భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల హీరో మోటోకార్ప్ మొదటిసారి ఓ వినూత్న వాహనాన్ని ఆవిష్కరించింది. ఇది ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన వాహనాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన ఈ కొత్త వెహికల్ 'సర్జ్ ఎస్32' కన్వర్టిబుల్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ చూడటానికి ఆటో రిక్షా మాదిరిగా ఉంటుంది. కానీ ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌కి జత చేసి ఉండటం చూడవచ్చు. కాబట్టి ఈ వెహికల్ అటు స్కూటర్‌గా, ఆటో రిక్షాగా కూడా పనిచేస్తుంది. కంపెనీ ప్రత్యేకంగా దీనిని స్వయం ఉపాధి పొందే వారికోసం రూపొందించినట్లు వెల్లడించింది.
ఇటీవల జరిగిన ‘హీరో వరల్డ్’ ఈవెంట్‌లో కంపెనీ దీన్ని ప్రదర్శించింది. ఈ వాహనానికి విండ్ స్క్రీన్, హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి, డోర్స్ మాత్రం లేదు. కానీ జిప్‌తో కూడిన సాఫ్ట్‌డోర్‌లు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి..
కొత్త సర్జ్ ఎస్32 త్రీవీలర్‌లో 10 kW ఇంజిన్, 11 kWh బ్యాటరీ ఉంటుంది. అదే సమయంలో రోజు వారీ వినియోగనైకి అనుకూలంగా ఉండటానికి స్కూటర్‌లో 3kw ఇంజిన్, 3.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. త్రీవీలర్ 50 కిమీ/గం వేగంతో 500 కిమీ బరువుని మోయగల కెపాసిటీ కలిగి ఉంటుంది. స్కూటర్ మాత్రం 60 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment