Hibiscus
-
నయన తార మెచ్చిన హైబిస్కస్ టీ : ఎన్ని మ్యాజిక్కులో
మన భారతదేశంలో మందార మొక్కకు ఉన్న ప్రాముఖ్యత చాలా పెద్దదే. మందార ఆకులు, పువ్వులు, పువ్వుల నుంచి తీసిన తైలం సౌందర్య ఉత్పత్తుల్లో అనాదిగా వాడుకలో ఉన్నవే. ముఖ్యంగా ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఈ మందార టీ తాగడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది స్టార్ హీరోయన్ నయనతార.మందార పువ్వుల టీ, లేదా హైబిస్కస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి .మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు , గుండె సంబంధిత వ్యాధులు,తదితర సమస్యలకు చక్కగా పనిచేస్తోంది. బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది. మొటిమలు, చర్మంపై వేడి కురుపులు రాకుండా కాపాడుతుంది. అలాగే హైబిస్కస్ టీ వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని కాపాడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్/అనారోగ్యం నుండి రక్షించే యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కలిగి ఉంటుంది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) రోజూ మందార టీ తాగడం సురక్షితమేనా? అంటే నిక్షేపంలా తాగవచ్చు (మితంగా) మందారతో దాదాపు ఎలాంటి అలెర్జీలు ఉండవు. మందార టీ దేనికి మంచిది? మందార టీ వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరంగా పరిశీలిద్దాం. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.హైపోలిపిడెమిక్ లక్షణాల వల్ల మధుమేహం వంటి బ్లడ్ షుగర్ డిజార్డర్స్‌తో బాధపడేవారికి అద్భుతాలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి , రక్త నాళాలు దెబ్బతినకుండా కాపాడటానికి దోహదం చేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మన శరీర కణజాలం, కణాలలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా ఈ వ్యాధుల నుండి కాపాడుతుంది. మెరిసే చర్మం కోసం మందార టీ చర్మానికి కూడా మేలు చేస్తుంది. హైబిస్కస్ టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇంకా మైరిసెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది కాబట్టి చర్మం మెరుపును కాపాడుతుంది.ఆరోగ్యకరమైన జుట్టుమందార టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెలనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. జుట్టుకు సహజమైన రంగును అందించి పట్టుకుచ్చులా మెరిసేలా చేస్తుంది. జుట్టు తొందరగా తెల్లగా కావడాన్ని అడ్డుకుంటుంది. ఈ టీలో ఉన్న అమైనో ఆమ్లాలు మీ శరీరంలో ఎక్కువ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇది కుదుళ్లు గట్టి జుట్టు ఒత్తుగా, షైనీ ఉంచేందుకు మ్యాజిక్‌లా పనిచేస్తుంది.ఇంకా రక్తపోటు నియంత్రణలోనూ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని ఆస్కార్బిక్ యాసిడ్ (విటమిన్ సి) సమృద్ధిగా ఉండటం వల్ల, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు కూడా ప్రసిద్ది చెందింది, ఇది సాధారణ అనారోగ్యాలను అరికట్టడంలో సహాయపడుతుంది ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం చికిత్సలోనూ పనిచేస్తుంది.మందార పూల టీ తయారీఎండ బెట్టిన మందార పూలను నీటిలో వేసి కొద్ది సేపు మరిగించాలి.దీంట్లో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసి మరికొద్దిసేపు మరిగించాలి. చక్కటి రంగు వచ్చిన తరువాత ఒక కప్పులోకి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. రుచికోసం ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. ఇంకా నిమ్మ, పుదీనాతో గార్నిష్ చేసుకొని చల్లగాగానీ, వేడిగా గానీ తాగవచ్చు. రెండు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. -
తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఇవిగో చిట్కాలు!
మారుతున్న కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చేస్తోంది. దీంతో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. మరికొంతమంది మార్కెట్లో దొరికే అనేక రకాల రసాయనాలతో కూడిన హెయిర్ డైలను ఎడా పెడా వాడేస్తున్నారు. ఈ అనారోగ్యకరమైన కెమికల్స్‌తో కొత్త సమస్యలొస్తున్నాయి. అయితే మరికొంతమంది మాత్రం ఓపిగ్గా సహజమైన హెన్నా, ఇతర చిట్కాలను వాడుతున్నారు. మరి అలాంటి చిట్కా మీకోసం.. జామ ఆకులు: సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చుట్టూదొరికేవాటితోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో జామ ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జామ ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్నుంచి తీసిన రసంలో 2 స్పూన్ల బాదం ఆయిల్ కలిపి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నల్ల నువ్వులు నల్ల నువ్వులు జుట్టును నల్లగా మారుస్తాయి. కొన్ని నల్ల నువ్వులను వారానికి రెండుసార్లు తినడం వల్ల జుట్టు నెరిసే ప్రక్రియ నెమ్మదిస్తుంది లేదా రివర్స్ కూడా చేయవచ్చు. ఆమ్లా లేదా పెద్ద ఉసిరి ఆమ్లా జుట్టు పిగ్మెంటేషన్‌ను మెరుగుపరుస్తుంది. ఎండబెట్టిన ఉసిరికాయముక్కలు, కొబ్బరి నూనెలో కలిపి బాగా నల్లగా వచ్చే దాకా మరగించాలి. ఈ తైలాన్ని జుట్టు పట్టిస్తే కేశాలు నల్లగా మారతాయి. అంతేకాదు ఈ ఆయిల్‌ను మాడుకు మసాజ్ చేసినా, ఆమ్లా జ్యూస్ తాగినా జుట్టు రాలడం తగ్గుతుంది, నల్లని నిగనిగలాడే జుట్టు మీ సొంతం. కరివేపాకు: కరివేపాకు జుట్టు ప్రయోజనకారిగా ఉంటుంది. కరివేపాకులను పేస్ట్‌లా చేసి పెరుగుతో కలిపి వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అశ్వగంధ: ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టు తెల్లగా అయిపోవడానికి తగ్గిస్తుంది.అశ్వగంధ వేరు పౌడర్‌తో పాటు బ్రాహ్మీ పొడిని పేస్ట్‌గా తయారు చేసి మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ఈ మాస్క్‌ని నెత్తిమీద మసాజ్ చేసి తర్వాత కడిగేసుకుంటే లాభాలు వస్తాయి. అశ్వగంధ టీ తీసుకోవడం వల్ల జుట్టు నెరసిపోవడం కూడా తగ్గుతుంది. భృంగరాజ్: దీన్నే గుంట గలకర అని కూడా అంటారు. బృంగరాజ్ ఆకులను ఏదైనా నూనెలో రాత్రంతా నానబెట్టి, ఈ నూనెను జుట్టుకు రాసుకోవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా చాలామంచిది. మందార పువ్వు: మందారలో విటమిన్ సి ఎ , ఐరన్ లభిస్తాయి. జుట్టుకు ఏదైనా నూనెతో కలిపి దాని ఎండబెట్టిన, లేదా పచ్చి పువ్వులను వేసి బాగా మరిగించి, చల్లారిన తరవుఆత దాన్ని జుట్టుకు పట్టించుకొని, తరువాత వాష్ చేసుకుంటే తెల్ల జుట్టు నివారణతో పాటు, మంచి మెరుపు కూడా వస్తుంది. తెల్ల జుట్టును తగ్గించడంలో ఉల్లిపాయ కూడా బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన జుట్టు కోసం సలాడ్లు, చేపలు, మాంసం, పండ్లు , ఆకు కూరలు ఎక్కువగా తినాలి. -
ఆ చెట్టు ఆకులు తెల్ల జుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో..
మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ సాయమవుతుంది. కప్పు నీటిలో ఒక మందార పువ్వు వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థపదార్థాల నుంచి రక్షణ పొందుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. రోజూ రెండు మూడు పుదీనా ఆకుల్ని నమిలి మింగుతుంటే జీర్ణశక్తి పెరిగి, కడుపు ఉబ్బరం, తేన్పులు తగ్గుతాయి. శ్వాసకోశాల శక్తి పెరుగుతుంది. వేపాకు, యాంటీ సెప్టిక్గాన, క్రిమి సంహారిణిగానూ బాగా పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నో రకాల క్రిమి కీటకాలు దూరంగా వెళ్లిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి స్ప్రే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమాల బాధలు తప్పుతాయి. పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పను దాకా కడుపులోకి తీసుకోవచ్చు. (చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు) -
మందార పువ్వులో ఇది కలిపి రాస్తే మొటిమలు, మచ్చలు మాయం
ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ కాలుష్యం, పని ఒత్తిడి, పెరుగుతున్న వయస్సుతో సాధారణంగా కాస్త పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ముఖాన్ని వైట్‌గా, కాంతివంతంగా మార్చుకునేందుకు వేలకు వేలు పోగేసి క్రీములు, ఫేస్‌మాస్కులు కొనగోలు చేసినా పెద్దగా ఉపయోగం లేదా? అయితే ఇది మీకోసమే. పైసా ఖర్చులేకుండా మన పెరట్లో దొరికే మందార పూలతోనే ముఖ వర్చస్సును మెరుగుపర్చుకోవచ్చు. సాధారణంగా మందారం పువ్వులను జుట్టు పెరుగుదలకు, ఒత్తుగా పెరిగేందుకు విరివిగా ఉపయోగిస్తుంటారన్నది అందరికి తెలిసిందే. దీనిని ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సమస్యలు దూరం అవుతాయి. కానీ ఈ పువ్వులు కేవలం జుట్టుకే కాదు అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయని మీకు తెలుసా? అదేలాగా? మందార పువ్వులతో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మందారంలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల వయసు పెరిగినా యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. ఈమధ్య కాలంలో అందాన్ని కాపాడుకోవడం, మరింత బ్రైట్‌గా కనిపించేందుకు తరచూ బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఫేషియల్, బ్లీచ్ వంటివి చేయించుకుంటారు. దీనికోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ వీటికన్నా మందార పూలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా రెండు-మూడు మందార పువ్వులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మిక్సీజార్‌లో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే ముఖం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.అంతేకాకుండా తరచూ ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య కూడా దూరమవుతుంది. చాన్నాళ్లుగా వేధిస్తున్న మొటిమలు, వాటి తాలూకూ మచ్చలు కూడా తొలిగిపోతాయి. -
ఇరవై మందార పూలు.. మెంతులు.. పచ్చకర్పూరం! ఇలా చేస్తే ఒత్తైన కురులు
జుట్టు రాలడం తగ్గి కురులు ఒత్తుగా పెరగాలంటే ఈ చిట్కా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా మందార తైలం తయారు చేసుకుని తలకు పట్టిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ►ఇరవై మందార పువ్వులను తీసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. ►పువ్వులు బాగా ఆరిన తరువాత మిక్సీజార్‌లో వేసుకుని రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెపెట్టి దానిలో అరలీటరు నువ్వుల నూనె లేదా కొబ్బరినూనె పోయాలి. మెంతులు కూడా వేసి ►అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మందార పువ్వుల పేస్టు, స్పూను మెంతులు వేసి మరగనివ్వాలి. ►మరిగిన తరువాత దించేముందు కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం లేదంటే.. ►తర్వాత ఆయిల్‌ను చల్లారనిచ్చి వడకట్టి సీసాలో భద్రపరుచుకోవాలి. ►ఈ మందార తైలాన్ని వారానికి రెండుసార్లు తలకు పట్టించి మర్దనా చేస్తే.. కుదుళ్లకు పోషణ అందుతుంది. ►ఫలితంగా రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ►పచ్చకర్పూరం లేదా ముద్దకర్పూరం వేయడం వల్ల పేలు రాకుండా ఉండటమే కాక మాడుకు చల్లగా హాయిగా అనిపిస్తుంది. -
చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ మూడు రంగులు..
శాయంపేట: చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ.. సమయాన్నిబట్టి రంగులు మారుతోంది. అదే మందార ముటాబిలిసి పువ్వు ప్రత్యేకత. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వన ప్రేమికుడు కోమనేని రఘు తన ఇంటి ఆవరణలో దక్షిణ చైనా, తైవాన్ దేశాలకు చెందిన మందార ముటాబిలిసి అనే మొక్కను నాటాడు. దీనిని కాన్ఫెడరేట్ గులాబీ, డిక్సీ రోజ్‌మల్లో, కాటన్ రోజ్ లేదా కాటన్ రోజ్‌మల్లో అని కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. ఆదివారం ఈ మొక్కకు అరుదైన పుష్పం వికసించింది. ఉదయం తెలుపు, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారడం ఈ పువ్వు ప్రత్యేకత. ఒకేరోజు మూడు రంగుల్లో వికసించడంతో స్థానికులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. చదవండి: టాప్‌గేర్‌లో ఎంసెట్... రివర్స్‌లో జేఈఈ -
ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు!
మీ వయసు కంటే పదేళ్ల పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? పని ఒత్తిడి, కాలుష్యం కారణమేదైనా.. చర్మంపై ముడతలు, మచ్చలు, నల్లని వలయాలు, మృతకణాలు ఏర్పడి చర్మాన్ని జీవం కోల్పోయేలా చేస్తుంది. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఫేస్ ఫ్యాక్ ద్వారా మీ చర్మానికి తిరిగి జీవం పోయొచ్చంటున్నారు బ్యూటీషియన్లు. మందారం, ఉసిరిలతో ఫేస్ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. కావల్సిన పదార్ధాలు ►1 మందారం పువ్వు లేదా 2 టేబుల్ స్పూన్ల మందారం పువ్వు పొడి ►1 టేబుల్ స్పూన్ తేనె ►2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి లేదా 1 మీడియం సైజు ఉసిరి కాయ తయారీ ఇలా ►మందారం పువ్వు పొడి లేనట్లయితే ఒక మందారం పువ్వును ఒక రాత్రంతా నానబెట్టి మెత్తగా గ్రేండ్ చెయ్యాలి. ►అలాగే ఉసిరి పొడి అందుబాటులో లేకపోతే మీడియం సైజు ఉసిరి కాయను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ►వీటికి తేనె జోడించి అన్నింటినీ బాగా కలుపుకుంటే ఫేస్ ప్యాక్ రెడీ. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఎలా అప్లై చేయాలంటే.. 5-7 నిముషాలు ముఖానికి ఆవిరిపట్టించాలి. ఇలా చేయడం ద్వారా చర్మ గ్రంధులన్నీ తెరచుకుంటాయి. ఫలితంగా ఫేస్ ప్యాక్‌లో ఉన్న అన్ని పధార్థాలు చర్మంలోకి చొచ్చుకుని పోయి రెట్టింపు ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖం అంతటా ఫ్యాక్‌లా వేసుకుని 20 నిముషాల పాటు ఉంచుకుని, చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇవీ ప్రయోజనాలు.. వారానికి కనీసం ఒక్కసారైనా ఈ ఫేస్ ప్యాక్ వాడితే, దీనిలోని విటమిన్ సి, చర్మానికి న్యాచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేసి, తడిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడి, చర్మం మెరిసేలా చేస్తుంది. అలాగే మందారం పువ్వు చర్మంలోని మృతకణాలను, మురికిని తొలగించి కాంతివంతం చేస్తుంది. నల్లని వలయాలను, ముడతలను కూడా నివారిస్తుంది. చదవండి: Health Tips: గుడ్డు, బీట్రూట్, ఉసిరి, పాలకూర.. వీటితో ఐరన్ లోపాన్ని తరిమేద్దాం..! -
మందారం
మహర్షులు మనకు మార్గదర్శనం చేసిన దేవతా వృక్షాలలో మందారం ఒకటి. దీనిని సంస్కృతంలో జపాపుష్పమనీ, రుద్రపుష్పమనీ, అర్కప్రియ అనీ, తెలుగులో దాసాని అనీ అంటారు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పుష్పాలలో మందార కూడా ఒకటి. మందారలో చాలా రకాలున్నప్పటికీ, ఎర్రమందారం లేదా ముద్దమందారమే ఎక్కువగా కనిపిస్తుంది. సూర్యుడి శరీర రంగుని మందారపువ్వుతో పోల్చారంటే మందార పుష్పం ఎంత ప్రాచీనకాలం నుంచి ఉన్నదో, ఎంత ప్రాశస్త్యమైనదో తెలుసుకోవచ్చు. జాతకంలో రాహు, కుజ దోషాలతో బాధపడుతూ వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్నవారు అమ్మవారిని, ఆంజనేయస్వామినీ మందారపూలతో అర్చించడం ద్వారా ఆయా దోషణ నివారణ జరిగి, తొందరగా వివాహం అవుతుందని శాస్త్రోక్తి. కేవలం అలంకరణకు, పూజకు మాత్రమే ఉపయోగించడం గాదు, మందారంతో ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తారు. మందారపూలను రుబ్బి, రసం తీసి, నువ్వులనూనె లేదా కొబ్బరినూనెలో కలిపి సన్నటి సెగ మీద వేడి చేసి, నూనె మాత్రమే మిగిలేదాకా ఉంచి, చల్లారిన తర్వాత సీసాలో పోసి భద్రపరుచుకుని తలకు రాసుకుంటే కురులు నల్లగా, దృఢంగా, నిగనిగలాడతాయని పెద్దలు చెబుతారు. -
ఒకే కొమ్మకు.. రెండు రంగుల పూలు..
