Dosha
-
దొరకునా ఇటువంటి దోశ!
‘వ్యాపారం అన్నాక నమ్మకమే కాదు కాస్త స్పెషాలిటీ కూడా ఉండాలి’ అంటూ రకరకాల పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తుంటారు కొందరు వ్యాపారులు. ముంబైలో ‘వికెట్–కీపర్ దోశవాలా’ అనే టిఫిన్ సెంటర్ ఉంది. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టినట్లు ‘వికెట్ కీపర్‌కు, దోశకు ఏమిటి సంబంధం?’ అనే కొశ్చెన్ వస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏమిటంటే... పెనం మీద తయారైన వేడి వేడి దోశను కస్టమర్‌కు ప్లేట్లో పెట్టి ఇవ్వరు. కస్టమర్ ఒక ప్లేటు పట్టుకొని కాస్త దూరంలో నిలబడాలి. పెనం మీద ఉన్న వేడి వేడి దోశను బాల్ని విసిరినట్లు గాల్లో విసిరేస్తారు. కస్టమర్ మహాశయుడు ఈ దోశను తన ప్లేటుతో క్యాచ్ పట్టాలి. ‘ఇదేమి పిచ్చి నాయనా’ అని మనం అనుకున్నా సరే ‘ఆ కిక్కే వేరప్పా’ అంటున్నారు ఈ టిఫిన్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు. -
నటి రియా చక్రవర్తి కోసం దోశెలు వేసిన సోనూసూద్
-
ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీదే హవా..సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్
గతంతో పోలిస్తే హైదరాబాదీలలో ఆరోగ్య స్పృహ పెరిగిందనేది ఫుడ్ ఆర్డర్ల ద్వారా మరోసారి రుజువైంది. విందు వినోదాల వీకెండ్ తర్వాత రోజు ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. వార్షిక నివేదిక వెల్లడించిన ఆసక్తికరమైన అంశాలివీ.. – సాక్షి, హైదరాబాద్ గ్రాసరీస్‌తో సహా విభిన్న రకాల కేటగిరీ ఉత్పత్తులను స్విగ్గీ అందిస్తున్నప్పటికీ.. మొత్తం ఆర్డర్లలో 48 శాతం ఫుడ్‌కు సంబంధించినవే. ఈ ఏడాది పెట్ ఫుడ్ కూడా ఆర్డర్లు బాగా పెరిగాయి. ఆసక్తికరంగా.. 20వేల ఆర్డర్స్ పెట్ ఫుడ్ కోసం వచ్చాయి. ఫుడ్ ఫర్ హెల్త్.. ఆరోగ్యకరమైన ఆహారం కోరుతూ హెల్త్ హబ్‌కి ఆర్డర్లు ఈ ఏడాది 200 శాతం పెరిగాయి. దేశంలోనే ఆరోగ్య స్పృహ కలిగిన ఆహారం కోరే నగరాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా గతం కంటే మెరుగ్గా హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. విందూ వినోదాలు ఎక్కువగా జరిగే వారాంతపు రోజుల అనంతరం సోమవారం ఆరోగ్యకర ఆహారం గురించి ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటే.. ఆ తర్వాత స్థానం గురువారం దక్కించుకుంది. కీటో శైలి ఫుడ్‌లో 23 శాతం వృద్ధి కనిపించగా, వెగాన్ శైలి, శాకాహారపు ఆర్డర్స్‌లో 83 శాతం పెరుగుదల నమోదైంది. చదవండి: అంతరిక్షానికీ ఫుడ్ డెలివరీ.. సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్.. నగరంలో చికెన్ బిర్యానీ ఆర్డర్లకే ఫస్ట్ ప్లేస్ దక్కుతోంది. అలాగే యాప్‌ని తొలిసారి వినియోగిస్తున్నవారిలో అత్యధికులు చికెన్ బిర్యానీతోనే అరంగేట్రం చేస్తున్నారట. దేశవ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వస్తే.. ఈ ఏడాది అది 115కి పెరిగింది. అంటే సెకనుకు 2 బిర్యానీలుగా చెప్పొచ్చు. చికెన్ బిర్యానీ వినియోగంలో వరుసగా చెన్నై, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌లు టాప్‌లో ఉన్నాయి. ముంబైలో మాత్రం చికెన్ బిర్యానీని దాల్ కిచిడీ దాటేసింది. చదవండి: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి ! బ్రౌనీస్ బాక్స్ డెలివరీకి 43.3 కి.మీ జర్నీ.. ► అత్యధిక దూరం ప్రయాణం చేయించిన ఆర్డర్లలో నగరానికి రెండో స్థానం దక్కింది. ఓ కస్టమర్ తన ప్రియ నేస్తానికి ఆర్డర్ చేసిన చాక్లెట్ బ్రౌనీస్ బాక్స్‌ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అందించడం కోసం సిటీకి చెందిన డెలివరీ బాయ్ 43.3 కి.మీ ప్రయాణం చేశాడు. ► ఈ విషయంలో ప్రథమ స్థానం దక్కించుకున్న బెంగళూరులో ఫుడ్ ప్యాక్ అందించడానికి ఓ స్విగ్గీ బాయ్ ఏకంగా 55.5 కి.మీ ప్రయాణం చేశాడు. కోల్‌కతాలో ఓ బిర్యానీ ప్రేమికురాలు తనకు ఇష్టమైన మటన్ బిర్యానీ కోసం 39.3 కి.మీ ప్రయాణం చేయించింది. చదవండి: బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు మనసు దోసె... దోసెలు ఆర్డర్ చేయడంలో బెంగళూరు టాప్‌లో ఉంది. బటర్ దోసె ఆర్డర్లలో బెంగళూరు తర్వాత స్థానం నగరానికి దక్కగా ముంబై మూడో స్థానంలో ఉంది. నగరవాసులు అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో.. చికెన్ బిర్యానీ తొలిస్థానంలో ఉండగా, చికెన్ 65 తర్వాతి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో పన్నీర్ బటర్ మసాలా నిలవగా, మసాలా దోసె 4, ఇడ్లీ 5వ స్థానాల్లో నిలిచాయి. సాధారణంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువ. రాత్రి 10 గంటల తర్వాత స్నాక్స్‌కు ఆర్డర్స్ పెరిగాయి. 80 శాతం మంది ఆన్లైన్ ద్వారా పేమెంట్స్‌కు మొగ్గు చూపుతున్నారు కొద్దిమంది మాత్రమే డెలివరీ తర్వాత నగదు చెల్లిస్తున్నారు. -
నాన్న కోసం దోశ వేసిన అల్లు అర్హ.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే. గత నెల 28న కోవిడ్ బారిన పడిన ఆయన.. ఇంట్లోనే ఓ స్పెషల్ రూంలో ఉంటున్నారు. తాజాగా ఆయన తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటునానని వెల్లడించాడు. తన ఆరోగ్యం బాగుందని, ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నానని తెలిపాడు. ఇదిలా ఉంటే షూటింగ్‌లతో బీజీబిజీగా ఉండే బన్నీ.. కరోనా వల్ల ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో కొడుకు అయాన్, కూతురి అర్హలతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. నేరుగా వాళ్లని కలుసుకోన్నప్పటికీ.. వారి అల్లరిని, చిలిపి పనులను దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుటున్నాడు. గతంలో అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ దోశ స్టెప్పు వీడియో ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా అర్హ పాప నాన్న కోసం స్వయంగా దోశ వేసి పెట్టింది. ‘నాన్నకి అర్హ స్పెషల్ దోశ. దోశ స్టెప్పుని ఆదర్శంగా తీసుకొనే ఇలా వేసిందేమో. నా జీవితంలో ఇది మర్చిపోలేని దోశ’ అంటూ ఆ వీడియోని షేర్ చేశాడు బన్నీ. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు.. తండ్రి కూతురు సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. -
స్ప్రౌటెడ్ మిలెట్ దోసె, ఇడ్లీ విత్ జింజర్ చట్నీ
