వర్లు గ్రౌండ్ నందు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ పక్క రాష్ట్రం వారు మనపై పెత్తనం చేసేందుకు చూస్తున్నారని అన్నారు. పాల్వంచలోని కేటీపీఎస్‌లో తాను డైలీవేజ్ కార్మికుడిగా పనిచేశానని, అదృష్టవశాత్తు రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగిందన్నారు. జిల్లా వాసిగా ఇక్కడి సమస్యలపై తనకు అవగాహన ఉందని, అందుబాలో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో తెలంగాణ కోసం పార్లమెంట్లో తొలి ఓటు వేసిన ఎంపీగా చరిత్రలో మిగిలానని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. జలగం వెంగళరావు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, వెంగళరావు తనయుడు జలగం వెంకట్రావ్ ఎమ్మెల్యేగా గతం కంటే ఎక్కువ నిధులు సేకరించి అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. మైనింగ్ యూనివర్సిటీ, ఎన్ఎండీసీ విస్తరణకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనలో తాను భాగస్వామ్యం కావాలని, ఆయన బాటలో నడిచేందుకు వచ్చానని, తనను దీవించి గెలిపించాలని కోరారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రధాన మంత్రి మోదీ సైతం కాపీ కొట్టి అమలు చేస్తున్నారంటే ఇక్కడి సంక్షేమ పథకాలు ప్రజలు ఎంత దగ్గరయ్యాయో అర్థం అవుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక కోతలు లేని కరెంట్ అందిస్తున్నారని, రైతు బీమా, రైతు బంధు, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, మాజీ చైర్మన్ గడిపెల్లి కవిత, పెద్దమ్మగుడి చైర్మన్ కోడి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, భువన సుందర్‌రెడ్డి, సీతారామిరెడ్డి, అయితా గంగాధర్, కాల్వ భాస్కర్, చెన్నమల్లు, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, రవిచంద్ర, మిరియాల కమలాకర్, విజయ్, దొప్పలపుడి సురేష్, జనార్దన్‌రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు.. ఐదు రకాలు
సాక్షి, పాల్వంచరూరల్: ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ఓటు ద్వారానే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ఐదు రకాలుగా ఓట్లు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. టెండర్ ఓటు, సాధారణ ఓటు, సర్వీస్ ఓటు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటు ప్రభుత్వశాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఓటర్లే. ఎన్నికల సమయంలో వీరు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. వారికి కూడా ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను తపాలాశాఖ ద్వారా పంపించి ఓటు హక్కును వినియోగించుకుంటారు. మరికొంతమంది పోలింగ్ ముందురోజే ప్రత్యేకంగా ఉద్యోగులకోసం పోస్టల్ పోలింగ్‌ను ఏర్పాటుచేసి ఓటువేయిస్తారు. ఓట్ల లెక్కింపు అయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో సందర్భంలో పోస్టల్ ఓట్లే కీలకంగా మారతాయి. టెండర్ ఓటు ఓటరు జాబితాలో ఓటుహక్కు ఉన్న ఓటరు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసేటప్పటికీ ఆ వ్యక్తి ఓటును మరొకరు వేసినా.. సదరు వ్యక్తి ఓటు వేయొచ్చు. ఇందుకోసం రిటర్నింగ్ అధికారి వద్ద తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని నిరూపించాలి. పోలింగ్ అధికారి హామీతో ఓటును వినియోగించుకోవచ్చు. దీన్నే టెండర్ ఓటు అంటారు. సాధారణ ఓటు 18 సంవత్సరాలు నిండిన ప్రతీ పౌరుడు అన్నిరకాల ఎన్నికల్లో ఓటువేసే అవకాశం కలిగి ఉంటాడు. ఇదే సాధారణ ఓటు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందేందుకు అర్హులు. ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఆధారాలు చూపిస్తే ఓటు హక్కు కల్పిస్తారు. సర్వీస్ ఓటు సైనికులకోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వీస్ ఓటు వేసే అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సైన్యంలో విధులు నిర్వహించే సైనిక ఉద్యోగులు ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉంటారు. సైన్యంలోని ప్రధాన అధికారి ద్వారా/ తపాలా శాఖ ద్వారా ఓటును పంపించవచ్చు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫరబుల్ ద్వారా కూడా పంపవచ్చు. ప్రవాస భారతీయులకూ.. ఈసారి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆన్లైన్లో ఫారం 6ఏ ద్వారా దరఖాస్తులు చేసుకుని తగిన ఆధారులుచూపించి ఓటు హక్కును పొందవచ్చు. ఓటు హక్కు పొందిన ప్రవాస భారతీయుల ఆసక్తి మేరకు విదేశాలనుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. -
ఒక్క క్లిక్‌తో.. సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదులు
సాక్షి, పాల్వంచరూరల్: ఎన్నికలు పారదర్శకంగా సాగేందుకు డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెట్టేందుకు ఈసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. కోడ్ ఉల్లంఘన, అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకునే క్రమంలో సమాజంలోని ప్రతి పౌరుడిని భాగస్వామ్యం చేసేందుకు ఎన్నికల సంఘం ‘సీ విజిల్’ యాప్‌ను రూపొందించింది. స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక్క క్లిక్‌తో ఫిర్యాదు నేరుగా ఎన్నికల సంఘానికి వెళ్లే విధంగా దీన్ని తయారు చేశారు. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో తొలిసారిగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యాప్‌ను ఉపయోగించారు. అప్పుడు మంచి స్పందన రావడంతో దాన్ని ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. వంద నిమిషాల్లోనే.. స్మార్ట్‌ఫోన్‌లో గుగూల్ ప్లే స్టోర్‌లో సీ విజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలను నమోదు చేసుకోవాలి. ఎక్కడైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందో దానికి సంబంధించిన ఫొటో గానీ, వీడియో గానీ తీసి.. దాన్ని యాప్‌లో అప్లోడ్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో నాయకులతో కూడిన ఫ్లెక్సీలు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉండటం.. ఇలాంటి కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే వాటిని యాప్‌లో ఒక్క క్లిక్‌తో అప్లోడ్ చేయొచ్చు. సీ విజిల్ యాప్‌లో అప్లోడ్ చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం వెంటనే పరిశీలిస్తుంది. వంద నిమిషాల్లోనే చర్యలకు పూనుకుంటుంది. యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారి పేర్లు, సెల్ నంబర్లను ఈసీ గోప్యంగా ఉంచుతుంది. 3లోగా ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ - ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఖమ్మంసహాకరనగర్: సార్వత్రిక ఎన్నికలను పురష్కరించుకొని జిల్లాలో ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ వచ్చే నెల 3వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. మంగళవారం టీటీడీసీ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులకు ఈవీఎం కమీషనింగ్‌పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈవీఎంల కమీషనింగ్‌పై సెక్టోరియల్ అధికారులకు సమగ్ర అవగాహన కలిగి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. బూత్ లెవల్ ఏజెంట్ల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికి తిరిగి ఫొటో ఓటర్ స్లిప్పులను అందజేయాలన్నారు. ఏజెంట్లు స్వయంగా ఎట్టి పరిస్థితుల్లో ఫొటో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయరాదన్నారు. శాసన సభ ఎన్నికల మాదిరగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దివ్యాంగ, గర్భిణులు, బాలింతలు, వయోవృద్ధులకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడింబా, సెక్టోరియల్ అధికారులు, జిల్లా స్థాయి నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
మైనారిటీలకు వరం.. గురుకులం..
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మైనారిటీలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు 2016–17 విద్యా సంవత్సరంలో శ్రీకారం చుట్టింది. భద్రాద్రి జిల్లాలో ఆ ఏడాది రెండు పాఠశాలలను ఏర్పాటు చేసింది. 2017–18లో మరో నాలుగు పాఠశాలలను ప్రారంభించింది. ఈ గురుకులాల్లో 70 శాతం ముస్లిం మైనారిటీలకు, 30 శాతం ఇతరులకు సీట్లు కేటాయిస్తారు. ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.1.40 లక్షలు ఖర్చు చేస్తారు. ప్రతి పాఠశాలలో అరబిక్ ట్యూటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. నమాజు చేసుకునేందుకు ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. స్పోర్ట్స్ కిట్ సౌకర్యంతో పాటు రెగ్యులర్ పీఈటీలనూ నియమించారు. జిల్లాలోని అశ్వారావుపేట, బూర్గంపాడు, కొత్తగూడెంలో బాలికలకు, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెంలో బాలుర కోసం పాఠశాలలు ఏర్పాటుచేశారు. భద్రాచలం, కొత్తగూడెం బాలుర పాఠశాలలను కలిపి పాల్వంచలోని శేఖరంబంజరలో ఉన్న కేఎల్ఆర్ భవనంలో కొనసాగిస్తున్నారు. కొత్తగూడెం బాలికలకు నేషనల్ డిగ్రీ కళాశాల భవనాన్ని కేటాయించారు. ఈ రెండింటిఇల్లందు బాలుర పాఠశాలను సింగరేణి భవనంలో, అశ్వారావుపేట బాలికల పాఠశాలను జెడ్పీహెచ్ఎస్ పాత భవనంలో, బూర్గంపాడు బాలికల పాఠశాలను ఐటీడీఏ గిరిజన సంక్షేమ వసతి గృహంలో కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో మొత్తం 1600 మంది విద్యనభ్యసించడానికి అవకాశం ఉండగా, ప్రస్తుతం 1400 మంది చదువుతున్నారు. ఏడాదికి ఒక తరగతి చొప్పున అప్‌గ్రేడ్.. జిల్లాలోని ఆరు పాఠశాలల్లో 627 మంది బాలికలు, 773 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు. కొత్తగూడెం బాలికల పాఠశాలలో 360, బూర్గంపాడు బాలికల పాఠశాలలో 152, అశ్వారావుపేట బాలికల పాఠశాలలో 115 మంది బాలికలు, మిగితా పాఠశాలల్లో బాలురు చదువుతున్నారు. అయితే ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో పాల్వంచలోని కేఎల్ఆర్, కొత్తగూడెంలోని నేషనల్ డిగ్రీ కళాశాల భవనాలకు అద్దె చెల్లించి పాఠశాలలను కొనసాగిస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో సొంత భవనాలను నిర్మించా లని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబా ద్, వికారాబాద్ జిల్లాలకు భవనాలు మంజూరయ్యాయి. భద్రాద్రి జిల్లా రామవరంలో బాలికల పాఠశాల నిర్మాణానికి ఏడెకరాల స్థలాన్ని, అశ్వారావుపేటలో ఐదెకరాలు, ఇల్లెందులో 3.5 ఎకరాలు కేటాయించారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంగా ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. మల్టీ సెక్టోరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎంఎస్‌డీపీ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగూడెం బాలికలు, ఇల్లందు బాలుర పాఠశాలల్లో 9వ తరగతి వరకు అవకాశం ఉండగా మిగిలిన పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే విద్యనభ్యసించవచ్చు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతిని అప్‌గ్రేడ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2019–20 సంతవ్సరానికి జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈనెల 31 తుది గడువుగా నిర్ణయించారు. 9వ తరగతి ఉన్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేస్తారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు నాణ్యమైన చదువుతోపాటు నాణ్యతా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఆటలు, యోగా ఉంటాయి. శీతాకాలంలో వేడినీళ్ల సౌకర్యం కూడా కల్పించాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్రమం తప్పకుండా మెనూ అందజేస్తున్నాం. – జి.ముత్యం, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి -
‘ఉపాధి’ పనుల్లో అవకతవకలు
సాక్షి, పాల్వంచరూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది నిర్వహించిన పనుల్లో అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ ప్రజావేదికలో బయటపడ్డాయి. అవకతవకలపై ఈజీఎస్ ప్రిసైడింగ్ అధికారి కరుణాకర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. అవకతకలు జరిగిన పంచాయతీల్లో లక్షా నాలుగువేల రూపా యలు రికవరీ చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఓపెన్‌ఫోరం జరిగింది. ఈజీఎస్ కింద 2017 డిసెంబర్ 1నుంచి 2018 జనవరి 31 వరకు మండలంలోని 11 పంచాయతీలలో జరిగిన రూ.6 కోట్ల 5 లక్షల19వేల 516 విలువగల పనులు నిర్వహించారు. ఈ పనుల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో అవకతవకలు వెలుగుచూశాయి. పనులకు రాకున్నా కూలీలకు మస్టర్లు వేసినట్లు, తీర్మానాలు లేకున్నా అనుమతులు ఇవ్వకున్నా అధికంగా భూమి చదును పనులు నిర్వహించారు. మృతి చెంది మూడు సంవత్సరాలైన కూలీకి వేతనం చెల్లించినట్లు, తక్కువ పనులు చేసి ఎక్కువ పని చేసినట్లుగా ఎంబీలో రికార్డులు నమోదు చేసి నట్లు, రైతులకు ఇచ్చిన మొక్కలు సగం కూడా బతకకపోవడం, చేసిన పనుల వద్ద ఉపాధి నేమ్ బోర్డులను ఏర్పాటు చేయక పోవడం వంటి పలు అక్రమాలు బయటపడ్డాయి. యానంబైల్ పంచా యతీలో పట్టా పాస్‌పుస్తకాలు, ఇతర ఆధారులు లేకుండానే భూమి లెవల్ పనులు నిర్వహించారని, ఎక్కడ ఎంత పని చేశారో కూడా రికార్డులో రాయకపోవడం, ప్లే స్లిప్‌లు పంపిణీ చేయలేదు. వంద రోజులు దాటిన తర్వాత కూడా కొంతమంది కూలీలకు పనులు కల్పించి వేతనాలు చెల్లించారు. ఎడ్ల ఉమ అనే కూలి 18 రోజులు కూలీ పనులు చేసిన వేతనం చెల్లించలేదు. మరి కొంతమంది జాబ్‌కార్డులు అడిగినా ఇవ్వలేదు. ఏపీఓ, ఎంపీడీఓ సంతకాలు లేకుండానే మస్టర్ల పేమెంట్ చేశారని, పనిచేయని కూలీకి రూ.421 వేతనం చెల్లించారని, గొగ్గిల శంకర్ అనే కూలీ మూడు సంవత్సరాల క్రితం మృతి చెందినా 6 రోజుల వేతనం చెల్లించినట్లు వెలుగు చూశాయి. దీనిపై విచారణ జరపాలని ప్రిసైడింగ్ అధికారి ఆదేశించారు. 37 మంది కూలీలకు రూ.7,450 అడ్వాన్స్ పేమెంట్ చేసిన విషయం బయటపడింది. సోములగూడెం పంచాయతీలో రూ.1 కోటి 73 లక్షల మంజూరు కాగా ఇందులో కేవలం రూ.77 లక్షల75 వేల పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకుడు గుంత నిర్మాణం చేయని పద్మ అనే మహిళకు పేమెంట్ చేశారు. ఒకేరోజు ఒక కూలీకి రెండు మస్టర్లు వేశారు. రెండు రోజులు పనిచేసిన ఒక కూలీకి ఒక రోజు వేతనం చెల్లించారు. లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీకళాశాలలో, సోములగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో కూలీలతో చేయాల్సిన గంతులు తీసే పనులను యంత్రాల సహాయంతో నిర్వహించినట్లు బయటపడింది. దీనిపై విచారణ జరపాలని ప్రిసైడింగ్ అధికారి ఆదేశాలు జారీచేశారు. నీటికుంట నిర్మాణంలో 5.25 క్యూబిక్ మీటర్లు నిర్మాణం జరుగగా ఎంబీ రికార్డులో మాత్రం 6.04 క్యూబిక్ మీటర్లు నమోదు చేసినట్లు బయటపడటంతో విచారణకు ఆదేశించారు. పాండు రంగాపురంలో కూడా మస్టర్లలో అవకతవకలు జరిగినట్లు వెలుగుచూశాయి. ఇలా మిగిలిన పం చాయతీలో కూడా పలు అవకతవకులు జరి గాయి. కార్యక్రమంలో ఈజీఎస్ ఏడీలు రాం మోహన్, మధుసూదన్‌రాజు, డీవీఓ. సీహెచ్.వెంకటేశ్వర్లు, ఎన్.భాస్కర్‌రావు, అనిల్‌కుమార్, ఎంపీడీఓలు అల్బర్ట్, ధన్సింగ్, సీఆర్పీ సీహెచ్. గంగరాజు, ఏపీఓ.రంగా పాల్గొన్నారు. -
కేటీపీఎస్ ఉద్యోగి హత్య
సాక్షి, పాల్వంచ: పాల్వంచలో కేటీపీఎస్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి వేళ మెడపై కత్తితో దాడి చేయడంతో రక్తమడుగులో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. కేటీపీఎస్ ఒఅండ్‌ఎం కర్మాగారంలోని ఐసీహెచ్‌పీలో పీఎగా విధులు నిర్వహిస్తున్న గుగ్గిళ్ళ వీరభద్రం(55) ఇంటర్మీడియట్ కాలనీలో క్వార్టర్ నంబర్ 60లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి షిఫ్ట్ విధులకు వెళ్లగా.. మద్యం సేవించి ఉన్నాడనే కారణంతో సెక్యూరిటీ అధికారులు అతడిని కేటీపీఎస్‌లోకి అనుమతించలేదు. దీంతో ఇంటికి వచ్చి పడుకున్నాడు. రాత్రి 3గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బాత్రూమ్కు వెళ్లిన వీరభద్రం ఒక్కసారిగా అరిచాడు. ఇంట్లో ఉన్న భార్య రమాదేవి, ఇద్దరు కొడుకులు రవితేజ, సంతోష్ వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు. మెడపై కత్తితో నరికిన గాయం ఉంది. కుటుంబ సభ్యులు ఇంటి పక్కవారి సాయంతో మోటార్ సైకిల్‌పై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరభద్రం మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ మడత రమేష్, ఎస్ఐ ముత్యం రమేష్‌లు సందర్శించారు. జాగిలాలను రప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు. తన భర్తను ఎవరో నరికి చంపారని భార్య రమాదేవి తెలిపింది. ఈ విషయమై సీఐ మడత రమేష్‌ను వివరణ కోరగా.. రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. తన చిన్న కొడుకు సంతోష్ ప్రేమ వివాహం విషయంలో గొడవలు జరిగాయని, అమ్మాయి తరుపు బంధువుపై అనుమానం ఉందని ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లో కేసును చేధిస్తామని అన్నారు. ఇటీవల మృతుడు వీరభద్రం మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కేటీపీఎస్ అధికారులు రిజక్ట్ చేసినట్లు తెలిసింది. కాగా హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరభద్రం మృతదేహం -
‘కొత్త’ వెలుగులు
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్) సుదీర్ఘ ప్రస్థానంలో 7వ దశ మరో సరికొత్త మైలురాయి కానుంది. ఈ ప్లాంట్ ద్వారా మరో 800 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి వెలుగులు పంచనుంది. జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం రాత్రి 7వ దశ ప్లాంట్ సీఓడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) చేసి జాతికి అంకితం చేశారు. జూన్ 30న ఈ ప్లాంట్‌కు సంబంధించి సింక్రనైజేషన్ (మొదటిసారి విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేయడం) ప్రక్రియ పూర్తి చేశారు. అయితే వివిధ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యుదుత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. అనంతరం ఎన్నికలు రావడంతో సీఓడీ ప్రక్రియ ఆలస్యమైంది. 1966 జూలై 4 నుంచి వివిధ దశల్లో విస్తరిస్తూ వస్తున్న కేటీపీఎస్ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడున్న 6 దశల ప్లాంట్ల ద్వారా (60 మెగావాట్ల సామర్థ్యం గల 3వ యూనిట్ మూతపడిన తర్వాత) 1,660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 7వ దశ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర గ్రిడ్‌కు రోజూ 2,460 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. అనేక అవాంతరాలను అధిగమిస్తూ.. 2015 జనవరిలో 7వ దశ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది అనేక అవాంతరాలను అధిగమిస్తూ తుది దశకు చేరుకుంది. 2017 సెప్టెంబర్ 27న హైడ్రాలిక్ టెస్ట్ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్లో ట్రాక్ ఆర్డర్ వద్ద టీపీ–3 ట్రాన్స్ఫార్మర్ కుప్పకూలింది. ఆ తర్వాత సాంకేతిక లోపంతో స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇలాంటి పలు అవాంతరాలను అధిగమిస్తూ 7వ దశ నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్ పూర్తి చేసింది. 2017 డిసెంబర్ 31 నాటికే పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణం ప్రారంభించారు. అయితే కొన్ని విభాగాల్లో పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పాటు పలు అవాంతరాలతో కొంత ఆలస్యమైంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో.. కేటీపీఎస్‌లో ఇప్పటి వరకు ఉన్న 6 దశల్లోని మొత్తం 11 యూనిట్లు సబ్ క్రిటికల్ టెక్నాలజీ పద్ధతిలో విద్యుదుత్పత్తి చేసేవే. ఈ నేపథ్యంలో 7వ దశ ప్లాంట్‌ను ఆధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో పోల్చుకుంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. 7వ దశలో భారీ నిర్మాణాలను బీహెచ్ఈఎల్ సంస్థ అనుకున్న సమయానికన్నా తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాయిలర్‌ను నిర్మించేందుకు 42 నెలలు నిర్దేశించుకోగా, 24 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. ఇక కూలింగ్ టవర్ నిర్మాణ పనులు ఏడాదిన్నర ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో మిగిలిన నిర్మాణాలన్నీ ఆలస్యం అవుతాయని జెన్కో అధికారులు ఆందోళన చెందారు. 2016 జూలైలో ప్రారంభమైన కూలింగ్ టవర్ నిర్మాణం 2017 డిసెంబర్ నాటికి (18నెలల్లో) పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించినట్లు జెన్కో అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా 275 మీటర్ల ఎత్తు గల చిమ్నీ(షెల్) నిర్మాణం పనులు 20 నెలల్లో విజయవంతంగా పూర్తి చేశారు. -
పరీక్షే..
పాల్వంచరూరల్: ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. మరోవైపు పదో తరగతి వార్షిక పరీక్షల గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల చదువులపై ఎన్నికలు ప్రభావం చూపేలా ఉన్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకున్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికలకు ఇంకా ఎక్కువ మంది సిబ్బంది అవసరమవుతారు. ఒక్కో పంచాయతీలో దాదాపు 8, 10 వార్డులు ఉండగా, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉపాధ్యాయులను అధిక సంఖ్యలో ఎన్నికలకు వినియోగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో విద్యాశాఖలో కూడా అయోమయం నెలకొంది. ఆశించిన ఫలితాలు రాబట్టగలమో, లేదోనని సంశయిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 13,646 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలికలు 7,103 బాలురు 6543మంది ఉన్నారు. 2015–2016లో ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పరీక్షలను 34,556 మంది రాశారు. వీరిలో 26,956 మంది ఉత్తీర్ణులయ్యారు. 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2016–2017లో ఉమ్మడి జిల్లాలో 35,333 మంది పరీక్షలకు హాజరుగా 29,898 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.62శాతం ఉత్తీర్ణత సాధించారు. 2017–2018 భద్రాద్రి జిల్లాలో 13175 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 9453 మంది ఉత్తీర్ణులయ్యారు. 71.74శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కన్నా మెరుగైన ఫలితాలును సాధించాలని విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. పుస్తకాలూ ఆలస్యంగానే వచ్చాయి.. పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా పూర్తిస్థాయిలో పుస్తకాలు విద్యార్థులకు చేరలేదు. దీనికితోడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్డ్ విడుదల చేసిన తర్వాత కూడా అధికారులు స్టడీ మెటీరియల్‌ను అందజేయలేదు. పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న సయమంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో విద్యార్థుల చదువులను ఎలా పూర్తిచేయాలో అర్థంకాక ఉపాధ్యాయులు, పరీక్షల్లో తమ పిల్లలు ఎలా రాస్తారోనని బెంగ తల్లిదండ్రుల్లో నెలకొంది. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించకపోతే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులు హక్కుం జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది. ఉత్తమ ఫలితాలకు యాక్షన్ ప్లాన్.. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఇటు డీఈఓ, అటు ఐటీడీఏ పీఓలు పాఠశాలలకు, గురుకులాలకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. గత నెల నుంచే అన్ని పాఠశాలలో ఉదయం, సాయంత్రం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. గురుకులాల్లో ఉదయం 5 గంటలనుంచి విద్యార్థులను పుస్తకాలు పట్టుకునే విధంగా ఉపాధ్యాయులు చూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్.. జిల్లాలో ఇంటర్ కళాశాలలు మొత్తం 57 ఉండగా ఇందులో ప్రభుత్వ కళాశాలు 14, ప్రైవేట్ కళాశాలు 43 ఉన్నారు. ఈ సంవత్సరం వార్షిక పరీక్షలకు 11,500 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రైవేటు కళాశాలల నుంచి 6,500 మంది, ప్రభుత్వ కళాశాలల నుంచి సుమారు 5 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఎన్నికలకు వినియోగించకపోతే ఉత్తమ ఫలితాలు పదో తరగతి విద్యార్థులకు ప్ర త్యేకంగా నెల రోజుల నుంచి యాక్షన్ ప్లాన్ ద్వారా విద్యబోధన సాగిస్తున్నాం. పరీక్ష సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి రోజు విలువైనదిగా భావించి బోధన చేస్తున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉత్తమ ఫలితాలను సాధించి తీరుతాం. –డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్నికల విధులు అప్పగించొద్దు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పగించొద్దు. తద్వారా విద్యార్ధులను పరీక్షలకు ప్రీపరేషన్ చేసి విద్యాశాఖ నిర్దేశించిన ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఎన్నికల విధులకు టీచర్లను వినియోగిస్తే ఆశించిన ఫలితాలు సాధించడం కష్టం. –రమేష్ రాథోడ్, ఉపాధ్యాయుడు ప్రభావం పడకుండా ప్రణాళిక విద్యార్థుల చదువులపై ఎన్నికల ప్రభావం పడకుండా ప్రణాళిక రూపొందించాం. ఎన్నికల విధులకు వెళ్ళే ఉపాధ్యాయుల స్థానంలో ఇతర ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తాం. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూస్తాం. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటాం. –వాసంతి, డీఈఓ -
కంటి వెలుగు కార్యక్రమంలో అపశ్రుతి
పాల్వంచ : కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షల చేయించుకునేందుకు తన రెండేళ్ళ కూతురుని తీసుకుని తల్లి వెళ్లింది. అక్కడ ఓ కూల్ డ్రింక్ సీసాను చూసిన ఆ చిన్నారి, దానిని చేతిలోకి తీసుకుని అందులోని ద్రవాన్ని తాగింది. అందులో ఉన్నది కూల్‌డ్రింక్ కాదు... పురుగు మందు. ఆ తల్లి తెలిపిన వివరాలు.. శుక్రవారం పట్టణంలోని శేఖరం బంజరకు చెందిన బోడ వెంకటేష్ భార్య పద్మ. ప్రభుత్వ పాఠశాలలో కంటి పరీక్షలను చేయించుకునేందుకు రెండేళ్ల కూతురు సహస్త్రను తీసుకెళ్లింది. అక్కడ పెద్ద క్యూ ఉండటంతో నిరీక్షిస్తోంది. ఆమె ఒళ్లో నుంచి ఆ చిన్నారి కిందకు దిగి ఆడుకుంటోంది. పాఠశాల గదిలో ఓ మూలకు కూల్ డ్రింక్ సీసా కనిపించింది. దానిని తీసుకుని, అందులోని ద్రవాన్ని తాగింది. కొద్దిసేపటికే చిన్నారి నోటి నుంచి నురగలు రావడంతో తల్లి కంగారు పడింది. బాటిల్లోని డ్రింక్ తాగిందని ఓ పాప చెప్పింది. అది పురుగు మందుగా గుర్తించిన ఆ తల్లి, వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపపత్రికి తన బిడ్డను తీసుకెళ్లింది. ఆ చిన్నారి కడుపు నుంచి మందును వైద్యులు కక్కించారు. ఆ మందును ఎండ్రోసల్పాన్గా గుర్తించారు. పాఠశాలలోకి పురుగుల మందు ఎలా వచ్చింది..? సీసాలో పెట్టి ఉంచినా ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని తల్లిదండ్రులు వెంకటేష్, పద్మ ప్రశ్నిస్తున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవి విచారణ చేపట్టారు. -
భూ ప్రకంపనలతో బెంబేలు
సాక్షి, కొత్తగూడెం/మహబూబాబాద్: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి భూమి కంపించింది. భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. భారీ శబ్ధాలు రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో 5 సెకన్లు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, సుజాతనగర్, చండ్రుగొండ, జూలూరుపాడు తదితర మండలాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే ఎక్కడా ఆస్తి నష్టం జరగలేదు. మహబూబాబాద్‌లోని కంకరబోడ్‌లో ఉన్న సమైక్య డిగ్రీ కళాశాల సమీపంలో స్వల్ప భూకంపం వచ్చిందని స్థానికులు తెలిపారు. -
మాంసాహారంలో కల్తీ
పాల్వంచరూరల్: పాల్వంచ పట్టణంలోని బీసీఎం రోడ్లో ఉన్న ఓ రెస్టారెంట్లో కల్తీ మాంసాహారం సరఫరా చేశారని బూర్గంపాడు మండలం రెడ్డిపాలేనికి చెందిన పి.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. బుధవారం రాత్రి తాను స్నేహితుడితో కలిసి బీసీఎం రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లామని తెలిపారు. మటన్ ఆర్డర్ ఇవ్వగా, మటన్‌లో ఇతర జంతువుల మాంసం కలిపి వడ్డించారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి ఆహార పదార్థాలను సీజ్ చేసి, పరీక్షకు పంపారని తెలిపారు. ఫలితాలను బట్టి తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు పేర్కొన్నట్లు బాధితులు తెలిపారు -
ఒకే కొమ్మకు.. రెండు రంగుల పూలు..
పాల్వంచరూరల్ : ఒకే చెట్టుకు రెండు రకాల మందారపూలు పూస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పాల్వంచ మండలం సోములగూడెం గ్రామపంచాయతీ లక్ష్మిదేవిపల్లిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు తన ఇంట్లో నాలుగేళ్లుగా పసుపు రకం మందార చెట్టును పెంచుతున్నాడు. ప్రతి సంవత్సరం ఈ చెట్టుకు పసుపు రంగు పూలు మాత్రమే పూసేవి. కానీ.. ఇటీవల అదే చెట్టుకు ఎర్ర మందారాలు కూడా పూస్తున్నాయి. ఒకే కొమ్మకు పక్కపక్కనే రెండు రంగుల పూలు పూయడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
మిషన్ భగీరథతో ఇంటింటికీ గోదావరి జలాలు
పాల్వంచరూరల్ : మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ గోదావరి జలాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేర్కొన్నారు. మిషన్ భగీరథలో భాగంగా పాల్వంచ మండలం తొగ్గూడెంలో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు గోదావరి జలాలు చేరాయి. ఆదివారం ఎమ్మెల్యే ఏరియేటర్లోకి నీటిని పంపింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించి, గంగమ్మతల్లికి పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరి కాయలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా జలగం మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానస పుత్రిక మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేసి పట్టుదలతో ఇంటింటికీ గోదావరి జలాలు చేరేవిధంగా కృషి చేస్తున్నారన్నారు. తొగ్గూడేనికి గోదావరి జలాలు విజయవంతంగా చేరడం హర్షణీయమన్నారు. సోమవారం అధికారికంగా ట్రయల్‌రన్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈలు సాయి, తాతారావు, జెడ్పీ వైస్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, పెద్దమ్మగుడి మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, నాయకులు జీవీకే.మనోహర్, అయితా గంగాధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భువనసుందర్రెడ్డి పాల్గొన్నారు. -
వృద్ధుడి ఆత్మహత్య
పాల్వంచరూరల్: మతి స్థిమితం సక్రమంగా లేని వృద్ధుడు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని పాండురంగాపురం గ్రామస్తుడు కఠోజు శ్రీనివాసచారి(56) శనివారం రాత్రి ఇంట్లో దూలానికి లుంగీతో ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున భార్య మేల్కొని వరండాలోకి వచ్చేసరికి, ఉరికి వేలాడుతూ భర్త కనిపించాడు. పోలీసులకు ఆమె సమాచారమిచ్చింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఇతడు, హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో కొన్ని సంవత్సరాలుగా చికిత్స పొందుతున్నాడు. ఇతడికి భార్య పుష్పావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటన స్ధలాన్ని హెడ్ కానిస్టేబుల్ సూర్యారావు పరిశీలించారు. శ్రీనివాసచారి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ముగ్గురు ఎన్డీ దళసభ్యుల అరెస్ట్
పాల్వంచరూరల్: సీపీఐ (ఎంఎంల్) న్యూడెమోక్రసీ రామన్న దళానికి చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ ఉత్తమకుమార్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పాల్వంచ మండలం ఉల్వనూరు అటవీ ప్రాంతంలో రాళ్లవాగు పరిసర ప్రాంతాల్లో దళం సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీఐ రఘవేంద్రరావు, ఎస్ఐ ఎం.రమేష్ సిబ్బంది శనివారం గాలింపు చేపట్టగా అనుమానాస్పద స్థితిలో తారసపడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎన్డీకి చెందిన రామన్న దళంలో సభ్యులుగా ఉన్న బూర్గంపాడు మండలం రాజీవ్‌నగర్‌కు చెందిన కోవాసి బుద్రు అలియాస్ సురేష్, అశ్వాపురం మండలం గుండాలపాడు గ్రామానికి చెందిన మడివి ఉంగి, ఎలియాస్ కవిత, రోజా, భవాని, పాల్వంచ మండలం రెడ్డిగూడేనికి చెందిన వీరమల్ల సురేష్‌ను అరెస్టు చేసి వారి వద్ద రైఫిల్, ఫిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గత ఏడాది నర్సంపేటలో జరిగిన రాయల భాస్కర్ హత్యకేసులో, 2017లో బోడు ప్రాంతంలో పోలీసులకు ఎన్డీ దళానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఈ ముగ్గురూ ఉన్నారని తెలిపారు. సమావేశంలో పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసరావు, మణుగూరు డీఎస్పీ సాయిబాబా, సీఐ రాఘవేంద్రరావు, అశ్వారావుపేట సీఐ అబ్బయ్య, ఎస్ఐ ఎం.రమేష్ పాల్గొన్నారు. -
చిన్నారిని బలిగొన్న డీజే బాక్స్
పాల్వంచరూరల్ : సేవాలాల్ జాతరలో అపశృతి దొర్లింది. డీజే బాక్స్ పడడంతో బాలుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పాండురంగాపురం గ్రామంలో సేవాలాల్ ఆలయ శంకుస్థాపన తర్వాత ఆంజనేయస్వామి గుడికి భక్తులు వెళ్తున్నారు. టాటా ఏస్ వాహనంపై డీజేబాక్స్లు ఏర్పాటు చేశారు. వాహనం ముందు, పక్కన కొంద రు నృత్యాలు చేస్తున్నారు. మార్గమధ్యలో ఒకచోట, పైన విద్యుత్ సర్వీ స్ వైరు ఒకటి డీజే బాక్స్‌లకు తగిలింది. దీనిని ఎవరూ గమనించలేదు. వాహనం ముందుకెళ్లడంతో పైన బాక్స్‌లు కిందపడ్డాయి. పక్కనే నడుస్తున్న భూక్యా పృధ్వీరాజ్(7)పై ఒక బాక్స్ పడింది. తలకు బలమైన గాయమవడంతో ఆ చిన్నారి మృతి చెందాడు. ఇతని తల్లిదండ్రులైన భూక్యా బాలకృష్ణ–అనిత దంపతులది నిరుపేద కుటుంబం. వీరిది ఇల్లెందుపాడు గ్రామం. ఈ చిన్నారి రెండోతరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు, అక్క కన్నీరు మున్నీరుగా విలపించారు. తండ్రి ఫిర్యాదుతో సేవాలాల్ ఆలయ పూజారి భూక్యా ఠాగూర్ సాధు. టాటా ఏస్ డ్రైవర్ గబ్బర్, నిర్వాహకులు జి.శ్రీనుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రమాదమా..? హత్యా..?!
పాల్వంచరూరల్: అది. పాల్వంచలోని కేటీపీఎస్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్. అక్కడొక కన్వేయర్ బెల్ట్. కేటీపీఎస్ ఓఅండ్ఎం బి–స్టేషన్‌కు చెందినది. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ) నుంచి 34ఏ మీదుగా 5–ఏకు బొగ్గును సరఫరా చేస్తోంది. అక్కడ మంగళవారం ఉదయం సిబ్బంది విధుల్లో ఉన్నారు. బంకర్లో నిలిచిపోయిన బొగ్గు చూరను తొలగిస్తున్నారు. ఆ చూరలో వారికి ఒకటి కనిపించింది. దానిని చూడగానే భయమేసింది. కొన్ని క్షణాల పాటు వణికిపోయారు. అదేమిటో తెలుసా..? కాలు..! మనిషి కాలు..!! నుజ్జు నుజ్జయింది. కాలు ఒక్కటే ఉంది. ఎవరిదిది..? ఎలా వచ్చింది..? ఏం జరిగింది..? అక్కడి సిబ్బందిలో అనేక సందేహాలు. సైదులు అనే కార్మికుడొకరు వెంటనే సంబంధిత షిఫ్ట్ ఇంజనీర్లకు సమాచారమిచ్చారు. అధికారులు వచ్చారు.. చూశారు. ఎస్సై రవికుమార్ చేరుకున్నారు, ఆ కాలును ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతోనే అక్కడకు కేటీపీఎస్ ఇన్చార్జ్ సీఈ నర్సింహం, సీఈ సమ్మయ్య, ఎస్ఈలు, ఏడీలు, డీఈలు, కార్మికులు పెద్ద సంఖ్య లో చేరుకున్నారు. వారందరి సమక్షంలో సిబ్బంది ఇంకా సూక్ష్మంగా వెతికారు. కాలు కనిపించిన చోటనే సెల్ ఫోన్ చిప్ దొరికింది. దానిని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. కొత్తగూడెం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వారం రోజులుగా కన్పించడం లేదట. ఈ కాలు అతనిదేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్ఏ నివేదిక వస్తేనేగానీ ఆ కాలు ఎవరిదనేది గుర్తించలేమని పోలీసులు అంటున్నారు. ఎలా వచ్చింది..? ఇది ఎలా వచ్చింది..? ఆ వ్యక్తిది హత్యా..? ప్రమాదమా..? అందరూ అడుగుతున్న ప్రశ్నలివి. సమాధానాల్లేవు. కేటీపీఎస్కు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవసరమైన బొగ్గును కొత్తగూడెంలోని బొగ్గు గనుల నుంచి వ్యాగన్ల ద్వారా సరఫరా చేస్తారు. బొగ్గు చోరీ చేసేందుకు వ్యాగన్ ఎక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందాడా..? ఎవరైనా హత్య చేసి శరీర భాగాలను వ్యాగన్లలో పడేశారా? ఇలా, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాగే వ్యాగన్లలో మృతదేహాలు కనిపించినట్టుగా ఇక్కడి కార్మికులు చెబుతన్నారు. ‘‘ప్రమాదాల్లోనే వారు మృతిచెందినట్టుగా ఆ తరువాత తెలిసింది’’ అని అక్కడి కార్మికులు చెప్పారు. కాలు మాత్రమే కనిపించడంతో, ఇది ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్సై రవి, కేసు నమోదు చేశారు. -
విహార యాత్రలో విషాదం
సాక్షి, పాల్వంచ: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం కిన్నెరసాని కాల్వ వద్ద జరిగింది. ములకలపల్లి మండలం నాగారం యూపీఎస్‌కు చెందిన నలుగురు టీచర్లు 70మంది విద్యార్థులను కిన్నెరసాని కాల్వ వద్దకు విహార యాత్రకు తీసుకు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను ముత్యాలు, నాగమణిల కుమారుడు వారం రాజేష్(11), వల్లవరపు వెంకటకృష్ణ, సౌజన్య దంపతుల కుమారుడు విజన్(10)గా గుర్తించారు. -
కేటీపీఎస్‌లో అగ్నిప్రమాదం: నిలిచిన ఉత్పత్తి
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ 11వ యూనిట్లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. 11వ యూనిట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు ఎగిసిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. -
ఎస్బీఐలో భారీ అగ్ని ప్రమాదం
- షార్ట్ సర్యూట్‌తో కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫర్నీచర్ పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సిల్ బ్రాంచ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం అర్థరాత్రి బ్యాంకు ముసివేసిన తర్వాత షార్ట్ సర్యూట్‌తో మంటలు వ్యాపించి భారీ ప్రమాదానికి దారి తీసింది. ఈ ఘటనలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఫర్నీచర్ పూర్తి దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల కధనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నవభారత్ వద్ద గల ఎస్బీఐ సిల్ బ్రాంచ్‌లో రాత్రి బ్యాంకులో పెద్దగా ఫైర్ సైరన్ మోగింది. సైరన్ విన్న చుట్టుపక్కల కాలనీ వాసులు బయటకు వచ్చి చూసే సరికి బ్యాంకులో మంటలు వచ్చి దట్టమైన పొగలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న బ్యాంకు మేనేజర్ పానుగంటి అప్పారావు హుటాహుటిన అక్కడికి చేరుకునే సరికి మంటలు తీవ్ర స్థాయికి చేరాయి. షార్టుసర్యూట్ వల్లే సంఘటన సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఐ షుకూర్, ఎస్ఐ కరుణాకర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
యువతి ఆత్మహత్య
పాల్వంచ : తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా, తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఉల్వనూరుకు చెందిన బెల్లంకొండ భవాని (22)కి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాని అసలు పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టంలేదని భవాని తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ వారు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో తీవ్ర మనస్థాపానికి గురైన భవాని సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
రూ. 10 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
పాల్వంచ: భద్రాద్రి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయి ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వద్ద ఆదివారం ఉదయం అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. బోలేరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకొని అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకొని పాల్వంచ డిపోకు తరలించారు. -
పెద్దమ్మకు కేసీఆర్ సతీమణి పూజలు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని పెద్దమ్మ గుడిలో సీఎం కేసీఆర్ సతీమణి శోభ ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆమెకు ఆశీర్వచనం అందజేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శోభ ఆదివారం సాయంత్రం భద్రాచలం వచ్చారు. ఈ రోజు ఉదయం ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని పాల్వంచ చేరారు. అమ్మవారికి ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. -
గుండెపోటుతో వీఆర్వో మృతి
భద్రాద్రి కొత్తగూడెం: విధి నిర్వహణలో ఉన్న ఓ రెవెన్యూ అధికారిని గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం చోటు చేసుకుంది. పినపాక మండలం గడ్డంపల్లికి చెందిన కోలం అంజమ్మ(40) అశ్వాపురంలో వీఆర్వోగా పనిచేస్తోంది. గత రెండు రోజులుగా భూ దస్తావేజుల విషయంలో పాల్వంచలోని డిప్యూటీ కల్టెర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శనివారం కార్యాలయంలో పని చేస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతిచెందింది. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
పాల్వంచ రూరల్: అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం కోడిపుంజులవాగు గ్రామానికి చెందిన రైతు కొర్ర మత్రు(28) తనకున్న ఎకరం చెలకలో మొక్కజొన్న సాగుచేశాడు. అయితే పంట నష్టం వచ్చింది. పంట సాగుకు రూ.లక్ష పైన అప్పులు చేశాడు. అప్పులు తీర్చే దారిలేక మనోవేదనతో ఇంట్లోని బాత్రూంలో మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం అయ్యప్పనగర్‌కు చెందిన నాగిడి వెంకటేశ్వర్లు(25) అనే యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల్ల మనస్తాపానికి గురై తనువు చాలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాల్వంచలో కేటీఆర్ పర్యటన
పాల్వంచ: సహజవనరులను సద్వినియోగం చేసుకుంటే భద్రాద్రి జిల్లా అగ్రస్థానంలో ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఉదయం ఆయన పాల్వంచలో మున్సిపల్ పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేటీపీఎస్‌లో ఉద్యోగాలను ఇకపై స్థానికులతోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. -
లారీ, టాటా మ్యాజిక్ ఢీ: ఐదుగురికి గాయాలు
పాల్వంచ(ఖమ్మం జిల్లా): పాల్వంచ ఆర్టీ చెక్‌పోస్టు సమీపంలో లారీ, టాటా మ్యాజిక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘నీరూ’ తరలుతోంది..
పాల్వంచ ఇరిగేషన్ పరిధి నుంచి 324 చెరువులు ఔట్ 9 మండలాలకు పరిమితమైన పాల్వంచ డివిజన్ సత్తుపల్లి డివిజన్ కలిస్తే మరింతగా పెరగనున్న విస్తీర్ణం పాల్వంచ: 15 ఏళ్ల క్రితం ఏర్పాటైన పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ ముక్కలు కానుంది. ఈ డివిజన్ నుంచి 324 చెరువులు బయటకు వెళ్లనున్నాయి. ఇప్పటి వరకు 12 మండలాలలో ఉన్న నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ (ఇరిగేషన్) డివిజన్ ఇక మీదట 9 మండలాలకు పరిమితం కానుంది. పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ నుంచి మూడు మండలాలు వివిధ జిల్లాల్లోకి వెళ్లనున్నాయి. డివిజన్లో ఇప్పటి వరకు పాల్వంచ, కొత్తగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాలు ఉండగా దీనిలో గార్ల, బయ్యారం మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లనున్నాయి. కామేపల్లి ఖమ్మం జిల్లాలోకి చేరుతుండగా ఈ డివిజన్ 9 మండలాలకు పరిమితం కానుంది. ఇప్పటి వరకు అశ్వారావుపేట డివిజన్లో ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తే విస్తీర్ణం పెరగనుంది. 12 మండలాల నుంచి 13 మండలాలకు ఈ ఇరిగేషన్ డివిజన్ చేరుతుంది. చెరువులు అటూఇటూ పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 1,660 చెరువులున్నాయి. గార్ల, బయ్యారం మండలాల పరిధిలోని 222 చెరువులు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్తున్నాయి. కామేపల్లి మండలంలోని 102 చెరువులు మాత్రం ఖమ్మం జిల్లాలో చేరనున్నాయి. ఈ మూడు మండలాల్లో కలిపి 324 చెరువులు పోతే 1336 చెరువులు పాల్వంచ డివిజన్ పరిధిలో ఉంటాయని ఇరిగేషన్ అధికారులు ధ్రువీకరించారు. ఆయా చెరువుల కింద 14,898 ఎకరాల ఆయకట్టు ఉంది. బయ్యారం పెద్దచెరువు మీడియం ఇరిగేషన్ కూడా మానుకోట జిల్లాలోకి వెళ్లడంతో 7,200 ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతుంది. ‘కొత్త’గా 730 చెరువులు: వెంకటేశ్వరరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ పరిధిలోని గార్ల, బయ్యారం, కామేపల్లి మండలాల నుంచి 324 చెరువులు ఇతర జిల్లాల్లోకి వెళ్తున్నాయి. అదే సమయంలో సత్తుపల్లి డివిజన్లో ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల పరిధిలోని 730 చెరువులు పాల్వంచ ఇరిగేషన్ డివిజన్ పరిధిలోకి రానున్నాయి. ఇది ఖాయమైతే ఇరిగేషన్ డివిజన్ విస్తీర్ణం పెరుగుతుంది తప్ప తగ్గదు. -
వణికిస్తున్న జ్వరాలు
పాల్వంచ ఆస్పత్రిలో 28మందికి చికిత్స పాల్వంచ రూరల్: విషజ్వరాలతో బాధ పడుతూ పాల్వంచ ఏరియా ఆస్పత్రికి వస్తున్న పీడితుల సంఖ్య పెరుగుతోంది. గురువారం దాదాపు 30మంది వరకు జ్వరంతో బాధ పడుతూ రాగా..23మంది టైఫాయిడ్, మరొకరు మలేరియా జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. ఇందిరానగర్ కాలనీలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులు జ్వరంతో బాధపడుతున్నారు. పదో తరగతి బాలికలు డి.సంధ్య, బి.బేబి, వెన్నెల తదితరులు తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికాగా బాధ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థి జె.కార్తీక్‌ను ఇక్కడ చేర్పించారు. సమీప గ్రామస్తులు, ఇటు విద్యార్థులు హాస్పిటల్‌కు రావడంతో బెడ్లు సరిపోలేదు. కొన్ని పడకలపై ఇద్దరి చొప్పున పడుకోబెట్టి వైద్యచికిత్స నిర్వహించారు. రక్త పరీక్షలు చేయించుకునేందుకు రోగులు బారులు తీరారు. ఇంకా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా పలువురు జ్వరపీడితులు చేరి.. చికిత్స పొందుతున్నారు. -
వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతకడానికి వాగుకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందారు. ఈ సంఘటన మండలంలో కుంటినాగులగూడెంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రోహిణి(12) ఏడో తరగతి, మోకాళ్ల శిరీష(15)పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరు ఈ రోజు గ్రామ శివారులోని ముర్రేడు వాగుకు దుస్తులు ఉతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రోహిణి వాగులో పడి మునిగి పోయింది. ఇది గుర్తించిన శిరీష ఆమెను రక్షించడానికి యత్నించి తాను కూడా వాగులో పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు మృతదేహాలను వెలికి తీశారు. స్నేహితులిద్దరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బంగారు తెలంగాణ అంటే ఇదేనా : రేణుకాచౌదరి
పాల్వంచ: బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని సీఎం కేసీఆర్‌ను కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ప్రశ్నించారు. పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచలో రేణుకాచౌదరి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేద ప్రజలపై భారం వేస్తూ.. ధనిక రాష్ట్రం అని తెలంగాణను ఎలా అంటారని ప్రభుత్వంపై మండిపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
గుండెపోటుతో ప్రభుత్వ వైద్యుని మృతి
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ సీనియర్ సర్జన్ గుండె పోటు తో మృతి చెందాడు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ గోపాల్(34) మంగళవారం సాయంత్రం షటిల్ ఆడుతూ అకస్మాత్తుగా పడిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపల మృతి చెందాడు. డాక్టర్ గోపాల్ స్వగ్రామం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సబ్బావారి తాండ. పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. గోపాల్‌కు భార్య ఉమాదేవి నలుగురు పిల్లలు ఉన్నారు. -
వ్యాగన్‌ను ఢీకొన్న గూడ్స్ ఇంజన్
పాల్వంచ : ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో శనివారం ప్రమాదం గూడ్స్ రైలు వ్యాగన్ ఢీకొట్టింది. కేటీపీఎస్ ఐదవ దశ కోల్ డంపింగ్ యార్డులో ఖాళీ వ్యాగన్ రైలు ఇంజన్ ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాగన్ బాగా దెబ్బతినడంతో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. -
15 గిరిజన కుటుంబాల వెలి
బొడ్రాయికి డబ్బులు ఇవ్వకపోవడమే కారణం మాట్లాడినా.. నీళ్లిచ్చినా 10 వేలు జరిమానా పాల్వంచ రూరల్: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెం పంచాయతీ పరిధిలోని తుమ్మలగూడెం లో 15 గిరిజన కుటుంబాలను కులపెద్దలు వెలి వేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కోసం ఆయా కుటుంబాలు డబ్బు లివ్వకపోవడంతో కుల పెద్దలు ఈ మేరకు నెల క్రితం నిర్ణయం తీసుకోగా... అప్పటి నుంచి ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మండలంలోని తుమ్మలగూడెంలో సుమారు 40 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. గతనెల 23న గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కోసం గ్రామంలోని గిరిజన కుటుంబాలు ఒక్కో ఇంటికి రూ. ఆరు వేల చొప్పున చందాగా ఇవ్వాలని కుల పెద్దలు నిర్ణయించారు. అయితే, క్రైస్తవమతం స్వీకరించిన 15 గిరిజన కుటుంబాలు చందాలివ్వలేమని చెప్పారుు. దీంతో ఆ కుటుంబాలకు చెందిన కుంజా రాందాసు, కుంజా లక్ష్మి, ఈసం రాజేశ్వరి, కుంజా రాములమ్మ, కుంజా పద్మ, జబ్బా యశోద, కుంజా నాగలక్ష్మి, ఎనుగు గురవమ్మ, ఈసం శివకృష్ణలతో పాటు మరికొందరిని గ్రామ పెద్దలు వెలి వేశారు. వారితో ఎవరు మాట్లాడినా, వారిని శుభకార్యాలకు పిలిచినా, వాళ్ల ఇళ్లకు వెళ్లినా, వారికి నీళ్లు ఇచ్చినా, పనిలోకి పిలిచినా రూ. 10 వేల జరిమానా విధిస్తామని పెద్దలు తేల్చిచెప్పారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తాం గ్రామస్తుల్లో కొందరిని వెలి వేయడం అత్యంత హేయమైన చర్య. గురువారం తుమ్మల గూడేన్ని సందర్శిస్తాం. గ్రామస్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం. - వి.రాఘవరెడ్డి, తహసీల్దార్ చంటి బిడ్డనూ ఎత్తుకోవడం లేదు బొడ్రాయికి చందాలివ్వలేదని.. అభం శుభం తెలియని చిన్నారిని చుట్టుపక్కల ఇళ్లవారు కూడా ఎత్తుకోవడం లేదు. ఎత్తుకుంటే జరిమానా విధిస్తారని అందరూ భయపడుతున్నారు. - యశోద నీళ్లకు కూడా రానివ్వడం లేదు బొడ్రాయికి చందాలివ్వలేదని క్రిస్టియన్ మతం తీసుకున్న మమ్మల్ని వెలి వేశారు. నీళ్ల కోసం వెళితే రావొద్దంటున్నారు. బంధువుల ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. - ఈసం రాజేశ్వరి -
భద్రాచలంలో ముగిసిన పోలింగ్
హైదరాబాద్: తెలంగాణ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో పోలింగ్ వంద శాతం నమోదైంది. మొత్తం 59 మంది ఓటర్లు తమ ఎటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 38 మహిళా ఓటర్లు ఉండగా, 21 మంది పురుష ఓటర్లు ఉన్నారు. పాల్వంచలో 11 గంటల సమయానికి 68 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ లో 88 శాతం పోలింగ్ నమోదైంది. 212 ఓట్లకు ఇప్పటి వరకు 183 ఓట్లు పోలయ్యాయి. మహబూబ్ నగర్ డివిజన్ లో 12 గంటల వరకు 78 శాతం పోలింగ్ నమోదైంది. తమ ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా రాజకీయ పార్టీలు క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడి నుండి నేరుగా బస్సుల ద్వారా మూకుమ్మడిగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలిస్తున్నాయి. -
పాల్వంచ పురపాలక కార్యాలయంలో ఉద్రిక్తత
పాల్వంచ: తొలగించిన పారిశుద్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఖమ్మం జిల్లా పాల్వంచ పురపాలక కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న కార్మికులు ఒక్కసారిగి కార్యాలయంలోకి దూసుకెళ్లి.. ఒక గదిలో దూరి తలుపులు వేసుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో మంగళవారం విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కర్మాగారంలోని 1 నుంచి 10 యూనిట్లు ట్రిప్ అవడంతో దీని వల్ల 1220 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గ్రిడ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే ఒకే సారి యూనిట్లన్నీ ట్రిప్ అయినట్లు సీఈ లక్ష్మయ్య తెలిపారు. సాంకేతిక లోపం ఏర్పడటంతో అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. -
పాల్వంచలో జిలిటెన్ స్టిక్స్ లభ్యం
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలో సోమవారం పోలీసులు జిలిటెన్ స్టిక్స్‌ను గుర్తించారు. మండల కేంద్రంలో లక్ష్మీదేవిపల్లి డిగ్రీ కాలేజీ ఎదుట ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు కింద 8 జిలిటెన్ స్టిక్స్‌ను పోలీసులు కనుగొన్నారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో మావోయిస్ట్‌లే ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జిలిటెన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాల్వంచలో భారీ చోరీ
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లె గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన భూక్యాలచ్చ గిరిజన సహాకార సొసైటీలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అయితే, గత ఆదివారం సాయంత్రం తిరుపతి వెళ్లి గురువారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. కాగా, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే బీరువా తాళాలు తెరిచి ఉండటంతో దొంగతనం జరిగిందని గుర్తించారు. దుండగులు బీరువా ఉన్న 35 తులాల బంగారం, 1 కేజీ వెండి, రూ. 3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
నా నటనతో అందరికీ కిక్కెక్కిస్తా
సినీ నటుడు, కమెడియన్ తాగుబోతు రమేష్ పాల్వంచ: తన నటనతో ప్రేక్షకులందరికీ కిక్కెస్తానని సినీ నటుడు, కమెడియన్ తాగుబోతు రమేష్ అన్నారు. పాల్వంచలోని కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాలలో సోమవారం ఫేర్వెల్ నైట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘‘మాది కరీంనగర్ జిల్లా గోదావరిఖని. మా నాన్న గారు సింగరేణి ఉద్యోగి. చదువులో అంతగా రాణించలేకపోయా. మొదటి నుంచి మిమిక్రీ అంటే ఇష్టం. ప్రాక్టీస్ చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడిని. ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న పట్టుదలతో 2006లో హైదరాబాద్ వెళ్లా. మొదటిసారి ‘జగడం’ సినిమాలో, ఆ తర్వాత ‘మహాత్మ’లో నటించా. ఈ రెండు సినిమాల్లో నా నటనకు మంచి పేరు వచ్చింది. ఇప్పటివరకు వంద సినిమాల్లో నటించా. ప్రస్తుతం కమెడియన్ పాత్రల్లో మూస దోరణి ఎక్కువగా ఉంటోంది. కొత్తగా ఏదైనా చేయాలని తపనతో ఉన్నా. ఎంతమంది కమెడియ న్లు ఉన్నప్పటికీ.. ‘తాగుబోతు రమేష్’ అంటే ప్రత్యేకమైన క్రేజ్ లభించడం సంతోషంగా ఉంది. నేను నటించిన సినిమాల దర్శకుల సహకారాన్ని మరువలేను. నటనలో నన్ను నందినీరెడ్డి, రాజమౌళి, శ్రీను వైట్ల ఎంతగానో ఎంకరేజ్ చేశారు. సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని విజయాలు సాధించడమన్నది ఒక్క శాతం మాత్రమే. నటన ద్వారా అభిమానుల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదిస్తే వంద శాతం సక్సెస్ అయినట్టే. తోటి కమెడియన్ ధనరాజ్‌తో కలిసి ‘ఏకే రావు.. పీకే రావు’ సినిమాలో హీరోగా నటించా. నా అభిమాన కమెడియన్లు.. హిందీలో కెస్టో ముఖర్జీ. తెలుగులో ఎంఎస్.నారాయణ. వారిలాగా పేరు సంపాదించుకోవాలని ఉంది. -
ఆటో లారీ ఢీ.. ఒకరి మృతి
ఖమ్మం: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. కంకర లోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ వెంపటి శ్రీనివాస చంద్రశేఖర్(35) అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు కొత్తగూడం హనుమాన్ బస్తీకి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. -
రూ. 7 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం
ఖమ్మం : ఖమ్మం జిల్లా పాల్వంచ అటవీ చెక్‌పోస్ట్ వద్ద గంజాయి అక్రమ రవాణాను సిబ్బంది అడ్డుకున్నారు. విశాఖ జిల్లా డొంకరాయి నుంచి టర్బో వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తున్న రెండున్నర క్వింటాళ్ల గంజాయిని సోమవారం ఉదయం తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్ట్ చేయగా... మరో ముగ్గురు పరారయ్యారు. పట్టుబడిన ఇద్దరిలో ఒకరు విశాఖ మాడుగుల మండలం ఎం.కోటపాడుకు చెందిన పిల్లి త్రినాథ్ కాగా, రెండో వ్యక్తి పాల్వంచకు చెందిన భూక్యా భాస్కర్‌గా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.7 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులు గంజాయిని ప్రింట్‌పేపర్ల కవర్లలో ప్యాక్ చేసి వాటిని టర్బో వాహనంలోపల సీట్లలో స్పాంజ్‌ను తొలగించి ఆ స్థానంలో ఉంచి రవాణా చేస్తున్నారు. (పాల్వంచ) -
పాల్వంచలో భారీ చోరీ
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి పాల్వంచలోని కేటీపీఎస్ జెన్కో కాలనీలో 10 ఇళ్లలో దొంగలు భారీగా దోచుకున్నారు. ఈ చోరీలో సుమారు కోటి రూపాయల విలువైన బంగారం, నగదును తస్కరించారు. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో కాలనీ వాసులు తమ సొంత గ్రామాలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు కాలనీలో పడి భారీ చోరీ చేసి ఉడాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దొంగల ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
దవా'ఖానా'..!
ప్రభుత్వాస్పత్రుల్లో నాసిరకం భోజనం ఖమ్మం: ముద్ద అన్నం.. నీళ్లచారు, మజ్జిగ.. సాంబారు లాంటి పప్పు.. నాసిరకం కోడిగుడ్లు, బ్రెడ్లు.. రుచీపచీలేని వంటకాలు తినలేక పస్తులుంటున్న తీరు.. ఇవీ జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పుత్రుల్లో రోగుల అవస్థలు. ఓ పద్ధతి ప్రకారం మెనూ అమలు చేయాల్సిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో పేషెంట్లు అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది. రోగులు డిశ్చార్జ్ అయినా.. భోజనం పెట్టినట్టు బిల్లులు నొక్కేస్తున్నా పర్యవేక్షించాల్సిన ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది పట్టనట్టే ఉంటున్నారు. మంగళవారం 'సాక్షి' పరిశీలనలో జిల్లాకేంద్ర ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రుల్లో ఆహార పదార్థాల అధ్వానస్థితి బయటపడింది. ఏరియా ఆస్పత్రుల్లో రోగులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా భోజనాన్ని వడ్డిస్తుండటంతో రోగులు తినలేకపోతున్నారు. కొన్నిచోట్ల మెనూ ప్రకారం గడ్డు, పాలు, బ్రెడ్డు కూడా అందించడం లేదు. ఇదేమని అడిగితే తమకు గిట్టుబాటు కావడం లేదని కాంట్రాక్టర్లు సమాధానం చెబుతుండటం గమనార్హం. జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్స్‌కు అందిస్తున్న భోజనం నాణ్యతపై మంగళవారం 'సాక్షి' పరిశీలన చేసింది. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రితో పాటు కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, సత్తుపల్లి, పెనుబల్లిలో ఏరియా ఆస్పత్రులున్నాయి. చికిత్స కోసం రోగులు అడ్మిట్ అయితే వారికి ఉదయం పాలు, బ్రెడ్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాలి. వైద్య విధాన పరిషత్ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు రోగులకు ఆహారపదార్థాలు అందిస్తారు. ఒక్కో రోగికి ఉదయం పాలు, బ్రెడ్‌తో పాటు రెండు పూటల భోజనం 400 గ్రాముల బియ్యం వండించి పెట్టాలి. చారు, గుడ్డు, మజ్జిగతో పాటు ఏదైనా కూర వడ్డించాలి. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయిన రోగులకు రెండు కూరలు, గుడ్డు పెట్టాలి. సాధారణంగా ఒక్కో రోగికి రోజుకు రూ.40, ఆరోగ్యశ్రీ కింద రూ.100 వరకు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. అయితే తమకు గిట్టుబాటు కావడం లేదంటున్న కాంట్రాక్టర్లు ఆరోగ్యశ్రీ వార్డుల్లోనూ నాసిరకంగా భొజనం అందిస్తున్నారు. జనరల్ వార్డుల్లో ఉన్న రోగులకు కూడా వారంలో రెండు రోజులే గుడ్లు పెడుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నీళ్ల చారు వడ్డిస్తుండటంతో రోగులు దీన్ని తినలేక పారబోస్తున్నారు. కొంతమంది రోగులు డిశ్చార్జ్ అయినా.. వారికి కూడా భోజనం పెట్టినట్లు కాంట్రాక్టర్లు రికార్డుల్లో రాసుకొని బిల్లులు నొక్కేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు ఏరియా ఆస్పత్రుల అధికారులు సహకరిస్తున్నారని సమాచారం. ఈ భోజన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రతి ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఓ అధికారిని ఏర్పాటు చేశారు. వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లనే కాంట్రాక్టర్లు నాణ్యతను విస్మరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చికిత్స కోసం ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన రోగులు మాత్రం ఈ భోజనం తిని ఎలా ఉండాలని వాపోతున్నారు. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో ఉదయం ఇచ్చే పాలు పలుచగా ఉంటున్నాయి.. మధ్యాహ్న భోజనానికి దొడ్డు బియ్యం ఉపయోగిస్తుండటంతో తినలేకపోతున్నామని రోగులు అంటున్నారు. అన్నంలో రాళ్లు, కూరలో ఉప్పు, కారం తక్కువగా ఉండటం, రుచి లేకపోవడంతో రోగులు తినలేక పారేస్తున్నారు. ప్రతి రోజు నీళ్ల చారు, ఆలుగడ్డ వంటి కూరలు పెడుతున్నారు. వాటి స్థానంలో ఆకు కూరలు పెట్టాలని రోగులు కోరుతున్నారు. సత్తుపల్లిలో ఏరియా ఆస్పత్రిలో 58 మంది రోగులు ఇన్పేషెంట్లుగా ఉన్నారు. వీరికి ఉదయం కిచిడి, పాలు అందిస్తారు. మధ్యాహ్నం దొడ్డు బియ్యం అన్నం, బెండకాయ పులుసు, నీళ్ల సాంబారుతో మెనూ తూతూ మంత్రంగా పాటిస్తున్నారు. మజ్జిగ అసలే లేదు. రోగులకు ఇగురు కూర అందించాల్సి ఉండగా పులుసు కూరతోనే సరిపెడుతున్నారు. రోగులకు కొలత ప్రకారం చిన్న గిన్నెతో అన్నం వడ్డిస్తుండటంతో సరిపోక అర్థాకలితో అలమటిస్తున్నారు. పెనుబల్లి ఏరియా ఆస్పత్రిలో రోగులు చలికి తట్టుకోలేక వైద్యం చేయించుకొని ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 24 మంది వైద్యం పొందుతున్నారు. వీరికి ఉదయాన్నే పాలు, బ్రెడ్ అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో ఉపయోగించే బియ్యం కొత్తవి, దొడ్డువి కావటంతో ఆ అన్నం తినేందుకు అవస్థలు పడుతున్నారు. పాల్వంచ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు ఉదయం పాలు, బ్రెడ్ అందించాల్సి ఉండగా రెండు ఇడ్లీలతో సరి పెడుతున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం భోజనంలో నాణ్యత లోపిస్తోంది. దొడ్డు రేషన్ బియ్యం కావడంతో అన్నం ముద్దముద్దగా తయారవుతోంది. రుచీపచీ లేకుండా కూరలు వండిపెడుతున్నారు. దోసకాయ కూర , రసం ఇచ్చారు. వాటిల్లో నాణ్యత లేదని, కనీసం తాలింపు గింజలు, ఎల్లిపాయలు, కరివేపాకు వంటి ఏమీ వేయలేదని రోగులు మండిపడ్డారు. నీళ్ల చారు ఎలా తాగాలని ప్రశ్నించారు. మధ్యాహ్నం, సాయంత్రం రెండు సార్లు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా గత వారం రోజులగా ఇవ్వటం లేదు. సాంబారుకు బదులు రసం చేసి ఇచ్చారు. కొన్ని రోజులుగా మజ్జిగా ఇవ్వడం లేదు. భద్రాచలం ఏరియా వైద్యశాలలో భోజనం నిర్వాహకులదే ఇష్టారాజ్యం. ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు, రొట్టె ఇచ్చేటప్పుడు, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం పెట్టేటప్పుడు ఆస్పత్రి అధికారులు కన్నెత్తయినా చూడటం లేదు. వాస్తవంగా భోజనం పంపిణీ సమయంలో ఆస్పత్రిలోని నర్సింగ్ సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి. కానీ భోజనం తయారు చేసే కార్మికులే వీటిని ప్రతి గదికి తిరిగి పెడుతున్నారు. ఇక్కడ తరచూ పప్పే వడ్డిస్తున్నారు. అది కూడా సాంబారు మాదిరే ఉంటుందని రోగులు చెబుతున్నారు. మజ్జిగ తాగలేని పరిస్థితి ఉంది. అరటిపండు కూడా అందరికీ ఇవ్వడం లేదు. -
కిన్నెరసాని రిజర్వాయర్‌లో జోరుగా చేపలవేట
పాల్వంచ రూరల్: కిన్నెరసాని రిజర్వాయర్‌లో చేపలవేట జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు తెప్పలు కట్టుకుని వెళ్లి వలలు వేసి చేపలు పట్టుకుంటున్నారు. కొందరు వాటిని మార్కెట్లోకి తెచ్చి అమ్ముకుంటుండగా మరికొందరు ఒడ్డునే ఈ వ్యాపారం చేస్తున్నారు. మొసళ్లు సంతచరించే ఈ రిజర్వాయర్‌లోకి వెళ్లడం ప్రమాదకరమని తెలిసినా యథేచ్ఛగా చేపల వేట కొనసాగుతున్నారు. రిజర్వాయర్‌లోకి వెళ్లడం నిషేధమైనప్పటిప్పటికీ అలాంటి నిబంధనలేవీ తమకు వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేటీపీఎస్ అధికారులు, అటవీశాఖ అనుబంధ వైల్డ్‌లైఫ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కళ్లెదుటే చేపల వేట జరుగుతుండడం, ఒడ్డున డ్యామ్ పక్కనే విక్రయాలు సాగుతుండడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నా చూసీచూడనట్లు వదిలేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. రిజర్వాయర్ వద్ద పహారా కాసే కేటీపీఎస్, వైల్డ్‌లైఫ్ సిబ్బంది తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
పంట ఎండింది.. గుండె పగిలింది
కరెంట్ కోతలతో కళ్ల ముందటే పంట ఎండిపోవట్టే.. వేసిన బోర్ల అప్పులు ఎక్కువయ్యే. బ్యాంకుల రుణమేమో మాఫీ కాలే. భవిష్యత్తు అంతా అంధకారమే కనిపించే. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువరైతు బతుకు మీద ఆశ వదులుకున్నాడు. చేనులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని అనాధను చేశాడు. భార్య, పిల్లలను వదిలి కానరాని లోకాలకు పయనమయ్యాడు. * పాల్వంచలో యువరైతు ఆత్మహత్య * అప్పులు ఎక్కువ కావడం * రుణం మాఫీ కాకపోవడంతో మనస్తాపం * పంట చేనులోనే ఉరికి వేలాడిన అన్నదాత మాచారెడ్డి: ఆరుగాలం శ్రమించిన పంట ఎండిపోయింది. బోర్లు తవ్వించిన అప్పు వేధించసాగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సం ఘటన సోమవారం మాచారెడ్డి మండలం పా ల్వంచ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాకలి నర్సింహులు (35) అనే రైతు తన సొంత చెరుకు తోట లో చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. మండల కేంద్రంలో ని స్టేట్ బ్యాంక్‌లో నర్సింహులకు రూ.45 వేల పంట రుణం ఉంది. సోమవారం బ్యాంకుకు వెళ్లిన ఆయన తన రుణం మాఫీ అయ్యిందా అని బ్యాంకు అధికారులను అడిగాడు. కాలేదని వారు సమాధానం చెప్పారు.దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.‘అప్పులైన యి.బ్యాంక్‌ల రుణంమాఫీకాలేదు.. కొత్త రుణం రాలేదు.. పంట ఎండిపోవట్టే.. పిల్లలు చిన్నగున్నరు ఏం చేద్దాం’ అంటూ తీవ్ర ఆందోళనకు గురయ్యాడని భార్య లక్ష్మి రోధిస్తూ చె ప్పింది. నర్సింహులు ఆయన సోదరుడు బాల్‌రాజు కలిసి నాలుగు ఎకరాల భూమిలో ఓ బోరు తవ్వించారు. ఆ బోరు నీరు తక్కువగా పోయడంతో నర్సింహులు మరో మూడుబోర్లు అదనంగా వేయించాడు. అవి వట్టిపోయాయి. రూ.లక్ష వరకు అప్పు అయ్యింది. ఎకరం చెరుకు, మరో ఎకరం వరి సాగుచేశాడు. కరెంట్ కోతలతో చెరుకుతోట సగం వరకు ఎండిపోయింది. సాగుచేసిన వరిపంట సైతం ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతు నర్సిం హులుకు ఉరి తాడే దిక్కయ్యింది. చనిపోతున్నానని చెప్పి... నర్సింహులు చనిపోవడానికి ముందు సమగ్ర సర్వేలో భాగంగా వచ్చిన తప్పు ఒప్పులను సరి దిద్దుకోవడానికి గ్రామపంచాయతీ వద్ద ఉన్న గ్రామస్తుడు పరశురాములుకు చూయించాడు. ఇదేమి సర్వేనో ఏమోనని మదనపడి, ఓ దిక్కు అప్పులు పెరిగిపోతున్నయి. రుణమాఫీ కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు పరశురాము లు తెలిపారు. గ్రామపంచాయతీ నుంచి నేరు గా గ్రామ శివారులో ఉన్న తన పొలం వద్దకు వెళ్లాడు. వెళ్లిన మరుక్షణమే గ్రామానికి చెందిన గ్రామసేవకుడు మశ్చందర్కు ఫోన్ చేశాడు. ‘‘కాకా నాకు బతకాల నిపిస్తలేదు చనిపోతు న్నా. రుణమాఫీ కాలేదు.. పంట ఎండిపోతుం ది. కరెంట్ ఎద్దెం మద్దెంగా ఉంది, నేను ఉరి వేసుకుని చచ్చిపోతున్నా. నా భార్య, పిల్లలు పయిలం’’ అంటూ నర్సింహు లు చెప్పడంతో మశ్చందర్ వద్దని వారించాడు. ‘ఎందుకు సచ్చిపోతావ్ బిడ్డా, అందరం బతక లేమా నువ్వుకూడా గట్లనే బతుకు, చిన్న చిన్న పిల్లలున్నరు అద్దు బిడ్డా’ అని బదులివ్వడంతో నర్సింహులు ఫోన్ కట్ చేశాడు. ఆందోళన చెం దిన ఆయన గ్రామస్తులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకునేలోగానే నర్సింహులు టేకు చెట్టుకు విగత జీవై కనిపిం చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న భార్య లక్ష్మి ‘‘చేనుకాడికి పోయివస్తానని శవమయ్యా వా’’ అంటూ బోరున విలపించింది. లోకం పోకడ తెలియని చిన్నారులు.. ‘‘నాయిన చెట్టు ఎక్కాడా అమ్మా’’ అంటూ అమాయకంగా అడగడంతో అక్కడ ఉన్న హృదయా లు కలచివేశాయి. నర్సింహులుకు భార్య లక్ష్మి, కూతురు అశ్విని(09), కుమారుడు నితిన్(06) ఉన్నారు. మాచారెడ్డి ఎస్ఐ ప్రసాద్‌రావు, ఏఎస్ఐ ముజీ బ్, హెడ్‌కానిస్టేబుల్ మురళి శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహంతో రైతుల ఆందోళన నర్సింహులు మృతదేహంతో శనివారం సాయంత్రం పాల్వంచ గ్రామం వద్ద కా మారెడ్డి-సిరిసిల్ల రహదారిపై రైతులు రా స్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్య తిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. రుణమాఫీ కాకపోవడం, కరెంట్ కొరత కారణంగా పంటలు ఎండిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రుణమాఫీ, విద్యుత్ సమస్య లు తీర్చాలని, లేకపోతే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని రైతులు హెచ్చరించారు. పాల్వంచ ఎంపీటీసీ సభ్యుడు గ్యార చంద్రయ్య, ఉపసర్పంచ్ అంజియాదవ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు నారాగౌడ్ రైతులకు సంఘీభావం తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అదిగో.. చిరుత
