Techniques
-
చదవమంటే నిద్ర వస్తుందంటాడు..? ఏం చేయాలి?
మా అబ్బాయికి 12 సం‘‘లు. వేదపాఠశాలలో చదువుతున్నాడు. క్లాసులో నిద్రపోతున్నాడని టీచర్ల కంప్లైంట్. బాబు ఇష్టం మీదే వేదపాఠశాలలో చేరాడు. సెలవులకు వచ్చినప్పుడు కూడా సమయం దొరికితే నిద్రపోతున్నాడు. ఎన్నిసార్లు మందలించినా నిద్రపోవడం మానడం లేదు. మా బాబు అతి నిద్ర తగ్గించి, బాగా చదివేటట్లు ఏదైనా సలహా చెబుతారా? – రాజేశ్వరి, తిరుపతివాస్తవానికి పిల్లలకు తమకిష్టంలేని సబ్జెక్టు చదువుతున్నప్పుడు బోర్ కొట్టి నిద్ర రావడం సహజమే! కానీ మీ అబ్బాయి తన ఇష్టంతోనే వేద΄ాఠశాలలో చేరాడంటే, అతని అతి నిద్రకు వేరే ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. క్లాసులు లేప్పుడు, సెలవుల్లో కూడా అతిగా నిద్ర΄ోతున్నాడని రాశారు. ఇలాంటి అతి నిద్ర సమస్యను ‘హైపర్ సోమ్నియా’ అంటారు. నార్కొలెప్సి, స్లీప్ ఆప్నియా లాంటి ఆరోగ్య సమస్యలున్నవారు, ఇలా అతిగా నిద్రపోతుంటారు. మీరు బాబును మందలించడం వల్ల పిల్లవాడు ఆత్మవిశ్వాసం కోల్పోయి, సమస్య మరింత పెద్దది అయే ప్రమాదముంది. ఆధునిక వైద్యశాస్త్రంలో అతి నిద్రను తగ్గించేందుకు అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ఒకసారి అబ్బాయిని సైకియాట్రిస్టుకు చూపించి, తగిన వైద్యం చేయిస్తే, మీ బాబు అతి నిద్రను తగ్గించి, మళ్లీ మామూలుగా చదివేటట్లు చేయవచ్చు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఇంటిప్స్: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి!
'ప్రతీరోజూ ఇంట్లో ఉన్న వంటింటిని కాపాడడం.. వంటింట్లో ఉన్న వస్తువులను కాపాడడం.. ఆ వస్తువులలో ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ఎక్కువ రోజులు మన్నికగా ఉండేట్లు చూసుకోవడం ఎంతో కష్టం. ఇకపై అలాంటి తిప్పలకు చెక్ పెట్టేవిధంగా ఈ ఇంటిప్స్ వాడారో.. కాస్త వీటి టెన్షన్ నుంచి రిలీఫ్ అవొచ్చు. ఇక అవేంటో చూద్దాం..' ఈ విధానాలు.. కూరలో నీరు ఎక్కువైతే కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత కూడా కూర చిక్కబడదు. అలాంటప్పుడు వేయించిన వేరుశనగపప్పులు పొడి కలిపితే చిక్కదనంతోపాటు రుచి కూడా ఇనుమడిస్తుంది. కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు కూడా ఈ చిట్కా మంచి ఫలితాన్నిస్తుంది. బంగాళాదుంపలు వాడిపోయినట్లయితే.. ఒక పాత్రలో వేసి అవి మునిగేటట్లు నీటిని పోసి ఓ అరగంట ఉంచితే తాజాగా మారుతాయి. అల్లంవెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు అందులో చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ నూనె వేయాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్‌ను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసి ఫ్రిజ్‌లో పెడితే రెండు వారాల పాటు తాజాగా ఉంటుంది. వెల్లుల్లిపొట్టు త్వరగా వదలాలంటే.. రేకలను ఒక పాత్రలో వేసి కొద్దిగా నూనె వేసి అన్నింటికీ పట్టేటట్లు వేళ్లతో రుద్ది ఇరవై నిమిషాల సేపు ఎండలో పెట్టాలి. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఫ్రిజ్‌లో పెట్టేముందు తొడిమలు ఒలిచి న్యూస్ పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో పెట్టాలి. మార్కెట్లో కొన్న పనీర్‌ని వండే ముందు పది నిమిషాల సేపు గోరువెచ్చటి నీటిలో నానబెడితే, పనీర్ ముక్కలు మృదువుగా మారుతాయి. ఇవి చదవండి: చెట్టినాడు ఘుమఘుమలు! -
ఇదో ఆధునిక రా.కీ.నే! కుమారులూ... ఏడు చేపల కథ!
ఇదో కథ. తరతరాలుగా తెలిసిందే. ఎంతోమంది రాజకీయ నేతలకు తరచూ అనుభవంలోకి వచ్చిన కథే. తరం తర్వాత తరం... ఇలా తర్వాతితరానికి తెలియాలనే ఉద్దేశంతో విచిత్ర వింత తంత్ర, కాతంత్ర, కుతంత్ర, బహుళతంత్రాలు రాసిన మహామునుల్లాంటి రాజకీయ విశ్లేషకులు దీన్ని గ్రంథస్థం చేసిన కథ. కేవలం ప్రైవేట్ సర్క్యులేషన్లో ఉంచిన ఈ ఓపెన్ సీక్రెట్గాథ సారాంశమేమిటంటే... అనగనగనగా ఓ రాజకీయనేత. రాజులాంటి ఆ రా.కీ. నేతకు ఏడుగురు కొడుకులు. ఓ రోజున రా.కీ. నేత ఇలా అన్నాడు. ‘‘కుమారులారా... ఎన్నాళ్లు నా పంచనబడి ఇలా బతికేస్తారు. ఇక మీరు కూడా స్వతంత్రంగా ఓటర్లకు గాలమేసి, వాళ్లను చేపల్లా పట్టుకునే టైమొచ్చింది’’ అని చెప్పాడు. ఇలా చెబుతూనే..ఓటర్ల ను చేపల్లా పట్టేసి, తమ ‘బుట్టలో పడేయడానికి’ ఏమేమి ఎర వేయాలో, ఎలాంటి ఎరలు వాడాలో లాంటి టెక్నిక్స్ కూడా వివరించాడు. ఏడుగురు కొడుకులూ గేలాలు తీసుకుని, ఓటర్ల వేటకు బయల్దేరారు. (ఒకడైతే మరీనూ. చేపల్లాంటి తన ఓటర్లను తాను ‘కాల్చుకు తినడాని’కంటూ ఓ ప్రెషర్ కుక్కర్నూ వెంట తీసుకొని బయల్దేరాడు. సదరు కుక్కరు..చేపల్నీ వండుతుంది, పనిలోపనిగా అది వేసే విజిళ్లతో తనకు ఎంకరేజ్మెంటూ దక్కుతుందనేది అతడి వాదన. ఒకే పనిలో బహుళ ప్రయోజనాల కోసం ప్లానింగ్ చేసే, అలాంటివాడే తనకు సరైన వారసుడంటూ మురిసిపోతాడా నేత. అది వేరే కథ). ఆరుగురు రా.కీ.నేత కుమారులకు ఓటర్లు పడ్డారుగానీ... ఒకడికి మాత్రం పడలేదు. అప్పుడా రా.కీ.నేత కుమారుడిలా ప్రశ్నించాడు. ‘‘ఓటరూ..ఓటరూ..నా గేలానికి నువ్వు ఎందుకు పడలేదు?’’ ‘‘నువ్వు నీ గేలానికి డబ్బు ఎరగా వేయలేదు’’ అతడు మళ్లీ తన పీఏ దగ్గరికెళ్లి అడిగాడు. ‘‘పీయ్యే..పీయ్యే.. గేలానికి ఎరగా డబ్బును ఎందుకు పెట్టలేదు?’’ ‘‘అదే టైముకు ఈడీ, ఇన్కమ్ట్యాక్సు వాళ్లు దాడులు చేసి, డబ్బు ఫ్రీజ్ చేశారు’’ అని జవాబిచ్చాడు పీయ్యే. ఈసారి రా.కీ. నేత కుమారుడు ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ వాళ్ల దగ్గరికి వెళ్లి అడిగాడు. ‘‘ఈడీ వాళ్లూ, ఐటీ వాళ్లూ... మా మీద దాడి ఎందుకు చేశారు?’’ ‘‘మా పైవాళ్లు మాకు ఆదేశాలు ఇచ్చారు’’ చెప్పారు ఈడీ, ఐటీ సిబ్బంది. ‘‘పైవాళ్లూ..పైవాళ్లూ..ఇలా ఆదేశాలు ఎందుకిచ్చారు?’’ ‘‘సార్... మేమేముంది చిన్న చీమల్లాంటి వాళ్లం. మీకు అధిష్టానం ఉన్నట్లే మాకు ప్రధానమైన పైపైవాళ్లు ఒకరుంటారు. వారిని కాదంటే మమ్మల్ని చీమల్లా నలిపేయగలరు కాబట్టి ‘చీమల్లాంటివాళ్లం’ అంటూ మమ్మల్ని మేము అభివర్ణించుకున్నాం. ఆ పైపైవారంటే.. వాళ్లు గతంలోలా కాంగ్రెస్ కావొచ్చు, లేదా ఇప్పట్లోలా బీజేపీ కావొచ్చు. అలా పవర్లో ఉన్నది యూపీఏ అయినా, లేదా ఎన్డీఏ అయినా..కుట్టాల్సింది పొరుగునున్న కర్ణాటక అయినా, పక్కనున్న మహారాష్ట్ర అయినా మరో రాష్ట్రమైనా ఫరక్ పడేదీ ఏదీ ఉండదు, ప్రాసెస్ సేమ్ టు సేమ్. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా..వాళ్ల స్టార్ క్యాంపెయినర్లం మేమే. ఆ అధికారగణాల బంగారు పుట్టలో ఎవరైనా వేలు పెడితే..వాళ్లను మేం కుట్టకుండా ఉంటామా?’’ అంటూ గుట్టు విప్పి, గుసగుసగా చెప్పారు. -
ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!
సాక్షి,ముంబై: చమక్కులు, ఫన్నీ వీడియోలు మాత్రమే కాదు ఇన్నోవేటివ్ ఐడియాలను, వీడియోలను సోషల్‌మీడియా ద్వారా తన ఫోలోవర్స్‌తో పంచు కోవడంలో బిలియనీర్, బడా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఎపుడూ ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా ఒక అద్భుతమైన వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. మన దేశంలోని రోడ్లు, గుంతలకు ఇది చక్కటి పరిష్కారం అన్నారు. అయితే దీనికి నెటిజన్ల లైక్స్‌తోపాటు, విమర్శలు, కౌంటర్లు ఎక్కువగానే ఉన్నాయి. I’d say this is an innovation that’s essential for India. Some building/construction material company needs to either emulate this or collaborate with this firm and get it out here pronto! pic.twitter.com/LkrAwIOP1x — anand mahindra (@anandmahindra) August 3, 2022 రోడ్డుపై ఉన్న గుంతలను ఆధునిక టెక్నాలజీ సాయంతో ‘పాచెస్’ ద్వారా పూడ్చివేస్తున్న ఒక వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఇది ఇండియాకు అవసరమైన ఒక ఆవిష్కరణ కొన్ని బిల్డింగ్/కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీలు దీన్ని ఫాలో కావాలి. ఈ సంస్థతో సంప్రదించి వెంటనే చర్యలు ఇక్కడ కూడా చేపట్టాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ లైక్స్‌తో వైరల్ అవుతోంది. ( నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ) అయితే కొంతమంది యూజర్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. ఇక్కడ సమస్య ఆవిష్కారం, టెక్నాలజీ కాదు సార్... దేశ ప్రధాని ప్రారంభించిన 5 రోజులకే ఎక్స్‌ప్రెస్‌వే దెబ్బతింది.. ముందు అలాంటి వాటిని పరిష్కరించాలి అని ఒకరు కామెంట్ చేశారు. ముందు కాంట్రాక్టర్లు ఫ్రొఫెషనల్‌గా రోడ్లు వేయడంలో కనీస అర్హతలు సంపాదించాలి. అలాగే రోడ్లు, నిర్మాణం, కాంట్రాక్టుల వ్యవహారంలో రాజకీయనాయకుల జోక్యం, అవినీతిపై మరొకరు తన ఆగ్రహాన్ని ప్రకటించారు. భారతదేశంలో రోడ్లను మించి, చాలాచోట్ల ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో గుంతలు ఉన్నాయి. అయినా మనం ఆశా జీవులం అంటూ ఇంకొకరు స్పందించారు. అంతేకాదు మన ఇండియాలో దీన్ని తీసుకొస్తే.. ఇక కాంట్రాక్టర్లు సరిగ్గా మరమ్మతులు చేయడం మానేసి రోడ్లను ప్యాచ్‌లతో నింపేస్తారని మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం. 😱 https://t.co/5SvJO0NhQz — anand mahindra (@anandmahindra) August 3, 2022 -
ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారా?
ఒక కార్టూన్లో... యువకుడి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ కాస్త ‘సెల్’ (జైలు)గా మారుతుంది. అందులో బందీ అయిన కుర్రాడు బయటికి బిత్తర చూపులు చూస్తుంటాడు. యువతరం డిజిటల్ వ్యసనానికి అద్దం పట్టే కార్టూన్ ఇది. హైదరాబాద్‌కు చెందిన పల్లవికి అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వస్తుంటుంది. లేచి తన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు ‘పదిలంగానే ఉన్నాయా లేదా!’ అని ఒకసారి చూసుకొని పడుకుంటుంది. చెన్నైకి చెందిన శ్రీహర్షిణి ఇంజనీరింగ్ స్టూడెంట్. తాను చదువుకుంటున్నా, ఏదైనా పనిలో ఉన్నా సెల్‌ఫోన్ రింగైనట్లు శబ్దభ్రమ కలిగి, ఫోన్‌ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటుంది. ఇవి మాత్రమే కాదు... ‘స్క్రీన్ టైమ్’లో తినాలనిపించకపోవడం, నిద్రపోవాలనిపించకపోవడం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం, స్క్రీన్ యాక్సెస్‌కు అవకాశం లేని సమయాల్లో ఒత్తిడికి గురికావడం, చిరాకు అనిపించడం, కోపం రావడం, ఏదైనా సరే ఆన్లైన్లోనే చేయాలనుకోవడం (అవసరం లేకపోయినా సరే), ఫోన్లలో ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం గడపడం (ఉద్యోగ విధుల్లో భాగంగా కాదు), చదువు దెబ్బతినడం... మొదలైనవి ‘డిజిటల్ అడిక్షన్’ కు సూచనలుగా చెబుతున్నారు. ‘ఇది సమస్య’ అని తెలుసుకోలేనంతగా ఆ సమస్యలో పీకల లోతులో మునిగిపోయిన యువతరం ఇప్పుడిప్పుడే ఆ వ్యసనం ఊబి నుంచి బయటపడడానికి, స్వీయచికిత్సకు సిద్ధం అవుతోంది. ‘డిజిటల్ అడిక్షన్’కు దూరం కావడానికి యువతరంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న టెక్నిక్స్‌లో కొన్ని.... 20–20–20: ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఫోన్ నుంచి బ్రేక్ తీసుకోవడం. 20 సెకండ్ల పాటు ఫోన్‌ను 20 ఫీట్ల దూరంలో పెట్టడం. అన్నీ బంద్: పడుకోవడానికి ముందు అన్ని స్క్రీన్లు ఆఫ్ చేయడం. డిజిటల్ ఫాస్ట్: నెలలో కొన్నిరోజులు గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండడం. యూజ్ టెక్–స్టే ఆఫ్ టెక్: అధిక సమయం స్మార్ట్ఫోన్లను ఉపయోగించకుండా యాప్ బ్లాకర్, టైమ్ ట్రాకర్లను ఉపయోగించడం. ఉదా: సెల్ఫ్–కంట్రోల్, ఫోకస్ బూస్టర్, థింక్... మొదలైన యాప్స్ అలారం: అలారం సెట్ చేసుకొని ప్రతి అరగంటకు ఒకసారి మాత్రమే సెల్‌ఫోన్ చెక్ చేసుకోవడం. మిగులు కాలం: డిజిటల్ ప్రపంచంలో గడపడానికి నిర్దిష్టమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని, మిగులు కాలాన్ని పుస్తకాలు చదవడానికి, స్నేహితులను ప్రత్యక్షంగా కలవడానికి ఉపయోగించడం, ఇంటి పనుల్లో పాల్గొనడం... మొదలైనవి. టర్న్ ఆఫ్: ఫోన్లో రకరకాల నోటిఫికేషన్లకు సంబంధించి ‘టింగ్’ అనే శబ్దాలు వస్తుంటాయి. ఎంత కాదనుకున్నా వాటిని చూడాలనిపిస్తుంది. దీనివల్ల టైమ్ వేస్ట్ అవుతుంటుంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి నోటిఫికేషన్ టర్న్ ఆఫ్ చేయడం. నో ఫోన్స్ ఎట్ నైట్ పాలసీ: అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితులలోనూ స్మార్ట్‌ఫోన్ వైపు చూడరాదు అనేది ఈ పాలసీ ఉద్దేశం. టెక్ దిగ్గజాలు కూడా కాలం వృథాను అరికట్టడానికి కొత్త ఫీచర్లు తీసుకువస్తున్నాయి. తాజాగా టిక్‌టాక్ రెండు స్క్రీన్టైమ్ ఫీచర్లను తీసుకువచ్చింది. ‘మొదట్లో డిజిటల్ ఫాస్ట్ అనే మాట నాకు వింతగా అనిపించేది. ఇది ఎలా సాధ్యమవుతుంది అని వాదించేదాన్ని. నేను కూడా ప్రాక్టిస్ చేసి చూశాను. చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఏదైనా మితంగానే ఉపయోగిస్తే మంచిది అనే వాస్తవాన్ని తెలుసుకున్నాను’ అంటుంది పల్లవి. ముంబైలో డిగ్రీ రెండో సంవత్సరం స్టూడెంట్ అయిన మేఘ ఒకప్పుడు ఫేస్బుక్లో నుంచి అరుదుగా మాత్రమే బయటికి వచ్చేది. ఈ వ్యసనం తన చదువుపై తీవ్ర ప్రభావం చూపడంతో డిజిటల్ ఫాస్ట్ వైపు మొగ్గు చూపింది. ‘ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వాటికవే చెడ్డవేమీ కాదు. అయితే వాటిని ఎలా ఉపయోగిస్తున్నాం, ఎంతసేపు ఉపయోగిస్తున్నాం అనేది అసలు సమస్య’ అంటారు మానసిక నిపుణులు. మొన్నటి వరకు ‘ఫోమో’ ప్రపంచంలో (ఫోమో... ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. ఏదైనా మిస్ అవుతున్నానేమో అనే భావనతో పదే పదే ఫోన్ చెక్ చేసుకోవడం) ఉన్న యువతరం ఇప్పుడు ‘జోమో’ ప్రపంచంలోకి (జోమో... జాయ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్–మిస్ కావడంలో కూడా ఆనందం వెదుక్కోవడం) రావడానికి గట్టి కృషే చేస్తోంది. మంచిదే కదా! (క్లిక్: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?) -
బ్రషింగ్ ఎలా చేయాలో ఇటో లుక్కేయండి!
పళ్లను శుభ్రపరచుకోవడంలో భాగంగా బ్రష్ చేసే సమయంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తుంటారు. నిజానికి ఒక క్రమపద్ధతిలో బ్రషింగ్ సాగాలి. దంతాలు దెబ్బతినకుండా ఆరోగ్యకరమైన రీతిలో బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. ►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి. ఇలా చేసుకునే సమయంలో నిలువుగా బ్రష్ చేస్తూనే పళ్ల మీద బ్రష్ కదలికలు సున్నాలు చుడుతున్నట్లుగా గుండ్రంగా సాగాలి. ►మృదువుగా బ్రష్ చేసుకోండి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అలాంటప్పుడు అవి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ►మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్ చేసుకోవాలి. ►రెండు లేదా మూడు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. అంతకుమించి బ్రషింగ్ కూడా పళ్లకు మంచిది కాదు. ►నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్లపాటు స్క్రబ్ చేయండి. ►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ►మూడు నెలలకు ఓమారు లేదా బ్రిజిల్స్ వంగినట్లు, కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. అలాగే జ్వరం వచ్చాక లేదా ఏదైనా జబ్బుబారిన పడి కోలుకున్న వెంటనే బ్రష్ మార్చడం ఉత్తమం. -
అమ్మాయిలూ...ఆదిపరాశక్తిలా మారండి!
ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరో ఒకరు వస్తారు, సహాయం చేస్తారు అని అనుకోవడం కాకుండా..ప్రతీ మహిళ తనను తాను కాపాడుకోవడం నేర్చుకోవాలి. తనకు తానే బాడీగార్డ్‌లా మారాలి. ఎవరైనా తన జోలికి వస్తే ఆదిపరాశక్తిలా మారి వారిని మట్టుబెట్టాలి. ఇలా చేయాలంటే చిన్నప్పటినుంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్‌లు తెలిసుండాలి. ఆ టెక్నిక్లేంటో తెలియాలంటే ఇప్పుడు చూద్దాం. -
పుచ్చ సాగు మెళకువలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీజన్లతో సంబంధం లేకుండా పుచ్చకాయలను ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. ఇక వేసవికాలంలో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ పంటల్లో అంతరపంటగా పుచ్చకాయ పైరును సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పుచ్చ తీగలు పూత, కాత దశలో ఉన్నాయి. ఇప్పుడు సాగు జాగ్రత్తలు చాలా కీలకం. తెగుళ్లు ఆశిస్తే..పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్తగూడెం, జూలూరుపాడు, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, పాల్వంచ తదితర మండలాల్లో 238 ఎకరాల్లో ఈ పుచ్చపంటను సాగు చేస్తున్నారు. పాటించాల్సిన సాగు మెళకువలను జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి జినుగు మరియన్న ఇలా వివరించారు. సాగు విధానం.. పుచ్చపంటను వ్యవసాయ భూముల్లో నేరుగా వేసుకోవచ్చు. లేదంటే వివిధ పంటల్లో అంతర పంటగా దీనిని సాగు చేసుకోవచ్చు. ఎకరానికి 80 నుంచి 90 రోజుల వ్యవధిలో రూ.60వేల రూపాయల పైచిలుకు నికర ఆదాయం పొందొచ్చు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. విత్తనం సాగు చేసే దశనుంచే..రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తెగుళ్ల పీడను గుర్తించాలి. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి..తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడం ఉత్తమం. రసాయన ఎరువులను అధికంగా వినియోగించొద్దు. సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా కూడా మంచి దిగుబడి పొందొచ్చు. తెగుళ్ల నివారణ.. ఆకుమచ్చ తెగులు ఈ పంటలో కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల సాఫ్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఆకు ముడత నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము ఎసిఫిల్ లేదా సువాస్ రెండు మిల్లీ లీటర్లతోపాటు ఐదు మిల్లీలీటర్ల వేపనూనెను కలిపి పిచికారీ చేయాలి. నాణ్యమైన ఉత్పత్తికి, కాయ ఎదుగుదలకు పంటకాలంలో వారానికి ఒకసారి 19:19:19 లేదా 13:0:45 లను కేజీ పరిమాణాన్ని డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో అందించాలి. అలాగే నాణ్యతకు, నిల్వకు దోహదపడే బోరాన్ మూలకాన్ని బోరాక్స్ రూపంలో పిచికారీ చేయాలి. లీటరు నీటికి రెండు గ్రాములు లేదా పంట కాలంలో ఎకరానికి రెండు నుంచి మూడు కేజీలపై పాటుగా లేదా డ్రిప్ అందించాలి. -
మ్యాక్సిమమ్
సింగిల్ పీస్ ఎక్కడైనా! ఎప్పుడైనా!! టాప్ టు బాటమ్ ఇదే మ్యాక్సిమమ్ ఛాలెంజ్! సూపర్ బ్యూటీ వచ్చేసిందహోయ్ మ్యాక్సీయుగం అమ్మాయిలకు ఆనందం అబ్బాయిలకు అసూయ!! చిన్న చిన్న టెక్నిక్స్‌తో సూపర్ స్టైలిష్. అంచుభాగం క్రాస్ కట్, రెండు రకాల మెటీరియల్స్ జత చేయడం... చైనీస్ కాలర్‌నెక్, లెదర్బెల్ట్తో ఈ గౌనుకు తీరైన అందం వచ్చింది. ►జార్జెట్ మ్యాక్సీ గౌన్... సీతాకోకచిలుకకు కొత్త హంగులు అద్దిన సింగారం. ►సింగిల్ పీస్ డ్రెస్ ఎక్కడ ఉన్నా... సో... బ్యూటీఫుల్ అనిపిస్తుంది. ► టాప్ టు బాటమ్ ప్లెయిన్ హంగామా! మ్యాక్సీ గౌన్‌తో తీరైన రాచకళ. ► ఆధునికతకు కొత్త భాష్యం చెబుతున్న లాంగ్ స్లీవ్స్ స్టైలిష్ మ్యాక్సీ గౌన్. -
ఆపరేషన్లకూ యూట్యూబే ఆధారం!
ఏదైనా కొత్త వంట గురించి తెలుసుకోవాలంటే గృహిణులు వెంటనే చూసేది.. యూట్యూబ్. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ మాయాజాలం వైద్యరంగాన్ని కూడా వదలడం లేదు. నిపుణులు సైతం ఆపరేషన్లలో సరికొత్త పద్ధతులు తెలుసుకోడానికి యూట్యూబ్ లాంటి ఆన్లైన్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారట. ఆమెరికన్ అకాడమీ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ అండ్ రీ కనస్ట్రక్టివ్ సర్జరీ (ఏఏఎఫ్పీఆర్ఎస్)కి చెందిన బృందం జరిపిన సర్వేలు యూట్యూబ్ వాడకంపై కొత్త విషయాలను వెల్లడించాయి. ప్లాస్టిక్ సర్జరీల విషయంలో వస్తున్న కొత్త పద్ధతుల గురించి యూట్యూబ్‌లో చూడటంతో పాటు.. వాటిని ఆచరణలో కూడా పెడుతున్నట్లు భారత సంతతికి చెందిన అనిత్ సెత్నా బృందం చేసిన అధ్యయనాల్లో కనుగొన్నారు. ఏఏఎఫ్పీఆర్ఎస్ సభ్యులు కొందరితో సర్వే చేయగా.. మొత్తం 202 మంది దానికి స్పందించారు. సాంకేతిక, సాంకేతికేతర విషయాలు తెలుసుకోడానికి ప్రధానంగా సమావేశాల్లో పాల్గొనడం, జర్నల్స్ చదవడం, సహోద్యోగులతో చర్చించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి. అయితే.. సర్వేలో పాల్గొన్నవారిలో 64.1 శాతం మంది మాత్రం.. రైనో ప్లాస్టీ, సూదులతో చేసే చికిత్సా విధానాలను, అందులోని కొత్త పద్ధతులను తెలుసుకునేందుకు కనీసం ఒక్కసారైనా తాము యూట్యూబ్ వీడియోలు చూసినట్లు చెప్పారు. వాళ్లలో 83.1 శాతం మంది ఏకంగా తాము అలా చూసిన పద్ధతులను ఆచరణలో కూడా పెడుతున్నట్లు చెబుతున్నారు. అనుభవం ఉన్న వాళ్ల కంటే.. అంతగా అనుభవం లేనివాళ్లు ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారట. ఇంటర్నెట్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం వరకు బాగానే ఉంది గానీ, ఆయా ఆపరేషన్ల నాణ్యత విషయంలోనే ఆందోళన వ్యక్తమవుతోందని సెత్నా బృందం తెలిపింది. వీరి పరిశోధన వ్యాసం జామా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమైంది. -
పరమహంస యోగానంద
యోగి కథ పాశ్చాత్య ప్రపంచానికి యోగ విద్యా విశిష్టతను పరిచయం చేసిన యోగిపుంగవుడు పరమహంస యోగానంద. మహావతార్ బాబా శిష్యపరంపరకు చెందిన యుక్తేశ్వర గిరి వద్ద క్రియాయోగ సాధనలో మెలకువలు తెలుసుకుని, ఈ విద్యను ప్రచారం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో పర్యటనలు సాగించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 1893 జనవరి 5న జన్మించిన పరమహంస యోగానంద అసలుపేరు ముకుందలాల్ ఘోష్. బాల్యం నుంచే భక్తి భావాలు కలిగిన యోగానంద యోగవిద్యను తెలుసుకునేందుకు పలువురు సాధువులను, సన్యాసులను కలుసుకున్నారు. చివరకు తన పదిహేడో ఏట గురువు యుక్తేశ్వర గిరిని కలుసుకోగలిగారు. యుక్తేశ్వర గిరి వద్ద యోగ శిక్షణ పొందుతూనే, మరోవైపు కోల్‌కతాలో ఉన్నత విద్యనూ కొనసాగించారు. సెరామ్‌పూర్ కాలేజీ నుంచి 1915లో డిగ్రీ పూర్తి చేశారు. రెండేళ్ల తర్వాత పశ్చిమబెంగాల్లోని డిహికాలో తొలి యోగ పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే రాంచీలో మరో యోగ పాఠశాలను స్థాపించారు. అదే తర్వాతి కాలంలో భారత యోగా సత్సంగ సంఘంగా రూపొందింది. గురువు అనుమతితో 1920లో నౌకాయానం ద్వారా అమెరికా చేరుకుని, అక్కడ భారతీయ యోగ విద్యకు విశేష ప్రచారం కల్పించారు. ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ పేరిట పరమహంస యోగానంద రచించిన ఆత్మకథ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పాఠకాదరణ పొందుతోంది. కేవలం ఈ పుస్తకం చదివిన తర్వాత క్రియాయోగం వైపు మళ్లిన వారు ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. -
చిన్నారులకు ఫొటోగ్రఫీ శిక్షణ
సరదాగా కెమెరా క్లిక్‌మనిపిస్తే అది జస్ట్ క్లిక్ మాత్రమే. కానీ మంచి ఫొటో తీయాలంటే కొంత ఫొటోగ్రఫీ నైపుణ్యం ఉండాలి. దానికి సికింద్రాబాద్‌లోని అవర్ సాక్రెడ్ స్పేస్‌లో ఈనెల 16, 17 తేదీల్లో చిన్నారులకు ‘ఫొటోగ్రఫీ వర్క్‌షాప్’ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొంటే చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకుని మెరుగైన ఫొటోలు తీయవచ్చు. -
బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్‌తో సత్ఫలితాలు: డీజీపీ ప్రసాదరావు
సాక్షి, హైదరాబాద్: నేర దర్యాప్తులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు అన్న్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను నిరోధించేందుకు ఇదే సరైన మార్గమని చెప్పారు. నేర పరిశోధనలో సత్యశోధనకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్’ విధానం(మెదడులో దాగి ఉన్న కీలక సమాచారాన్ని రాబట్టే ప్రక్రియ)పై శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఏపీఎఫ్ఎస్ఎల్)లో ఓ సదస్సు జరిగింది. ఏపీఎఫ్ఎస్ఎల్, స్వర్ణరక్ష నేతృత్వంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో డీజీపీ ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేర నిరూపణలో సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్)కంటే బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ విధానం అత్యంత ఆధునికమైందని చెప్పారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సహా అభివృద్ధి చెందిన దేశాలలో దర్యాప్తు సంస్థలు దీన్ని అనుసరిస్తున్నాయని తెలిపారు. ఈ విధానం 90 శాతం సత్ఫలితాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో నేరస్తులను మానసికంగా, శారీరకంగా హింసించకుండా నే నిజాలు రాబట్టడం తేలికవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ మాట్లాడుతూ.. బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ నేర పరిశోధనలో విప్లవాత్మక మార్పులు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియలో సచ్ఛీలతకు అద్దంపట్టేలా ఈ సరికొత్త విధానం సహకరిస్తుందని ఫోరెన్సిక్ లేబొరేటరీ డెరైక్టర్ శారద చెప్పారు. పాలీగ్రాఫ్, నార్కో, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షల నిర్వహణను సుప్రీం కోర్టు నిషేధించిందనేది పూర్తిగా వాస్తవం కాదని, నిందితుడి అనుమతి ఉంటే పరీక్షలు నిర్వహించవచ్చని ఆమె తెలిపారు. ఈ సరికొత్త విధానాన్ని ఇప్పటికే అమెరికా విజయవంతంగా అమలు చేస్తోందని మాజీ డీజీపీ, స్వర్ణరక్ష సంస్థ అధినేత స్వరణ్‌జిత్ సేన్ అన్నారు.