సీటు రమ్మంది.. ఫీజు పొమ్మంది
- నాగ్‌పూర్ ఎన్‌ఐటీలో సీటు సాధించిన సిరిపురం విద్యార్థి
- రూ.63 వేల ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్
- దాతల సాయంతోనే ఇంతవరకు సాగిన చదువు
- ఆపన్నహస్తం కోసం ఎదురు చూపు
సిరిపురం(లింగాలఘణపురం) : సరస్వతి పుత్రుడి చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డం కిగా మారుతున్నాయి. చదువులో చురుకుగా ఉన్నప్పటికీ చాలినంత డబ్బు లేక నానా తిప్పలు పడుతున్నాడు. పదో తరగతి ముగిసినప్పటి నుంచే బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే దాతల సాయంతోనే చేరి పూర్తి బీటెక్ పూర్తి చేశాడు. నేడు నాగ్‌పూర్ ఎన్‌ఐటీలో సీటు వచ్చి నా సగం ఫీజు చెల్లించి మిగిలిన సగం కోసం దాతల వైపు చూస్తున్నాడు.
ఈ నెల 31లోగా ఫీజు చెల్లించకపోతే ఇక చెల్లించిన ఫీజు వృథా అవుతుందేమోనని ఆందోళనలో ఉన్నాడు మండలంలోని సిరిపురానికి చెందిన బెల్లం రాంగోపాల్. రాంగోపాల్ మొదటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ కళ్లెం ప్రభుత్వ పాఠశాలలో చదివి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. అప్పడు ఫీజు చెల్లించేందుకు స్థానిక సర్పంచ్ శ్రీనువాస్, ఉపాధ్యాయుడు ఎర్రోజు శ్రీనువాస్, లయన్స్‌క్లబ్, గ్రామ యువజన సంఘాలు తదితరులంతా ఆర్థిక సాయం చేయడంతో బాసరలో బీటెక్ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు యాదగిరి, భారతమ్మ కూలీనాలీ చేసి కుటుంబాన్ని పోషించలేని దుస్థితిలో కొడుకు ఉన్నత చదువులకు ఇబ్బందులు పడుతున్నారు.
నాగ్‌పూర్ ఎన్‌ఐటీలో మైనింగ్ విభాగంలో ఎక్స్‌క్లవేషన్ ఇంజనీరింగ్‌లో సీటు సాధించి రూ.83,000 ఫీజుకు రూ.20,000లు చెల్లించా డు. మిగిలిన రూ.63 వేల కోసం దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. జూన్ 30లోగా చెల్లిం చాలని లేకుం టే సీటు పోతుందనే మనోవేదనతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆర్థిక సాయం చేసే వారి కోసం తన సెల్ నంబర్ 9640563120కి ఫోన్‌చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.