పిండి కోసం కావలసినవి: స్ప్రౌట్స్ – ఒక కప్పు (జొన్నలు, రాగులు, సజ్జలు); ఉప్పుడు బియ్యం – ఒక కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; మెంతులు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. చట్నీ కోసం కావలసినవి: ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం – చిన్న ముక్క; వెల్లుల్లి రెబ్బలు – 3 (లేకపోయినా పరవాలేదు); మెంతులు – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 12; కరివేపాకు – పావు కప్పు; ఇంగువ – అర టీ స్పూను; చింతపండు – పావు కప్పు కంటె ఎక్కువ; బెల్లం పొడి – పావు కేజీ పిండి తయారీ: ఉప్పు మినహా పిండి కోసం చెప్పిన మిగతా పదార్థాలకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, నానబెట్టిన వాటిని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాక, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙సుమారు ఎనిమిది గంటలపాటు ఈ పిండిని నానబెట్టాలి ∙ఈ పిండితో దోసెలు, ఇడ్లీలు తయారుచేసుకోవచ్చు ∙అల్లం చట్నీతో అందించాలి ∙ఈ అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్లం చట్నీ తయారీ: చింతపండుకు తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ధనియాలు, పచ్చి సెనగ పప్పు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, అల్లం ముక్క వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙నానబెట్టిన చింతపండు, కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙బెల్లం పొడి, ఉప్పు జత చేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ∙దోసె, ఇడ్లీలతో అందించాలి. ఇటువంటి ఆరోగ్యకరమైన వంటకాలను బామ్మలు, అమ్మమ్మలు మాత్రమే చెప్తారు. ఇందులో నూనె ఎక్కువగా వాడలేదు. మినుముకు విరుగుడైన అల్లం చట్నీతో తినడం వల్ల శరీరం గట్టి పడుతుంది. -
మందారం
మహర్షులు మనకు మార్గదర్శనం చేసిన దేవతా వృక్షాలలో మందారం ఒకటి. దీనిని సంస్కృతంలో జపాపుష్పమనీ, రుద్రపుష్పమనీ, అర్కప్రియ అనీ, తెలుగులో దాసాని అనీ అంటారు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన పుష్పాలలో మందార కూడా ఒకటి. మందారలో చాలా రకాలున్నప్పటికీ, ఎర్రమందారం లేదా ముద్దమందారమే ఎక్కువగా కనిపిస్తుంది. సూర్యుడి శరీర రంగుని మందారపువ్వుతో పోల్చారంటే మందార పుష్పం ఎంత ప్రాచీనకాలం నుంచి ఉన్నదో, ఎంత ప్రాశస్త్యమైనదో తెలుసుకోవచ్చు. జాతకంలో రాహు, కుజ దోషాలతో బాధపడుతూ వివాహానికి ఆటంకాలు ఎదురవుతున్నవారు అమ్మవారిని, ఆంజనేయస్వామినీ మందారపూలతో అర్చించడం ద్వారా ఆయా దోషణ నివారణ జరిగి, తొందరగా వివాహం అవుతుందని శాస్త్రోక్తి. కేవలం అలంకరణకు, పూజకు మాత్రమే ఉపయోగించడం గాదు, మందారంతో ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తారు. మందారపూలను రుబ్బి, రసం తీసి, నువ్వులనూనె లేదా కొబ్బరినూనెలో కలిపి సన్నటి సెగ మీద వేడి చేసి, నూనె మాత్రమే మిగిలేదాకా ఉంచి, చల్లారిన తర్వాత సీసాలో పోసి భద్రపరుచుకుని తలకు రాసుకుంటే కురులు నల్లగా, దృఢంగా, నిగనిగలాడతాయని పెద్దలు చెబుతారు. -
నగరంలో కన్నడిగులు...
మినీ భారత్: ఏళ్ల కిందటే భాగ్యనగరానికి వలస వచ్చిన కన్నడిగులు ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ఇడ్లీ, దోశ వంటి తినుబండారాల చిరు వ్యాపారాలు మొదలుకొని ట్రాన్స్పోర్ట్, వస్త్ర వ్యాపారాలు, బంగారు, వెండి ఆభరణాల వంటి బడా వ్యాపారాలు చేస్తున్న వారు కొందరైతే, ప్రైవేటు ఉద్యోగాల్లో కుదురుకున్న వారు ఇంకొందరు. ఉపాధి కోసం ఎలాంటి వృత్తి వ్యాపారాల్లో కొనసాగుతున్నా, కన్నడిగులు తమ సంప్రదాయాలను చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 1972లో భారీ వలసలు... కన్నడిగుల్లో కొందరు నిజాం కాలంలోనే హైదరాబాద్ నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. అయితే, 1972లో కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా తదితర జిల్లాలతో పాటు సరిహద్దుల్లోని మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో తీవ్రమైన కరువు వాటిల్లినప్పుడు పెద్దసంఖ్యలో కన్నడిగులు నగరానికి వలస వచ్చారు. నగరంలోని గుల్జార్‌హౌస్, చార్‌కమాన్, మామాజుమ్లా పాఠక్, కోకర్‌వాడీ, చేలాపురా, గౌలిపురా, ఛత్రినాక, ఫిసల్‌బండ, బహదూర్‌పురా, జియాగూడ, బేగంబజార్, మిధాని, దిల్సుఖ్నగర్, కాచిగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. శాకాహారం... శైవాచారం... కన్నడిగుల్లో వీరశైవులు, లింగాయత్‌లు శివలింగానికి పూజచేయడంతో దినచర్య ప్రారంభిస్తారు. జొన్నరొట్టెలు, గోధుమరొట్టెలను ప్రధానంగా స్వీకరించే వీరు పూర్తిగా శాకాహారులు. విందు, వినోదాల్లో సైతం మాంసాహారానికి దూరంగా ఉంటారు. వీరశైవులకు జగద్గురు రేణుకాచార్య కులగురువు కాగా, లింగాయత్‌లకు మహాత్మా బసవేశ్వర కులగురువు. కన్నడిగుల్లో యువతరం ఆధునిక వస్త్రధారణకు అలవాటు పడినా, వయసు మళ్లిన వారు మాత్రం ఇప్పటికీ సంప్రదాయ వస్త్రధారణతోనే తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కన్నడిగుల ప్రత్యేక పండుగ ‘యాడమాస్’ ఉగాది, దసరా, దీపావళి, నాగపంచమి పండుగులను తెలుగువారి మాదిరిగానే జరుపుకొనే కన్నడిగులు, ‘యాడమాస్’ పండుగను ప్రత్యేకంగా జరుపుకొంటారు. పంటలు చేతికొచ్చే సమయంలో జనవరిలో నిర్వహించే ఈ పండుగకు నగరంలోని కన్నడిగులందరూ తప్పనిసరిగా తమ తమ స్వస్థలాలకు వెళతారు. జొన్నరొట్టెలతో పాటు పిండివంటలు చేసుకుని, తమ తమ పొలాలకు వెళ్లి, చేతికొచ్చిన పంటలకు ప్రత్యేక పూజలు చేసి, అక్కడే సామూహికంగా విందుభోజనాలు చేసి, సాయంత్రం ఇళ్లకు చేరుకుంటారు. ఇక లింగాయత్‌లు తమ కులగురువైన మహాత్మా బసవేశ్వర జయంతిని వేడుకగా జరుపుకొంటారు. ఆ సందర్భంగా పతాకావిష్కరణ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లలో తలపాగా తప్పనిసరి మర్యాద... కన్నడిగుల పెళ్లిళ్లలో తలపాగా మర్యాద తప్పనిసరి. పెళ్లికి వచ్చిన బంధుమిత్రుల్లో పురుషులందరికీ తప్పనిసరిగా తలపాగా కడతారు. మహిళలందరికీ చీర, పసుపు కుంకుమలు ఇస్తారు. వరుడి ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు వధువు తరఫు బంధుమిత్రులందరికీ ఈ మర్యాదలు చేస్తారు. ఇందులో చిన్నా పెద్దా తారతమ్యాలు ఉండవు. కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలి కన్నడిగులను లింగ్విస్టిక్ మైనారిటీలుగా గుర్తించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. నగర శివార్లలో మహాత్మా బసవేశ్వర ఆశ్రమ నిర్మాణానికి మూడెకరాల ఖాళీ స్థలాన్ని కేటాయించాలి. నగరంలోని ప్రధాన కూడలిలో బసవేశ్వర శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కన్నడిగుల కోసం ప్రత్యేక శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించాలి. - నాగ్నాథ్ మాశెట్టి, అధ్యక్షుడు, ఏపీ బసవ కేంద్రం,హైదరాబాద్ పిల్లి రాంచందర్