ఇటాలియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ వీఎల్ఎఫ్.. ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. అద్భుతమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందిన వీఎల్ఎఫ్ కేఏడబ్ల్యు వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో జట్టుకట్టింది. ఈ భాగస్వామ్యంతో కంపెనీ ఓ సరికొత్త వెహికల్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
భారతదేశంలో మొదలయ్యే పండుగ సీజన్ సమయానికి కంపెనీ తన స్కూటర్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ప్రధానంగా టైర్ 1, టైర్ 2 నగరాలను లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ డీలర్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేయడానికి సంకల్పించింది.
వీఎల్ఎఫ్ కంపెనీ 2024 నాటికి 15 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీలర్‌షిప్‌ల సంఖ్యను 50కి పెంచనున్నట్లు సమాచారం. కేఏడబ్ల్యూ వెలోస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ షెల్కే దీని గురించి మాట్లాడుతూ.. వీఎల్ఎఫ్ భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే అందిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment