
బంగారు తెలంగాణ అంటే ఇదేనా : రేణుకాచౌదరి
పాల్వంచ: బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని సీఎం కేసీఆర్ను కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ప్రశ్నించారు. పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా పాల్వంచలో రేణుకాచౌదరి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేద ప్రజలపై భారం వేస్తూ.. ధనిక రాష్ట్రం అని తెలంగాణను ఎలా అంటారని ప్రభుత్వంపై మండిపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.