పాల్వంచరూరల్ : ఒకే చెట్టుకు రెండు రకాల మందారపూలు పూస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పాల్వంచ మండలం సోములగూడెం గ్రామపంచాయతీ లక్ష్మిదేవిపల్లిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు తన ఇంట్లో నాలుగేళ్లుగా పసుపు రకం మందార చెట్టును పెంచుతున్నాడు. ప్రతి సంవత్సరం ఈ చెట్టుకు పసుపు రంగు పూలు మాత్రమే పూసేవి. కానీ.. ఇటీవల అదే చెట్టుకు ఎర్ర మందారాలు కూడా పూస్తున్నాయి. ఒకే కొమ్మకు పక్కపక్కనే రెండు రంగుల పూలు పూయడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
నేటి నుంచి వేడుకలు ఆరంభం
ఇంద్రవెల్లి : జిల్లాలోని గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని ప్రధాన్గూడలో ఆదివాసీ గిరిజనులు నాలుగేళ్లుగా గిరిజన బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతల్లో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు ఆడుతున్న ఆట పాటలు, సంస్కృతి సంప్రదాయాలకు ఆకర్షితులైన ఆదివాసీ గిరిజన మహిళలు ఆడుతున్నారు. ఏటా దసరా పండుగకు తొమ్మిది రోజుల ముందు నుంచి ఆ గ్రామం పటేల్ ఇంటి ముందు గుండం ఏర్పాటు చేసి, ఆ గుండంలో బతుకమ్మ మొక్క నాటి, దాని చుట్టూ దీపాలు వెలిగించి గిరిజన సంప్రదాయ రీతిలో డోలు, పేప్రే, కాలికోం వాయిద్యాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు నృత్యాలు చేస్తారు. దసరా పండుగ మరుసటి రోజే సాయంత్రం పండుగ ముగుస్తుంది. తంగేడు పువ్వు పల్లె ప్రాంతాలు, అడవిలో తంగేడు పువ్వులు సహజసిద్ధంగా లభిస్తాయి. ఈ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులు, మూత్రకోశ వ్యాధులకు తంగేడు పుష్పాన్ని వినియోగిస్తారు. తంగేడు కషాయం శరీరానికి చల్లదానాన్నిస్తుంది. అతిసారం, చర్మ, క్రిమి రోగాలు, నేత్ర జబ్బులకు తంగేడును ఔషధానికి ఉపయోగిస్తారు. తంగేడును నీటిలో వేయడంతో అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. వాతం, ఉష్ణం, ప్రకోపాలను తగ్గించే గుణం ఈ పువ్వులో ఉంది. రక్తప్రసరణకు ఎంతగానో దోహదపడుతుంది. సీతమ్మ జడ కళ్లకు ఇంపుగా కనిపించే సీతమ్మజడ పూలు రంగుల తయారీలో అత్యధికంగా ఉపయోగిస్తారు. సిలోసియా అరెగేటియా అమరాంథస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పుష్పం బతుకమ్మలో అందంగా పేర్చడానికి వినియోగిస్తారు. ఆకర్షకపత్రాలు, నారలు తయారీలోనూ ఈ పుష్పాన్ని వాడుతారు. ఈ పుష్పంలోనూ ఔషధ గుణాలున్నాయి. బీరపువ్వు పసుపు వర్ణంలో ఉండి కంటికి ఇంపుగా కనిపించే బీరపువ్వు రంగుల తయారీలో ఎంతగానో వినియోగిస్తారు. బీరకాయలను ఎండబెట్టి అందులో నుంచి పీచును వెలికితీసి రంగులలో ఉపయోగిస్తారు. బతుకమ్మలు తయారు చేసి నుదుటన తిలకం దిద్దిన మాదిరి బీరపువ్వును అలంకరిస్తారు. గునుగు పువ్వు సిలోసియా అర్జెంటీయా శాస్త్రీయ నామం కలిగిన గునుగు పువ్వు బతుకమ్మకు ఎంతో శోభను తెస్తుంది. తెల్లవర్ణంలో ఉన్న ఈ పుష్పం గ్రామాల్లో పశువులకు దాణాకు ఉపయోగపడుతుంది. గునుగుపూలను నీటిలో వేస్తే మలినాలను పీల్చుకొని శుభ్రం చేస్తుంది. బంతి పువ్వు ‘క్రిసాంథిమమ్ బయాన్కో’ శాస్త్రీయ నామం కలిగిన బంతి పువ్వు చలువదనానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తనాళాలను శుద్ధి చేసి రక్తసరఫరాను మెరుగుపర్చడానికి సరఫరా చేసే ఔషధంలో బంతిపువ్వును వినియోగిస్తారు. గొంతు సంబంధిత వ్యాధులను నయం చేసే లక్షణం ఈ పువ్వులో ఉన్నాయి. సూక్ష్మ క్రీములను నాశనం చేయడంలో బంతి పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది. గుమ్మడి గుమ్మడి పుష్పంలో ఏ,సీ విటమిన్లు అధికంగా ఉన్నాయి. వృద్ధాప్యంలో తలెత్తే కీళ్లనొప్పులను తగ్గించే మందుల తయారీలో ఈ పుష్పాన్ని వాడతారు. ప్రొటెస్ట్గ్రంథికి హానికలిగించకుండా గుమ్మడి పువ్వు రక్షణ కవచంగా పని చేస్తుంది. పొడిబారిన చర్మాన్ని పొలుసులు రాకుండా దోహదపడుతుంది. ఈ పుష్పంలో వేడిని తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయి. మందారం ఆకర్షణీయంగా కనిపించే మందారం పువ్వులో ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆకర్షణ పత్రాలలో ఈ పుష్పాన్ని వాడతారు. ముఖ్యంగా వెంట్రుకలను నల్లబర్చడానికి తయారు చేసే నూనెలో మందార పుష్పాలను వినియోగిస్తారు. అందువల్ల ఈ పుష్పాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. సౌందర్య సాధనాల తయారీలోనూ మందారాలను వాడుతారు. అతిసారా వ్యాధితో బాధపడే వారికి మందారం ఉపశమనం కలిగిస్తుంది. ఈ పుష్పాలను ఎండబెట్టి నూనెలో మరిగించి తలకు రాసుకున్నట్లయితే తలనొప్పి త్వరితగతిన తగ్గి ఉపశమనం ఇస్తుంది. రుద్రాక్ష పువ్వు ఔషధ గుణాలు రుద్రాక్ష పువ్వులో మెండుగా ఉన్నాయి. సౌందర్యసాధనాల తయారీలో రుద్రాక్ష పూలను విస్తారంగా వినియోగిస్తారు. కేక్, జల్లీల తయారీలో రుద్రాక్ష పూలు వాడతారు. ఈ పువ్వులో పుండ్లను నయం చేసే గుణం ఎంతగానో ఉంది. వీటి గింజలు వేసిన చెరువుల్లో స్నానం చేసినట్లయితే చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి. సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ ప్రత్యేకం. తొమ్మిది రోజుల్లోనూ ప్రతి ఆడపడుచూ తప్పనిసరిగా బతుకమ్మ చుట్టూ రెండు అడుగులు వేయాలి. రెండు పాటలు పాడాలి అనుకునే సందర్భం సద్దుల బతుకమ్మ. మహిళలు పట్టు చీరెలు, యువతులు పరికిణీలు ధరించి, నగలతో సింగారించుకుంటుంటారు. వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ రాత్రిలో బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పేరుతోనూ, గౌరమ్మగానూ కొలిచి నీటిలో నిమజ్జనం చేసి పోయి రా.. బతుకమ్మా అంటూ.. హారతులు ఇచ్చి సాగనంపుతారు. వెంట తెచ్చుకున్న పెరుగన్నం, సత్తు పిండి (మొక్కజొన్న, వేరుశెనగ పిండి వేయించి చక్కెర కలిపి) ఇచ్చి పుచ్చుకుంటారు. బియ్యం, నువ్వులు, పల్లీలు, మొక్కజొన్నలను చక్కెర, బెల్లంతో కలిపి దంచిపెడుతారు. యువతులు, మహిళలు ఒకచోట చేరి శిబ్బుల్లో (బతుకమ్మను పేర్చేది) ఇచ్చిపుచ్చుకుంటుంటారు.