
సాక్షి, హైదరాబాద్: ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా. ఎగ్జిట్ పోల్స్‌లో ఏదో జరుగుతున్నట్లు చూపొచ్చు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ మాకు శుభవార్తను అందజేస్తాయి’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లోనే ఉన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నారు.
అనంతరం అక్కడే ఉన్న మంత్రి హరీశ్‌రావు కూడా మాట్లాడుతూ..శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ కోసం కష్టపడిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వంద రోజుల పాటు శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment