మా అబ్బాయికి 12 సం‘‘లు. వేదపాఠశాలలో చదువుతున్నాడు. క్లాసులో నిద్రపోతున్నాడని టీచర్ల కంప్లైంట్. బాబు ఇష్టం మీదే వేదపాఠశాలలో చేరాడు. సెలవులకు వచ్చినప్పుడు కూడా సమయం దొరికితే నిద్రపోతున్నాడు. ఎన్నిసార్లు మందలించినా నిద్రపోవడం మానడం లేదు. మా బాబు అతి నిద్ర తగ్గించి, బాగా చదివేటట్లు ఏదైనా సలహా చెబుతారా? – రాజేశ్వరి, తిరుపతి
వాస్తవానికి పిల్లలకు తమకిష్టంలేని సబ్జెక్టు చదువుతున్నప్పుడు బోర్ కొట్టి నిద్ర రావడం సహజమే! కానీ మీ అబ్బాయి తన ఇష్టంతోనే వేద΄ాఠశాలలో చేరాడంటే, అతని అతి నిద్రకు వేరే ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. క్లాసులు లేప్పుడు, సెలవుల్లో కూడా అతిగా నిద్ర΄ోతున్నాడని రాశారు. ఇలాంటి అతి నిద్ర సమస్యను ‘హైపర్ సోమ్నియా’ అంటారు. నార్కొలెప్సి, స్లీప్ ఆప్నియా లాంటి ఆరోగ్య సమస్యలున్నవారు, ఇలా అతిగా నిద్రపోతుంటారు. మీరు బాబును మందలించడం వల్ల పిల్లవాడు ఆత్మవిశ్వాసం కోల్పోయి, సమస్య మరింత పెద్దది అయే ప్రమాదముంది.
ఆధునిక వైద్యశాస్త్రంలో అతి నిద్రను తగ్గించేందుకు అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ఒకసారి అబ్బాయిని సైకియాట్రిస్టుకు చూపించి, తగిన వైద్యం చేయిస్తే, మీ బాబు అతి నిద్రను తగ్గించి, మళ్లీ మామూలుగా చదివేటట్లు చేయవచ్చు.
– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
Comments
Please login to add a commentAdd a comment