సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇందులో కొన్ని నెటిజన్లను తెగ ఆకర్శించేస్తాయి. అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు ట్విటర్ వేదికగా వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
వీడియోలో గమనించినట్లయితే ఒక భారీ 'హమ్మర్' (Hummer) రోడ్డుపై ఉండటం చూడవచ్చు. ఇది చూడటానికి సాధారణ కారులా కాకుండా ఒక విమానం మాదిరిగా అనిపిస్తుంది. ఈ కొత్త మోడిఫైడ్ కారు దుబాయ్‌కి చెందిన 'షేక్ హమద్ బిన్ హమ్దాన్ నహ్వాన్'కి చెందినదిగా తెలుస్తోంది. ఇతన్ని అక్కడి ప్రజలు రెయిన్‌బో షేక్ అని కూడా పిలుస్తారు.
ఇదీ చదవండి: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు!
కార్ల మీద అమితమైన ఆసక్తి కలిగిన ఈయన దీనిని ప్రత్యేకంగా రూపోంచించినట్లు తెలుస్తోంది. ఇది సాధారణ హమ్మర్ కారుకంటే మూడు రెట్లు పెద్దదిగా ఉంది. దీని పొడవు 184.5 ఇంచెస్, వెడల్పు 865 ఇంచెస్, ఎత్తు 77 ఇంచెస్ వరకు ఉంది. ఈ వీడియో ఎంతోమంది ఆటోమొబైల్ ప్రెమికులను కట్టిపడేస్తోంది.
Dubai Rainbow Sheikh’s giant Hummer H1 “X3” is three times bigger than a regular Hummer H1 SUV (14 meters long, 6 meters wide, and 5.8 meters high). The Hummer is also fully drivable
— Massimo (@Rainmaker1973) July 27, 2023
[read more: https://t.co/LlohQguhTM]pic.twitter.com/uV1Z4juHKx
Comments
Please login to add a commentAdd a comment