ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ సీనియర్ సర్జన్ గుండె పోటు తో మృతి చెందాడు.
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ సీనియర్ సర్జన్ గుండె పోటు తో మృతి చెందాడు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ గోపాల్(34) మంగళవారం సాయంత్రం షటిల్ ఆడుతూ అకస్మాత్తుగా పడిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపల మృతి చెందాడు. డాక్టర్ గోపాల్ స్వగ్రామం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సబ్బావారి తాండ. పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. గోపాల్‌కు భార్య ఉమాదేవి నలుగురు పిల్లలు ఉన్నారు.