Hummer
-
ఇల్లులాంటి వాహనం!.. ఇదే ప్రపంచంలోని అతి పెద్ద కారు!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కారు. చూడటానికి చిన్న సైజు కొండలా కనిపిస్తుంది. దీని ఎత్తు 21.6 అడుగులు. ఇది రెండంతస్తుల కారు. అమెరికన్ కార్ల తయారీ కంపెనీ ‘హమ్మర్’ దీనిని ప్రత్యేకంగా తయారు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాచకుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నాహ్యాన్ దీనిని 20 మిలియన్ డాలర్లకు (రూ.164.52 కోట్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు. కార్ల పిచ్చిగల ఈ షేక్గారి దగ్గర ఇప్పటికే అత్యంత అరుదైన కార్లు ఉన్నాయి. తాజాగా ‘మాన్స్టర్ ట్రక్’గా పేరుపొందిన ఈ ‘హమ్మర్ హెచ్1 ఎక్స్3’ మోడల్ కారు కూడా ఆయన గ్యారేజీకి చేరింది. ఈ భారీ కారు నాలుగు డీజిల్ ఇంజన్లతో పనిచేస్తుంది. రోడ్లపై దీని గరిష్ఠవేగం గంటకు 32 కిలోమీటర్లు మాత్రమే! ఒక్కో అంతస్తులోను ఒక్కో బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక బాత్రూమ్ దీని ప్రత్యేకతలు. రెండో అంతస్తులో డ్రైవర్ సీటు ఉంటుంది. వుడెన్ ఫ్లోరింగ్‌తో దీని లోపలకు అడుగు పెడుతూనే ఒక ఇంట్లోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది. నిజానికి దీనిని వాహనం అనడం కంటే చక్రాలపై కదిలే ఇల్లు అనడమే సబబు. (చదవండి: మనుషులు వదిలేసిన దీవి) -
ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇందులో కొన్ని నెటిజన్లను తెగ ఆకర్శించేస్తాయి. అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు ట్విటర్ వేదికగా వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియోలో గమనించినట్లయితే ఒక భారీ 'హమ్మర్' (Hummer) రోడ్డుపై ఉండటం చూడవచ్చు. ఇది చూడటానికి సాధారణ కారులా కాకుండా ఒక విమానం మాదిరిగా అనిపిస్తుంది. ఈ కొత్త మోడిఫైడ్ కారు దుబాయ్‌కి చెందిన 'షేక్ హమద్ బిన్ హమ్దాన్ నహ్వాన్'కి చెందినదిగా తెలుస్తోంది. ఇతన్ని అక్కడి ప్రజలు రెయిన్బో షేక్ అని కూడా పిలుస్తారు. ఇదీ చదవండి: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు! కార్ల మీద అమితమైన ఆసక్తి కలిగిన ఈయన దీనిని ప్రత్యేకంగా రూపోంచించినట్లు తెలుస్తోంది. ఇది సాధారణ హమ్మర్ కారుకంటే మూడు రెట్లు పెద్దదిగా ఉంది. దీని పొడవు 184.5 ఇంచెస్, వెడల్పు 865 ఇంచెస్, ఎత్తు 77 ఇంచెస్ వరకు ఉంది. ఈ వీడియో ఎంతోమంది ఆటోమొబైల్ ప్రెమికులను కట్టిపడేస్తోంది. Dubai Rainbow Sheikh’s giant Hummer H1 “X3” is three times bigger than a regular Hummer H1 SUV (14 meters long, 6 meters wide, and 5.8 meters high). The Hummer is also fully drivable [read more: https://t.co/LlohQguhTM]pic.twitter.com/uV1Z4juHKx — Massimo (@Rainmaker1973) July 27, 2023 -
హమ్మర్.. ‘షేక్’ అయ్యేలా..
కార్లంటే ఇష్టం చాలా మందికి ఉంటుంది. కానీ దుబాయ్‌కు చెందిన ఓ షేక్‌కి మాత్రం పిచ్చి. అందుకే... కార్ల కోసం ఏకంగా షార్జా ఆఫ్‌రోడ్ హిస్టరీ మ్యూజియంనే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మ్యూజియమ్‌లో ఉన్న కార్లన్నీ ఒకెత్తు. ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు మరో ఎత్తు. ఇటీవలే అతని మ్యూజియంలోకి చేరిన ఈ హమ్మర్ విశేషాలు తెలుసుకుందాం.. –సాక్షి, సెంట్రల్ డెస్క్ హమ్మర్ కారు ప్రపంచంలోనే అతి పెద్దది. జనరల్ మోటార్స్ సంస్థ ఈ హమ్మర్ హెచ్1ఎక్స్3ని రూపొందించింది. ఇది పూర్తిస్థాయిలో నడపగల జెయింట్ కార్. అమెరికా ఆర్మీకి చెందిన లార్క్–ఎల్ఎక్స్ కార్గో వెహికల్ ఫ్రేమ్‌పై ఈ కారును తయారుచేశారు. నాలుగు చక్రాలకు నాలుగు డీజిల్ ఇంజన్లను ఏర్పాటు చేశారు. బయట చూడటానికి సాధారణ హమ్మర్నే పోలి ఉంటుంది. కానీ, దానికంటే మూడు రెట్లు పెద్దది. ఈ జెయింట్ కారు కింది భాగంలో సాధారణ హమ్మర్‌ను నిలపొచ్చంటే... కారు ఎంత ఎత్తు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారులో రెండు అంతస్తులున్నాయి. మొదటి అంతస్తులో స్టీరింగ్ కేబిన్, టాయిలెట్, మెట్లున్నాయి. ఇక రెండో అంతస్తు పూర్తిగా విలాసవంతమైన గెస్ట్ స్పేస్. ఇందులో కూర్చుని నాలుగు వైపులా చూడొచ్చు. చూడటానికి కారే అయినా లగ్జరీ విల్లాలో ఉన్న ఫీలింగ్ కలిగిస్తుందన్నమాట. దీన్ని దుబాయ్‌కు చెందిన బిలియనీర్ షేక్ హమద్‌బిన్ హమ్దాన్ అల్ హన్యన్ కొన్నాడు. ఇప్పటికే 718 మోడళ్ల కార్లను సేకరించి పెట్టుకున్న వ్యక్తిగా గిన్నిస్ బుక్ రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు హమద్. దుబాయ్‌కి ఉత్తరంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని ‘షార్జా ఆఫ్ రోడ్ హిస్టరీ మ్యూజియం’కు తరలించేందుకు ఇటీవల రోడ్డు మీదకు తెచ్చారు. ఈ భారీ కారును నడిపించేందుకు డ్రైవర్‌తోపాటు చిన్నపాటి సైన్యమే అవసరమైంది. గంటకు 20 కి.మీ. మాత్రమే ప్రయాణించగలిగే ఈ వాహనం... రోడ్డు మీద రెండు లేన్లను ఆక్రమించేసింది. దీంతో రహదారిని పూర్తిగా బ్లాక్ చేయాల్సి వచ్చింది. నెమ్మదిగా వెళ్తున్న ఈ భారీ కారును చూసి జనం ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. -
'ధోని ఐదేళ్లుగా పన్ను కట్టలేదు'
రాంచి: టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన హమ్మర్ కారుకు ఐదేళ్ల నుంచి పన్ను చెల్లించడం లేదని రాంచి డీటీఓ తెలిపారు. పెనాల్టీతో సహా అతడు ఒకేసారి పన్ను చెల్లించాల్సివుంటుందని చెప్పారు. ధోని హమ్మర్ కు సంబంధించిన వివరాలు ఇప్పటివరకు నమోదు కాలేదని తెలిపారు. 'మిస్టర్ కూల్' కారు పేరును టైపిస్ట్ పొరపాటున స్కార్పియోగా నమోదు చేశాడని వెల్లడించారు. హమ్మర్ అనేది అంతర్జాతీయ బ్రాండ్ అని అతడికి తెలియకపోవడంతో పొరపాటు పడ్డాడని వివరించారు. టైపిస్ట్ పొరపాటు పడడంతో ధోని హమ్మర్ వివరాలు లేవని చెప్పారు.