కొద్ది రోజుల క్రితం భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో బహిర్భూమికి వెళ్లిన వాచ్‌మన్ బాలరాజుచిరుతను చూసి జడుసుకున్నాడు. దోమకొండలో పొలానికి వెళ్లిన రైతు వెంకటరెడ్డి భార్య ఇందిర బంతిపూల తోటలో చిరుతను చూసి హడలిపోయింది. మాక్లూరు మండలం మాదాపూర్ శివారులో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు చిరుతను చూసి బెంబేలెత్తిపోయారు. అడవులలో సంచరించాల్సిన చిరుతపులులు జనారణ్యంలో అలజడి రేపుతున్నాయి. అటవీ శాఖ అధికారులు మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తున్నారు. - సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ భిక్కనూరు టు మాక్లూరు * వయా పాల్వంచ, దోమకొండ * జనారణ్యంలో చిరుత సంచారం * పొద్దుగూకితే భయం భయం * అభయారణ్యంలో కరువైన రక్షణ * ‘పోచారం’ను వీడి జనావాసాల్లోకి * వన్యప్రాణుల సంరక్షణ గాలికి * చోద్యం చూస్తున్న అటవీ శాఖ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పదిహేను రోజులుగా జిల్లాలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. ఎన్నడూ లేని విధంగా చిరుతలు జనారణ్యం వైపు రావడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖ వన్యప్రాణుల సంరక్షణను విస్మరించిన కారణంగానే పులులు, చిరుతలు జనంలోకి వస్తున్నాయంటున్నారు. నిజామాబాద్‌ను ఆనుకుని ఉన్న ఆదిలాబా ద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యం నుంచి కూడ చిరుతలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రహసనంగా వన్యప్రాణుల సంరక్షణ అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వన్యప్రాణుల సంరక్షణ ప్రహసనంగా మారింది. చట్టం అభాసుపాలవుతోంది. పులి గోర్లు, చర్మాల కోసం జంతువుల వేట ప్రధాన వృత్తిగా పెట్టుకున్న స్మగ్లర్ల కారణంగా వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. మిగిలిన వాటి ని అధికారులు పట్టించుకోకపోవడంతో అవి జనావాసాల వైపు దూసు కొస్తున్నాయి. జిల్లా వైశాల్యం 17,655 చదరపు కిలోమీటర్లు కాగా, అందులో 17.40 శాతం (2,718.09 చ. కి. మీ) వరకు అడవులు విస్తరించి ఉన్నాయి. పోచారం అభయా రణ్యాన్ని 1952 ఫిబ్రవరి 29 నుంచి జీఓ నంబర్ 124 ప్రకారం వన్యప్రాణుల రక్షిత ప్రదేశంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ అడవిలో మూడు పులులు, పన్నెండు చిరుతలు, నెమళ్లు, దుప్పులు, అడవి జింకలు, కృష్ణజింకలు, అడవిదున్నలు తదితర వన్యప్రాణులున్నాయి. వీటి సంరక్షణ కోసం ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేశారు. కానీ, వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు చిక్కుతూనే ఉన్నాయి. పులులు, చిరుతల సంతతి రోజు రోజుకూ అంతరించిపోతోందని ‘జాతీయ పులుల గణన సమితి’ ఆందోళన చెం దు తున్నది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయి తే, అధికారులు వాటికి అడవిలో తగిన వసతులు కల్పించడం లో విఫలమవుతున్నారు. లెక్కలు తేలేది ఇలాగ ప్రభుత్వం ఏటా అభయారణ్యాలలో జీవించే వన్యప్రాణుల గణనను చేపడుతోంది. నాలుగేళ్లకు ఓసారి కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా వన్యమృగాల గణాం కాలపై సర్వే నిరహిస్తోంది. రాష్ట్రంలో మాత్రం దట్టమైన అడవులలో ఏటా మే నెలలో వన్యప్రాణులను గణిస్తారు. జంతువుల ‘అడుగుజాడ (ఇన్‌ప్రింట్)ల’ ఆధారంగా వీటిని లెక్కిస్తారు. గత ఏడాదితో పోల్చి తే ఈ సంవత్సరం వన్యప్రాణుల సంఖ్య తగ్గిందా? పెరిగిందా? అన్నది కూడా ఈ పద్ధతి ద్వారానే తెలుస్తుంది. 2004లో జిల్లాలో మూడు పులులు, పన్నెం డు చిరుతలు ఉండేవి. ప్రస్తుతం పులుల ఆచూకీ లేకపోగా, చిరుతల సంఖ్య ఎనిమిదికి తగ్గిందని సమాచారం. ఇతర వన్యప్రాణుల విషయానికి వస్తే పో చారం అభయారణ్యంలో 168 అడవి పందులు, 96 నీల్గాయిలు, కుందేళ్లు, నెమళ్లు, కృష్ణ జింకలు, 400 సాంబారులు ఉన్నట్లు అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అధికారులు వ్యవహరిస్తే పులులు, చిరుతలు జనంలోకి రాకుండా అడవులకే పరిమితమవుతాయి. కానీ, అంతరిస్తున్న అడవులు, చట్టు బండలవుతున్న కారణంగా చిరుతలు జనంలోకి చేరి ఆందోళన కలిగిస్తున్నాయి. మా ఇంటికి సమీపంలోనే కన్పించింది మా ఇంటికి సమీపంలోనే సమారు 200 మీటర్ల దూరంలో పులి కన్పించింది, రాత్రి పూటి ఇంటినుంచి బయటకు రావడంలేదు, రాత్రి ఎనిమిది గంటలకు తలుపులు వేస్తే ఉదయం వరకు తీయడంలేదు. భయంగా ఉంది, రాత్రి పూట నిద్రలేకుండా గడుపుతున్నం. అధికారులు వచ్చి పోయిండ్రు.. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -దుర్గేష్, కూలి, మాదాపూర్ ఐదు రోజులలో మూడు సార్లు .. నేను కంకర మిషన్‌లో పని చేస్తా. మేం పని చేసే చోట చిరుత ఐదు రోజులలో మూడు సార్లు కనిపించింది. మొదట ఏడవ తేదీన, తరువాత ఎనిమిది, పదవ తేదీల లో మళ్లీ కన్పిపించింది. మేం ఒంటరిగా పనికి పోవడం లేదు. అందరం కలిసే పోతున్నం. భయంగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. - అనిల్రామ, మాదాపూర్ -
విజృంభిస్తున్న విషజ్వరాలు
పాల్వంచ : జిల్లాలో విషజ్వారాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటున్నారు. ఒక్క మంగళవారం రోజునే జ్వరాల తో పాల్వంచ మండలంలో ముగ్గురు, చండ్రుగొండ మండలంలో ఒకరు మృత్యువాత పడ్డారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్లపైనే మురుగు నీరు చేరుతుండడంతో దోమలు ప్రబలుతున్నాయని, పారిశుధ్య సమస్యను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జర పీడితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా వైద్య సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటించాల్సిన వైద్య సిబ్బంది కనిపించడమే లేదని చెపుతున్నారు. పాల్వంచ మండలం ఉల్వనూరు పంచాయతీ కొత్తూరు బంజర గ్రామానికి చెందిన కుంజా మల్లయ్య, లక్ష్మి దంపతుల కూతురు అనిత(14) ఉల్వనూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల ఇంటికి వచ్చిన అనిత మూడు రోజుల క్రితం జ్వరం బారిన పడింది. దీంతో ఉల్వనూరు పీహెచ్సీలో చికిత్స చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో పాల్వంచ, ఖమ్మంలోని ఆస్పత్రుల్లో చూపించారు. బాలిక సెలబ్రల్ బ్రెయిన్ మలేరియాతో బాధపడుతోందని వైద్యులు తెలిపారు. చివరకు కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఇక పాల్వంచ మున్సిపాలిటీలోని హమాలీ కాలనీకి చెందిన మిటా రాజక్క (40) పది రోజులుగా జ్వరంతో భాదపడుతూ కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. అలాగే పాల్వంచలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీకి చెందిన జర్పల శేఖర్, స్వర్ణ దంపతుల కూతురు నిత్య(4 నెలలు) నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చికిత్స పొందుతూనే మృత్యువాత పడింది. ఈ విషయకమై ఉల్వనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రాఘవేందర్ రెడ్డిని వివరణ కోరగా.. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వస్తున్నాయని, వాతావరణంలో మార్పులు, దోమల కారణంగా గత రెండు రోజులుగా జ్వారపీడితుల సంఖ్య పెరిగిందని చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చండ్రుగొండలో.. చండ్రుగొండ మండలం తిప్పనపల్లి డీవీనగర్కు చెందిన పూజల వెంకటేశ్వర్లు (40) విషజ్వరంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వారం రోజుల క్రితం జ్వరం రాగా ఆస్పత్రికి తీసుకెళ్లామని, అయినా పరిస్థితి అదుపులోకి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తిప్పనపల్లి గ్రామంలో ఇటీవల విషజ్వరాలు ప్రబలి సుమారు 200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు వెంకటేశ్వర్లు మరణంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి జ్వరాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆ మృతదేహం ఉపేందర్దే....
పాల్వంచ : హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది నీటి ప్రవాహంలో గల్లంతయిన విద్యార్థి తల్లాడ ఉపేందర్ మృతదేహాన్ని వెలికి తీశారు. గాలింపు చర్యల్లో భాగంగా సిబ్బంది గురువారం రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఉపేందర్ మృతదేహాన్ని అతని తల్లిదండ్రులు గుర్తించారు. విహార యాత్రకు వెళ్లిన కుమారుడు చివరికి విగత జీవిగా మారటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా విలపించారు. కాగా ఉపేందర్ తండ్రి తల్లాడ శ్రీనివాస్ స్థానికంగా కేటీపీఎస్‌లో కాంట్రాక్టు పనులు చేస్తుంటారు. చిన్నకొడుకు మహేష్ వరంగల్‌లో చదువుతుండగా పెద్ద కొడుకు ఉపేందర్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈలో ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు స్థానిక కృష్ణగౌతమి పాఠశాలలో చదివిన ఉపేందర్.... తోటి విద్యార్థులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు చదువులో ప్రతిభ కనబరుస్తు ఉండేవాడని ఆ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణ తెలిపారు. ఉపేందర్ హైదరాబాద్ మసబ్‌ట్యాంక్ వద్ద గల జెఎన్టియు కళాశాలలో డిప్లొమో చదివాడని, ఈసెట్‌లో మంచి ర్యాంక్ సాధించడంతో విజ్ఞాన జ్యోతి కళాశాలలో సీటు లభించిందని పిన్ని పద్మ తెలిపింది. ఇలా చదువులో మొదటి నుంచి ప్రతిభ కనబరుస్తున్న ఉపేందర్ ప్రమాదబారిన పడడంతో అతను చదివిన పాఠశాల ఉపాధ్యాయుల్లో, తోటి స్నేహితుల్లోనూ విషాదం అలముకుంది. -
రాష్ట్ర విభజన నేపథ్యం గందరగోళం
భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో.... జూన్ 2 తరువాత భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 211 గ్రామాలను జిల్లా నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. కానీ ముంపు మండలాల్లో సరిహద్దుల ఏర్పాటు విషయంలో తలెత్తే సమస్యలపై అధికారుల నుంచి సరైన స్పష్టత లేకపోవటం తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ముంపు గ్రామాలను జిల్లా నుంచి వేరుచేయటమే తమ పని అన్నట్లుగా అధికారులు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. అయితే ముంపు ప్రాంత ప్రజానీకం, ఉద్యోగుల్లో తలెత్తే అనుమానాలను నివృత్తి చేసేవారు లేకపోవటంతో అంతటా అయోమయం నెలకొంది. కొత్త చిక్కులు.... ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేసే క్రమంలో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ముంపు పరిధిలో ఉన్న గ్రామాలనే పరిగణలోకి తీసుకొని అధికారులు విభజన నివేదికలు తయారు చేస్తున్నారు. ఈ కారణంగా మధ్యలో మిగిలిపోతున్న గ్రామాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వస్తున్నాయి. అంటే చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలు ఉంటే మధ్యలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు ఉంటాయి. ముంపు పరిధిలోకి వచ్చే ఏడు మండలాల్లో వీఆర్‌పురం, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్లిపోతున్నట్లుగానే అందరూ భావించారు. కానీ వాస్తవంగా ఈ మండలాల్లో కూడా కొన్ని గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాయి. కూనవరం మండలాన్నే పరిశీలిస్తే... వాస్తవంగా ఇక్కడ 56 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇందులో 39 గ్రామాలు ముంపు పరిధిలోకి వస్తున్నాయి. ఈ మండలంలో 26,597 మంది జనాభా ఉంటే, ఇందులో 22,795 మందిని ఇక్కడ నుంచి వేరుచేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ ప్రకటించిన జాబితాలో పేర్కొన్నారు. అంటే మరో 3,802 మంది తెలంగాణ రాష్ట్రంలోనే ఉండిపోతారు. ఇలా మిగిలిపోయిన జనాభా ఉన్న గ్రామాల చుట్టూ ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రంలోకి వెళ్లే గ్రామాలు ఉంటాయి. వీరంతా గ్రామం నుంచి భద్రాచలం, జిల్లా కేంద్రమైన ఖమ్మం ప్రాంతాలకు రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల మీదుగా ప్రయాణించాల్సిందే. ముంపు పరిధిలో గల దాదాపు ఏడు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గుట్ట దిగితే ఆంధ్ర...ఎక్కితే తెలంగాణ..! ముంపు మండలాల్లో ఉన్న కొండరెడ్డి గ్రామాల పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. కూనవరం, వీఆర్‌పురం, వేలేరుపాడు మండలాల్లో గుట్టలపై ఉన్న కొండరెడ్డి గ్రామాలు ముంపు పరిధిలో రాకపోవటంతో ఈ గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయి. ఇలా కూనవరం మండలంలో 10 గ్రామాలు, వేలేరుపాడులో ఒకటి, వీఆర్‌పురం మండ లంలో ఒక గ్రామం ఉంది. వీరు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా గుట్టలు దిగి రావాల్సిందే. ఉదాహరణకు కూనవరం మండలంలో గుట్టలపై ఉన్న గ్రామాల వారు కూటూరు వద్ద గుట్ట దిగుతారు. కానీ ప్రస్తుతం కూటూరు ముంపులో ఉన్నందున ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం అవుతుంది.దీంతో తెలంగాణలో ఉన్న గుట్టలపై నుంచి కింద ఉన్న ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలోని గ్రామాలకు రావాల్సిందే. ఈ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. శరవేగంగా విభజన ఏర్పాట్లు జూన్ 2 తరువాత ముంపు గ్రామాలకు అన్ని రకాల సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే అందుతాయని ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ముంపు గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తులు, స్థిర, చరాస్తులను ఆయా శాఖల ఆధ్వర్యంలో లెక్క గట్టి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అదే విధంగా ముంపు పరిధిలోకి ఎంత మంది సిబ్బంది వస్తున్నారనే దానిపై కూడా నివేదికలు రెడీ అవుతున్నాయి. మొత్తంగా... ప్రజానీకంలో నెలకొన్న అయోమయంపై సరైన స్పష్టత ఇవ్వకుండానే ముంపు గ్రామాలను విలీనం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. -
వైఎస్ఆర్ సీపీ గెలుపును ఆపలేరు
పాల్వంచ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ నేత, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పొంగులేటి శ్రీని వాసరెడ్డి, పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ బుధవారం పాల్వంచ మండలంలోని పాండురంగాపురం, రెడ్డిగూడెం, పునుకుల, పుల్లాయిగూడెం తదితర గిరిజన గ్రామాల్లో ప్రచారం నిర్వహిం చారు. జడ్పీటీసీ అభ్యర్థి బాలినేని నాగేశ్వరరావును, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పొంగులేటి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థులు మల్లయ్య (పాండురంగాపురం), బి.జ్యోతి (సూరారం), బండి వెంకటేశ్వర్లు (పాయకారియానంబైల్), నాయకులు జాలే జానకిరెడ్డి, తుమ్మల శివారెడ్డి, పిట్టల వెంకటనర్సయ్య, మోహన్‌రావు, కె.నాగిరెడ్డి, సండ్రుపట్ల శ్రీనివాసరెడ్డి, మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, దేవీ లాల్, భద్రయ్య, సలీమున్నీసాబేగం, రేవంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవడు, 1 నేనొక్కడినే పైరసీ సీడీలు స్వాధీనం
ఖమ్మం : తెలుగు చిత్ర పరిశ్రమను పైరసీ రక్కసి వెంటాడుతూనే ఉంది. మొన్న కృష్ణాజిల్లా....నేడు ఖమ్మం జిల్లాలో ఇటీవలి విడుదలైన ఎవడు, 1 నేనొక్కడినే చిత్రాల పైరసీ సీడీలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తాజాగా పాల్వంచలో ఈ రెండు చిత్రాల పైరసీ సీడీలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పైరసీ సీడీలు విక్రయిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు సీడీ షాపులపై దాడులు చేశారు. ఈ సందర్భంగా పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న పలు ప్రాంతాల్లో ఎవడు, 1 నేనొక్కడినే పైరసీ సీడీలు స్వైర విహారం చేస్తున్నాయి. -
‘బ్రిజేష్’ తీర్పు అమలయితే... సాగర్ ఆయకట్టు ఎడారే
పాల్వంచ, న్యూస్‌లైన్: కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు చెప్పారు. ఆయన శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ తీర్పు అమలయితే జిల్లాలోని సాగర్ ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో కొంతవరకు (ప్రకాశం బ్యారేజీ వరకు) మాత్రమే సద్వినియోగమవుతున్నాయని అన్నారు. ట్రిబ్యునల్ తీర్పుతో నాగార్జున సాగర్‌కు నీరు వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. రాష్ట్రంలోని నదులపై ప్రాజెక్టులు లేనందునే నదీ జలాలు సముద్రంపాలవుతున్నాయని అన్నారు. దీనిని చూపించే.. మిగులు జలాలను కర్ణాటక, మహారాష్ట్ర వినియోగించుకోవచ్చని బ్రిజెష్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిందన్నారు. నదుల్లోని మిగులు జలాలను సాగుకు వినియోగించే లక్ష్యంతోనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి జల యజ్ఞం చేపట్టారని అన్నారు. దీనిని పూర్తిచేయడంలో వైఎస్ఆర్ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని విమర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా మిగులు జలాల వినియోగంపై ఇప్పుడు తర్జనభర్జన నెలకొందన్నారు. ఆంధ్రా, తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు కృష్ణా మిగులు జలాలను కర్ణాటక, మహారాష్ట్రకు కట్టబెట్టేందుకు చూస్తున్నదని విమర్శించారు. ఇకపై రాష్ట్రానికి సాగు నీరు అందక ఇబ్బందులేర్పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
తెలంగాణ ఉద్యమానికి.. పురిటిగడ్డ పాల్వంచ
పాల్వంచ, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమం.. కేటీపీఎస్ కేంద్రం గా పాల్వంచలో పురుడు పోసుకుందని, అది 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడిందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పా రు. పాల్వంచలోని జెన్కో గెస్ట్‌హౌస్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర అధికారుల పెత్తనం, ఇక్కడి ప్రజలపట్ల వివక్ష, చులకన భావం సహించలేని ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఆనాడు తిరుగబాటు చేశారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు కిందిస్థాయి ఉద్యోగుల విషయంలో ఆంధ్ర అధికారుల పక్షపాత వైఖరిలో మార్పు రావడం లేదని అన్నారు. ఉన్నతస్థాయి పదవులన్నింటినీ సీమాంధ్రులే చేజిక్కించుకుని నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారని, కిందిస్థాయి ఉద్యోగుల బతుకులు ఛిద్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ఉద్యోగాలలో కేవలం 21శాతం మాత్రమే ఇక్కడి వారు ఉన్నారని, మిగతా వాటిని ఆంధ్ర వారితో భర్తీ చేశారని చెప్పారు. ఇకపై తెలంగాణ వారికే ఉద్యోగోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బదిలీల ప్రక్రియ చేపట్టాలని, అప్పుడు ఎక్కువ శాతం మంది ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును ఇక్కడి ప్రాంతానిదే వాడాలని, తద్వారా ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గుతుందని అన్నారు. నాణ్యమైన బొగ్గు లభ్యమవుతున్నందున ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగే అవకాశముందని అన్నారు. ఇక్కడి వనరులను ఉపయోగించే విద్యుత్ ప్లాంట్లను నడపాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో నిర్మాణంలోగల కేటీపీపీ 2వ దశ, జూరాలలో హైడల్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని; ప్రతిపాదనలోగల కేటీపీఎస్ 7వ దశ, కేటీపీపీ 3వ దశను; రామగుండం, సత్తుపల్లి, నేదునూరు. శంకర్‌పల్లిలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్(టీవీఈఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.నెహ్రూ, ఎన్.భాస్కర్ మాట్లాడుతూ.. 610 జీఓ ప్రకారం జెన్కోలో 42 శాతం ఉండాల్సిన తెలంగాణ ఎగ్జిక్యూటివ్ కేడర్లలో కేవలం 17 శాతం మాత్రమే ఉన్నామని అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులను బదిలీ చేసి, ఖాళీ అయిన ఆ స్థానాలను తెలంగాణ వారితో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం, పది డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కోదండరామ్‌కు ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యోగ జేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు, అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ తిరుమలరావు, జె న్కో టీజేఏసీ కన్వీనర్ డి.సంజీవయ్య, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు ఎం.బాలరాజు, కె.మధుబాబు, ఎ.జగదీష్, సిహెచ్.కన్నయ్య. వి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురిని బలితీసుకున్న విద్యుత్ వైరు
పాల్వంచ, న్యూస్‌లైన్: పంటచేలో విద్యుత్ వైరు ఆ అక్కాచెల్లెళ్ల కుటుంబాల్లో చీకట్లను నింపింది. విద్యుదాఘాతానికి గురైన మరిదిని కాపాడబోయి వదినకూడా మృత్యువుపాలు కాగా....వీరి మృతదేహాలవద్దకు వస్తున్న ఆమె కొడుకునూ అదే విద్యుత్‌వైరు బలితీసుకుంది. భర్త లేకపోవడంతో తానే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని సాదుకుంటున్న ఆమె చేలోనే కొడుకుతో సహా ప్రాణాలు కోల్పోవడం, పక్క ఇంట్లో ఉండే చెల్లెలి భర్త కూడా అదే ఘటనలో మృతి చెందడంతో కారేగట్టు గ్రామంలో విషాదం కట్టలు తెంచుకుంది. పాల్వంచ మండలం కారేగట్టు గ్రామానికి చెందిన మాడే తిరుపతమ్మ(42) భర్త పాపయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. ముగ్గురు పిల్లల పోషణ భారాన్ని తనపై వేసుకున్న తిరుపతమ్మ తనకున్న ఐదెకరాల చేనును సాగు చేసుకుంటూ పిల్లల్ని సాకుతోంది. తిరుపతమ్మ పెద్ద కుమారుడు నరేష్ చినప్పుడే చదువు మానేసి తల్లితో పొలం పనులు చూసుకుంటుండగా... రెండో కొడుకు మహేష్(22) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. గత రెండు సంవత్సరాలుగా మహేష్ కూడా తల్లితోపాటు చేలో పనులకు వెళుతున్నాడు. కాగా తిరుపతమ్మ మూడో కుమారుడు సురేష్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాగా, మొక్క జొన్న చేను ఏపుగా పెరగడంతో రెండు నెలలుగా అక్కడ మంచె ఏర్పాటు చేసుకున్న మహేష్ చేనుకు కాపలాగా ఉంటున్నాడు. వెలుగు కోసం పెట్టుకున్న వైరు ప్రాణాలు తీసింది... మొక్కజొన్న చేలో కాపలా ఉంటున్న మహేష్ మంచె వద్ద రాత్రి పూట లైటు వెలిగించేందుకు పక్కనే ఉన్న విద్యుత్ లైన్ నుంచి జీఏ వైరు సహాయంతో కరెంట్ తీసుకున్నాడు. అయితే మంగళవారం వర్షం రావడంతో జీఏ వైరు కట్టిన గడ (కర్ర)కిందకు వాలిపోయింది. పక్క చేలో వ్యవసాయం చేస్తున్న తిరుపతమ్మ చెల్లెలి భర్త కోరెం లక్ష్మయ్య(45) జీఏ వైరును పొరబాటున పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అక్కడే ఉండి గమనించిన తిరుపతమ్మ అతనిని రక్షించేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌కు గురైంది. తల్లి, బాబాయిలు చేలో పడిపోయి ఉండటం చూసి వారికి ఏమైందోనని వచ్చిన మహేష్ సైతం కిందపడి ఉన్న వైరుకు తగిలి మృత్యువాతపడ్డాడు. వెలుగులు నింపేందుకు చేలో పెట్టుకున్న విద్యుత్ వైరు ఈముగ్గురి పాలిట మృత్యుపాశమైంది. విషాదంలో కారేగట్టు... తమ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యుత్‌షాక్‌కు గురై ఒకేసారి మరణించడంతో కారేగట్టు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నా యి. కాయకష్టం చేస్తూ తమను సాకుతున్న తల్లి, సోదరుడు మృత్యువాతపడటంతో నరేష్, సురేష్‌లు చేసే రోదన చూసి అక్కడున్న వారు కంటతడిపెట్టారు. మరోవైపు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కోరెం లక్ష్మయ్య మృతి చెందడంతో భార్య వెంకటనర్సమ్మ, కుమారులు రాజశేఖర్, నాగేంద్రబాబు, కూతురు నాగలక్ష్మి రోదన అంతాఇంతా కాదు. గ్రామానికి చెందిన వారంతా దగ్గరి బంధువులు కావడంతో అంతా మృతదేహాల వద్దకు చేరుకుని శోకంలో మునిగిపోయారు. మృతదేహాలను సందర్శించిన పలువురు నాయకులు... కారేగట్టు గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాదం విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల కన్వీనర్ పిట్టల వెంకటనర్సయ్య గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అక్కడకు చేరుకుని మృతదేహాలను సందర్శించారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. -
టవేరా బోల్తా: ఒకరు మృతి
ఖమ్మం/ఒంగోలు: పాల్వంచలోని దమ్మపేట సెంటర్లో నగల కోసం ఓ వృద్ధురాలిని ఆగంతకులు గత అర్థరాత్రి హత్య చేశారు. అనంతరం ఆమె వద్ద గల లక్షా 50 వేల విలువైన బంగారు అభరాణాలను అపహరించారు.శుక్రవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వృద్దురాలి హత్యపై పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రబెల్లి వద్ద టవేరా వాహనం శుక్రవారం బోల్తా పడింది. ఆ ఘటనలో ఒక్కరు అక్కికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టవేరా వాహనం భద్రచలం నుంచి వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించారు.