పిండి కోసం కావలసినవి: స్ప్రౌట్స్ – ఒక కప్పు (జొన్నలు, రాగులు, సజ్జలు); ఉప్పుడు బియ్యం – ఒక కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; మెంతులు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత.
చట్నీ కోసం కావలసినవి: ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం – చిన్న ముక్క; వెల్లుల్లి రెబ్బలు – 3 (లేకపోయినా పరవాలేదు); మెంతులు – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 12; కరివేపాకు – పావు కప్పు; ఇంగువ – అర టీ స్పూను; చింతపండు – పావు కప్పు కంటె ఎక్కువ; బెల్లం పొడి – పావు కేజీ
పిండి తయారీ: ఉప్పు మినహా పిండి కోసం చెప్పిన మిగతా పదార్థాలకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు నాలుగు గంటలసేపు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, నానబెట్టిన వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బాక, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙సుమారు ఎనిమిది గంటలపాటు ఈ పిండిని నానబెట్టాలి ∙ఈ పిండితో దోసెలు, ఇడ్లీలు తయారుచేసుకోవచ్చు ∙అల్లం చట్నీతో అందించాలి ∙ఈ అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అల్లం చట్నీ తయారీ: చింతపండుకు తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ధనియాలు, పచ్చి సెనగ పప్పు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, అల్లం ముక్క వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙నానబెట్టిన చింతపండు, కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙బెల్లం పొడి, ఉప్పు జత చేసి పచ్చడి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ∙దోసె, ఇడ్లీలతో అందించాలి. ఇటువంటి ఆరోగ్యకరమైన వంటకాలను బామ్మలు, అమ్మమ్మలు మాత్రమే చెప్తారు. ఇందులో నూనె ఎక్కువగా వాడలేదు. మినుముకు విరుగుడైన అల్లం చట్నీతో తినడం వల్ల శరీరం గట్టి పడుతుంది.
స్ప్రౌటెడ్ మిలెట్ దోసె, ఇడ్లీ విత్ జింజర్ చట్నీ
Published Sat, Mar 14 2020 4:35 AM | Last Updated on Sat, Mar 14 2020 1:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment