సోలోగా కాదు..మ్యాజిక్‌ జరగాలంటే : ఆనంద్‌ మహీంద్ర మరో అద్భుత పోస్ట్‌, వీడియో వైరల్‌ | Anand Mahindra shares video of birds says about team work | Sakshi
Sakshi News home page

సోలోగా కాదు..మ్యాజిక్‌ జరగాలంటే : ఆనంద్‌ మహీంద్ర మరో అద్భుత పోస్ట్‌, వీడియో వైరల్‌

Published Mon, Oct 7 2024 12:37 PM | Last Updated on Mon, Oct 7 2024 2:51 PM

 Anand Mahindra shares video of birds says about team work

టీమ్‌ వర్క్‌లోనే ఉంది మ్యాజిక్‌ 

పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ఐకమ​త్యం గురించి తెలిపే ఒక అద్భుతమైన వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు.  వ్యాపార వ్యవహరాల్లో తలమునకలై  ఉన్నప్పటికీ, సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ ఫాలోవర్స్‌ను ఎడ్యుకేట్‌ చేయడంలో, మోటివేట్‌ చేయడంలో  ఈ బిజినెస్‌ టైకూన్‌  తరువాతే మరెవ్వరైనా  అని చెప్పవచ్చు.

మట్టిలో మాణిక్యాల్లాంటి  వ్యక్తుల ప్రతిభను పరిచయం చేయడమే కాదు, తనవంతుబాధ్యతగా  వారికి అండగా నిలుస్తారు. ఇన్‌స్పిరేషనల్‌ వీడియోస్‌, సామాజిక స్పృహతో పాటు ప్రోత్సాహపరిచే వీడియోలు, అప్పుడప్పుడు మరికొన్ని ఫన్నీ విడియోలను  పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మండే మోటివేషన్‌ పేరుతో  ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 

బలం, శక్తి, స్వేచ్ఛకు ప్రతీకలు పక్షులు గుంపుగా ఎగురుతున్న వీడియోను ఎక్స్‌లో  పోస్ట్‌ చేశారు. ఒంటరిగా ఎగరడం, అదీ అందనంత ఎత్తున ఆకాశతీరాన విహరించడం  చాలా ఉత్సాహంగా ఉంటుంది.  కానీ  పనిలో జట్టుగా, జమిలిగా ఎగరడం(ఎదగడం)లో చాలా మేజిక్‌ ఉంది.  దానికి చాలా శక్తి ఉంది అంటూ కలిసికట్టుగా ఉండటంలోని ప్రయోజనాన్ని గురించి ఆనంద్‌ మహీంద్ర  గురించి చెప్పారు. ఇది ఆయన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘‘అవును సార్‌, టీమ్‌వర్క్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అనుకున్నకలలను నెరవేర్చుకోవచ్చు, కలిసి, కొత్త శిఖరాలను చేరుకోవచ్చు  మరపురాని అనుభవాన్ని సాధించవచ్చు!  అంటూ ఒక నెటిజన్‌ కమెంట్‌ చేయడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement