doctor killed
-
కబళిస్తోన్న కరోనా వైరస్..
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటివరకూ మొత్తంగా 563కు చేరుకుంది. కాగా, బుధవారం ఒక్కరోజే 73 మంది చనిపోయారు. ఈ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయిన వారి సంఖ్య 28,018కు చేరుకుందని చైనా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం తెలిపారు. దేశంలోని దాదాపు 31 ప్రావిన్సుల పరిధికి వ్యాధి విస్తరించిందని, బుధవారం మరణించిన 73 మందిలో ముగ్గురు మినహా మిగిలిన వారందరూ హుబే ప్రాంతం వారని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. 10రోజుల్లో ఆసుపత్రిని కట్టిన చైనా వుహాన్‌లో మరో ఆసుపత్రినికి కట్టింది. 1500 పడకలున్న ఈ ఆసుపత్రిలో త్వరలో వైద్యసేవలు ప్రారంభంకానున్నాయి. వుహాన్ సిటీ నుంచి ఢిల్లీకి చేరుకున్న 645 మందిలో ఏ ఒక్కరికీ వైరస్ సోకలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వదంతులను సృష్టించారని కక్ష వైరస్ వ్యాప్తిపై చైనా దేశ ప్రజలను అప్రమత్తం చేసిన ఎనిమిదిమంది వైద్యుల్లో ఒకరైన లీ వెన్లియాంగ్(34) చివరికి అదే వ్యాధితో కన్నుమూశారు. గత డిసెంబర్లో వుహాన్‌లోని వైద్య కళాశాలకు వచ్చిన రోగుల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన ఈయన తన సన్నిహితులను అప్రమత్తం చేయడానికి వుయ్‌చాట్ ఆప్‌లో ఆ వివరాలను ఉంచారు. చివరికి ఆ మెసేజీ ద్వారా అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. దీంతో ప్రభుత్వం వదంతులను వ్యాపింపజేస్తున్నారంటూ లీపై కక్షకట్టింది. చివరికి డాక్టర్ లీకి కూడా ప్రాణాంతక వైరస్ సోకి పరిస్థితి విషమించడంతో వుహాన్‌లో కన్నుమూశారు. -
క్యూలైన్లో రిటైర్డ్ వైద్యుడు మృతి
-
క్యూలైన్లో రిటైర్డ్ వైద్యుడు మృతి
నందికొట్కూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. శుక్రవారం నుంచి పెద్ద నోట్లు బ్యాంకులలో మాత్రమే చెల్లుబాటు అవుతుండటంతో.. తన ఖాతాలో డబ్బులు వేసుకోవడానికి బ్యాంకుకు వచ్చిన ఓ విశ్రాంత పశువైద్యడు బాలరాజు గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో చోటు చేసుకుంది. బాలరాజును జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. -
ప్రాణాలు తీసిన నిద్ర మత్తు
♦ కంటైనర్ లారీని ఢీకొని డాక్టర్, డ్రైవర్ దుర్మరణం ♦ గాయాలతో బయట పడిన మరో డాక్టర్ ♦ సహాయంగా వచ్చిన మరో యువకుడికి తీవ్రగాయాలు దొరవారిసత్రం : స్కార్పియో కారు డ్రైవర్ నిద్ర మత్తు, అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న డాక్టర్ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని జాతీయ రహదారిపై కలగుంట సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ఎస్సై మారుతీకష్ణ కథనం మేరకు... చెన్నై ప్రాంతంలోని పొన్నేరిలో డాక్టర్లు మువ్వా భవాని (48), ఆదిశేషారావు సాయిభవాని డయాబెటిక్ సెంటర్‌ను సుమారు 20 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఆదిశేషారావు తండ్రి సంవత్సరికం సందర్భంగా స్వగ్రామైన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు 14వ తేదీన వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు ముగించుకుని 16వ తేదీన భవాని స్వగ్రామం తెనాలికి వచ్చారు. అక్కడ చదువుకుంటున్న కుమారుడిని చూసి శనివారం రాత్రి 8 గంటలకు పొన్నేరికి కారులో బయలుదేరారు. కలగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వచ్చే సరికి డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా కారును నడపడంతో ముందుకు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొన్నాడు. కారు లారీ వెనుక భాగంలో సగం వరకు చొచ్చుకొనిపోయింది. దీంతో కారు డ్రైవర్ ధరణి నరేష్ (30), డాక్టర్ భవాని అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిశేషారావుకు స్వల్పగాయాలు కాగా, వీరికి సహాయంగా వచ్చిన కుమార్ తీవ్రగాయాలతో బయట పడ్డాడు. డ్రైవర్ చెన్నై దగ్గరలోని అనపంబట్టు ప్రాంతానికి చెందినవాడిగా పోలీసుల తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు గంటల పాటు అల్లాడిన యువకుడు డాక్టర్ కుటుంబానికి తోడుగా వచ్చిన యువకుడు కుమార్ జరిగిన ప్రమాదంలో కారులోనే ఇరుక్కుపోయాడు. ప్రమాదం ఆదివారం తెల్లవారు జామున సుమారు 3.30 గంటలకు జరిగింది. విషయం తెలుసుకుని ఎస్సై, పోలీసులు, 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికి ఎంత ప్రయత్నం చేసిన ఇర్కుపోయిన యువకుడిని బయటకు తీయలేకపోయారు. చివరికి ఎస్సై నాయుడుపేట నుంచి ఓ క్రేన్ తెప్పించి గాయపడిన కుమార్‌ను వెలికి తీసే సరికి రెండు గంటల సమయం పట్టింది. అప్పటి వరకు కాపాడండి కాపాడండి.. అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ ఆ యువకుడు నరకయాతన పడ్డాడు. -
గుండెపోటుతో ప్రభుత్వ వైద్యుని మృతి
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ సీనియర్ సర్జన్ గుండె పోటు తో మృతి చెందాడు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ గోపాల్(34) మంగళవారం సాయంత్రం షటిల్ ఆడుతూ అకస్మాత్తుగా పడిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపల మృతి చెందాడు. డాక్టర్ గోపాల్ స్వగ్రామం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం సబ్బావారి తాండ. పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. గోపాల్‌కు భార్య ఉమాదేవి నలుగురు పిల్లలు ఉన్నారు.