డబ్బుతో అన్ని కొనగలం గానీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కొనలేం అని తెలిసిందే. అందుకే పిసినారుల్లా, డబ్బు కోసం పడిగాపులు పడొద్దని పెద్దలు హితవు చెబుతుంటారు. అయితే ఈ విషయంపై పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు కూడా. అందుకు సమాధానం కనుగొన్నారు. ఆ అధ్యయనాల్లో డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చు అనిపించేలా ఫలితాలు వచ్చాయి. ఆదాయాలు పెరగడంతో కొందరూ సంతోషంగా ఉన్నామని చెప్పగా, అల్రెడీ ఎక్కువ ఆర్జిస్తున్న వారిలో సంతోషం కనిపించలేదు. ఇక్కడ పెరుగుతున్న ఆదాయాలు సంతోషానికి కారణమవుతాయని తేలింది గానీ చివరిగా అందరూ ఒక్కదానికే ఏకగ్రీవంగా ఓటేశారు. అలా చేస్తేనే చాలా సంతోషంగా అనిపించిందన్నారు. ఇంతకీ అందరూ దేన్నీ హైలెట్ చేసి చెప్పారంటే...
వివరాల్లోకెళ్తే..పరిశోధకులు డేనియల్ కాహ్నెమాన్, మాథ్యూ కిల్లింగ్స్‌వర్త్ ద్యయం చేసిన అధ్యయనం నిర్ధిష్ట ఆదాయ పరిమితిని చేరుకున్న తర్వాత సంతోషంగా ఉండగలమా? అనే దాన్ని సవాలు చేసిందన్నారు. ఈ మేరకు పరిశోధకులు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా సుమారు 33 వేల మందిపై అధ్యయనం చేసి వారి డేటాను సేకరించింది. అయితే వారిలో పెరుగుతున్న ఆదాయాలతో సంతోషం పెరుగుతుందని తేలింది. తక్కువ సంపాదన కలిగిన వ్యక్తులు అధిక సంపాదన కలిగిన వారితో పోలిస్తే పెరిగిన ఆదాయం కారణంగా సంతోషంగా ఉండగలరని వెల్లడయ్యింది.
వార్షిక జీతం దాదాపు 74 లక్షలు వరకు ఉంటే మానసిక ఆనందంలో మెరుగుదల కనపించింది. అంతకుమించి ఆదాయం పెరిగితే.. అవి ఆనందానికి, మానసికి సంతోషానికి మధ్య సంబంధాల పరిమితి ఏర్పడుతున్నట్లు గమనించారు. ఇక కిల్లింగ్సవర్త్ 2021 అధ్యయనం ప్రకారం దాదాపు రూ. 4 కోట్ల ఆదాయం ఉన్నప్పుడూ.. ఆనందంపై డబ్బు సానుకూల ప్రభావం కనిపించింది. అదేసమయంలో దాదాపు 83 లక్షలు కంటే ఎక్కువ జీతాలు అందుకున్న వ్యక్తుల్లో సంపద పెరిగినప్పటికీ వారి ఆనందంలో మెరుగుదల కనిపించలేదు. వారు కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపించలేదని అన్నారు.
ఈ మేరకు హార్వర్డ్ స్టడీ ఆఫ్ అడల్ట్ డెవలప్‌మెంట్ సంతోషాన్ని పొందడంలో అనుబంధాల పాత్ర అత్యంత కీలకమనిపేర్కొంది. మంచి జీవితానికి సంబంధాలు అవసరమని అందుకు సంపద కూడా ఒకింత కారణమని చెప్పారు. భౌతకపరమైన సంపదకంటే అనుభవాలతో ఆర్జించుకున్న సంతోషమే గొప్పదని తేలింది. కొంతమంది సామాజికి సంబంధాలతో సంతోషాన్ని పెంపొందించుకున్నారు. డబ్బుతో పనిలేదని ప్రూవ్ చేశారన్నారు. 2008లో ఎలిజబెత్ డన్ ఆమె సహచరులు నిర్వహించిన అధ్యయనంలో ఒక సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన అధ్యయనంలో కెనడాలోని వాంకోవర్ వీధిలో నడిచే వ్యక్తులకు కొంత డబ్బు నోటులు ఇచ్చి మీ కోసం లేదా ఇతరుల కోసం ఖర్చే చేయమని చెప్పారు.
చివరిగా వారంతా తమ కోస కంటే ఇతరుల కోసం ఖర్చు చేసినప్పుడు ఎక్కువ సంతోషం కలిగినట్లు ముక్తకంఠంతో చెప్పారు. పరోపకారమే ఎక్కువ ఆనందాన్నిస్తుంది అని అన్నారు. అలాగే మిస్సౌరీ-కొలంబియా విశ్వవిద్యాలయంలోని సైకలాజి పరిశోధకుల అధ్యయనంలో ఇతరులను సంతోష పెట్టడం వల్ల ఆనందం అర్థవంతంగా ఉందన్న విషయాన్ని హైలెట్ అయ్యింది. దయతో కూడిన పరోపకార చర్యలే ఎక్కువ సంతోషానికి కారణమవుతాయని ఆ పరిశోధనలో తేలింది కూడా. ఈ అధ్యయనం ఇతరుల ఆనందానికి తోడ్పడటం అనే ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ పరిశోధనల సారాంశం అవసరాలకు సరిపడ ఆదాయ పెరుగుదల మన సంతోషానికి కారణమవ్వడం తోపాటు ఇతరులకు సాయం చేయడం వల్ల మనం మరింత మానసిక సంతోషాన్ని పొందగలమని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment