ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కారు. చూడటానికి చిన్న సైజు కొండలా కనిపిస్తుంది. దీని ఎత్తు 21.6 అడుగులు. ఇది రెండంతస్తుల కారు. అమెరికన్ కార్ల తయారీ కంపెనీ ‘హమ్మర్’ దీనిని ప్రత్యేకంగా తయారు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాచకుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నాహ్యాన్ దీనిని 20 మిలియన్ డాలర్లకు (రూ.164.52 కోట్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు. కార్ల పిచ్చిగల ఈ షేక్‌గారి దగ్గర ఇప్పటికే అత్యంత అరుదైన కార్లు ఉన్నాయి.
తాజాగా ‘మాన్‌స్టర్ ట్రక్’గా పేరుపొందిన ఈ ‘హమ్మర్ హెచ్1 ఎక్స్3’ మోడల్ కారు కూడా ఆయన గ్యారేజీకి చేరింది. ఈ భారీ కారు నాలుగు డీజిల్ ఇంజన్లతో పనిచేస్తుంది. రోడ్లపై దీని గరిష్ఠవేగం గంటకు 32 కిలోమీటర్లు మాత్రమే! ఒక్కో అంతస్తులోను ఒక్కో బెడ్‌రూమ్, ఒక కిచెన్, ఒక బాత్‌రూమ్ దీని ప్రత్యేకతలు. రెండో అంతస్తులో డ్రైవర్ సీటు ఉంటుంది. వుడెన్ ఫ్లోరింగ్‌తో దీని లోపలకు అడుగు పెడుతూనే ఒక ఇంట్లోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది. నిజానికి దీనిని వాహనం అనడం కంటే చక్రాలపై కదిలే ఇల్లు అనడమే సబబు.
(చదవండి: మనుషులు వదిలేసిన దీవి)
Comments
Please login to add a commentAdd a comment