చాలామంది బ్రేక్‌ఫాస్ట్ అనగానే ఏదో తిన్నాంలే అనుకుంటారు. చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ రోజులో తొలి భోజనమైన ఈ అల్పాహారం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందట. శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఆ విషయం వెల్లడైంది. ముఖ్యంగా వృద్ధులు, పిలల్లు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ని నిర్లక్ష్య చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు.
అల్పాహారంలోని కేలరీ కంటెంట్, పోషక నాణ్యత ఎలా ఆరోగ్యంపై ప్రభావితం చేస్తుందనే దానిపై అధ్యయనం చేశారు స్పానిష్ పరిశోధకులు. వారి పరిశోధనలో వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం అనేది అత్యంత కీలకమని తేలింది. అల్పాహారమే అని అల్పంగా చూస్తే.. దీర్ఘకాలిక హృదయ ఆరోగ్యంపై గట్టి ప్రభావమే చూపిస్తుందని చెప్పారు.
మన దినచర్యలో ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని భాగం చేసుకునే యత్నం చేస్తే దీర్ఘకాలికి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలుగుతాయని అన్నారు. ముఖ్యంగా జీవన నాణ్యాత మెరుగుపరిచి, ఒబెసిటీ వంటి అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం తగ్గుతుందన్నారు పరిశోధకులు. అందుకోసం 55 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్న.. దాదాపు 383 మంది వ్యక్తులపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారందరి హెల్త్ ట్రాక్‌ల ఆధారంగా ఈ విషయాలను వెల్లడించినట్లు తెలిపారు. ఉదయం తక్కువ కేలరీలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న వారిలో ఆరోగ్య ఫలితాలు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని, పైగా వారి బాడీ సరైన ఆకృతిలో లేకపోవడమే గాక, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువుగా ఉన్నట్లు పరిశోధనలో వెలడైందని చెప్పారు.
అంతేగాదు ఈ పరిశోధన అల్పాహారం నాణ్యాత ఎంత ముఖ్యమో అలాగే క్వాంటిటీ కూడా ముఖ్యమని పేర్కొంది. దీర్ఘకాలిక గుండె జబ్బులతో ఉన్నవారు, వృద్ధులు అల్పాహారం విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలన్నారు. దీంతోపాటు ఎట్టిపరిస్థితుల్లోనూ అల్పాహారాన్ని స్కిప్ చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ ఏజింగ్‌లో ప్రచురితమైంది.
'ఐడియల్ అల్పాహారం' అంటే..
సమతుల్యమైన పోషకాలతో కూడినా ఆహారమే ఐడియల్ అల్పహారం. ఇందులో రోజువారీగా కనీసం 20% నుంచి 30% కేలరీలు ఉండాలని పరిశోధన చెబుతోంది. అందుకోసం తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు కూరగాయలతో కూడినవి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ప్రాసెస్ చేసిన వాటికి దూరంగా ఉండాలన్నారు.
సరైన మొత్తంలో అధిక-నాణ్యత కలిగిన పోషకాహారంతో మనం రోజును ప్రారంభిస్తే.. జీవక్రియ మెరుగై మొత్తం ఆరోగ్యమే బాగుటుందని పరిశోధన చెబుతోంది. రోజులో అతిముఖ్యమైన భోజనం అల్పాహరం అని స్పష్టం చేసింది. అయితే ఏం తింటున్నారు, ఎలాంటిది తింటున్నారు అనేది అత్యంత ముఖ్యమని అన్నారు. ముఖ్యంగా పరిమాణం, పోషక నాణ్యత అనేవి అత్యంత కీలకమైనవని చెప్పారు పరిశోధకులు.
(చదవండి: పల్లెటూరి కుర్రాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!: మోదీ)
Comments
Please login to add a commentAdd a comment