అందరినీ ఆకట్టుకుంటున్న మందార పూలు
పాల్వంచరూరల్ : ఒకే చెట్టుకు రెండు రకాల మందారపూలు పూస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పాల్వంచ మండలం సోములగూడెం గ్రామపంచాయతీ లక్ష్మిదేవిపల్లిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు తన ఇంట్లో నాలుగేళ్లుగా పసుపు రకం మందార చెట్టును పెంచుతున్నాడు.
ప్రతి సంవత్సరం ఈ చెట్టుకు పసుపు రంగు పూలు మాత్రమే పూసేవి. కానీ.. ఇటీవల అదే చెట్టుకు ఎర్ర మందారాలు కూడా పూస్తున్నాయి. ఒకే కొమ్మకు పక్కపక్కనే రెండు రంగుల పూలు పూయడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment