మహర్షులు మనకు మార్గదర్శనం చేసిన దేవతా వృక్షాలలో మందారం ఒకటి. దీనిని సంస్కృతంలో జపాపుష్పమనీ, రుద్రపుష్పమనీ, అర్కప్రియ అనీ, తెలుగులో దాసాని అనీ అంటారు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పుష్పాలలో మందార కూడా ఒకటి. మందారలో చాలా రకాలున్నప్పటికీ, ఎర్రమందారం లేదా ముద్దమందారమే ఎక్కువగా కనిపిస్తుంది.
సూర్యుడి శరీర రంగుని మందారపువ్వుతో పోల్చారంటే మందార పుష్పం ఎంత ప్రాచీనకాలం నుంచి ఉన్నదో, ఎంత ప్రాశస్త్యమైనదో తెలుసుకోవచ్చు. జాతకంలో రాహు, కుజ దోషాలతో బాధపడుతూ వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్నవారు అమ్మవారిని, ఆంజనేయస్వామినీ మందారపూలతో అర్చించడం ద్వారా ఆయా దోషణ నివారణ జరిగి, తొందరగా వివాహం అవుతుందని శాస్త్రోక్తి.
కేవలం అలంకరణకు, పూజకు మాత్రమే ఉపయోగించడం గాదు, మందారంతో ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తారు. మందారపూలను రుబ్బి, రసం తీసి, నువ్వులనూనె లేదా కొబ్బరినూనెలో కలిపి సన్నటి సెగ మీద వేడి చేసి, నూనె మాత్రమే మిగిలేదాకా ఉంచి, చల్లారిన తర్వాత సీసాలో పోసి భద్రపరుచుకుని తలకు రాసుకుంటే కురులు నల్లగా, దృఢంగా, నిగనిగలాడతాయని పెద్దలు చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment