సాక్షి,ముంబై: చమక్కులు, ఫన్నీ వీడియోలు మాత్రమే కాదు ఇన్నోవేటివ్ ఐడియాలను, వీడియోలను సోషల్‌మీడియా ద్వారా తన ఫోలోవర్స్‌తో పంచు కోవడంలో బిలియనీర్, బడా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఎపుడూ ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా ఒక అద్భుతమైన వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. మన దేశంలోని రోడ్లు, గుంతలకు ఇది చక్కటి పరిష్కారం అన్నారు. అయితే దీనికి నెటిజన్ల లైక్స్‌తోపాటు, విమర్శలు, కౌంటర్లు ఎక్కువగానే ఉన్నాయి.
I’d say this is an innovation that’s essential for India. Some building/construction material company needs to either emulate this or collaborate with this firm and get it out here pronto! pic.twitter.com/LkrAwIOP1x
— anand mahindra (@anandmahindra) August 3, 2022
రోడ్డుపై ఉన్న గుంతలను ఆధునిక టెక్నాలజీ సాయంతో ‘పాచెస్’ ద్వారా పూడ్చివేస్తున్న ఒక వీడియోను ఆయన ట్వీట్ చేశారు. ఇది ఇండియాకు అవసరమైన ఒక ఆవిష్కరణ కొన్ని బిల్డింగ్/కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీలు దీన్ని ఫాలో కావాలి. ఈ సంస్థతో సంప్రదించి వెంటనే చర్యలు ఇక్కడ కూడా చేపట్టాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటూ లైక్స్‌తో వైరల్ అవుతోంది. ( నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ)
అయితే కొంతమంది యూజర్లు మాత్రం విభిన్నంగా స్పందించారు. ఇక్కడ సమస్య ఆవిష్కారం, టెక్నాలజీ కాదు సార్... దేశ ప్రధాని ప్రారంభించిన 5 రోజులకే ఎక్స్‌ప్రెస్‌వే దెబ్బతింది.. ముందు అలాంటి వాటిని పరిష్కరించాలి అని ఒకరు కామెంట్ చేశారు. ముందు కాంట్రాక్టర్లు ఫ్రొఫెషనల్‌గా రోడ్లు వేయడంలో కనీస అర్హతలు సంపాదించాలి. అలాగే రోడ్లు, నిర్మాణం, కాంట్రాక్టుల వ్యవహారంలో రాజకీయనాయకుల జోక్యం, అవినీతిపై మరొకరు తన ఆగ్రహాన్ని ప్రకటించారు.
భారతదేశంలో రోడ్లను మించి, చాలాచోట్ల ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో గుంతలు ఉన్నాయి. అయినా మనం ఆశా జీవులం అంటూ ఇంకొకరు స్పందించారు. అంతేకాదు మన ఇండియాలో దీన్ని తీసుకొస్తే.. ఇక కాంట్రాక్టర్లు సరిగ్గా మరమ్మతులు చేయడం మానేసి రోడ్లను ప్యాచ్‌లతో నింపేస్తారని మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.
— anand mahindra (@anandmahindra) August 3, 2022
Comments
Please login to add a commentAdd a comment