పాల్వంచలో కేటీఆర్ పర్యటన
Published Mon, Nov 14 2016 3:02 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
పాల్వంచ: సహజవనరులను సద్వినియోగం చేసుకుంటే భద్రాద్రి జిల్లా అగ్రస్థానంలో ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఉదయం ఆయన పాల్వంచలో మున్సిపల్ పంప్‌హౌస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేటీపీఎస్‌లో ఉద్యోగాలను ఇకపై స్థానికులతోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన కేటీపీఎస్ 7వ దశ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Advertisement